రాక్షసుని కోరిక
రాక్షసుడు యిలా అన్నాడు. "తెలిసినా, తెలియకపోయినా నా నివాసాన్ని అపవిత్రము చేశారు. ఇందుకు మీరు నాకు నరబలి యివ్వాలి. అదీ ఎనిమిదేండ్లు నిండిన బాలుని బలియివ్వాలి. అట్లా చేస్తామని మీరు వాగ్దానము చేస్తే -మిమ్ము విడిచి పెడతా. లేదా యిప్పుడే మిమ్ములను హతమారుస్తా"నని హూంకరించాడు.
రాజదంపతులు వాగ్దానం చేశారు. రాక్షసుడు శాంతించాడు - రాజదంప తులు వేకువజాముననే లేచి బయలుదేరి తమ నగరం చేరుకొన్నారు.
రాజు తలచిన దెబ్బలకు కొరతా: అన్నట్లు ఒక పేద బ్రాహ్మణునికి బంగారం, ఒక గ్రామం ఆశచూపి, వారి కుమారుని పదేండ్లవానిని సంపాదించారు.
ఆ మరునాడే రాజదంపతులు బాలునితో రాక్షసుడు ఉన్న చెట్టువద్దకు
వచ్చారు. ఆ బ్రాహ్మణుని కుమారుని పేరు సదానందుడు. ఆఖరు కోరిక ఏమిటని రాజు ఆ బాలుని ప్రశ్నించాడు. ఆ బాలుడు మాటాడక ఆకాశంవైపు చూస్తూ పక పక నవ్వ ప్రారంభించాడు. ఆ నవ్వుతో రాక్షసుని మనస్సు మారిపోయింది. "బలి ఆవసరం లేదు. మీరు హాయిగా వెళ్ళండి:" అని వెళ్ళిపోయాడు.
మహారాజా: విన్నావుకదా కథ: ఆ బాలుడు ఎందుకు నవ్వెనో చెప్ప గలవా? అని భేతాళుడు అని ప్రశ్నించెను. విక్రమార్కుడు ఆలోచించి "బుద్బుద ప్రాయమైన శరీరంపై వీరందరకూ ఎంత మమకారం: ఏనాటికైనా వీరుకూడ చచ్చేవారేకదా! అని వారి తెలివిలేమికి, భగవంతుని తలచుకొని నవ్వినాడు ఆ బాలుడు" అన్నాడు.
మౌనభంగం కావడంతో భేతాళుడు ఎరగిరి తన వృక్షానికి చేరుకొన్నాడు.
భేతాళుడు తన పట్టునుండి తప్పించుకొని, మరల చెట్టునకు అతుకు కొని పోయినందుకు విక్రమార్కుడు విసిగి కొనలేదు. తిరిగి చెట్టువద్దకు వెళ్ళి, భేతాళుని బంధించినాడు; భుజముపై వేసికొని ఆశ్రమానికి బయలు దేరినాడు; విక్రమార్కుడు.
భేతాళుడు ఊరుకొనలేదు. ఆతడు విక్రమార్కుని జూచి "మహీపాలా: నాకు చాలా కాలమునుండి ఒక సందేహము ఉన్నది. ఆ సందియమును తెలియ జేయుదును. నీవు సకల నీతి పారంగతుడవు. కావున నా అనుమానమును దీర్చుము" అని పలికియిట్లు పలుకసాగెను.