Subscribe

ఉపాయం


విజయనగర సామ్రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది .ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి‘’అవ్వ మేము యాత్రికులము చాలదూరం ప్రయాణం చేయుటచే బాగా అలసి పోయి ఉన్నాము .దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకొంటూ కొన్నాళ్ళు ఉంటాము" అన్నారు .

ఆమె అంగీకారంతో వారు ఆ ఇంటిలో నివసించసాగారు. ఒకరోజున వాళ్ళు బంగారునాణెములతో ఉన్న కుండనొకటి తెచ్చియిచ్చి దాన్ని భద్ర౦గా చూడవలసినదని ఆమెకు చేప్పారు . ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము మీకెక్కడిది మీరు దొంగల అని అడిగీంది, కాదు మేము యాత్రికులము ప్రతి రాత్రీ మేము దేవాలయాల వద్ద అనేక భక్తిగీతాలు పాడుతూ.జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాము .
వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణేలను ఇస్తుంటారు. మేము నలుగురము కలసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి. అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు. అందులకు ఆమె అంగీకరించింది.

ఒకరోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు, పళ్ళు కన్పించాయి. ఆ రోజు వాళ్ళ వద్ద పైకం మేమి లేదు. మరి అవి ఎట్లా కొనుక్కోవాలి. అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది. అందుచేత వారిలో ఒక్కణ్ణి పోయి కుండను తీసుకు రమ్మని చెప్పారు. వెళ్ళిన వాడు కుండనిమ్మని అడిగితె ఆ అవ్వ గట్టిగ “కుండను ఇతనికి ఇవ్వవచున్న ? “ అని కేక వేసింది.
ఆమెకు సమాదానంగా మిగితా ముగ్గురు “ఆ! ఇవ్వవచ్చు” అన్నారు. వెంటనే ఆమె వచ్చిన వానికి కుండనిచ్చింది. ఆ వాడు దురాశపరుడు. ఆ నాణాల కుండతో ప్రక్క దోవన ఎక్కడికో పారిపోయాడు.

ఎంతసేపటికి అతడు రాలేదని మిగిత ముగ్గురు అవ్వ వద్దకు వెళ్లి “ అవ్వ! కుండ ఏది?” అని అడిగాడు. వచ్చిన వాడికి కుండను ఇవ్వవచున్నని అరిచి చెప్పారు కదా!
అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది. దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభస చేయసాగారు. “ముసలమ్మా దొంగది. మా సొమ్మంత దొంగలించింది” అని అరవ సాగారు. ఆ గోడవకి చుట్టూ ప్రక్కల వారు అనేక మంది పోగయ్యారు. ఎవ్వరు ఏమి చేయలేక పోతున్నారు . అదే సమయంలో రామలింగడు ఆ దారి గుండా పోతూ వీరి గోల విన్నాడు. ఆసమయంలోనే ప్రాతః కాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది. ఆయనకు రామలింగడు జరిగినదంతా వివరించి “అవ్వను దూషించడం మంచిది కాదు. అవ్వ నిజయితీపరురాలు. మోసకారి కాదు!” అన్నాడు.

“ఐతే, ఆమె నిర్దోషియని నీవే నిరుపించి చూపించు” అని రామలింగని రాజు గారు అజ్ఞాపించాడు. రామలింగడు ఆ ముగ్గుర్ని ప్రక్కకు పిలిచి, జరింగినదంతా చెప్పండి అని అడిగాడు.

అంతా విన్న రామలింగడు “ ఈ అవ్వ దోషి కాదు. ఆమె అబద్దమాడుట లేదు. మీరు నలుగురు ఉన్నపుడు మాత్రమే ఆమెను కుండనిమ్మని చేప్పారు కదా ? ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు! మీకు ఈమె కుండనేట్ల ఇస్తుంది ? అని అడిగాడు. ఏం జవాబు చెప్పాలో వాళ్లకి తోచలేదు. వాళ్ళని నీలదీసిన మీదట, తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు.
రామలింగని తెలివికి రాజు గారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు. ముగ్గురు దొంగల్ని బందించి చెరసాలలో బెట్టారు.

Responsive Footer with Logo and Social Media