లేత మనసు



అమ్మా!” అన్న ఆరుపు విని, వంటగదిలో వున్న సీత - చేతిలోని పాత్రను. క్రింద 'పెట్టి “ఏమైంది లక్ష్మీ?” అని అరుచుకుంటూ బయటికి వచ్చింది. ఇంటి ముందు ఎనిమిదేళ్ళ లక్ష్మి భయంతో నిలబడి వుంది. ఎదురుగా రంకెలు వేస్తూ ఎద్దు వేగంగా వస్తోంది.

అది పొలాల, వద్దే ఎప్పుడూ కట్టివేసి వుండేది. దానికి పొగరెక్కువ. అందువల్ల కనబడిన వారిని పొడుస్తుంది. ఎవరు దాని కట్లు విప్పారో.. లేక అదే బలవంతంగా తెంచుకుందో... తెలియదు. ఇంటి ముందు ఎర్ర రంగు గౌనుతో ఆడుకుంటున్న లక్ష్మిని చూసి, అది వేగంగా ఆ అమ్మాయి వైపు రాసాగింది. ఇంటి నుంచి బయటికి వచ్చిన సీత క్షణంలో సంగతి గ్రహించింది. ఆ ఎద్దు ఎవరికీ భయపడదు. అందువల్ల తన కుమార్తెని కాపాడాలని వంగి, లక్ష్మిని ఇంట్లోకి విసిరి, వెనక్కి తిరిగింది. అంతే! ఆ "ఎద్దు తన పదునైన కొమ్ములు సీత వెనుక నుంచి కడుపును చీల్చుకుని బయటికి వచ్చాయి. సీత 'అమ్మా!' అని పెద్దగా అరిచి రక్తపు ధారలతో అలాగే క్రింద పడిపోయింది. ఇంట్లో ఆఫీసు పని చేసుకుంటున్న శరత్‌, భార్య కేక విని, ఆతృతతో బయటికి వచ్చాడు.

నేల మీద పడివున్న సీతని చూసి “సీతా! ఏమైందే!” అంటూ దగ్గరికి తీసుకున్నాడు. కానీ అప్పటికే ఆమె ప్రాణాలు అనంతవాయువుల్లో లీనమై పోయాయి. శరత్‌ ఏడుస్తూ, “సీతా! ఇంతలో నీకు నూరేళ్ళు నిండయా? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసెలా వచ్చింది? ఈ దరిద్రపు గొట్టు ఎద్దు మనింటికి ఎందుకొచ్చింది?” అని ఏడ్వసాగాడు.

అంతలో చుట్టుప్రక్కల వున్నవారు గుమిగూడారు. ఎదురింటి అవ్వ అంతా చూసినట్టుంది. “శరత్‌, పాపం! నీ భార్య లోపల పనిచేసుకుంటున్నట్టుంది. నీ కూతురు లక్ష్మీ మీదకు ఆ ఎద్దు వస్తున్న సంగతి తెలుసుకుని, సీత పరిగెత్తుకు

వచ్చి దాన్ని లోపలికి గిరవాటు వేసి, తాను బలి అయిపోయింది. ఇంక విచారించి ప్రయోజనం ఏమీ లేదు. పైన జరపవలసింది చూడు.” అన్నది. అంతా విన్న శరత్‌ దుఃఖాన్ని ఆపి, కోపంతో, లక్ష్మిని చూసాడు. భయంతో లక్ష్మి... బిత్తర చూపులు చూస్తూ, వణుకుతూ 'నేనేంచేయలేదు నాన్నా! నాకేం తెలీదు” అంది.

శరత్‌ కోపంతో లేచి, లక్ష్మి చెంప మీద టపటపా వాయించి “దరిద్రపుగొట్టుదానా! నీ వల్ల సీత చనిపోయిందా? ఇంట్లో ఆడుకోకుండా బయటకు ఎందుకు వెళ్ళావు? ఇక మీదట నీ పాపిష్టి ముఖం నాకు చూపకు” అంటూ లోపలికి వెళ్ళాడు.

తండ్రి చేసిన పని లక్ష్మికి ఏమీ అర్ధం కాలేదు. “అమ్మని చంపింది ఆ ఎద్దు, మరి నాన్న ఎందుకు తనని తిడుతున్నారు.. కొడుతున్నారు? తానేం చేశానని అసలు అమ్మ లేకుండా తాను మాత్రం వుండగలనా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు? అమ్మ వుండేటప్పుడు నన్ను ఎంత (ప్రేమగా చూసుకునేవారు. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి?” అని ఆలోచిస్తూ వుండిపోయింది.

సీత, శరత్‌ అన్యోన్య దంపతలు, వారి ముద్దుల కుమారై లక్ష్మి. ఆ సంసారంలో ఎప్పుడూ చిన్న పోట్లాటైనా జరగేదికాదు. ' ఎప్పుడూ ఆనందంగా వుండేవాళ్లు. శరత్‌కు సీత అంటే ఎక్కువ ఇష్టం. ఆమెని వదిలి వుండేవాడు కాదు.

తన ప్రాణపదమైన సీత చనిపోవడంతో, అందుకు కొంత కారణమైన తన కూతురు లక్ష్మిని అసహ్యించుకోసాగాడు. ఆ ఇంట్లో అన్ని కార్యక్రమాలు ముగిసాయి. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి తండ్రితో మాట్లాడాలని శతవిధాలా ప్రయత్నించింది. కానీ శరత్‌ భార్య మీద ప్రేమతో - కన్న కూతురిని గమనించటం లేదు.

ఆ రోజు లక్ష్మి పుస్తకాల సంచి తగిలించుకుని “నాన్న! అమ్మ పోయాక నేను బడికి వెళ్ళలేదు. ఈ రోజు. నుండి బడికి! వెళుతాను?” అంటూ భయంగా

అంది. “నువ్వెక్కడైనా చావు - నా కెందుకు? బంగారం లాంటి నీ తల్లిని పొట్టిన పెట్టుకున్నావు. నువ్వు బ్రతికివుండి ఎవరిని సాధించాలి? నా కంటి. ముందు నిలవకు పో...” అంటూ లోపలికి వెళ్ళాడు.

మర్చాడు తెల్లారగానే శరత్‌ నిద్రలేచి, బయటికి వెళ్ళి కాఫీ తాగి వచ్చాడు. ఇంట్లో కూతురికి కాఫీ ఇవ్వాలన్న జ్ఞానమైనా లేదు అతనికి! తరువాత అమ్మాయి బడికి వెళుతుంటే.. ఏమైనా తిండి పెట్టాలన్న సంగతి కూడా మరిచాడు. మధ్యాహ్నం భోజనం క్యారియర్‌లో పెట్టివ్వాలన్నది అతనికి గుర్తుకురాలేదు. పాపం! లక్ష్మికి అన్నీ తెలుసు, కానీ నాన్నని అడిగితే తిడతాడన్న భయంతో ఏమీ తినకుండా బడికి వెళ్ళిపోయింది . బడి ఇంటి నుండి చాలా దూరంలో వుంది. అమ్మ వుండగా ప్రతిరోజూ తండ్రి సైకిల్‌ మీద తీసుకువెళ్ళి దిగబెట్టే వారు. తల్లి ప్రేమతో వీడ్కోలు చెప్పేది. కానీ ఈ రోజు. నుండి తనకి దిక్కెవరూ లేరు. ఇంత చిన్న వయసులో ఇన్ని కష్టాలు భరించవలసి వచ్చింది. అదే అమ్మ వుంటే, తన చేతితో చిన్న పని కూడా చేయనీయదు... “అమ్మా! ఎందుకమ్మా నన్ను వదిలి వెళ్ళావు? నువ్వు నా వల్ల చనిపోయావా? నాన్న ఎందుకు ఇంతగా మారిపోయారు... నువ్వు తిరిగి వచ్చేయమ్మా?' నువ్వు లేక (బ్రతకలేనమ్మా?” మనసులో అనుకుని ఏడుస్తూ లక్ష్మి వెళ్లసాగింది.

లక్ష్మి నీరసంతో బడిని చేరుకుంది. అప్పటికే క్లాసు జరుగుతోంది. లక్ష్మి తెలివైన పిల్ల, చక్కగా చదువుకుంటుంది. అని మేష్టరికి తెలుసు. అందులో వాళ్ళ అమ్మ చనిపోయిందని పది రోజులు రాలేదని తెలిసివున్నందువల్ల ఆలస్యానికి కారణం , అడగకుండా లక్ష్మిని క్లాసులో కూర్చోమన్నారు. మధ్యాహ్నమైంది అందరు పిల్లలూ తాము తెచ్చుకున్న భోజనం తినసాగారు. కాని లక్ష్మి వద్ద ఏమీ లేదు. అందరూ తింటుంటే ఆ చిన్నారి మనసు వేదన పడసాగింది. ఆకలికి తట్టుకోలేకపోయింది.

తిన్నగా క్లాసు గదిలోకి వెళ్లి కుండలో వున్న చల్లని నీటిని రెండు గ్లాసులు (త్రాగి, పుస్తకాలు తీసి చదువుకోసాగింది. నాలుగు గంటలకు బడి వదలడంతో పిల్లలు సంతోషంతో ఇంటి వైపు కేకలతో పరిగెత్తసాగారు. కానీ లక్ష్మికి ఇంటికి వెళితే సంతోషమెక్కడిది? బడిలోనే మనసుకు కొంత తృప్తి వుంది. అయినా వెళ్ళక తప్పదుగా, విచారంతో ఇంటివైపు నడిచింది.

లక్ష్మి ఇల్లు చేరి చూడటంతో తలుపుకు తాళం వేసి వుంది. తండ్రి ప్రతిరోజూ సాయంత్రం ఆరుగంటల మీదటే ఆఫీసు నుండి వచ్చేవారు. ఆయన వచ్చేదాకా వేచి వుంది. ఇంటి అరుగు మీద కూర్చుని, హోంవర్క్‌ చేసుకోసాగింది. తెల్లవారి నుండి తిండి తిననందున, వ్రాసుకుంటు అలాగే నిద్రలోకి జారుకుంది.

ఏడు గంటలకు ఇంటికి వచ్చిన శరత్‌ తిన్నెమీద పడుకుని వున్న లక్ష్మిని చూసి, ఏమాత్రం కనికరం చూపకుండా తలుపులు తెరిచి లోపలికి వెళ్ళిపోయాడు. చాలా సేపటికి ఏదో చప్పుడు కావడంతో.-మెలకువ వచ్చిన లక్ష్మి-ఇంటి తలుపులు తెరిచి వుండడం చూసి లోపలికి నడిచింది. వంట గదిలో శరత్‌ వంట చేస్తున్నాడు. తిన్నగా తండ్రి వద్దకు వెళ్ళింది. “ఏం కావాలి? నీ దరిద్రపు గొట్టు ముఖాన్ని నాకు చూపవద్దన్నానా... పో... అవతలికి!” అని అరిచాడు. లక్ష్మి భయంతో ఏడుస్తూ... “నాన్నా తెల్లవారినప్పటి నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా వుంది నాన్నా!” అంది.

నీ కల్లిబొల్లి ఏడుపులకు నేను కరగను. ఆనందంగా కాలం గడుపుతున్న నేను నీ మూలంగా ఆఫీసు పని అలా వుంచి, ఇంటి పనికి, వంటవాడినయ్యాను. మీ అమ్మని సంతోషంతో పైకి పంపావు. ఇక నన్ను పంపితే నువ్వు హాయిగా వుండొచ్చు!” అని విసుక్కున్నాడు.

ములుకుల్లాంటి మాటలు ఆ పసిహృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. లక్ష్మికి రోషం వచ్చింది... “ఛీ. ఇక చచ్చినా పర్వాలేదు, కాని.

నాన్నని తిండి అడగకూడదు” అని మనసులో అనుకంటూ ప్రక్క గదిలోకి వెళ్ళింది. “ఈ చేతగాని రోషాలకేం. కొదవలేదు” అంటూ శరత్‌ వంట చేయసాగాడు. పక్క గదిలో వున్న లక్ష్మికి అంతకుముందు తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. “కొన్ని నెలలకు ముందు లక్ష్మి బడి నుండి ఇంటికి రావటంతోనే సీత చాక్లెట్లు ఇస్తూ... “లక్ష్మీ! నువ్వు అదృష్టవంతురాలీవమ్మా! నువ్వు పుట్టిన వెంటనే నాన్నకి ప్రమోషన్‌ వచ్చింది, నీ పుట్టిన రోజున నీ పేరు మీద నాన్న తీసిన లాటరీ టిక్కెట్టుకు పదివేల రూపాయలు వచ్చిందట! నీకు ఏంకావాలో చెప్పు కొని పెడతాను!” అంది.

“అమ్మా! నాకు ఏమీ వద్దు. ఎప్పుడూ నాన్న నువ్వు నన్ను చక్కగా చూసుకోవాలి!” అన్నది లక్ష్మి. సీత ఆనందంతో లక్ష్మిని దగ్గరికి తీసుకుని, “నువ్వు నా బంగారు లక్ష్మివి. ఈ ఇంటి అదృష్ట దేవతవి; నిన్ను వదిలి నేను వుండలేను” అంటూ మోహం మీద ముద్దుల వర్షం కురిపించింది.

ఆ దృశ్యం తన కళ్ళెదుట లక్ష్మికి గుర్తుకు రావడంతోటే ఆమెకి తెలియకుండా కళ్ళ నుండి నీరు ధారాపాతంగా కారసాగింది. “అమ్మా! నన్ను వదిలి వుండలేనని ఇప్పుడు ఎంతో దూరంగా వెళ్ళిపోయావా? నన్నూ నీ దరికి తీసుకుపోమ్మా - నేనిక్కడుండలేను!” అని మనసులో వేడుకోసాగింది, ఏదో శబ్దంలో కల చెదిరి లక్ష్మి కళ్ళు తెరిచింది. ఎదురుగా నాన్న నిలబడి వున్నారు.

“రాత్రిలేదు, వగలులేదు ఎప్పుడూ నిద్రేనా? ప్రతిదానికి నిన్ను వేడుకోవాలా? లోపలికి వెళ్ళి వున్నది తిని, పాత్రలన్నీ శుభ్రంగా కడిగి రా?” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.. కనికరం లేని కన్న తండ్రి. ,లక్ష్మికి తండ్రి మీద ఎనలేని కోపం వచ్చింది. దాంతోపాటు రోషం కూడా పెరిగింది, “ఛీ... ఈ తిండి తినకూడదు. నేనిలాగే చచ్చిపోవాలి?” అని మనసులో అనుకుంది. కానీ పాత్రలన్నీ కడిగి పెట్టమన్నాడు కదా! లేకపోతే తిడతాడు. అందువల్ల పాత్రలు కడగటానికి వంట గదిలోకి వెళ్లింది. చిన్న పాత్రలో కొంచెం అన్నం వుంది. మిగిలిన

పాత్రలన్నీ ఖాళీగా వున్నాయి. అన్నాన్ని చూడడంతో, ఆ చిన్నారిలో అంతవరకూ నిద్రాణంలో వున్న ఆకలి మేల్కొంది. ఆ సమయంలో రోషం, కోపం అన్నీ అణిగిపోయాయి. ఆకలి బాధకి తట్టుకోలేక అన్నాన్ని ముద్దలు చేసుకుని తినసాగింది. అన్నం చాలా కొద్దిగా వుంది; ఆకలా చాలా ఎక్కువగా వుంది. అయినా ఆకలి తీర్చుకుని, పాత్రలన్నీ కడిగి పెట్టింది.

అంతకుముందు 'తాను [ఒకనాడు రాత్రిపూట భోజనం చేయకుండా పడుకుంటే, తల్లి తనని లేపి, తాను వద్దన్నా రకరకాల కథలూ - కబుర్లూ చెబుతూ కడుపునిండా అన్నం పెట్టి నిద్రబుచ్చేది. కానీ ఈ రోజు తాను కావాలన్నా అన్నం లేదు. ఆపైన అమ్మా లేదు. తనని గమనించే వాళ్లూ లేరు... అంటూ లోపల మధనపడసాగింది.

వంట గదిలో నుండి లక్ష్మి బయటికి వచ్చి చూసింది. అప్పటికే వీధి తలుపులు గడియవేసి, తండ్రి నిద్రపోతున్నాడు. “తనికి సవతి తల్లి వుంటే కూడా తన (బ్రతుకు ఇంత నరకంలాగా వుండదు. ఛీ... నాన్న వుండి ఏం ప్రయోజనం?” అని ఆ లేతమనసు బాధపడుతూ పడుకుంది.

మరునాడు లక్ష్మి బడికి వెళ్ళడానికి బయటికి వచ్చింది అంతలో లాటరీ టిక్కెట్లు అమ్ముతున్న తాత, “లక్ష్మి! ఇటు రా...” అని పిలిచాడు. లక్ష్మి అతని వద్దకు వెళ్ళింది. “లక్ష్మి! మీ నాన్న పెడుతున్న బాధలు నేను సూస్తున్నాను. నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మివి. నిన్ను నష్టజాతకరాలివని తిడుతున్నాడు మీ నాన్న అతను 'మీ అమ్మ పోయినప్పటి నుండి అలా మారిపోయాడు. నువ్వు మహాలక్ష్మి వని నిరూపించాలి. నా వద్ద ఒక టిక్కెట్టు తీసుకో! నీకు తప్పక లక్ష రూపాయల బహుమతి వస్తుంది” అన్నాడు.

లక్ష్మి నవ్వుతూ... “తాతా! నేను నష్టజాతకురాలిని ప్రతిరోజూ మా నాన్న తిడుతున్నాడు. నువ్వు లక్ష రూపాయలు వస్తుందని చెబుతున్నావు. నాకు అదృష్టం

వుంటే ఇన్ని కష్టాలు పడవలసివచ్చేదాన్నా?” అంది. “నా మాట విన్ను ఇంతకుముందు మీ నాన్న నీ పేరుతో తీసిన టిక్కెట్టకు బహుమతి వచ్చింది. ఒక టిక్కెట్టు తీసి చూడు! నీకు బహుమతి వస్తే మీ నాన్న మారిపోతాడు” అన్నాడు, ఆ మాటలకు లక్ష్మి మనసులో ఆశ చిగురించింది. తనకి తండ్రితో ముందులా హాయిగా వుండాలన్న ఆశ వుంది. అందువల్ల ఇంటికి వెళ్లి తన వద్ద వున్న రూపాయి తీసుకొచ్చి, ఒక టిక్కెట్టు తీసుకుని బడికి వెళ్ళిపోయింది. ఆ రోజ సాయంత్రం లక్ష్మి బడి నుండి ఇంటికి రావడంతోటే వర్షం మొదలైంది. శరత్‌ అప్పటికి ఇంకా ఇంటికి రాలేదు. అందువల్ల లక్ష్మి తిన్నె మీద కూర్చుని వర్షాన్నిచూడసాగింది . ఆరుగంటలకు శరత్‌ వర్షంలో ముద్దగా తడిసి ఇంటికి వచ్చాడు. లక్ష్మితో . ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళితల తుడుచుకోకుండా బట్టలు మార్చుకుని పని చేసుకోసాగాడు.

ఇదివరలో నాన్న వర్షంలో తడిసి ఇంటికి వస్తే. అమ్మ తల తుడుచుకోమని. టవల్‌ ఇచ్చి, శ్రమ పరిహారంగా వేడి వేడి కాఫీ ఇవ్వడం లక్ష్మికి గుర్తుకు వచ్చింది. తల సరిగ్గా తుడుచుకోకపోతే జ్వరం వస్తుంది కదా! కానీ ఆ పసికందుకు నాన్నకి ఆ మాట చెప్పడానికి ధైర్యం చాలలేదు. అందువల్ల అలాగే వుండిపోయింది. మురునాడు లక్ష్మి ఆలశ్యంగా నిద్రలేచింది. వంట గదిలో నాన్నవు న్నట్టు అలికిడి లేదు. ఆశ్చర్యపోతూ, తండ్రి గది వద్దకు వెళ్ళి చూసింది. శరత్‌ ఇంకా నిద్రపోతున్నాడు. బాగా' అలసినట్టున్నాడు...ఆలస్యంగా నిద్రలేస్తాడేమోనని లక్షి తన పనులు చూసుకోసాగింది.

ఎనిమిది గంటలయింది. అప్పటికీ నాన్న లేవకపోవడంతో లక్ష్మి భయంతో దగ్గరకెళ్ళి, తలను తాకి చూసింది. ఎంతో వేడిగా వుంది. మంచి జ్వరం

_ వచ్చిందని తెలుసుకుంది. మరి డాక్టరు రావాలీ కదా! డాక్టరు ఎక్కడ వుంటారో తెలియదే తనకు! ఇంతవరకు తాను ఒంటరిగా ఎక్కడికీ వెళ్ళలేదు. కొంతసేపు ఆలోచించి, చివరికి మూడో ఇంటి పంకజం ఇంటికి వెళ్ళి, ఆమె సహాయంతో డాక్టర్‌ని ఇంటికి పిల్చుకుని వచ్చింది.

డాక్టర్‌ శరత్‌కి ఇంజక్షన్‌ ఇచ్చి, కొన్ని మాత్రాలు ఇచ్చి వెళ్ళిపోయాడు. తరువాత శరత్‌ నెమ్మదిగా కళ్ళు తెరిచి, ఎదురుగా వున్న పంకజంని చూసి ఆశ్చర్యపోయాడు. పంకజం జరిగినది వివరంగా చెప్పి, “శరత్‌! నువ్వు లక్ష్మిని ఎంత అసహ్యించుకున్నా - నీమీద దానికెంత (ప్రేమో అర్ధం చేసుకో... లక్ష్మి నాకు నీ జ్వరం సంగతి చెప్పకపోతే, నీ గతి ఏమయ్యేది? భార్య మీద (ప్రేమతో కన్న కూతురిని అసహ్యించుకునే ' వారు ప్రపంచంలో ఎవరూ వుండరు. ఇకనైనా నీ కూతురినీ బాగా చూసుకో! లక్ష్మి నీ ఇంటి మహాలక్ష్మి!” అని చెప్పి వెళ్ళిపోయింది. శరత్‌ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ అతని మనసులో తాను ఏదో తప్పు చేస్తున్నాడేమోనన్న భావం కలిగింది. అంతలో అతని దృష్టి గదిలో వున్న భార్య సీత ఫోటో మీద పడడంతో, కూతురి మీద భావం మంచులా కరిగిపోయింది. “ఛీ ... నీ వల్ల నా సీతని పోగొట్టుకున్నాను... నువ్వు నా ఇంటికి లక్ష్మి కాదు, నాకు దాపురించిన శని” అని మనసులో తిట్టుకున్నాడు.

రెండు రోజుల తరువాత శరత్‌ ఆఫీసుకి వెళ్ళాడు. మేనేజర్‌ అతడ్ని పిలిచి, “శరత్‌! నువ్వు చేస్తున్న పనులన్నిటిలోనూ చాలా తప్పులు దొర్లుతున్నాయి. నువ్వు సరిగ్గా జవాబు వ్రాయనందున మన దగ్గర ఖాతాదార్ల కంపెనీలు, వేరే వారి వద్దకు వెళ్ళిపోతున్నారు. నీ' వల్ల మనకి చాలా నష్టం కలిగింది. ఇంకోసారి ఇలా జరిగిందంటే నీ ఉద్యోగం వూడుతుందని తెలుసుకో” అని బాగా తిట్టి పంపాడు. తన ఇంటి లక్ష్మిని కష్టపెట్టడం వల్ల తనకి ఇంత కష్టం వస్తుందని ఆ మూర్కుడు తెలుసుకోలేకపోయాడు.

సాయంత్రం శరత్‌ ఇంటికి రావడంతోనే ఎదురింటి రాజారావు వచ్చి. అందమైన గౌన్‌ ఇచ్చి, “శరత్‌ క్రిందటి నెలలో నేను ఢిల్లీకి వెళుతుంటే, నీ భార్య రెండువందలిచ్చి, మంచి గౌను తీసుకురమ్మంది. కానీ నేను వచ్చేటప్పటికి పాపం! ఆమె లేకుండా పోయింది. అయినా ఇది మీ పాపకికదా! నేను తరువాత కలుస్తాను! అని ఇచ్చి వెళ్ళిపోయాడు.

అంతటినీ దూరం నుండి చూస్తున్న లక్ష్మి “ఆహా! ఆ గౌను అందంగా వుంది. ఈ నెలలో నాకు రాబోతున్న పుట్టిన రోజు పండగ కోసం అమ్మ ముందుగా ఏర్పాటు చేసి వుంది. అమ్మా! నువ్వు ఎంత మంచిదానివమ్మా! ను; వున్నంత కాలం నీ గొప్పతనం నాకు తెలియలేదు. ఇప్పుడు నువ్వు లేవు. నే రమ్మన్నా రానంత దూరంలో వున్నావు!” అని అనుకుంటూ నాన్న వద్దకు వెళ్ళింది. “ఏం కావాలి?” కటువుగా అడిగాడు తండ్రి. వుదయం మేనేజర్‌ తిట్టిన తిట్లు కూతురు మీద చూసిస్తున్నాడు. “గౌ....గౌను.. నాకు కదా! ఈ నాపుట్టిన రోజు వస్తుంది కదా నాన్నా?” అన్నది. “దరిద్రపుదానికి అంత గౌను కావల్సి వచ్చిందా? ఏం అక్కరలేదు...” అంటూ గౌనుని అటక మీదికి విసిరాడు ఆ రాక్షసుడు . లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరునాడు శరత్‌ ఆఫీసులో పని చేసుకుంటుండగా, తన ఎవరో వచ్చారని ప్యూన్‌ చెప్పడంతో, పనిని వదలి బయటికి నడిచాడు.

శరత్‌ బయట వున్న “రాంలాల్‌'ని చూడడంతో నీరుకారిపోయాడు. “ఆరునెలల క్రిందట తాను కంపెనీ డబ్బు ఇరవైఐదువేలు సొంతానికి వాడుకున్నాడు. దానిని తిరిగి సర్దలేక పోయాడు. కొత్త మేనేజర్‌ రావడంతో, ఆయన డబ్బు వివరాలు అడగడంతో శరత్‌ భయపడి, అసలు సంగతి తెలిస్తే తాను బయటికివెళ్ళవలసి వస్తుందని భయంతో తన ఇంటి దస్తావేజులు రాంలాల్‌ వద్ద కుదువపెట్టి

, తీసుకుని, కంపెనీలొ సర్దేశాడు . ఆ తరువాత నెలలు గడిచినా, శరత్‌ రాంలాల్‌

వద్దకు వెళ్ళలేదు. వడ్డీ డబ్బు పైసా కూడా కట్టలేదు. అసలు ఆ సంగతి పూర్తిగా మరచిపోయాడు.

'శరత్‌సాబ్‌! నన్ను మరచిపోయావా? ఆరు నెలలు గడిచాయి. వడ్డీ కట్టలేదు. నన్ను మోసం చేస్తావా?” అని అడిగాడు. శరత్‌ 'రాంలాల్‌! నేను అటువంటివాడిని కాదు. ఇంకో నెల రోజులు గడువు ఇవ్వు. అంతా పూర్తిగా కట్టేస్తాను” అన్నాడు. “నీ మాటల మీద నాకు ఇక నమ్మకంలేదు. వారం రోజులు గడువిస్తాను. అంతలో అసలూ - వడ్డీ అంతా ఇవ్వాలి. లేదా నీ ఇంటిని వేలాం వేసి, నా డబ్బు రా బట్టుకుంటాను. తరువాత బాధపడి ప్రయోజనం వుండదు” అంటూ రాంలాల్‌ కోపంతో వెళ్ళిపోయాడు. శరత్‌ అంత డబ్బు వారంరోజులలో " ఎలా సంపాదించలగను... అని ఆలోచిస్తూ పనీ చేసుకోసాగాడు. తన స్నేహితులని అప్పు అడిగాడు. కానీ అంత పెద్ద మొత్తం వారం రోజులలో దొరకడం ' చాలా కష్టమని చెప్పారు. శరత్‌కి పనిచేయడానికి మనసు ఇష్టపడలేదు. అతని ఆలోచన అంతా ఇంటి మీదే వుంది. వారం రోజులలో తాను డబ్బు ఇవ్వకపోతే, రాంలాల్‌ చెప్పినట్టు ఇల్లు వేలాం వేస్తాడు. అందరి ముందూ తాను అవమానం పాలవ వలసి. వస్తుందని వేదన పడసాగాడు.

సాయంత్రం మేనేజర్‌ శరత్‌ని పిలిచి, ఫైల్‌ ఇచ్చి, “శరత్‌! కాగితాలన్నీ చిందరవందరగా వున్నాయి. రేపు ఆదివారం నువ్వు ఇంట్లో తీరికగా వీటిని సరిచేసి, తీసుకురా! జాగ్రత్త! ఇది చాలా ముఖ్యమైన ఫైల్‌” అని చెప్పి అతని - మేనేజర్‌ని చూసి శరత్‌కి ఒళ్ళుమండింది. కానీ ఏం చేయగలడు? కోవం దిగమింగుకుని వెళ్ళిపోయాడు. మరునాడు శరత్‌ ఆఫీసు నుండి తెచ్చిన ఫైల్‌ కాగితాలు సరిచేయసాగాడు. ఆ సమయంలో ప్రక్క గదిలో లక్ష్మి తన స్నేహితురాలు. రమతో ఆడుకుంటోంది. అంతలో ఎవరో పిలవడంతో శరత్‌ తన పనిని వదిలి!

బయటికి వెళ్ళాడు. ఫైల్‌ సరిగ్గా కిటికీ పక్కన వుండడం వల్ల, గాలి వేగంగా వీచడంవల్ల, అందులోని కాగితాలన్నీ ఎగిరి నేలమీద పడిపోయాయి. అది గమనించిన లక్ష్మి “రమా! మా నాన్న పెట్టిన కాగితాలు కిందపడివున్నాయి. నాన్న చూసారంటే, నన్ను తిడతారు. నేను వాటిని సరిచేసి వస్తాను!” అంటూ వెళ్ళి కాగితాలు తీయసాగింది.

శరత్‌ కోసం అతని స్నేహితుడు రహీం వచ్చాడు. ముందు రోజు శరత్‌ అతన్ని అప్పు అడిగినపుడు, ఉదయం ఇంటికి వచ్చి ఇస్తానన్నాడు. శరత్‌ ఆశతో 'ఫైల్‌ సంగతి మరచి, బయటికి 'వెళ్ళాడు. కానీ అతను డబ్బు దొరకలేదని చెప్పి వెళ్లిపోయాడు. దాంతో శరత్‌ నీరుకారిపోయాడు.. అతని నంతోషం 'దిగజారిపోయింది. విచారంతో ఇంట్లోకి నడిచాడు.

ఎదురుగా లక్ష్మి ఫైల్‌లోని కాగితాలు తీయటం అతని కంట పడింది. ఆ సమయంలో అక్కడ ఏం జరిగి వుంటుందో వూహించలేకపోయాడు. అప్పు దొరకలేదన్న బాధ అటుండగా, ఎదురుగా తాను చూస్తున్న దృశ్యానికి అతనిలో చెప్పరాని కోపం రగలసాగింది.

ఎదురుగా వున్నది కన్న కూతురన్న సంగతి మరచాడు. “ఆఫీసు ఫైల్‌లోని కాగితాలన్నీ క్రిందపడేస్తావా! నీకెంత అహంభావం” అంటూ దగ్గరికి వెళ్ళి చాచి లక్ష్మి చెంప మీద బలంగా కొట్టాడు. అంత పెద్ద దెబ్బ చిన్నారి లేత చెంప తట్టుకోలేకపోయింది. అంతే కాదు లక్ష్మి ఎగిరి గోడకు కొట్టుకుని అలాగే మూర్ఫపోయింది.

అంతలో (ప్రక్క గదిలో నుండి రమ పరిగెత్తుకువచ్చి “అంకుల్‌! అనవసరంగా లక్ష్మిని కొట్టారు. మీరు వదిలి పెట్టిపోయిన ఫైల్‌లోని కాగితాలు గాలికి కిటికి నుండి ఎగిరి క్రిందపడడంతో పాపం లక్ష్మి వాటిని సరిచేయాలని కిందనుండి తీస్తోంది, అంతలో మీరు చాలా తొందరపడ్డారు” అన్నది. అంత

చిన్న పిల్ల అలా చెప్పడంతో శరత్‌కి కొండ మీద నుండి క్రింద 'పడినంతయింది. అతనిలోని కోపం పూర్తిగా చల్లారింది. మొట్టమొదటి సారిగా అ/ మనసు ఆలోచించసాగింది. “నేను తప్పు చేసానా? కన్న కూతురిని చూడకుం। ఎంత పెద్ద దెబ్బ కొట్టాను? ఇంతవరకు భార్య మీద మమకారంతో, లక్ష్మి అసహ్యించుకున్నాను. ఇప్పుడు తాను చేయని పనికి అన్యాయంగా కొట్టాను. ఛీ! నేనెంత నీచుడ్ని? నాకు జ్వరంగా వున్నప్పుడు ఎంత సహాయం చేసింది లక్ష్మి! తను చేసిన మంచి అప్పుడు నాకెందుకు తెలియలేదు? నన్ను ఆ భగవంతు! కూడా క్షమించడు. కన్న కూతురిని అసహ్యించుకునే తండ్రి ఈ ప్రపంచంలో ఎక్కడైన వున్నాడా?”:అని మనసులో వేదన పడుతూ లక్ష్మి వద్దకు వెళ్ళి, మొహం మీద ! నీళ్ళు చిలకరించాడు.

కానీ లక్ష్మికి మెలకువ రాలేదు. తలకు బాగా దెబ్బతగలడంవల్ల రక్తం కారసాగింది. శరత్‌ అది చూడడంతో భయం వేసింది. వెంటనే లక్ష్మిని దగ్గరలో వున్న ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. సమయానికి డాక్టరు అక్కడ లేరు. ఆ నర్సు లక్ష్మికి దెబ్బ తగిలనచోట మందు వేసి, కట్టుకట్టింది. అంతలో అక్కడి! డాక్టర్‌ వచ్చి, “శరత్‌! ఏమిటి ఇలా వచ్చావు? అమ్మాయికి ఏమైంది?” అన్నాడు. _ లక్ష్మికి దెబ్బ ఎలా తగిలిందో చెప్పడానికి శరత్‌ సిగ్గుపడ్డాడు. ఏదో అబద్ధం చెప్పి అక్కడి నుండి ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చిన కొంతసేపటికి లక్ష్మి మెల్లిగా మూలగసాగింది. శరత్‌ ఆతృతతో, “లక్ష్మీ! కళ్ళు తెరిచి చూడమ్మా నేను మీ నాన్నని!” అని మెల్లిగా అన్నాడు. లక్ష్మి మెల్లిగా కళ్ళు తెరిచింది. ఎదురు! నాన్బని చూడడంతో... “నాన్నా! నేనేం చేయలేదు... మరి..?” అంది. “లక్ష్మీ! నా బంగారుతల్లీ. అంతా నాకు తెలుసు, ఇన్ని రోజులూ ఏదో తెలియని ఆవేశంలో హాసహ్యాయించుకున్నాను .అని ఏడ్వసాగాడు.

తండ్రి ఏడ్వడం చూసి లక్ష్మి ఆశ్చర్యపోతూ... చాలా రోజలయినాక తండ్రి తనకు దగ్గరగా వచ్చి, మంచిగా మాట్లాడడం చూసి మనసులో సంతోషపడింది . అంతలో లాటరీ టిక్కెట్లు అమ్మే తాత వచ్చి, ఇంట్లో దృక్యాన్ని చూసి, “శరత్‌ ఇంతలో ఎరా రామయ్యా! నీ లక్ష్మి నీ ఇంటికి మహాలక్ష్మి అని నిరూపించింది. నీ కూతురు కొన్న టిక్కెట్టుకు లక్షరూపాయలు బహుమతి వచ్చింది. దీంతో నీ కష్టాలు గట్టెక్కుతాయి. ఆ రాంలాల్‌ అప్పు తీర్చేయవచ్చు. ఇక మీదైనా నీ కూతురిని బాగా చూసుకో!” అని అన్నాడు.

శరత్‌ విచారంతో “తాతా! ఇన్ని రోజులు నా భార్య మీద వున్న (ప్రేమవల్ల ఆ ఘోరమైన దృశ్యాన్ని మరచిపోలేకుండా... నా కూతురికి అన్యాయం చేసాను. నాలో అంతటి రాక్షసత్వం ఎలా ప్రవేశించిందో తెలియలేదు. జరగినదంతా తలుచుకుంటే, నాకే సిగేస్తుంది. ఈ రోజు ఆ భగవంతుడే నా కళ్లకు కప్పి వున్న తెరని తెరిపించాడు. ఇక నా చిట్టి తల్లి లేత మనసుకి అన్యాయం జరగదు” అన్నాడు. అది విని తాత, “లక్ష్మి నువ్వు అదృష్టావంతురాలివమ్మా! లాటరీలో బహుమతితో పాటు పోగొట్టుకున్న తండ్రి (ప్రేమను మళ్ళీ సంపాదించుకున్నావు.. ఇక హాయిగా వుండు తల్లీ” అని దీవించి వెళ్లిపోయాడు. .

శరత్‌ సంతోషంతో లక్ష్మిని దగ్గరికి తీసుకుని “నువ్వు నిజంగా నా ఇంటి మహాలక్ష్మివి. నా కష్టాలు గట్టెక్కించిన దేవతవి. ఇన్ని రోజులూ కష్టపెట్టినందుకు భగవంతుడు నన్ను శిక్షించాడు. ఇక నుండి మనం ఆనందంగా వుందాం?” అన్నాడు. అంతా ! లక్ష్మిలోని లేతమనసు ఆనందంతో చిగురించింది. “నాన్నా! ఎప్పటి! నువ్వు నా మీద (ప్రేమతో వుండడమే నాక్కావాల్సింది” అని, తండ్రిని గట్టిగా 'హత్తుకుంది.

Responsive Footer with Logo and Social Media