పేజీ సంఖ్య - 42

రాధిక మరియు హారిక

రాధిక: "'గవర్నమెంట్ ఉద్యోగస్తుణ్ని పెళ్లి చేసుకోవడం తప్పయిందే"'

హారిక: "'ఏమయిందే?"' అని అడిగింది.

రాధిక: "'శోభనం గదిలో ఆయనకి ఒకటే ఆవలింత'" అంది చిరాగ్గా.



ప్రేమ, దోమ కామెంట్

రెండూ నిద్ర డిస్ట్రబెన్స్ కలిగించేవి.



కొత్త హీరోయిన్ తెల్లబోయే పరిస్థితి

కొత్త హీరోయిన్: "'ఈ బట్టలు వేసుకోవాలంటే సిగ్గేస్తుంది."

డైరెక్టర్: "'అలా నువ్వు సిగ్గు పడకూడదు. చూసే ప్రేక్షకులు సిగ్గుపడాలి'" అని వివరించాడు.



అపశకునం

శుభమా అని జరగబోయే పెళ్ళికి లాయర్లని అతిధులుగా పిలవడం.



సూక్తి

'ఆరోగ్యమే మహాభాగ్యం' జనానికి మాత్రమే, కానీ డాక్టర్లకు 'మీ అనారోగ్యమే మా మహాభాగ్యం'.



సతీష్ మరియు నితీస్

సతీష్: "'కరెంట్ పోవాలని కోరుకుంటావేమిటి?"'

నితీస్: "'కరెంట్ పోతేనే మా ఆవిడ టీవీ సీరియల్స్ చూడడం ఆపి వంట మొదలెట్టేది'" అని వివరించాడు.



భర్త తెల్లబోయేదెప్పుడు

భర్త: "'టీవీ సీరియల్స్ బోర్ అంటూనే రోజంతా చూస్తావేం?"'

భార్య: "'మీరు పది సంవత్సరాలనుంచి బోర్ కొడుతున్నారు. అయినా మిమ్మల్ని వదిలేసానా మరి'" అని సమాధానమిచ్చింది.



సభాష్ మరియు డాక్టర్

సభాష్: "'డాక్టర్ నాకు సుపిరియారిటీ కాంప్లెక్స్ ఉంది. పెళ్ళి చేసుకోవచ్చా?"'

డాక్టర్: "'ఫరవాలేదు, పెళ్ళి చేసుకున్న తర్వాత ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది లెండి'" అని సర్దిచెప్పాడు.



చింటూ మరియు కిట్టూ

చింటూ: "'నీకు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఏమీరాదు.. అయినా టీమ్ నిన్నెందుకు తీసుకుర్నారో అర్థం కావడంలేదు."'

కిట్టూ: "'క్రికెట్ కిట్ నాదే మరి'" అని అసలు సంగతి చెప్పాడు.



ఇంగ్లీషు మాష్టారు మరియు చింటూ

మాష్టారు: "'గదిలోనుంచి బయటకి వెళ్ళు అనడాన్ని ఇంగ్లీషులో ఏమనాలి?"'

చింటూ: "'గెట్ అవుట్' అంటానండి."

మాష్టారు: "'మరి లోపలికి రమ్మని అనడానికి ఏమంటావ్?"'

చింటూ: "'నేను బయటకి వెళ్ళి మళ్ళీ 'గెట్ అవుట్' అంటానండి'" అని ఆలోచించి చెప్పాడు.

Pagination Example

తదుపరి


పేజీ సంఖ్య -42

Responsive Footer with Logo and Social Media