రాజనర్తకి
అనంతి నగరానికి, కుసుమ పురానికి సత్సంబంధాలుండేవి. అవంతి రాజనర్తకి కౌముది. రాజాజ్ఞను పురస్కరించుకుని కుసుమ పురానికెళ్ళి అక్కడ జరిగిన ఉత్సవాల్లో నాట్యం చేసింది. ఆమె అవంతి నగరానికి తిరిగి వస్తూ మార్గమధ్యంలోని అడవుల్లో వున్న బందిపోట్లకు ొరికిపోయింది. కొముదీ వెంటవున్న సైనికులు, బందిపోట్లను ఎదిరించి పోరాడలేక ఓడిపోయారు.
బందిపోట్లు రాజనర్తకిని ముఠానాయకుడి దగ్గరకు తీసుకెళ్ళారు. ఆమె ముఠా నాయకుడితో "నేనెవరనుకున్నావ్? అవంతి రాజనర్తకిని. మీరు నన్ను బంధించారని మహారాజుకు తప్పక తెలుస్తుంది. ఆయన సైన్యాన్ని పంపి మిమ్మల్ని నర్వనాశనం చేస్తారు" అన్నది .
బందిపోట్లు ఆమె మాటను నమ్మలేదు. ఏదో సాధారణ నగరవాసి అనుకున్నారు. వారిలో ఒకడు “నువ్వు రాజనర్తకివా? ఇంకా నయం సాక్షాత్తూ మహారాణినే అనలేదు” అన్నాడు.
ఇది విని అందరూ నవ్వారు. బందిపోట్ల ముతానాయకుడు ఆమెతో “సరే! నువ్వు మా ముందు నాట్యం చేసి రాజనర్తకివని నిరూపించుకో!” అన్నాడు.
ఇందుకు రాజనర్తకి పట్టరాని కోపంతో "ఛీ. మీ లాంటి అడవి మనుషులముందు నాట్యం చేయడమా? నేను నాట్యం చేసేది రాజస్తానంలోనే నా ప్రాణం తీసినా సరే. నేనిక్కడ నాట్యం చేయను” అంది.
” ఈ జవాబు వింటూనే బందిపోటు ముఠానాయకుడు ఉలిక్కిపడి, “అవును! ఈమె నిస్తందేహంగా రాజనర్తకే. వృత్తివిలువ తెలసిన నిజమైన కళాకారిణి . ఈమెను ఈమె వెంట వచ్చిన పరివారాన్ని సగౌరవంగా అడవిని దాటించండి” అని తన అనుచరుల్ని ఆజ్ఞాపించాడు.