పేజీ సంఖ్య - 80
ఖరీదు చెల్లిస్తాను
అప్పారావు: దానికి మళ్ళీ ఆపరేషన్ ఎందుకండీ...ఆ 20 రూపాయలు నేనే ఇస్తాను. కొత్తది కొనుక్కోండి.
కనికరించండి ప్లీజ్
ఒక కుర్రాడు కాలేజీ గ్రౌండ్‌లో చాకు పట్టుకుని తిరుగుతున్నాడు.
లెక్చరర్: ఏంట్రా కాలేజీలో చాకు పట్టుకు తిరుగుతున్నావ్?
స్టూడెంట్: పేద విద్యార్థిని సార్. రివా ల్వర్ కొనుక్కునే స్తోమత లేదు.
ముందు జాగ్రత్త!
అబ్బాయి: నన్ను ప్రేమిస్తున్నావా?
అమ్మాయి: అవును.
అబ్బాయి పరిగెత్తటం ప్రారంభించాడు.
అమ్మాయి: ఎక్కడికి?
అబ్బాయి: ఫేస్బుక్‌లో నా రిలేషన్‌షిప్ స్టేటస్ అప్‌డేట్ చేసుకోవాలి.
‘సౌండ్’ వాలా
ఇంటర్వూ అధికారి: ఎలక్ట్రిక్ మోటర్
ఎలా రన్ అవుతుంది?
అభర్థి: డుర్ర్ ర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్ర్
అధికారి: ఆపు!
అభ్యర్థి: డుర్ర్ దుప్ దుప్ దుప్ దుప్..
అబ్బే... ఒప్పుకోట్లా!
డాక్టరు: ఓ క్రీమ్ వచ్చిందిరా. రాసు కుంటే నలభైయేళ్ల ఆవిడ ఇరవైయేళ్లఅమ్మాయిలా
కనిపిస్తుంది.
స్నేహితుడు: అయితే బాగానే అమ్ముడుపో తుండచ్చు.
డాక్టరు: ఒక్కటి కూడా పోలేదు. తమకు నలభైయేళ్ళని ఒప్పుకోవడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటేగా!
ఆ ముక్క ముందు చెప్పాలి!
పడవ మునిగిపోయింది. ‘నేల ఎంత దూరం’ కంగారుగా అడిగాడు తోటి ప్రయాణికుడు సుబ్బారావుని. ‘ఒక మైలు’ అని చెప్పగానే నీళ్ళల్లోకి దూకేసాడు. ఈదుతూ ‘ఎటువైపు?’ అని అడిగాడు. ‘కిందకి’ చెప్పాడు సుబ్బారావు.
..అందుకే అరవలేదు
బజార్నుంచి తిరిగొచ్చిన వెంకట్రావు తన పరుసు, గొలుసు దొంగలు కొట్టేసిన విషయం చెప్పాడు భార్యతో.
భార్య: ఎప్పుడూ నా మీద ఇంతెత్తున లేచే మీరు, దొంగ... దొంగ అని గట్టిగా అరవలేకపోయారా?
వెంకట్: ఊరుకోవె బాబూ, గట్టిగా అరిస్తే నోట్లో ఉన్న బంగారప్పళ్ళు కూడా పీక్కుపోతారని ఊరుకున్నా! చల్లగా చెప్పాడు.
‘ట్యూబ్‌లైట్’ కుర్రాడు
పరీక్ష హాల్లో ఎవర్నీ కాపీయింగ్ చేయనివ్వకుండా అటూయిటూ తిరుగుతున్నాడు ఎగ్జామినర్.
రాము అతనికో స్లిప్పు రాసివ్వగానే, వెళ్ళి కుర్చీలో కూర్చుని మళ్ళీ పరీక్ష అయ్యేంతదాకా కదల్లేదు.
ఏం రాసిచ్చావురా అని అడిగాడు రమేష్. ‘మీ ప్యాంటు వెనక చిరుగు ఉంద’ని అన్నాడు రాము.
వేళ ఉందమ్మా!
జాతరకు పిల్లాడ్ని తీసుకెళ్ళింది కమల. అక్కడ అందరూ పెద్దగా శబ్దం చేసే బూరల్ని పోటీపడి ఊదుతున్నారు.
‘‘అమ్మా, నాకది కొనిపెట్టవా’’ అడిగాడు బంటి.
‘‘వద్దురా ఓ వేళాపాళా లేకుండా ఊదుతావు, దాంతో మాకు బి.పి పెరుగుతుంది’’ అంది కమల.
‘‘ఒట్టమ్మా. అందరూ నిద్రపోయాక ఊదుకుంటా’’ అమాయకంగా చెప్పాడు బంటి.
బాబా నీతి
కుందేలు పరుగెత్తుతుంది. గంతులేస్తుంది. అయినా 15 ఏళ్ళే బతుకుతుంది.
తాబేలు పరుగెత్తదు. గంతులేయదు. అయినా 300 ఏళ్ళు బతుకుతుంది.
నీతి : వ్యాయామం కంటే విశ్రాంతే మేలు.
అందుకే మరి!
టీచర్: నీ దగ్గర రెండు రూపాయ
లుందనుకో....
మీ అమ్మ మరొక్క రూపాయి
ఇచ్చిందనుకో....
మొత్తం ఎంతయింది?
స్టూడెంట్: రెండు
టీచర్: మీ అమ్మ ఇచ్చిన రూపాయి
కలపమన్నాగా....
స్టూడెంట్: మా అమ్మ చచ్చినా నాకు
రూపాయి ఇవ్వదు. అందుకే
కలపలేదు.
ఎన్న గలాటా ?
‘‘వంద రూపాయలెట్టి కొన్న టికెట్టుని పర్రుమని చించి నా చేతిలో పెట్టాడు’’ టికెట్టు ముక్కని మేనేజరుకు చూపిస్తూ కయ్యిమన్నాడు సుబ్బారావు.
అందుకు...
‘‘మీ పెంపుడు కుక్క మిమ్మల్నే కరిచిందా?’’ ఆశ్చర్యపోతూ అడిగాడు పరమానందం.
‘‘అది ఎలా కాపలా కాస్తోందో టెస్ట్ చేద్దామని అర్ధరాత్రి మా ఇంటి గోడ దూకానులెండి’’ వివరించాడు భజగోవిందం.
పోయాక
కోడిపిల్ల: మమ్మీ మనుషులంతా పుట్టగానేపేర్లు పెట్టుకుంటుంటారు. మరి మనకెందుకు లేవు?
తల్లికోడి: మనకూ ఉన్నాయి ఎన్నో... చికెన్ 65, చిల్లీ చికెన్, తండూరి చికెన్...ఇలా. కాకుంటే అవన్నీ మనం పోయాకే పెడతారు.
నానా స్టాపు
ఒకడు: మధ్యలో ఎక్కడా ఆగని బస్సును ‘నాన్‌స్టాప్’ బస్సు అంటారు కదా! మరి ఇలా ఆగమన్న చోటల్లా ఆగే బస్సును ఏమంటారో?
రెండోవాడు: ‘నానాస్టాపు’ బస్సు
రెండూ సమానమే
5 నిమిషాల్లో రెడీ అయిపోతాను - స్త్రీలు
5 నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను - పురుషులు
ఇంకా డౌటా?
ఓ తల్లి తన ఆరేళ్ల కూతురితో బస్సెక్కింది. ‘‘ఇంత వికారమైన పిల్లను నేనెప్పుడూ చూడలేదు’’ ముఖం చిట్లించుకుంటూ అన్నాడు డ్రైవర్. గొణుక్కుంటూ వెళ్లి సీట్లో కూర్చుంది ఆమె. కోపంతో ఊగిపోతూ డ్రైవర్‌ను శాపనార్థాలు పె డుతూనే ఉంది. ఆ న్యూసెన్స్ భరించలేని పక్కసీటు ప్యాసింజర్ ఆమెతో అన్నాడు. ‘‘అమ్మా, నేరుగా వెళ్లి ఆ డ్రైవర్‌కే రెండు తగిలించి రారాదూ. అంతవరకు ఈ కోతిపిల్లను నేను భరిస్తా’’ అన్నాడు ప్యాసింజర్.
టక్కరి
‘‘ఈ రోజు మీ డాడీ మా బ్యాంకుకు వచ్చాడు. అక్కౌంట్ ఓపెన్ చేసాడు. ఇక మన ప్రేమను ఆలస్యం చేయదలుచుకోలేదు’’ అని ముగించాడు టక్కరి యువకుడు.
ఆడా, మగా?
ఎ: పొట్టి జుట్టు గల బ్లూజీన్స్‌లోని ఆ వ్యక్తి ఆడా, మగా?
బి: ఆ అమ్మాయి నా కూతురే.
ఎ: సారీ సార్, మీరు ఆ అమ్మాయి డాడీ అని తెలియదు.
బి: డాడీ....కాదు బాబూ.. మమ్మీని.
దానికేం ... అల్లాగే!
‘‘నీతో కలిసి ఉండాలంటే విసుగ్గా ఉంది. ఇకనుండి మనం విడిగా ఉందాం’’ చెప్పాడు భర్త.
‘‘నేను బెడ్రూములో పడుకుంటా. నీవు వరండాలో పడుకో’’ ఠపీమని బదులిచ్చింది తాయారు.
డాక్టర్ గారి
‘ఉచిత’ సలహాలు
‘‘నిద్రలో నడిచే అలవాటుంది. ఏం చెయ్యమంటారు?’’
‘‘నడక ఆరోగ్యానికి మంచిదే కదా .. నడవండి’’
‘‘సార్ రాత్రుళ్లు పీడకలలు వస్తున్నాయి’’
‘‘కలలు రావటం ముఖ్యం కానీ ఏ కలలైతే ఏమిటీ? అబ్దుల్ కలాం ఏమన్నారు? నిత్యం కలలు కంటూ ఉండమని చెప్పలేదూ ...’’
జవాబు తెలీక కాదు!
‘‘ఏంట్రా స్కూలు వదలకుండానే వచ్చేశావు?’’ అడిగాడు తండ్రి.
‘‘మాస్టారు ఒక ప్రశ్న అడిగారని ...’’ చెప్పాడు పుత్రరత్నం.
‘‘నీవు జవాబు చెప్పలేదా? ఆయన అడిగిన ప్రశ్న ఏంటి?’’ రెట్టించాడు తండ్రి.
‘‘ఈ కంపాక్స్ బాక్స్‌ని నా బుర్రకేసి కొట్టిన వెధవ ఎవడ్రా?’’ చెప్పాడు పుత్రరత్నం.
నేనింకా నేర్పలేదమ్మా!
‘‘వదినా ... కాస్త అన్నయ్యగార్ని పిలుస్తారా .. ఇంట్లో కరెంటు లేదు. ఫ్యూజు ఎగిరిపోయినట్టుంది. వేసిపెడతారేమో’’ అడిగింది పక్కింటి పంకజాక్షి.
‘‘అయ్యో ... రాత. ఆయనకు అంట్లు తోమడం, వంట చేయడం, బట్టలుతకడం నేర్పడానికే ఇన్నేళ్లు పట్టింది నాకు. ఫ్యూజులేయడం ఇంకా నేర్పలేదమ్మా’’ తాపీగా బదులిచ్చింది మీనాక్షి.
కొనడం మాత్రం తప్పదు!
‘‘ఏ వస్తువు కొనాలన్నా మా ఆవిడ రెండు కారణాల్లో ఏదో ఒకటి విధిగా చెబుతుంది’’ చెప్పాడు సత్యానందం.
‘‘ఏమిటవి?’’ అడిగాడు బ్రహ్మానందం.
‘‘ఎదురింటి వాళ్ల దగ్గర ఉంది కాబట్టి మనమూ కొనాలనని. లేదా వాళ్లింట్లో లేదు కాబట్టి మనం కొంటే గొప్పగా ఉంటుందని’’ చెప్పాడు సత్యానందం.
లౌక్యం
సుబ్బారావ్‌ని ఇంటర్వూలో ఇంగ్లీష్‌లో అడిగారు. ‘మీరు పుట్టింది ఎక్కడ’?
సుబ్బారావ్: ‘తిరువనంతపురం’.
ఆఫీసర్: ‘స్పెల్లింగ్ చెప్పండి’.
సుబ్బారావ్: అలా అయితే ‘గోవాలో’.
క్లూ
కక్ష తీరే మార్గమదే!
పెళ్లయిన ఏడాదికే రాణి చావు బతుకుల్లో హాస్పటల్లో చేరింది. చివరి మాటగా భర్తతో -
‘‘మీరు మళ్లీ తప్పక పెళ్లి చేసుకోవాలి. అదీ నా ఫ్రెండ్ పద్మను మాత్రమే’’ మాట తీసుకుంది.
‘‘పద్మ అంటే నీకు ఎంత ప్రాణం రాణీ’’ కళ్లు తుడుచుకున్నాడు వెంకట్రావు.
‘‘ఆ దిక్కుమాలిందే నీతో నన్ను పెళ్లికి ఒప్పించింది. అది ఇంతకింతా అనుభవించాలి’’ పైకి అనలేక తల ఊపింది రాణి.
ఒక వికెట్‌కి ఒక ఉద్యోగం
‘‘మా హాస్పిటల్లో ఆపరేషన్ ఫెయిలై పేషెంటు చనిపోతే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇక్కడే ఉద్యోగం ఇస్తారు తెలుసా?’’ గొప్పగా చెప్పింది నర్స్ నాంచారి.
‘‘అసలు సంగతి అదన్నమాట! ఇంత చిన్న హాస్పిటల్లో రోగులకంటే సిబ్బంది ఎక్కువుందేం చెప్మా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను’’ అంది నాంచారి స్నేహితురాలు మయూరి.
గడుగ్గాయి
‘‘ఏం తమాషాగా ఉందా? కీటకాలను గీయమంటే తెల్లపేపరు ఇస్తావా?’’ అరిచాడు డ్రాయింగ్ మాస్టారు.
‘‘నేను గీసినవి సూక్ష్మజీవులు సార్. కళ్లకు కనిపించవు. భూతద్దంలో చూడాల్సిందే’’ చెప్పాడు విద్యార్థి.
నాగాస్త్రం
వైశంపాయనుడు గారు ఇంటిమీద మొదటి అంతస్తు వేస్తున్నాడు. అడ్డు వస్తున్నాయని పక్కింటి మునగచెట్టు కొమ్మల్ని నరికించాడు. యాత్రల నుంచి తిరిగి వ చ్చిన పక్కింటి గోకర్ణం గారు తన చెట్టు బోడిగా అయిపోయి వుండడం చూసి, అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. పక్కింటివాడు పై అంతస్తు వేస్తూ వుంటే ఎంత మండిపోతుందో అంతా మండిందాయనకి. వైశంపాయనుడు గారు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశాడు. వినకపోయేసరికి, పక్కింటి మీదే వాలే కొమ్మలపై ఆ ఇంటి వాడికి హక్కుంటుందని ‘లా పాయింటు’ వదిలాడు. దాంతో గోకర్ణం డిఫెన్స్‌లో పడి పోయాడు. ఉక్రోషానికి తిక్క తోడైంది. ‘‘అదేం కుదరదు నా కొమ్మలు, మునక్కాయలూ నాకు తెచ్చివ్వాల్సిందే’’ అంటూ రాంగ్ రూట్లో వచ్చేశాడు. అంతా ఓపిగ్గా విన్న వైశంపాయనుడు గారి ధర్మపత్ని సుబ్బాయమ్మ గారు ముందు కొచ్చింది. ‘‘అంతేకదా అన్నయ్యగారూ మీ కొమ్మలూ, కాయలూ తెచ్చిచ్చేస్తాం గానీ, మొన్న మా పెరట్లోంచి మీ ఇంటివైపు పాము వచ్చిందని చంపేశారు కదా. ముందు మా పాముని మాకు తెచ్చివ్వండి. మేమెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పామది!’’ అంది సవినయంగా. గోకర్ణంగారు సైలెంట్ అయిపోయారు
అసలిస్తే చాలు
వైశంపాయనుడుగారిని కోర్టుకి ఈడ్చింది సుబ్బాయమ్మగారు. కూతురి పెళ్లికి సొమ్ము సర్దుబాటు కాక ఇబ్బందిపడుతున్నానని, త్వరలో వడ్డీతో సహా బాకీ తీరుస్తాననీ ప్రాధేయపడితే, తన పుట్టింటి వారిచ్చిన యాభైవేలనీ ఫిక్సెడ్ డిపాజిట్ క్యాన్సిల్ చేసి మరీ ఆయన చేతుల్లో పోసిందట. కూతురి పెళ్లి చేయడమే కాకుండా కొడుకుని స్టేట్స్‌కి కూడా పంపించాడు గానీ బాకీ మాత్రం తీర్చలేదు వైశంపాయనుడు గారు. నిజానికి వడ్డీతో కలిపి మొత్తం లక్ష అవుతుందని, అయితే బంధువు కాబట్టి వడ్డీ అడగడం లేదని, అసలిప్పిస్తే చాలని కోర్టువారికి మొరపెట్టుకుందామె. ‘‘బంధువా? ఏమవుతారమ్మా మీకు?’’ అని అడిగేడు లాయరు. ‘‘భర్త!’’ అంది సుబ్బాయమ్మగారు తాపీగా.్త్రె్చర