పేజీ సంఖ్య - 37
ప్రశ్న మరియు సునీల్
ప్రశ్న: "అనీల్: సిగరెట్లు మానేశావని విన్నాను. నిన్ను చూస్తే మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నావు." అని అడిగాడు.
జ: "సునీల్: మానేశానంటే ఎవరూ నమ్మడంలేదు. అందేచేత మళ్ళీ మొదలు పెట్టాను." అన్నాడు.
ప్రశ్న మరియు నాగేష్
ప్రశ్న: "ఊటీ వెళ్తున్నావట. కంగ్రాట్స్ బాగా ఎంజాయ్ చెయ్యి." అన్నాడు నాగేష్.
జ: "ఏం ఎంజాయ్ మెంట్ మా ఆవిడకూడా వస్తుంది." చెప్పాడు బాధగా.
ప్రశ్న మరియు నిహాల్
ప్రశ్న: "ఆ రాణితో నీ ప్రేమ వ్యవహారం సుఖాంతమైందా? దుఃఖాంతమైందా?" అని అడిగాడు నిహాల్.
జ: "దు:ఖాంతమే అయింది? చివరికి. ఇరువైపుల పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు." అని విచారంగా చెప్పాడు విశాల్.
ప్రశ్న మరియు రాజు
ప్రశ్న: "రాజు: నేను ఈత నేర్చుకుందామనుకుంటే వద్దంటావు. మరి డాడీని ఆపవేం?" అని అడిగాడు.
జ: "సుందరి: డాడికి ఇన్సూరెన్స్ ఉందికదా." అని సర్దిచెప్పింది.
ప్రశ్న మరియు రమేష్
ప్రశ్న: "చాలా రోజులనుండి చూస్తున్నాను నువ్వు మంచి వెయిటర్వి. ఇవ్వాళ నాతోబాటు సువ్వూ టీ తాగు, రెండు టీలు తే." అని అన్నాడు రమేష్.
జ: "సారీ అండి. నేను కాస్త మంచి హోటల్లో టీ తాగుతాను." అని చెప్పాడు వెయిటర్.
ప్రశ్న మరియు శ్రావ్య
ప్రశ్న: "నా వంట ఎలా ఉంది?" అని అడిగింది శ్రావ్య.
జ: "నా మొహంలా ఉంది." అన్నాడు వినోద్ విసుగ్గా.
జ: "మరీ అంత చండాలంగా ఏమీలేదులెండి?" అంది శ్రావ్య.
ప్రశ్న మరియు అనంత్
ప్రశ్న: "నేను చనిపోయాక ఆ శంకర్ని పెళ్లాడు." అన్నాడు అనంత్.
జ: "ఎందుకని?" అడిగింది భార్య వినీత.
జ: "అతడే.. నా బద్ద శత్రువు.." అని చెప్పాడు అనంత్.
ప్రశ్న మరియు జడ్జి
ప్రశ్న: "కొత్త బట్టలను ఎందుకు దొంగిలించావు?" అడిగాడు జడ్జి.
జ: "సంక్రాంతి పండుగ వస్తుందికదాసార్." చెప్పాడు ముద్దాయి.
ప్రశ్న మరియు లాయర్
ప్రశ్న: "ఇంత చిన్నపుడే ఇన్ని అబద్దాలడుతున్నావు పెద్దయ్యాక ఏమవుతావు?"
జ: "లాయర్ని కావాలని నా ఆశయం." టీచర్" అని సమాధానం చెప్పాడు రాజు.
ప్రశ్న మరియు శ్రవన్
ప్రశ్న: "మీ ఆవిడ సంగీతం ప్రాక్టీస్ చేస్తుందారాజూ?" అని అడిగాడు శ్రవన్.
జ: "అవును ఆ విషయం నీకెలా తెలిసింది?" అని అడిగాడు నవీన్.
జ: "మీ ఇంటికి ఇటూ అటూ నాలుగేసి ఇళ్ళ చొప్పున ఖాళీగా ఉంటేనూ." అని సమాధానం చెప్పాడు శ్రావణ్.