సన్యాసి-విక్రమార్కుడు



విక్రమార్క భూపాలుడు ఈ విధముగా అనగా, భట్టి ఉపదేశించిన ప్రకారము ఆరునెలలు రాజ్యపాలనము; ఆరు నెలలు దేశసంచారము చేయుచు ప్రజారంజకముగా పరిపాలన చేస్తున్నాడు.

అదే సమయంలో ఉజ్జయినీ నగరానికి పదికోసుల దూరములో గల ఒక కాళికాలయంలో ఒక సరివ్రాజకుడు (సన్యాసి) ఎన్నో యేండ్లనుండి తపస్సు చేస్తూ ఉన్నాడు. దేవి అతని తపస్సుకు మెచ్చి, ప్రత్యక్షమైంది. ఆ సన్యాసి ఆమెను మోక్షమును కోరలేదు, ఆశాపూరితుడై "తల్లీ! ఈ లోకమందే నాకు సర్వ అధికారములు కలుగునట్లు, రాజాధిరాజులందరూ తనకు సామంతులై సేవ చేసేటట్లు ఎప్పుడు నిన్ను ప్రార్ధించినా నీవు దర్శనమిచ్చునట్లు తనకు చావు లేకుండునట్లు, తాను ఏ విధముగా ఏమి తలంచినా అది ఆయేటట్లు- పెక్కు హిరణ్యా క్షవరాలు కోరాడు. కాళికామాత అతని దురాశకు కోపగించింది- కానీ, ఆ సన్యాసి తనను తపస్సుచేసి మెప్పించాడు. కాబట్టి ఆమె బాగా ఆలోచించి ఇలా చెప్పింది. ఆ భద్రకాళి,

"ఓయీ: నీవు కోరినట్లు యిచ్చుటకు నాకు సమ్మతమే. కానీ, అందుకు ముందు నీవు భేతాళుని వశము చేసుకోవలెను. ఇక్కడకు అమడ దూరమున గల అడవిలో ఒక పెద్ద మణివృక్షము ఉన్నది. దానిపై రాక్షసగణం భూత ప్రేతాదులు నివసిస్తూ ఉన్నాయి. వానికి ఆధిపతిగా భేతాళుడు ఉంటాడు. అతడు ఒక శవాకారముగా ఆ మజ్జికొమ్మకు వ్రేలాడుతూ ఉంటాడు అతనిని నీవు ముందు వశం చేసుకోవాలి.

అంతకంటే ముందుగా నీవు నాకు సంతుష్టి కలిగించు. భద్రకాళీ హోమము చేయాలి. నా నామము పఠించుచు ఆహోనుము చేయాలి. నరబలి ఉండాలి. సూరుమంది రాజకుమారులుగా ఉండాలివారు. ఆఖరివాడు అనగా నూరవ రాజుకుమారుడు మహావీరుడు. సాహసముగలవాడై యుండాలి. ఆ నూరవబలితో యజ్ఞము (హోమం)పూర్తి అవుతుంది. వాని సహాయంతోనే నీవు భేతాళుని వశం చేసికోవాలి, అప్పుడు నీవు కోరిన కోరికలు అన్నియు తీరుతాయి" అని చెప్పి మాయమైంది.

భద్రకాళి మాట చొప్పున ఆ దురాశాపూరితుడైన సన్యాసి హోమము ప్రారంభించాడు. హోమానికి రాజుకుమారునిబలి అవసరంగదా! అందుకు దేశదేశములు తిరిగి మాయమాటలతో రాజకుమారులను భద్రకాళి ఆలయమునకు తీసికొని వచ్చి, వారిని నమ్మించి, దేవికి మ్రొక్కునట్లు చేసేవాడు. ఆయా రాజకుమారులట్లు మ్రొక్కే సమయంలో దండిస్తూ ఉండేవాడు.

ఈ విధంగా ఆ సన్యాసి 99 మంది రాజపుత్రులను నమ్మించి తీసికొని వచ్చి భద్రకాళికి బలి చేసాడు. ఇక నూరవవాడు రావాలి. ఆ రాజకుమారుడు మహావీరుడు, సాహసం గలవాడు. అయి ఉండాలి అని గదా భద్రకాళి చెప్పినది: అందువలన అటువంటి వానికై వెదకుచున్న సమయంలో, ఆ సన్యా సికి విక్రమార్కుని గురించి తెలిసింది. నెమ్మదిగా ఉజ్జయినీ నగరం వచ్చి మకాం చేశాడు. విక్రమార్కుడు దేశ సంచారం చేసి రాజ్యానికి వచ్చినప్పుడు ఆయనను దర్శించి యిలా తన కోరిక విన్న వించుకున్నాడు.

Responsive Footer with Logo and Social Media