సదానందుని కథ
పూర్వం చంద్రకూటమను నగరమున వీరవర్మ అను మహారాజు పాలించుచుండెను. ఆతని భార్య మణిమాల వారు ఒకనాడు వివాహం చూచుటకు బంధువుల నగరంనకు వెళ్ళిరి. వివాహపు ముచ్చటలు అన్నియు ముగిసినవి, తిరిగి వీరవర్మ-మణిమాల తమ నగరంనకు బయలు దేరిరి. వారు బయలు దేరిన శకటం అర్ధరాత్రమునకు ఒక అడవి మధ్యభాగంనకు వచ్చినది. ఆ అడవి దాటినచో వారి నగరం వచ్చును. కానీ, ఆ కటిక చీకటిలో బయలుదేరుటకు వారు శంకించి, ఆ రాత్రి అక్కడ గడిపి- వేకువజాముననే నగరం చేరుటకు నిశ్చయించుకొన్నారు.
ఒక పెద్ద మర్రివృక్షం క్రింద రధం ఆపించినారు. శకటచోదకుడు (సారథి) కొంచెం దూరంలో పడుకొన్నాడు. దంపతులిద్దరూ ఆ చెట్టుక్రిందనే పవళించినారు.
ఆ దంపతులు నివసించిన మర్రివృక్షంపై ఒక రాక్షసుడు నివసించి యుండెను. వాడు రాజదంపతులు ఆక్కడ శయనించుట చూచి. సహించలేక పోయాడు.
"ఓరీ: నా నివాసము క్రింద భార్యతో సల్లాపాలు ఆడుతున్నావా? మూర్ఖః చూడు మీ యిద్దరినే యిప్పుడే యమాలయానికి పంపిస్తానని మీదికి రాబోయాడు.
రాజదంపతులు భయపడుచు "తెలియక మేమీ వృక్షము క్రింద పడుకున్నాము. ఉదయమే లేచి వెళ్ళిపోగలము" అని ప్రార్థించారు.