శకునం
రామాపురంలో నివసించే సుబ్బన్న ఒక కిరాణా వర్తకుడు. సుబ్బన్నకి మూఢ నమ్మకాలు ఎక్కువ. ఓ రోజు ఉదయం సుబ్బన్న తల్లికి వంట్లో బాగోలేదని కబురు వచ్చింది. కబురు విన్న సుబ్బన్న హుటాహుటిన ప్రయాణమై బయలుదేరేసరికి నల్లపిల్లి ఎదురు వచ్చింది. అసలే మూఢనమ్మకాలున్న సుబ్బన్న వెంటనే తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు.
"అదేమిటండీ! తిరిగొచ్చారు మా అమ్మగారికి ఆరోగ్యం నరిగ్గా లేదటగా” అంది భార్య శారద.
దానికి నుబ్బన్న “బాగోలేదని నాకు తెలుసు కాని బయలుదేరేముందు నల్లపిల్లి ఎదురొచ్చింది. అందుకే ప్రయాణం వాయిదా వేనుకొన్నాను” అన్నాడు.
“నల్లపిల్లి ఎదురు రావడమేమిటి? ప్రయాణం వాయిదా వేసుకోవడమేమిటి?” అంది శారద విస్తుపోతూ.
“నీకు తెలుసో తెలీదో నల్లపిల్లి ఎదురొస్తే అన్నీ అరిష్టాలే జరుగుతాయట” అన్నాడు సుబ్బన్న
భర్త ప్రవర్తనకి మనస్సులోనే నొచ్చుకుంది శారద.
ఆ మరునాటి ఉదయం తన తల్లి ప్రాణాపాయస్థితిలో వుందని కబురొఛ్చింది నుబ్బన్నకి
సుబ్బన్న కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ మరలా బయలుదేరేసరికి ఒక విధవరాలు ఎదురొచ్చింది.
*ఛీ...ఛీ.ఎంత అపచారం? విధవ ఎదురొస్తే అన్నీ నష్టాలే జరుగుతాయట!” అని ఆ రోజు కూడా తన ప్రయాణాన్నీ వాయిదా వేసుకున్నాడు. ఆ మర్నాడు సుబ్బన్న తల్లి చనిపోయిందని కబురొచ్చింది. తల్లి మరణవార్త వినగానే సుబ్బన్న లబోదిబో మన్నాడు. వెంటనే. అతడు తల్లి దగ్గరకు బయలుదేరే నమయంలో కట్టెలూ. నూనె ఎదురొచ్చాయి. అవి అదురొచ్చేనరికి నుబ్బన్ల మనసు మరలా కీడును సూచించింది అయినస్పటికీ తల్లి చనిపోయినా మూఢునిలా వెళ్ళలేదని అందరూ చివాట్లు పెడతారని, తన తల్లి దగ్గరకు వెళ్ళాడు .
సుబ్బన్న వెళ్సేసరికి తల్లి ఆనందంగా తిరుగుతూ కనిపించింది. అది చూసి సుబ్బన్న తల్లిని అసలు విషయం అడిగాడు.
“నీవిలా మూఢనమ్మకాలతో మగ్గిపోతున్నావని తెలిసి నేనె నాకు వంట్లో బాగాలేదని " కబురు పంపించాను. మొదటి రెండురోజులు నేను చావు బతుకుల మధ్య ఉన్నానని తెలిసి కూడా కేవలం నీ మనసులో పాతుకుపోయిన మూఢనమ్మకాల వల్ల నా దగ్గరికి రాలేకపోయావు, నీ విషయం, నీకు కబురువంపిన వ్యక్తి ద్వారా తెలుసుకున్న నేను, ఈ రోజు మరణించానని కబురు పంపించాను. నిజానికి నీకు నేనే ప్రతిరోజూ ఎదురు కల్పించింది. ఈ రోజు నాకోసం కాకపోయినా పరులకోసం ఇక్కడికి వచ్చావు, ఇప్పడు చెప్పు నీవు వచ్చేటపుడు పుల్లలు, మానె ఎదురొచ్చాయి. నీకేమైనా నష్టమొచ్చిందా? ఎప్పుడు ఎలా ఏం జరగాలంటే అది జరుగుతుంది. అంతేకానీ వచ్చే ఎదురే మనకి నష్టాన్ని లాభాన్ని తెస్తుందని ఊహిస్తే అది మూర్ఖత్వమే అవుతుంది” అని ముగించింది.
విషయం గ్రహించిన సుబ్బన్న మూఢనమ్మకాలను మరచి మామూలుగా బతకడం మొదలుపెట్టాడు.