పరమానందయ్య పరిచయం



గోదావరీ నదీ తీరాన సుక్షేత్రమైన ఒకానొక అగ్రహారంలో సచ్చిదానందుల వారనే గురువరేణ్యులు నివశిస్తుండేవారు. ఆయన ధర్మపత్ని కాలం చేశాక 'ఇహలోక సుఖాల కంటే పరలోక చింతనమే ఈ జన్మ సార్ధక్యానికి హేతువు' అని గుర్తించినవారై సత్య, ధర్మ, శాంత, సహన గుణాలతో శోభిస్తూ ఆ చుట్టుప్రక్కల పది -ఇరవై గ్రామాల ప్రజలకు దర్మబోధ చేస్తూ 'సచ్చిదానంద మఠాన్ని' నెలకొల్పారు. గురువుగారిగా ఆ గ్రామాల ప్రజలు ముక్త కంఠంతో సచ్చిదానందుల వారి మాట జవదాటక, తమధర్మ సందేహాలను తీర్చుకుంటూ ఉండేవారు. ఆయన స్వయంగా ఆచరించి చూపిన వాటినే ఇతరులకు బోదిస్తూ గురు శబ్దానికి గొప్ప అర్హత కలిగించారు.

సచ్చిదానంద గురువరేణ్యులు ఏకైక పుత్రరత్నమే పరమా నందయ్య. తల్లిలేని బిడ్డ అయినందున అధిక గారాబం చేస్తూ, తల్లీ తండ్రీ తానే అయి పెంచి పెద్ద చేశారు సచ్చిదానందులు. ఫలితంగా పరమానందయ్య 'పండితపుత్రుడై' వర్ధిల్లసాగాడు తప్ప అసలైన పాండిత్యం సంపాదించలేక పోయాడు. తండ్రి విద్వత్తులో వెయ్యోవంతు అయినా అబ్బని పరమానందయ్యకు తండ్రి గుణాలలో ఒక్కటి మాత్రం దక్కింది. అదే మంచితనంతో కూడిన అమాయకత్వం. దీనికి తోడు జాలీ, భూతదయా, శాంతం, సహనం వంటి సోదర గుణాలు సహజంగానే అలవడ్డాయి. తండ్రిగారి పేరుతోబాటు గురు పరంపరగా గురు పీఠాన్ని అలంకరించే భాగ్యం పరమానందయ్య గారికి తండ్రిగారి తదనంతరం దానికదే సంక్రమించింది. గురుపీఠార్హత గురించి ఎవరూ ప్రశ్నించే అవసరం రాలేదు. దానికి కారణం... ఆ చుట్టు ప్రక్కల ఇరవై క్రోసుల దూరం దాకా గురువు కాదుకదా!.... కనీసం పురోహితులైన లేని ప్రాంతం.

సచ్చిదానంద గురుదేవుల కాలం నుంచీ చుట్టుప్రక్కల గ్రామస్తులు ఇచ్చే సంభారాలతో హాయిగా కాలం గడిచిపోతూ ఉండే ఆ గురుపీఠం ధర్మకార్యాచరణలో ముందుండేది. ఎవరికీ అన్నానికి లోటులేని సుక్షేత్రం గనుక పీఠంలోని గురువరేణ్యులను తమకు తోచినపుడు తమ గ్రామంలో పర్యటించవలసిందిగా కోరి ధర్మసూక్ష్మాలు చెప్పించుకోవడం, పురాణకాలక్షేపాలు జరిపించుకోవడం, తమకు తోచిందేదో తృణమో పణమో గురువు గారికి సమర్పించడం ఆ గ్రామస్తులకు అలవాటు.

గృహంలో జరుగుబాటుకు ఇబ్బందిగా ఉన్నప్పుడు తన శిష్యులతో సహా ఆయా గ్రామాలను సందర్శించడమనేది కూడా ఒక ఆనవాయితీ. అయితే సచ్చిదానందుల వారికి ఒకరిద్దరు శిష్యులకు మించిలేరు. వారుకూడా ఆయన కాలం చేశాక తాము నేర్చుకోడానికి ఇంకేమీలేక దూరప్రాంతాలలో వేరే గురువును ఆశ్రయించడానికి తరలిపోయారు.

సచ్చిదానందులవారు బ్రతికి ఉన్న రోజుల్లోనే పరమానందయ్యకు పేరిందేవి అనే సుగుణాల రాశితో పెళ్ళి జరిపించివున్నందున ఆయన నిశ్చింతగా కన్నుమూశారు.

పేరిందేవి పెద్దగా చదువుకోక పోయినా, అన్ని విధాలా భర్తకు అనుకూలవతి అయిన భార్యగా మెలగడంలో గొప్ప మెలకువ కలిగినది. పైగా ఆమెకు లోకజ్ఞానం కొంత ఉన్నది. జాలీ, దయా, పరులకు పెట్టేగుణం... ఇవన్నిటిలోనూ పరమానందయ్యకు సరిజోడిగా సరిపోయింది.

పరమానందయ్య పరిచయం

మరిన్ని కథల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పట్టుబట్టల దహనం

మక్కికి మక్కీ జవాబు

పరమానందయ్య పరలోక యాత్ర

తీర్థం - ప్రసాదం

మందమతులైన మహాత్ములు

పిండాల పోలేరమ్మకి పిండప్రదానం

శాపగ్రస్తురాలైన దేవకన్య

25.నన్ను బైటికి తియ్యి, నీ దాహం తీరుస్తా!

పురాణం చెప్పిన శిష్యులు

గురువుగారూ - గుర్రముపై ప్రయాణమూ

ఫలించిన జ్యోతిష్కుని మాట

గుర్రపుశాల యోగం లేని గుర్రం

శొంఠికొమ్ము వైద్యం

నీటిగండం తప్పిన గురువు గారు

చిన్నదీ - చిరునవ్వు

పరశురామ ప్రీత్యర్ధం - ఉత్సవం

దొంగా... దొంగా... దొరికారోచ్…

తిక్కరేగిందా?తిమ్మిరెక్కిందా?

మంత్రమా? మజాకానా?

భూతంగారి స్థలపురాణం

అమరేశ్వరుడి సన్నిధిలో ఆనందహేల

విద్యారంభంతో వింతగోల

విద్దెలమ్మా... విద్దెలూ... వింత వింత విద్దెలు

దడిగాడు వానసిరా

దేవేంద్ర శాపంతో భూలోకానికి.

శిష్యులతో సహా పరమానందయ్య ఏరుదాటడం

క్షేమంగా ఏరు దాటిన గురు శిష్యులు

శిష్యుల సంఖ్యలో తేడా వచ్చిందని సందేహం

కార్తీక సోమవార వ్రతఫలం

గురువు గారి కాలికి ముల్లు గుచ్చుకోవడం

గురువు గారికి గుర్రం కోసం వెతుకులాట

గుర్రం గుడ్డు బేరం

ఒసే... గంగానమ్మ

భూతాలరాజుని దుమ్మెత్తిపోసిన భేతాళుడు

రామాయణంలో పిడకలవేట

ఎలుకల బాధ

Responsive Footer with Logo and Social Media