తెలివి
మల్లాపురం అనే గ్రామంలో ముగ్గురు స్నేహితులుండేవారు. వారు వ్యాపారం కోసం తిమ్మాపురం వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. తిమ్మాపురం వెళ్ళాలంటే ఒక సెద్ద అడవి దాటి వెళ్ళాలి. ముగ్గురు స్నేహితులు ఊరినుండి ఉదయం బయల్దేరారు. రెండు మూడు గంటల్లో వారు అడవిని చేరుకున్నారు. పోతూ పోతూ వుంటే ముగ్గురిలో ఒకడికి తాడు దొరికింది. మళ్ళీ పోతూ పోతూ ఇంకొకడికి చాట దొరికింది. అలాగే, మరొకరికి గడ్డపార దొరికింది. వారు ముగ్గురూ ఒక గుడిలో నిద్రపోయారు. -
అంతలో ఒక రాక్షసుడు అక్కడికి చేరుకున్నాడు. ఆ రాక్షసునికి నరవాసన వచ్చింది. ఆ వాననను బట్టి గుడి దగ్గరకు చేరుకున్నాడు. నర వాననను గుర్తువట్టి ఈ గుడిలో మనుషులున్నారనుకుని “ఒరేయ్! మానవా నేనెవరినో తెలుసా... రాక్షసుడ్నిరా! రారా బైటకు నమిలి మ్రింగేస్తా” అని పెద్దగా అరుస్తూ అన్నాడు రాక్షసుడు. ఆ ముగ్గురిలో ఒకడు తెలివితో "ఒరేయ్... రాక్షసుడా...! నేనెవరో తెలుసా? నేను రాకాసుల గాంచిన గూకాసినిరా!” అన్నాడు. కోపంగా అరుస్తూ "ఐతే బైటకిరా! నీ ప్రతాపం నా ప్రతాపం చూసుకుందాం?” అన్నాడు రాక్షసుడు “నేను రావటమేమిట్రా! నా గోరు చాలు నిన్ను పొడిచి చంపటానికి” అని గడ్డపారను చూపాడు. "అమ్మో ఇంత పెద్దదా?” అని ఆశ్చర్యపోయాడు రాక్షసుడు, “నా చెవి చూడరా, నా చెవిని ఆడించానంటే గాలికే కొట్టుకు పోతావురా!” అని చాటని బైట అటూ ఇటూ ఊపాడు. గూకాసుని చెవిని చూసి వణికిపోయాడు రాక్షసుడు. “నా తోక చూడరా!" అని త్రాడుని బైటకు విసిరాడు. అంతే ఆ దెబ్బతో ఆ రాక్షసుడు వణుకుతూ అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ రాత్రి ముగ్గురు స్నేహితులు హాయిగా నిద్రపోయి. తెల్లవారు జామున లేచి నడవటం మొదలుపెట్టారు.
తెలివి వుంటే ఏ పనినైనా తేలికగా సాధించవచ్చు.