సోమరి
రామాపురంలో వీరయ్య అనేవాడుండేవాడు. వీరయ్య వట్టి సోమరిపోతు, ఏ. వనీ చేసేవాడు కాదు. తండ్రి సంపాదించి పెట్టిన ఆస్తిని ఖర్చుచేసి, హాయిగా ఆ యేడు రామాపురంలో వరదొచ్చింది. వరద రావడంతోనే వీరయ్య పనివాడు. అక్కడికి వచ్చి “బాబూ... ఊరిలోకి వరదొచ్చింది. మీరు వెంటనే లేచి మన ధాన్యం బస్తాలు తరలించండి” అని చెప్పాడు. దానికి వీరయ్య "వరదొచ్చి ఏం చేస్తుందిలే... వచ్చిపోతుందిలే అంటూ పనివాడిని పంపించివేశాడు.
అనంతరం ఊరిలోకి వరదొచ్చి, ధాన్యం బస్తాలన్నీ నీటిలో కొట్టుకు పోయాయి సోమరిపోతు అయిన వీరైయ్యా దీనిని పట్టించుకోలేదు.
ఈ సంఘటన జరిగిన నెలరోజులకి. వీరయ్య పనివాడు మరలా వచ్చి “బాబూ... మన ఇల్లు కాలిపోతుంది... వెంటనే వచ్చి మంటలు ఆర్పాం డి ' అని చెప్పాడు.
"దానికి వీరయ్య అగ్ని అన్న తర్వాత మండక ఏం చేస్తుంది” నీవేం భయపడకు... అదే ఆరిపోతూంది" అని చే ప్పాడు నిద్రపొతూనే.
అంతే, అగ్ని ప్రమాధంలో వీరయ్య వస్తువులన్నీ తగులబడిపోయాయి. కొంతకాలా నికి వీరయ్య వద్ద వున్న సోమ్ము కాస్తా అయిపోయింది. సొమ్ము అయిపోవడంతో తినడానికి డబ్బులేక వీరయ్య మలమల మాడిపోయాడు. వీరయ్య సోమరిపోతు కావడం వల్ల ఎక్కడా అప్పుకూడా పుట్టలేదు.
తన సోమరితనమే తన నీ స్థితికి తీసుకొచ్చిందని గ్రహించాడు వీరయ్య, ఆనాటినుండి అతడు కష్టపడి వని చేయడం మొదలు పెట్టాడు.