వింతైన తోక పక్షిని…



హాయ్‌ నేస్తాలూ..! పక్కనే ఉన్న చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? రంగు రంగులుగా, వింత ఆకారంలో ఉన్న ఈ జీవి ఎక్కడి నుంచి వచ్చింది అసలు... అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనాన్ని జాగ్రత్తగా చదివి, దాని మాటల్లోనే ఆ వివరాలన్నీ తెలుసుకోండి!

పిల్లలూ.. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా...! 'ఏంటి ఇది వివరాలు చెప్పకుండా... కుశల ప్రశ్నలు అడుగుతుంది' అనుకుంటున్నారా! సరేలే... చెబుతాను వినండి. నా పేరు విల్ఫన్స్‌ బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైస్‌. పలకడానికి ఇబ్బందిగా ఉంటే. మీకు నచ్చినట్లు పిలవండి, పలుకుతాను. అన్నట్లు... నన్ను మీరెప్పుడూ చూసి ఉండరు. ఎందుకంటే. నేను ఇండోనేషియాకు చెందిన పక్షిని. అక్కడ తప్ప ఇంకెక్కడా కనిపించను. నా గురించి 1998లో ఓ ప్రముఖ ఛానెల్‌ డాక్యుమెంటరీ కూడా తయారుచేసింది.

అదే ప్రత్యేకం...!

నన్ను ఎన్నిసార్లు చూసినా చూపు తిప్పుకోలేరు తెలుసా! ఎందుకంటే. నా రంగు, రూపం అలా ఉంటాయి. నా శరీరం నలుపు... రెక్కలేమో బ్రౌన్‌, ఎరుపు... తల మీద లేత నీలం, పసుపు... కాళ్లు నీలం రంగులో ఉంటాయి. ఒక విధంగా రంగులన్నీ నా శరీరంలోనే ఉన్నాయా.. అన్నట్లు అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా... నా శరీరంలో తోక చాలా ప్రత్యేకం. అది ఎవరో తయారు చేసి పెట్టినట్లుగా నలుపు రంగులో వంకలు తిరిగి ఉంటుంది. మాలో ఆడ, మగ షక్షుల్లో రంగులో కాస్త తేడా ఉంటుంది.

ఒంటరిగానే...

నాకు గుంపులుగా ఉండటం అస్సలు నచ్చదు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఎంచక్కా అడవులన్నీ ఒంటరిగా తిరిగేస్తాను. నేను పండ్లు, చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాను. మీకో విషయం తెలుసా... పూర్వం నన్ను సంపదలకు, శక్తికి గుర్తుగా సూచించేవారు. నా బరువు 5£ నుంచి 8% గ్రాముల వరకు ఉంటుంది. పొడవు £1 సెంటీ మీటర్లు. సాధారణంగా అయితే... 8 ఏళ్ల వరకు, రక్షణ కల్పిస్తే... 80 సంవత్సరాల వరకు జీవిస్తాను. కానీ ప్రస్తుతం వేట వల్ల మా సంఖ్య చాలా వరకు తగ్గిపోతోంది. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!

Responsive Footer with Logo and Social Media