17.పరశురామ ప్రీత్యర్ధం - ఉత్సవం



వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు జోరుగా జరగడం సర్వసాధారణమైన విషయం. పరమానందయ్య గారి ఆశ్రమానికి, కూతవేటు దూరంలో ఉన్న ఓ సంపన్నుని ఇంట వివాహం జరుగుతోంది.

ఆ రాత్రి వంటశాల వద్దనో, ఇతరత్రా కారణాల వల్లనో ప్రమాదం వాటిల్లి ఇల్లు అంటుకుంది. పెద్దపెద్ద మంటల్లో ఆకాశమే ఎరుపెక్కి పోయింది. వెదురు కర్రలు కాల్తూ ఫటఫట శబ్దాలు వినిపించసాగాయి.

మంటలు చూసి కూడా మాటాడకుండా పోతున్న మతిలేని శిష్యుడు ఓ శిష్యుడా దహనకాండ చూడబోయి వెళ్తూ వెళ్తూ దారిలో ఒక ఆసామిని "అదంతా ఏమిటి?" అని అడిగాడు. ధనికుల పైన ఆ ఆసామికి గల కసికొద్దీ "ఆఁ! ఏముందీ? అది పరశురామ ప్రీత్యర్ధం....” అనేసి . చక్కాపోయాడు. అయ్యో!... మంటలు అంటుకొని వాళ్ళెంత క్షోభ పడుతున్నారో కదా!" అనే ఆలోచన రాకపోయిందా శిష్యునికి, దూరాన్నుంచే ఆ దృశ్యం చూసి ఆ ఆసామి చెప్పిన మాటలనే వల్లె వేస్తూ ఆశ్రమానికి తిరిగొచ్చేశాడు. ఆ మంటల దృశ్యం యొక్క అందం, అతడి హృదయం మీద ముద్రపడింది

Responsive Footer with Logo and Social Media