పేజీ సంఖ్య - 75

అతని కంటె ఘనడు

‘‘నేను సిటీ బస్‌తో పాటు పరిగెత్తుకుంటూ కాలేజీకి వచ్చా .. దాని వల్ల 15 రూపాయలు ఆదా అయ్యింది తెలుసా?’’ గొప్పగా చెప్పాడు పిసినారి నెం. 1

‘‘నీదంతా దుబారా యవ్వారంరా .. అదే టాక్సీ వెంట పరిగెత్తుకొచ్చివుంటే కనీసం 200 మిగిలేవి కదా’’ సలహా ఇచ్చాడు పిసినారి నెం. 2


బెంగ అందుకోసం!

‘‘మా ఆయన వాకింగ్‌కి వెళ్లి ఐదు గంటలు దాటింది. ఇప్పటి వరకు తిరిగి రాలేదు’’ పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇచ్చింది సుబ్బలక్ష్మి.

‘‘దానికంత కంగారెందుకమ్మా .. వస్తారులే, ఏ పార్కులోనే బాతాఖానీ కొడుతుంటాడు’’ చెప్పాడు పోలీసు.

‘‘కంగారు ఆయన రానందుకు కాదండి ... ఆయన వెంట వెళ్లిన మా డాగ్‌ పప్పీ గురించి’’ విచారంగా చెప్పింది సుబ్బలక్ష్మి.


ఇదో ట్రిక్‌

‘‘అదేంటొదినా ... మీ ఆయన నిక్షేపంగా ఇంట్లోనే ఉన్నాడుగా. కనిపించుటలేదని పేపర్లో ప్రకటన ఇచ్చారేం?’’ బుగ్గలు నొక్కుకుంది పక్కింటి కోమలాంగి.

‘‘అప్పులోళ్లు ఇంటికి రాకూడదని’’ చెప్పింది లతాంగి.


అప్పుడే తృప్తి!

‘‘నేను రాసిన కథలు, కవితలు, నవలలు .. అన్నీ నీకే అంకితం చేశాను. నువ్వు తృప్తి చెందాలంటే ఇంకేం రాయాలి?’’ అడిగాడు రచయిత భర్త.

‘‘వీలునామా’’ ఠపీమని చెప్పింది భార్య.


ధ్యేయం!

‘‘నేను లాయర్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టినప్పటినుండి నీవు జేబు దొంగతనాలు చేస్తూనే ఉన్నావు. ఇంకా ఎప్పటి దాకా?’’ గంగుల్ని మరోసారి చూడగానే విస్తూపోతూ అడిగారు జడ్జి గంగాధరం.

‘‘గిన్నీస్‌ బుక్‌లో ఎక్కేదాకా’’ బోనులోంచే వినయంగా తలవంచి స్థిరంగా చెప్పాడు జేబుదొంగ గంగులు.


బల్లినైనా కాకపోతిని

‘‘ఛీ .. వెధవ జీవితం, బల్లినై పుట్టినా బాగుండేది’’ చిరాగ్గా అన్నాడు మన్మథరావు.

‘‘బల్లిగానే ఎందుకు?’’ ఆరా తీశాడు రామారావు.

‘‘బల్లికి తప్పించి లోకంలో ఎవరికీ భయపడదు మా ఆవిడ’’ అసలు విషయం చెప్పాడు మన్మథరావు.


తూ.చ. పాటించే అధికారి

‘‘అసలైన కుటుంబ నియంత్రణ అధికారి ఎవరు?’’ అడిగాడు టీచర్‌.

‘‘తన కూతురికి ‘మాలా - డి’, కొడుక్కి ‘నిరోధ్‌’ పేర్లు పెట్టేవాడు’’ ఠపీమని వెనక బెంచీ నుండి వినిపించింది జవాబు.


డిసైడ్‌ అయ్యే వచ్చాను

‘‘నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను’’ చెప్పాడు రాకేష్‌.

‘‘నాకు చెప్పావు సరే ... మా ఆవిడతో మాట్లాడావా?’’ అడిగాడు అమ్మాయి తండ్రి జోగినాథం.

‘‘మాట్లాడాను ... ఇద్దర్లో నాకు మీ అమ్మాయే నచ్చింది’’ కచ్చితంగా చెప్పాడు రాకేష్‌.


అమ్మాయి మనసు

ఒకమ్మాయిని ముగ్గురబ్బాయిలు ప్రేమించారు.

మొదటివాడు: నీకోసం ప్రాణాలు విడుస్తా.

అమ్మాయి: ప్రతి ఒక్కడూ ఇలాగే అంటాడు.

రెండోవాడు: నీ కోసం చుక్కలు తెంపుకొస్తాను.

అమ్మాయి: పాత డైలాగ్‌ ...

మూడోవాడు: నీకోసం నా ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్లోజ్‌ చేస్తాను.

అమ్మాయి: ఐ లవ్‌ యూ!


ఓపిక పట్టు

‘‘ఏరా మనం వచ్చింది త్రీస్టార్‌ హోటల్‌కే కదా. ఒక్క ‘చుక్కా’ కనిపించట్లేదేం?’’ రొమాంటిక్‌గా అడిగాడు శంభులింగం.

‘‘ఆగు, సర్వర్‌ బిల్‌ తేగానే ఒకేసారి కనిపిస్తాయి’’ చెప్పాడు జంబులింగం.


ఎవర్ని నమ్మగలం చెప్పండి?

‘‘ఈ దొంగతనాలన్నీ నీవు ఒక్కడివే చేశావా?’’ ఆశ్చర్యపోయాడు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌.

‘‘అవును. ఈ రోజుల్లో మరొకర్ని నమ్మలేం కదండీ’’ చేతులు కట్టుకుని చెప్పాడు దొంగ.


ఆర్జీ వాపస్‌

‘‘దేవుడా ... జీవితంలో చాలా అలసిపోయాను. నన్ను నీ దరికి చేర్చుకోవయ్యా’’ మొక్కాడు భర్త.

‘‘దేవుడా ... ఆయన కంటే ముందు నన్ను నీ దగ్గరకి చేర్చుకో’’ ప్రార్థించింది భార్య.

‘‘దేవుడా ... నా మొక్కు వెనక్కి తీసుకుంటున్నాను’’ రెండో కోరిక కోరాడు భర్త.


మనం నిద్రలో ఉంటాం

‘‘రేపు సూర్యోదయం కంటే ముందే నీకు ఉరిశిక్ష అమలు చేయమని ఆర్డర్‌ వచ్చింది’’ చెప్పాడు జైలర్‌ బాధగా.

‘‘హ్హ ... హ్హ ... హ్హ ...’’ పెద్దగా నవ్వాడు గంగారామ్‌.

‘‘ఇది నవ్వే విషయమా?’’ ముఖం చిట్లించాడు జైలర్‌.

‘‘కాదా మరి? నేను నిద్ర లేచేదే 9 గంటలకి’’ మళ్లీ నవ్వాడు గంగారామ్‌.


కేక్‌

టీచర్‌: ‘‘ఎలాంటి కేక్‌ తినకూడదో చెప్పు?’’

‘‘డిటర్జెంట్‌ కేక్‌’’ ఠపీమని చెప్పాడు స్టూడెంట్‌.


అదీ విషయం!

‘‘ఇంట్లో నా మాటే నెగ్గుతుంది తెలుసా?’’

‘‘అవునా!’’

‘‘మరేఁ ... మా ఆవిడతో వేడి నీళ్లు తెమ్మని చెప్పడం ఆలస్యం .. క్షణాల్లో నా ముందు ఉంచుతుంది’’

‘‘ఇంతకీ వేడి నీళ్లతో నీకేం పని?’’

‘‘వాటితో కడిగితే అంట్ల జిడ్డు బాగా వదులుతుంది’’


మారియానా మజాకా?

టీచర్‌ రమోలా హిస్టరీ పాఠంలో భాగంగా ప్రపంచం మాప్‌ను బోర్డు మీద గీసి ‘‘మారియా ... నీవు వచ్చి ఇందులో అమెరికా ఎక్కడుందో గుర్తించు’’ అంది.

మారియా వచ్చి రూల్‌ కర్రతో అమెరికా ఎక్కడుందో చూపించింది.

‘‘వెరీ గుడ్‌ మారియా ... వెళ్లి నీ సీట్లో కూర్చో’’ అని ‘‘ఇప్పుడు చెప్పండి పిల్లలూ ... అమెరికాను ఎవరు కనిపెట్టారు?’’ అడిగింది రమోలా.

‘‘మారియా ...’’ గొల్లున అరిచారు పిల్లలంతా ఏకకంఠంతో.


ధర్మం పాటించాను

‘‘డాడీ, నేను స్కూల్‌ ఫస్ట్‌ వస్తే ఎలా ఫీలవుతారో చెప్పండి?’’ అడిగాడు పుత్రరత్నం.

‘‘పిచ్చెక్కి గంతులెయ్యనూ’’ ఉత్సాహంగా అన్నాడు జనకుడు.

‘‘తండ్రికి పిచ్చెక్కించడం పుత్రుడి ధర్మం కాదు. అందుకని ఫెయిలయ్యా’’ బదులిచ్చాడు పుత్రరత్నం.


ముందు జాగ్రత్త!

‘‘కండక్టర్‌ నీవైపు గుర్రుగా చూస్తున్నాడు .. ఏమైనా పేచీ పెట్టుకున్నావా ఆయనతో?’’ అడిగాడు బుల్లెబ్బాయి.

‘‘లేదు. టికెట్‌ వెనక బ్యాలెన్స్‌ రాసే ఛాన్స్‌ ఇవ్వకుండా సరిపడా చిల్లర ఇచ్చాను’’ చెప్పాడు చిట్టెబ్బాయి.


పి (బు)చ్చిబాబు

‘‘ఏం కావాలి సార్‌?’’ అడిగాడు సర్వర్‌.

‘‘అదే ఆలోచిస్తున్నాను ... ’’ బుర్ర గోక్కున్నాడు బుచ్చిబాబు.

‘‘పోనీ ‘మెనూ’ తెమ్మంటారా ..’’ అడిగాడు సర్వర్‌.

‘‘వేడిగా ఉంటే .. తీసుకురా?’’ చెప్పాడు బుచ్చిబాబు.


దేవుడికి కృతజ్ఞతలు

‘‘దేవుడిని ఏం కోరు కున్నావురా.. ’’

‘‘దేవుడా! డాలర్‌ రేటు, పెట్రోలు రేటు, కందిపప్పు రేటు పెంచావు. పాస్‌ మార్కులు మాత్రం నిలకడగా 35 దగ్గరే ఉంచావు. ఎప్పటికీ అలాగే ఉంచు స్వామీ అని.’’


తపము ఫలించిన శుభవేళ

‘‘భక్తా .. నీ తపస్సుకు మెచ్చి వచ్చా ..’’

‘‘ధన్యుడను స్వామీ .. ’’

‘‘వరం కోరుకొమ్ము’’

‘‘పెద్ద కోరికలంటూ ఏం లేవు స్వామీ. ఒక ఏ.సి. గది, దాన్నిండా డబ్బులు, నేను ఎప్పుడు నిద్రపోయినా అడిగే నాథుడు ఉండకూడదు .. అంతే’’

‘‘తథాస్తు!’’

భక్తుడికి వెంటనే ఎ.టి.ఎమ్‌. దగ్గర సెక్యూరిటీ గార్డు ఉద్యోగం వచ్చింది.

‘‘అయ్యో .. దేవుడా, నేను అడిగింది ఈరకంగా అర్థం చేసుకున్నావా ... !’’ గొల్లుమన్నాడు భక్తుడు.


రివర్స్‌ గేర్‌

‘‘మమ్మీ .. ట్యూషన్‌ నుండి నన్ను తీసుకురావడానికి డాడీని పంపకు. ఇకనుండి నువ్వే రా .. లేదంటే నేనే వచ్చేస్తా’’ కోపంగా చెప్పాడు టింకూ.

‘‘ఎందుకురా ...’’ అడిగింది మమ్మీ.

‘‘ఆయన్ని మా ‘మిస్‌’ నుంచి లాక్కురావడానికి నా ప్రాణం పోతోంది’’ చిరాగ్గా బదులిచ్చాడు టింకూ.


ఒకరు మేల్కుంటే చాలదూ!

‘‘రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు కదా ... ఏం చేస్తున్నావు నువ్వు? ’’ కోపంగా అడిగాడు యజమాని.

‘‘రాత్రంతా మీరు ఫేస్‌బుక్కూ, వాట్సాపూ చూస్తూ మేలుకునే ఉన్నారు కదా .. ఇద్దరం మేల్కుని ఉండడం దేనికని నేను కునుకుతీశా’’ చెప్పాడు వాచ్‌మాన్‌.


ధర్మం పాటించాను

సెటింగో ... బెట్టింగో!

దేవుడికీ డాక్టరుకీ ఎప్పుడూ కోపం తెప్పించకూడదు. ఎందుకంటే దేవుడికి కోపం వస్తే డాక్టర్‌ దగ్గరకు పంపిస్తాడు. డాక్టరుకి కోపం వస్తే దేవుడి దగ్గరకు పంపిస్తాడు. ఇదంతా ఒక సెట్టింగు


ప్యాసవ్వడానికే

శ్రీను లైబ్రరీకి వెళ్లి ‘‘అర్జెంటుగా నాకు రక్తం గురించి సమాచారం ఉన్న పుస్తకం కావాలి’’ అని అడిగాడు.

‘‘ఏమిటంత ఆర్జెంటు?’’ ఆరా తీశాడు లైబ్రేరియన్‌.

‘‘డాక్టర్‌ రేపు నాకు రక్త పరీక్ష ఉందన్నాడు. ఇప్పుడు చదివితే కదా రేపు ప్యాసయ్యేది’’ చెప్పాడు శ్రీను.


కుట్టి చంపేస్తాయని!

‘‘చీమలను చూస్తే భయంగా ఉందా ... ఎప్పటి నుండి?’’ అడిగాడు డాక్టరు ముకుందం.

‘‘షుగర్‌ వ్యాధి వచ్చినప్పటి నుండి’’ భయంగా చెప్పాడు మనోహరం.


గురువుల్లో మార్పురాలేదు

‘‘ఏకలవ్యుడి పాఠం వల్ల మీరు నేర్చుకున్న నీతి చెప్పండి?’’ అడిగాడు తెలుగు మాస్టారు.

‘‘డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులకి ఆ రోజుల్లో ఫీజులు తీసుకోకుండా ‘వేలు’ అడిగేవారని’’ ఠపీమని చెప్పాడు బుల్లబ్బాయి.


Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -75

Responsive Footer with Logo and Social Media