పేజీ సంఖ్య - 79
వదిలేరకం కాదు
‘‘అదేంటండి .. క్షవరం మరీ అంత చిన్నగా చేయించుకొచ్చారు?’’ ఆశ్చర్యపోయింది భార్య.
‘‘ముందు మామూలుగానే చేశాడోయ్. యాభై నోటు ఇస్తే చిల్లర లేదన్నాడు. ఊరికే వదిలేయడం ఎందుకని, ఆ చిల్లరకు సరిపడా కట్ చేయమన్నా’’ చెప్పాడు భర్త.
నెట్ కుటుంబం
ఏకలింగం సోషల్ నెట్ వర్కింగ్ ప్రభావంతో తన కుటుంబాన్ని ఇలా పరిచయం చేశాడు -
‘‘ఈమె నా భార్య గూగుల్ రాణి - ఒక్కటి అడిగితే పది చెబుతుంది. వీడు నా కొడుకు ఫేస్‌బుక్ కుమార్. ఇంట్లో విషయాలన్నీ లోకానికి అందజేస్తాడు. ఈమె నా కూతురు ట్విట్టర్ కుమారి. కాలనీ మొత్తం దీన్ని ఫాలో అవుతుంది. ఈమె మా అమ్మ. వాట్సప్ మాత. రోజంతా బుడ్‌బుడ్‌మని చప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇక నేను ఆర్కుట్ లింగాన్ని - నన్నెవడూ పట్టించుకోడు.
‘ఫేస్’బుక్కయింది!
‘‘డార్లింగ్ నిన్న వాల్ మీద పిక్చర్ మార్చాను. ఎలా ఉందో చెప్పలేదేం?’’ అడిగాడు సుమంత్.
‘‘నా ఫేస్‌బుక్‌లో నోటిఫికేషన్ రాలేదే’’ ఆశ్చర్యపోయింది అమల.
‘‘నీకు నెట్ పిచ్చి బాగా ముదిరింది. నేను మార్చింది ఫేస్‌బుక్‌లో కాదు మన బెడ్రూమ్‌లో’’ చిరాకు పడ్డాడు సుమంత్.
రైల్వే పెళ్లికొడుకు
‘‘మీరు నా పెళ్లికి తప్పకుండా రావాలి’’ శుభలేఖ అందిస్తూ చెప్పాడు రైల్వే ఉద్యోగి మృత్యుంజయరావు.
‘‘పెళ్లి రైట్ టైముకేనా, లేటుందా?’’ క్యాజువల్‌గా అడిగాడు అనంతమూర్తి.
అమ్మ ... సర్వరో!
‘‘సర్వర్, నీకు వచ్చిన టిప్స్‌తో ఏం చేస్తావు?’’ అడిగాడు అరవిందం.
‘‘మంచి హోటల్‌కి వెళ్లి భోజనం చేస్తాను సార్’’ చెప్పాడు సర్వర్ భజగోవిందం
సెటింగో ... బెట్టింగో!
దేవుడికీ డాక్టరుకీ ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్ దగ్గరకు పంపిస్తాడు. డాక్టరుకి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు
కక్ష తీరే మార్గమదే!
పెళ్లయిన ఏడాదికే రాణి చావు బతుకుల్లో హాస్పటల్లో చేరింది. చివరి మాటగా భర్తతో -
‘‘మీరు మళ్లీ తప్పక పెళ్లి చేసుకోవాలి. అదీ నా ఫ్రెండ్ పద్మను మాత్రమే’’ మాట తీసుకుంది.
‘‘పద్మ అంటే నీకు ఎంత ప్రాణం రాణీ’’ కళ్లు తుడుచుకున్నాడు వెంకట్రావు.
‘‘ఆ దిక్కుమాలిందే నీతో నన్ను పెళ్లికి ఒప్పించింది. అది ఇంతకింతా అనుభవించాలి’’ పైకి అనలేక తల ఊపింది రాణి.
ఒక వికెట్‌కి ఒక ఉద్యోగం
‘‘మా హాస్పిటల్లో ఆపరేషన్ ఫెయిలై పేషెంటు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇక్కడే ఉద్యోగం ఇస్తారు తెలుసా?’’ గొప్పగా చెప్పింది నర్స్ నాంచారి.
‘‘అసలు సంగతి అదన్నమాట! ఇంత చిన్న హాస్పిటల్లో రోగులకంటే సిబ్బంది ఎక్కువుందేం చెప్మా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను’’ అంది నాంచారి స్నేహితురాలు మయూరి.
గడుగ్గాయి
‘‘ఏం తమాషాగా ఉందా? కీటకాలను గీయమంటే తెల్లపేపరు ఇస్తావా?’’ అరిచాడు డ్రాయింగ్ మాస్టారు.
‘‘నేను గీసినవి సూక్ష్మజీవులు సార్. కళ్లకు కనిపించవు. భూతద్దంలో చూడాల్సిందే’’ చెప్పాడు విద్యార్థి.
ఇప్పుడా... ఇదివరకా?
‘‘నిద్రాహారాలు మాని కుటుంబాన్ని వదిలేసి ఊరికి దూరంగా బతికేవాళ్ళను ఏమంటారు?’’ టీచర్ ఒక పిల్లవాణ్ణి అడిగాడు.
‘‘ఇప్పుడా? ఇదివరకా?’’ అడిగాడు పిల్లవాడు.
‘‘రెండూ చెప్పు’’ ఆశ్చర్యపోతూ అన్నాడు టీచర్.
‘‘ఇదివరకైతే ఋషులు. ఇప్పుడైతే ఐ.టి. ఉద్యోగులు.’’
చిక్కలేదు
చాలాకాలం తర్వాత రెండు పుస్తకాలు ఎదురుపడ్డాయి లైబ్రరీ టేబిల్ మీద.
‘ఏంటలా చిక్కిపోయావు? ఎండలకా?’ అని అడిగింది ఒక పుస్తకం రెండోదాన్ని.
‘కాదు. ఎవడికో కోపం వచ్చి ముందుమాటలన్నీ చించేశాడు’ జవాబిచ్చింది అది.
పోలిక
‘‘ప్రేమకు, పెళ్లికి తేడా ఏంటి?’’ అడిగాడు సురేష్.
‘‘ప్రేమ సైకిల్ ప్రయాణమైతే, పెళ్లి పడవ ప్రయాణం’’ చెప్పాడు రమేష్.
‘‘అదెలా?’’ ఆరా తీశాడు సురేష్.
‘‘ఇష్టం లేకపోతే సైకిల్ దిగిపోవచ్చు. కాని పడవప్రయాణంలో మధ్యలో దిగడం కుదరదు కదా’’ వివరించాడు రమేష్.
టపా కట్టే వయసే ముఖ్యం
డెభై ఏళ్ల వైకుంఠం పాతికేళ్ల పడుచు ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ఆమెతో చెప్పడానికి ధైర్యం చాలక -
‘‘కచ్చితంగా ఒప్పుకుంటుంది - కాకపోతే, ఇప్పటి నీ వయసుకి మరో 20 ఏళ్లు కలిపి చెబితే’’ సలహా ఇచ్చాడు శ్రీశైలం.
నేమ్ ప్లేట్
‘‘మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. పోయిన సంవత్సరం మా ఆవిడ చనిపోయినపుడు ‘బ్యాచిలర్ ఎగైన్’ అన్న అర్థంలో బి.ఎ. అని పెట్టాను. ఈ మధ్యే మళ్ళీ పెళ్ళి చేసుకున్నా కాబట్టి ‘మ్యారీడ్ ఎగైన్’ అర్థంలో ఎం.ఎ అని పెట్టాను’ వివరించాడు సురేష్
ఒకేలా ఎందుకు?
చైనా వాళ్ళందరూ ఒకేలా ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఒక అబ్బాయి.
‘దేవుడు ప్రతి ఒక్కరినీ వేరువేరుగా తయారు చేస్తాడని చెప్పావు కదా! మరీ వీళ్ళనెందుకమ్మా ఒకేలా తయారుచేశాడు?’ అని తల్లిని అడిగాడు.
‘140 కోట్ల మందిని వేరేవేరుగా తయారు చేయాలంటే మాటలా నాన్నా! పైగా ఆయన ఆ టైంలో అమెరికా నుంచి ఇటొస్తున్నాడట. అలిసిపోయుంటాడు’ చెప్పింది తల్లి.
‘ఒక్కటే మిగులుతుంది’
ఐదేళ్ళ కూతురికి తల్లి కూడికలు, తీసివేతల లెక్కలు చెపుతోంది.
‘నాన్న అన్నయ్య కోసం తెచ్చిన స్వీట్ బాక్స్‌లో 50 స్వీట్లు ఉన్నాయనుకో. అందులో 40 మీ అన్నయ్య తినేశాడనుకో. ఎన్ని మిగులుతాయి?’
‘బాక్స్‌లో ఎన్ని మిగులుతాయో కాని అన్నయ్యకు డయాబెటిస్ మాత్రం జీవితాంతం మిగులుతుంది.’
ప్రేమ పరీక్ష
‘అమ్మా! నేనంటే నీకు ప్రేమ ఉందా?’
‘ఎందుకు లేదు నాన్నా! నీకా సందేహమెందుకు?’
‘అయితే నాన్నకు డైవోర్స్ ఇచ్చి, ఆ ఐస్‌క్రీం షాపు అంకుల్ని పెళ్ళి చేసుకో.’’
‘‘....!!’’
రక్షణ కోసం
‘‘నాలుక తడిగానే ఎందుకుంటుంది?’’ అడిగింది సైన్స్ టీచర్.
‘‘నిప్పులాంటి నిజాలు మాట్లాడినప్పుడు కాలకుండా ఉండడం కోసమేమో టీచర్’’ కొద్దిసేపు ఆలోచించి చెప్పాడు తరుణ్.
ఏం చేస్తున్నావు?
‘‘ఇంట్లో దొంగలు పడి ల్యాప్‌టాప్ తప్ప అన్నీ దోచుకుపోతుంటే నువ్వు ఏం చేస్తున్నావయ్యా?’’ అడిగాడు పోలీసు.
‘‘ఫేస్‌బుక్ చూస్తున్నా’’ చెప్పాడు వీరవెంకటసాయి సత్యన్నారాయణ.
కింద కాదు పైన చూడు
‘‘ఏరా లెక్కల్లో మార్కులు వందకు పైనే వచ్చాయన్నావు? నాకు ఇక్కడ రెండు మార్కులే కన్పిస్తున్నాయి’’ చిందులేశాడు తండ్రి.
‘‘అవున్నాన్నా .. ఆ రెండూ ఎక్కడ వేశారో సరిగ్గా చూడండి. వందకు పైనే కదా’’ తాపీగా చెప్పాడు పుత్రరత్నం.
వదిలిచూడండి!
‘‘ఆరునెలల జైలు శిక్ష ... లేదా మూడు వేల రూపాయల జరిమానా .. రెండింటిలో ఏది నీకిష్టం?’’ అడిగాడు న్యాయమూర్తి.
‘‘జరిమానా కడతానండి’’ చెప్పాడు జేబుదొంగ మునుస్వామి.
‘‘మరి నీ చేతిలో అంత డబ్బుందా?’’ అడిగాడు న్యాయమూర్తి.
‘‘ఇప్పుడు లేదు. సెంటర్ దాకా వెళ్లిరావడానికి అరగంట పర్మిషన్ ఇవ్వండి చాలు ... చిటికెలో తెస్తాను’’ ఉత్సాహంగా చెప్పాడు మునుస్వామి.
తెలివైన నాన్న
‘‘దారుణమైన మోసం జరిగిపోయింది మామా’’ భోరుమన్నాడు అఖిల్.
‘‘ఏమైందిరా?’’ అడిగాడు సునీల్.
‘‘పుస్తకాలు కొనాలి డబ్బులు పంపమని ఫోన్ చేస్తే, పుస్తకాలు కొని పంపించాడు మా అయ్య’’ మళ్లీ భోరుమన్నాడు అఖిల్.
కండక్టర్ బుద్ధి
కండక్టర్ కాంతయ్య పెళ్లి జరుగుతోంది. పెళ్లికూతురు వెనక ఆమె తాలూకూ ఆడంగులు గుంపుగా కూర్చుని ఉన్నారు. మరో ఇద్దరు చుట్టాలు వేదిక మీదికి రాగానే పెళ్లిపీటల మీద ఉన్న కాంతయ్య వెనక్కి తిరిగి ‘‘కొద్దిగా సర్దుకోండమ్మా ... ఇంకా ఇద్దరు పడతారు’’ చిరాకుగా అరిచాడు.
దిక్కుమాలిన మిషన్
‘‘ఏమిటి పిన్నిగారూ ఊరునుండి రావడంరావడంతోనే అంత కోపంగా ఉన్నారు?’’ ఆరా తీసింది పక్కింటి నరసమ్మ.
‘‘ఇందాక బస్టాండులో బరువు చూసుకుందామని weighing machine లో కాయిన్ వేస్తే ‘‘ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు’’ అనే కార్డు వచ్చింది’’ కసిగా చెప్పింది అలివేలమ్మ.
ఆ ఒక్కటీ అడక్కు!
‘‘రోజూ అడుక్కుని ఎంత సంపాదిస్తావోయ్?’’ రూపాయి బిళ్ల వేస్తూ అడిగింది ఆండాళ్లమ్మ.
‘‘క్షమించండమ్మా ... ఆడాళ్ల వయసు, మగాళ్ల సంపాదన అడక్కూడదంటారు’’ వినయంగా చెప్పి ముందుకు వెళ్లాడు బిచ్చగాడు.
అదీ నిజమే!
ఎండ నుండి వేగలేక టోపీ కొందామని షాపుకు వెళ్లాడు బోసుబాబు.
‘‘ఆ గోధుమరంగు టోపీ ఎంతండి?’’
‘‘199 రూపాయలు’’
‘‘బాబోయ్ ... అంత ధరా! ఆ డబ్బుల్తో మరో జత చెప్పులే వస్తాయి కదా’’
‘‘చెప్పుల్ని తల మీద పెట్టుకోలేరు కదండి’’
మేడిన్ ఇండియా!
చార్మినార్ దగ్గర ఆటో దిగిన అకీరా మీటర్ బిల్ చూసి గుడ్లు తేలేసి ‘‘టూ ఎక్సెపెన్సివ్’’ అన్నాడు కోపంగా.
‘‘మీటర్ మేడిన్ ఇండియా... వెరీ వెరీ ఫాస్ట్’’ కూల్‌గా బదులిచ్చాడు యాదగిరి.
‘ఎ’ క్లాస్ వెంగళప్ప
చంద్రకిరణ్ ఇంటర్వ్యూకి వెళ్లాడు.
‘‘నీకు ఎం.ఎస్. ఆఫీస్ తెలుసా?’’ అడిగాడు అధికారి.
‘‘తెలియదు. అడ్రస్ చెబితే చిటికెలో వెళ్లొస్తా’’ ఠపీమని బదులిచ్చాడు చంద్రకిరణ్.
వాక్య నిర్మాణం
‘‘ఎద్దు, ఆవు గడ్డి మేస్తున్నారు ... ఇదేం వాక్యం! సరిగ్గా రాయి’’ అరిచింది గ్రామర్ టీచర్.
‘‘ఆవు, ఎద్దు గడ్డి మేస్తున్నారు’’ దాన్నే కొంచెం మార్చి రాసి చూపించాడు గోపి.
‘‘నీవు ముందు రాసిందీ, ఇదీ ఒకటే కదా ... తేడా ఎముంది?’’ మరింత కోపంగా అంది టీచర్.
‘‘లేడీస్ ఫస్ట్ అని ఆవును ముందు పెట్టాగా’’ చెప్పాడు గోపి.
ఆదర్శమూర్తివి నీవయ్యా!
‘‘నీవు ఎవరి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నావు?’’ అడిగాడు ఏసుపాదం.
‘‘మహాత్మాగాంధీ’’ ఠపీమని చెప్పాడు పదేళ్ల సుందరం.
‘‘వెరీ గుడ్ సెలక్షన్ ... కారణం ఒక్కముక్కలో చెప్పగలవా?’’ అడిగాడు ఏసుపాదం.
‘‘పదమూడేళ్ల వయసులో పెళ్లిచేసుకున్నాడు కాబట్టి’’ చెప్పాడు సుందరం.
నా పేరు మార్చేయకు!
‘‘గిజిడ ""Why are you trespassing'' ’’ కంచె దూకబోతున్న వ్యక్తిని అడిగాడు నవరతన్.
‘‘ఐయామ్ నాట్ ట్రెస్పాసింగ్ ... ఐయామ్ యశ్వంత్ సింగ్’’ కోపంగా చెప్పాడు దూకబోతున్న వ్యక్తి.
అనుమానం పీనుగు
కంగారుగా నిద్రలేచిన సుమలత మెసేజ్ చెక్ చేసి ‘‘ముందు ఆ కళ్లద్దాలు తగిలించుకోండి. అదిBEAUTIFUL కాదు BATTERYFULL' అని కయ్యిమంది.
ప్రేమ స్వగతం
‘‘ఒకమ్మాయి ఉండేది
నన్నుచూసి నవ్వేది
నవ్వుతూ పాట పాడేది
పాడుతూ సిగ్గుపడేది
సిగ్గుపడుతూ మెలికలు తిరిగేది
నేను అనుకున్నా ... ప్రేమేమో అని.
కాని, తర్వాత తెలిసింది తను పిచ్చిదని!!’’