Subscribe

31.అటూ ఇటుగా

కౌన్‌ బనేగా కరోర్‌పతికీ నేతలకూ పోలిక ఏమిటి?
కేబీసీలో జవాబులు చెప్పి కోట్లు సంపాదించుకుంటాం
. కానీ రాజకీయాల్లో కోట్లు సంపాదించాక ఏదో
ఒక జవాబు చెప్పవచ్చు.

32.అంతేగా

బంటి: నేనో రాజకీయ నాయకుడి దగ్గరకు వెళ్లాను.
తను నా సమస్యలన్నీ సావధానంగా విన్నాడు.
అక్కడికక్కడే వాటిని పరిష్కరించేందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేశాడు.

చంటి: వావ్‌ గ్రేట్‌.... తర్వాత ఏం జరిగింది.
బంటి: ఏం జరుగుతుంది.... మెలకువ వచ్చింది.

33.పోలిక మారింది

నాన్నా ప్రజాస్వామ్యం అంటే ఏమిటో చెప్పవా? అని
అడిగాడు పదేళ్ల వాసు. ‘అదెంత పని!
నీకు తేలికగా అర్థమయ్యేలా చెబుతా విను. నేను,
మీ అమ్మ ఇల్లు గడవడానికి కావల్సిన డబ్బు తెస్తున్నాం
. కాబట్టి మేం వ్యాపారవేత్తలం అనుకో. నువ్వు ఈ ఇంట్లో
హాయిగా తిరుగుతున్నావు కాబట్టి దేశ పౌరునిగా ఊహించుకో.
పని పిల్ల పని చేస్తోంది కాబట్టి, తను శ్రామిక వర్గం. ఈ ఇంటి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు కాబట్టి మీ తాతయ్యే ప్రభుత్వాధికారి. నీ తమ్ముడు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాడు కాబట్టి తనే ఈ దేశ భవిష్యత్తు’ అంటూ చాలా తెలివిగా చెప్పాననుకుని మురిసిపోయాడు తండ్రి. ఆ రాత్రి కరెంటు పోయింది. తమ్ముడు గుక్కపెట్టి ఏడుస్తున్నాడు. తాతయ్యేమో గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. కిందకి వచ్చి చూసిన వాసుకి, అమ్మానాన్నలు పనిపిల్లను కొడుతూ కనిపించారు. ‘ఇప్పుడర్థం అయ్యింది నాకు ప్రజాస్వామ్యం అంటే’ అనుకున్నాడు వాసు. ‘ప్రభుత్వం గుర్రుపెట్టి నిద్రపోతుంటే, వ్యాపారవేత్తలు కార్మికులను చావగొడతున్నారు. భవిష్యత్తు అంధకారంలో గుక్కపెట్టి ఏడుస్తోంది’.

34.మాట తప్పలేదు

నన్ను ఎన్నుకోండి మీ జీడీపీ పెంచేస్తాను అని
మాట ఇచ్చాడు నాయకుడు. అంతా ఆశగా
తనని ఎన్నుకున్నారు. తను మాట తప్పలేదు.
గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ రేట్లు
పెంచి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు.

35.తేడా

ఫ్రెండంటే!
నువ్వు జైల్లో ఉంటే, బెయిల్‌ ఇచ్చి విడిపించేవాడు.
బెస్ట్‌ ఫ్రెండంటే!
నీతో పాటు పట్టుబడేవాడు.

36.ఉద్యోగి వేదాంతం!

ఎక్కువ పని చేస్తే ఎక్కువ తప్పులు చేస్తాం. తక్కువ
పని చేస్తే తక్కువ తప్పులు చేస్తాం
అసలు ఏ పనీ చేయకపోతే, తప్పులు
చేసే అవసరమే ఉండదు. అందుకే... పని
చేయనివాడికే ప్రమోషన్‌ వస్తుంది. ప్చ్‌!

37.భలే బేరం

ఈ గడి యారం ఖరీదు ఎంత?
అయిదు ముద్దులు!
ఆ బొమ్మ ఖరీదు ఎంత?
పది ముద్దులు!
సరే! ఆ రెండూ నాకు కావాలి.
మరి బిల్లు సంగతో!
మా డాడీ వచ్చి నీ బిల్లు
పే చేస్తారు.

38.కనబడుటలేదు

సురేష్‌ ఫేస్‌బుక్‌ వాల్‌ మీద వాళ్ల
నాన్నగారు ఇలా రాశారు...
‘బాబూ ఇప్పటికైనా నీ కంప్యూటర్‌ షట్‌డౌన్‌
చేసి గదిలోంచి బయటకి రా!
నిన్ను చూసి రెండు రోజులైపోయింది.
ఇవాళైనా కలిసి భోజనం చేద్దాం’.
సురేష్‌ మనసు కరిగిపోయింది. ఓ లైక్‌ కొట్టి, బ్రౌజింగ్‌ కొనసాగించాడు.

39.పచ్చి అబద్ధం

పాలు తాగితే బలం వస్తుందని ఎవరు చెప్పారు? నాలుగు
గ్లాసుల పాలు తాగినా ఎదురుగా ఉన్న గోడని కదిలించలేం.
కానీ ఓ గ్లాసుడు ఓడ్కా తాగితే, గోడ దానంతట అదే కదిలిపోతుంది.

40.భవిష్యత్తు

ఓ కప్ప జ్యోతిషుడి దగ్గరకు వెళ్లింది.
‘కప్పలు, అందమైన అమ్మాయిలను కలుసుకున్న కథ చదివాను.
నేను కూడా అలా ఓ అమ్మాయినికలుసుకుంటానా?’ అని ఆశగా అడిగింది.

‘తప్పకుండా! వచ్చే ఏడాది ఓ బయాలజీ క్లాస్‌లో’
అంటూ శూన్యంలోకి చూస్తూ బదులిచ్చాడు జ్యోతిషుడు.

Pagination Example

తదుపరి