సత్యవ్రతుని కథ



పూర్వకాలంలో కళింగ పట్టణమున సత్యవ్రతుడను ఒక రైతుఉండేను.అతనికి "నా" అను వారెవ్వరూ లేరు. ఆతనికి కొద్దిగా పొలం ఉండెను. దానిని తానే స్వయముగా సేద్యము చేసుకొనుచు, దానిమీద వచ్చు రాబడితో జీవించేవాడు. సత్యవ్రతునికి తల్లి దండ్రులు లేని కారణము వలనను, పట్టించుకొని చేసే పెద్దవారు (బంధువులు) ఎవ్వరూ లేనందువల్ల ఆతనికి వివాహము కాలేదు. అందరివలె తానుకూడ పెండ్లి చేసుకొని సంసారము చేయవలె"నను కోరిక ఉంది. సత్యవ్రతునికి.

కానీ, ఒంటరివాడగు అతనికి కన్యనిచ్చుటకు ఆ గ్రామము రైతులెవ్వరూ -సమ్మతింపలేదు. అందువలన సత్యవ్రతుని కోరిక తీరలేదు. ఆ కోరిక తీరుటకై "ఆలోచనలు చేస్తుండేవాడు.

కొన్ని రోజుల గతించిన. ఆ సంవత్సరం తన గ్రామానికి పొరుగున ఉన్న "షిష్టలాపురము"లో అమ్మవారి జాతర జరిగెను. సత్యవ్రతుడు ఆ కాళికా మాత ఉత్సవము చూచుటకు వెళ్ళెను. ప్రతి సంవత్సరమూ అతడు వెళ్ళుచుండెడివాడు. ఆ జాతర చూచు సంధర్భములో, ఒక దగ్గర సత్యవ్రతునికి ఒక కన్యక కనిపించింది. ఆమె రూపం సత్యవ్రతునికి చాల ఆనందం కలిగించింది. ఆ కన్యక గూడ సత్యవ్రతుని చూచి ఎంతగానో ఆనందించింది. అది పసిగట్టాడు సత్యవ్రతుడు. వారికి తెలియకుండ వారిని వెంబడించి, వారి బసను తెలిసికొన్నారు.

అదే రాత్రి సత్యవ్రతుడు కాళీమాత ఆలయంలోనికి వెళ్ళి దేవినిగాంచి యిలా ప్రార్థించాడు. "అమ్మా: నేను యెవ్వరూలేని నిర్భాగ్యుడను. నీవు తల్లివి. నీవే నన్ను కరుణించాలి. ఈ రోజున నేను జాతరలో చూచిన కన్యకను నాకు భార్యగా ప్రసాదించుము. నాకు గల కోరిక తీరుతుంది. ఇందుకు భక్తితో నా కోరిక తీర్చిన నీకు...నా శిరస్సునే కానుకగా యిస్తాను" అని మ్రొక్కుకున్నాడు.

ఆ మరునాడు తన స్నేహితులను కొంతమందిని కన్యక తండ్రి వద్దకు పంపించి-"మా సత్యవ్రతునికి మీ అమ్మాయిని భార్యగా చేయు"డని అడి గించెను. దేవీ మహిమవలన, ఆ తండ్రి తన కూతురగు “సుళీల”ను యిచ్చుటకు సమ్మతించెను- సుశీలా సత్యవ్రతుల వివాహం చాల వైభవంగా జరిగింది.

వివాహానంతరం సత్యవ్రతుడు "మనుగుడుపు వేడుకకై అత్తవారింటికి వచ్చాడు. అక్కడ కొన్ని రోజులు ఉండాలి. కాబట్టి ఉన్నాడు. ఒకనాడు సుశీల అన్న గారగు "వీరధవళునితో సత్యవ్రతుడు విహారము సేయుచు క్రమముగా కాళికామాత ఆలయ సమీపమునకు చేరుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media