శంకుంతలోపాఖ్యానము
విశ్వామిత్రుడు మరియు మేనక అను దంపతులకు శకుంతల అను ఒక కూతురు ఉంది. శకుంతల తల్లిదండ్రులు శకుంతల పుట్టగానే ఆమెను విడిచిపెట్టారు. శకుంతములు అనే పక్షులు ఆమెను సంరక్షించాలి కనుక ఈమెకు శకుంతల అనే పేరు వచ్చింది. కన్వమహర్షి శకుంతలను పోషించి పెద్ద చేశాడు.
ఈమె కన్వ మహర్షి ఆశ్రమంలోనే పెరిగింది ఒకానొక సమయంలో కన్వ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో ఒక సంఘటన చోటు చేసుకున్నది. దుష్యంత మహారాజు జంతువులను వేటాడడానికి కన్వ మహర్షి ఆశ్రమ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఉన్న సౌందర్యవతి అయిన శకుంతలను చూసి తొలిచూపులోనే ఆమె పట్ల ఆకర్షితుడయ్యి అతని ప్రేమను వ్యక్తం చేశాడు. అయితే శకుంతల మాత్రం కన్వ మహర్షి అనుమతితోనే వివాహం చేసుకుందామని చెప్పింది. కానీ, దుష్యంతుడు శకుంతలను ఒప్పించి గాంధర్వ వివాహం చేసుకోవాలనుకున్నాడు.
అందుకు ఈమె ఒక షరతు పెట్టడం జరిగింది. అదేమిటంటే, వారికి పుట్టబోయే కుమారుడిని చక్రవర్తిగా పట్టాభిషేకము చేస్తాను అని మాట ఇస్తే వివాహం చేసుకుంటాను అని చెప్పింది. దుష్యంతుడు సరే అని మాట ఇచ్చి గాంధర్వ వివాహం చేసుకొని కొన్ని రోజులు ఆశ్రమంలోనే శకుంతలతో నివసించి రాజకార్యాల నిమిత్తం వెళ్లిపోయాడు. వెళ్ళేటప్పుడు నేను వెళ్లి మళ్లీ వస్తాను నిన్ను తీసుకొని వెళ్తాను అని దుష్యంతుడు చెప్పి వెళ్లిపోయాడు.
కన్వ మహర్షి ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు జరిగిన విషయాలను శకుంతల కన్వ మహర్షికి చెప్పింది. కన్వ మహర్షి కూడా తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ శకుంతల గర్భం పండి ఒక కుమారునికి జన్మనిస్తుంది. ఆ పిల్లవాడు చిన్న వయసులోనే సకల జంతువులను తన శక్తితో లొంగదీసుకోనడం చూసి అక్కడ ఉన్న మునులు ఆ పిల్లవాడికి 'సర్వదమనుడు' అనే పేరు పెట్టారు.వెళ్లేటప్పుడు దుష్యంతుడు తిరిగి నేను వచ్చి నిన్ను రాజ్యానికి తీసుకువెళ్తాను అని ఇచ్చిన మాటను మరిచిపోయాడు.
వివాహమైన స్త్రీ ఇంట్లో ఉండటం మంచిది కాదు అని కన్వ మహర్షి గ్రహించి. శకుంతల భర్త దగ్గర శకుంతల ఉండటమే మంచిది అని శకుంతలకు నచ్చ చెప్పి, కొందరు శిష్యులను శకుంతలకు తోడుగా ఇచ్చి.. దుష్యంత మహారాజు యొక్క సభకు పంపించాడు.
శకుంతల దుష్యంతుని సభలోకి వెళ్లే సమయానికి దుష్యంతుడు సభలో ఉన్నాడు. దుష్యంతుని వైపు చూసింది శకుంతల. దుష్యంతుడు కూడా శకుంతలను చూశాడు. కానీ, చూసి చూడనట్లుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన శకుంతల మూర్ఛిల్లింది. తెలిసి కూడా తెలియనట్లే నటిస్తున్నాడు అని గ్రహించింది. ఆయనతో మాట్లాడకుండా వెళ్ళటం తప్పు అని ఆగి, జరిగిన విషయం అంతటిని దుష్యంతునికి చెప్పి ఎలాగైనా ఇచ్చిన మాటను నెరవేర్చుకొని తీరాలి అని అనుకొని శకుంతల దుష్యంతునితో మాట్లాదుతుంది.
దుష్యంత మహారాజు మీరు కన్వ మహర్షి ఆశ్రమానికి వేటాడడానికి వచ్చినప్పుడు అక్కడ మీరు నన్ను చూసి నన్ను గాంధర్వ వివాహం చేసుకున్నారు గుర్తుందా! పుట్టే కుమారుని యువరాజును చేస్తాను అని కూడా మాట ఇచ్చారు ఇదిగో ఇతనే నీ కుమారుడు. నీ వంశానికి తర్వాతి తరం వాడు. ఈ నీ కుమారుడిని యువరాజుగా చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకో! ఓ దుశ్యంతుడా! అని కోరింది శకుంతల.
నేను ఎప్పుడూ నిన్ను చూడలేదే! అనవసరమైన వ్యర్థ మాటలు మాట్లాడవద్దు! మీరు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్లిపోండి అని చెప్పాడు. ఆ మాట విన్న శకుంతల ఎంతో వేదనతో కన్నీరు పెడుతూ, ఏడుస్తూ.. తలవంచుకొని.. దుష్యంతునితో ఈ మాటలు మాట్లాడింది.
ఓ మహారాజా! అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టు నటించకండి. మీలాంటి ధర్మాత్ములైన వారు ఇలాంటి అబద్ధాలు ఆడడం చాలా తప్పు. మనిషి యొక్క ప్రవర్తనను పంచభూతాలు వేదాలు సూర్యచంద్రులు నిత్యము గమనిస్తూనే ఉంటారు. వాళ్ల నుండి ఈ సత్యాన్ని మీరు దాచలేరు. భార్యను కుమారుడిని స్వీకరించలేని వాళ్ళు ఇహలోకంలోనూ.. పరలోకంలోనూ.. చోటు సంపాదించలేరు అని చెప్పి, భార్య భర్తల దాంపత్యం గురించి మాట్లాడింది.
భార్య భర్తలు సగం. భర్త భార్య యందు ప్రవేశించి పుత్రుడికి జన్మనిస్తాడు అయితే, అలాంటి ఈ కుమారుడిని నీవు స్వీకరించాలి. స్వీకరించి.., కౌగిలించుకొని పుత్ర గాత్ర పరిశ్వంగా సుఖం అనుభవించు అని శకుంతల కోరింది. పై విషయాలన్నీ చెప్పి ఇలాంటి ఉత్తముడైన నీ కుమారుని వద్దు అనుకోవడం సరైనది కాదు. నూరు మంది కుమారుల కంటే సత్యం గొప్పది. 1000 అశ్వమేధాల కంటే సత్యం గొప్పది. సర్వ తీర్థాలను సేవించడం కంటే సత్యం గొప్పది. వేదాలను చదవడం కంటే సత్యం గొప్పది అని పురుషులు చెప్పినట్లు ఆ సత్యాన్ని అసత్యం చేయకు రాజా! నీవు ఇచ్చిన మాటను నిలబెట్టుకొ అని కోరింది.
నేనెక్కడా? నీవెక్కడా? అసలు నేను నిన్ను చూడలేదు. అబద్ధాలు నిజం అయిపోవు. ఇలాంటి మాటలు వింటే ప్రజలు నవ్వుకుంటారు. గనుక, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని దృశ్యంతుడు శకుంతలకు ఆజ్ఞాపించాడు, అప్పుడు శకుంతల యొక్క దుఃఖము.
ఈ మాటలు విన్న శకుంతల చాలా దుఃఖంతో తన మనసులో - నేను పుట్టినప్పుడు అమ్మానాన్న వదిలిపెట్టారు. భర్తకి కూడా ఇప్పుడు దూరం అవుతున్నాను. పోయిన జన్మలో మంచి నోములు చేయలేదో ఏంటో! ఇన్ని సమస్యలు నాకే జరుగుతున్నాయి అని తన మనసులో దుఖించి తన బిడ్డతో సహా ఆ సభ నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యింది.
ఆకాశవాణి పలుకుతూ ఓ మహారాజా! నీకు శకుంతలకు జన్మించిన వాడే ఈ సర్వదమనుడు. ఆమె ప్రతివ్రత. ఆమెను స్వీకరించు అని చెప్పాడు. సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు దుష్యంతుడికి గుర్తుకు వచ్చి అవును నేను శకుంతలను వివాహం చేసుకున్నాను గాంధర్వ వివాహం చేసుకున్నాను. ఈ వివాహం గురించి ఎవరికీ తెలియదు. అని శకుంతలను దుష్యంతుడు స్వీకరించాడు.