పేజీ సంఖ్య - 43
సుబ్బారావు మరియు రాము
సుబ్బారావు: "'ఏం భోజనం చేసేముందు దేవుడికి ప్రార్ధన చేయవా?"'
రాము: "'మా అమ్మ వంట బాగానే చేస్తుంది'" అని జవాబిచ్చాడు.
సతీష్ మరియు వెంకట్
సతీష్: "'మా ఫ్యామిలీ డాక్టర్ మందు తాగవద్దని తెగ సలహాలు ఇస్తున్నాడు ఈమధ్య. అందుకే మనేశాను"'
వెంకట్: "'మందు మానేశావా?"'
సతీష్: "'ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళడం మానేశాను. కొత్త ఫ్యామిలీ డాక్టర్ని చూసుకున్నా'" అన్నాడు.
ప్రేమ-పెళ్ళి పోలిక
ప్రేమ మరియు పెళ్ళి? స్వర్గం, నరకం లాంటివి.
జాతకాల పిచ్చి తండ్రి సంతృప్తి
తండ్రి: "'పరీక్ష తప్పావా?"'
కొడుకు: "'నా గ్రహస్థితి బాగాలేదు. ఎంత బాగా చదివినా ఫేలవుతానట, సిద్ధాంతి చెప్పాడు'" అని చెప్పినప్పుడు తండ్రి సంతృప్తి పడ్డాడు.
జయ మరియు ప్రియ
జయ: "'నువ్వెంత పెళ్ల్నే మీ ఆయన ఒక్క ముక్కకూడా మాట్లాడడేం?"'
ప్రియ: "'ఆయన లైబ్రేరియన్లే'" అంది.
పొదుపరి గృహిణి
స్టీలు సామాన్ల అతని అభిరుచి ప్రకారం తన కొత్త చీరలు కొనుక్కునేది.
శక్తివంతమైన సిటీ
ఎలక్ట్రిసిటీ.
ఆఫీసర్ మరియు వెంకట్రావు
ఆఫీసర్: "'నాకు పునర్జన్మల మీద నమ్మకం కుదిరించినందుకు థ్యాంక్స్ వెంట్రావు"'
వెంకట్రావు: "'నేను నమ్మకం కలిగించనా ఎలా?"'
ఆఫీసర్: "'నువ్వు నిన్న మీ తాత అంత్యక్రియలకని లీప్ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత, నీకోసం మీ తాత ఆఫీసుకు వచ్చాడు'" అని అసలు విషయం చెప్పాడు.
చమత్కారి పురోహితుడు
పెళ్ళివాళ్ళు: "'కాస్త ఆగండి పంతులుగారు, మీకు దక్షిణ ఇస్తాం"'
పురోహితుడు: "'అలాగా, ఉత్తరం, తూర్పు, పడమర కూడా ఇవ్వండి"'
వెంకట్ మరియు సురేష్
వెంకట్: "'పెళ్ళికి ముందు దీపావళి బాంబులంటే తెగ భయపడేవాణ్ని"'
సురేష్: "'అంటే మీ ఆవిడ నీ ఆ భయం పోగొట్టందన్నమాట?"'
వెంకట్: "'మా ఆవిడ మాటలు ఆ బాంబులకంటే పవర్ఫుల్" అన్నాడు వెంకట్.'