రాబిన్‌హుడ్‌ సాహస కథలు


రాబిన్‌హుడ్‌ సాహస కథలు పన్నెండు సంవత్సరాల వయసులో తన ఈడు పిల్ల లందరికీ నాయకుడుగా ఉండేవాడు. పిల్లలందరూ ఎంతో అల్లరి చేసేవారు. మంచి మంచి ఆటలు ఆడుకునేవారు.

చిన్నతనం నుండీ రాబిన్‌ హుడ్‌కి కత్తి యుద్దమన్నా, గుర్రపుస్వారి అన్నా ఎంతో ఆసక్తి చూపుతుండేవాడు, గురిచూసి లక్షాన్ని "బాణంతో కోట్టడమనేది రావిన్‌కి వెన్నతో బెట్టిన విద్య.

రాబిన్‌ ఉంటున్న పల్లేటూరు నుండి చాలా దూరంలో 'నాటింగ్‌ హామ్‌' అనే "పెద్ద పట్టణముంది. అక్కడ రావిన్‌ మేనమామ ఉంటున్నాడు. అతని పేరు “గామ్‌ వేల్‌”!...బాగా పలుకుబడి ఉన్నవాడు. ధనవంతుడు కూడా!...

“అమ్మా! “నాటింగ్‌హామ్‌”లో నీకొక అన్నయ్య ఉన్నాడని చెబుతూ ఉంటావు కదా! ... మరి మనం అక్కడకు ఎప్పుడూ వేళ్ళినట్టులేదే !... మామయ్య ఎటువంటివాడు? మహావీరుడేనా?” అడిగాడు రావిన్‌ ఒకనాడు తల్లిని.

రాబిన్‌ తల్లి నవ్వి “మహావీరుడేనా! అని అడుగుతున్నావా? మీ మామయ్య షేర్‌పుడ్‌ అడవిలోకి వెళ్ళి ఎలుగుబంటిని ఏ ఆయుధం లేకుండా. ఉత్త చేతులతోనే చంపాడు తెలుసా?” అంది.

రావిన్‌ ఆశ్చర్యపోయాడు!....

“నేను కూడా అటువంటి మహావీరుణ్ని కావాలి! ఆయుధాలు ఉపయోగించ కుండా క్రూర జంతువుల్ని చంపాలి. వీరాధీ వీరుణ్ని అనిపించుకోవాలి అను కున్నాడు.

పదిహేనేళ్ళ రాబిన్‌, ఒకనాటి ఉదయాన్నే విల్లూ, బాణాలు తీసుకుని, షికారుగా షేర్‌ వుడ్‌ అడవి లోపలికి వెళ్ళాడు.

మధ్యాహ్న మైంది. రాబిన్‌ ఇంటికి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు ఎంతో భయపడిపోయారు.

సాయంత్ర మైంది. అయినా రాబిన్‌ ఇంటికి రాలేదు.

రాబిన్‌ తండ్రి అంతటా వెదికాడు. అడవిలో కొంతదూరం వరకూ వేళ్ళి చూసాడు. ప్రయోజనం లేకపోయింది.

రాత్రి కావచ్చింది. రాబిన్‌ జాడలేదు, రాబిన్‌ తల్లి కొడుకు కోసం ఏడుస్తూ కూర్చుంది. రాబిన్‌ తండ్రి ఆమెను ఓదార్చాడు.

తెల్లవారింది. సూర్యుడు నడినెత్తికి పస్తున్నాడనగా రాబిన్‌ తీరుబడిగా ఇంటికి చేరుకున్నాడు. రాబిన్‌ తల్లి కొడుకుని కాగలించుకుని ఆనంద పారవశ్యంలో మునిగిపోయింది.

“నిన్న అంతా ఎక్కడున్నావురా?....” అని రావిన్‌ తండ్రి గద్దిస్తూ అడి గాడు.

“మామయ్య ఏ ఆయుధం లేకుండా ఎలుగుబంటిని చంపాడు. ఎక్కడైనా ఎలుగుబంటి కనిపిస్తుందెమోనని అడవి లోపలికి వెళ్లాను .. నా దురదృష్టం ఏమిటో కానీ, ఒక్క ఎలుగుబంటి కూడా కనిపించలేదు. అడవిలో కొంతమంది నాకు ఆతిధ్య

మిచ్చారు” అన్నాడు రావిన్‌.

“మా అదృష్టం బాగుండబట్టి ఆ క్రూర జంతువు నీకు కనిపించలేదు. కని పించి ఉంటే, నువ్వు మాకు శాశ్వతంగా దూరమై ఉండేవాడివి. ఇంక ఆడవి ఊసు ఎత్తకు!” అని రావిన్‌ తండ్రి కళ్ళెర్ర చేసాడు.

“ఓహో! అడవి జీవితం _ ఎంత ఆనందదాయకం! ప్రకృతి అందాలన్నీ అక్కడే ఉంటాయి సుమా! పచ్చని చెట్లూ, అందమైన పూదోటలూ, ఫలవృక్షాలూ, పక్షుల కిలకిలారవాలూ, చల్లని సెలయేళ్లు చూడముచ్చట గొలిపే లేళ్ళూ, కుం దేళ్ళూ ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. (ప్రకృతి పాన్చుగా అమర్చిన బండ రాయిమీద పడుకుని ఆకాశం వంక చూస్తుంటే” మిలమిలా మెరుస్తున్న నక్షతాలు రారమ్మని పిలుస్తున్న, అనుభూతి ఎలా మరచిపోగలను. ఏనాటికైనా సరే , నేను షేర్‌వుడ్‌ అడవిలోనే కాపురం పెడతాను.” అనుకున్నాడు రావిన్‌హుడ్‌.

రావిన్‌హుడ్‌కి తన మేనమామ ఎలా ఉంటాడో తెలియదు, రావిన్‌ తల్లి కూడా తన అన్నను చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. ఆమెకు అన్నను చూడాలన్న కోరిక కలిగింది.

అదీ గాక, రాబిన్‌ని అన్న దగ్గర విడిచివస్తే తనంత మహావీరుడిగా రాబిస్‌ని తీర్చిదిద్దుతాడు! అన్నది రావిన్‌ తల్లి ఆశ!

“రాబిన్‌ని తీసుకుని ఒకసారి మా అన్న దగ్గరకు నాటింగ్‌ హోమ్‌ వేళ్ళి వస్తాను. అతణ్ని చూసి ఎన్నో సంవత్సరాలు అయింది కదా!” అంది రావిన్‌ తల్లి భర్తతో.

“ఇప్పుడు నాకు పంట కోతలకాలం!... నీకు తోడుగా రావ టం కుదరదు. మీరు వెళ్ళే దారి యావత్తూ దొంగల మయం. ప్రమాదాలు ఎక్కువ. మరొకసారి వీలు చూసుకుని వెళ్దాంలే!” అన్నాడు రావిన్‌ తండ్రీ.

“నేను తోడుగా వేళ్ళుతున్నాను కదా! అమ్మకేం భయం లేదులే నాన్న గారూ!.... నా దగ్గర ఖడ్గం ఉంది. విల్లూ బాణాలు ఉన్నాయి!” అన్నాడు రాబిన్‌ గోప్ప యోధుడిలాగ,

రావిన్‌ తండ్రి, తల్లీ కొడుకులు నాటింగ్‌ హోమ్‌ వేళ్ళేందుకు అంగీకరిం చాడు.

మేలు జాతి గుర్రం వాళ్ళ (ప్రయాణానికి సిద్ధం చేయబడింది. రావిన్‌ గుర్రం మీద కూర్చున్నాడు. అతడి తల్హి వెనుక కూర్చుంది.

కొన్నిరోజులు ప్రయాణం చేసిన తర్యాత వాళ్లు నాటింగ్‌హామ్‌ చేరు కున్నారు. చెల్లైలినీ, మేనల్లుడ్నీ చూసి గామవెల్‌ 'ఏంతో సంతోషించాడు.

గామ్‌వెల్‌కి రాబిన్‌ ఈడువాడే ఒక కొడుకు ఉన్నాడు. ఆ కుర్రవాడి పేరు

రాబిన్‌ విలువిద్యా నైపుణ్యాన్ని అందరూ శ్రద్ధగా తిలకించుట! “విల్‌ గామ్‌వేల్‌”!... కొద్దిరోజులకే రావిన్‌_విల్‌ గామ్‌వెల్‌ మధ్య గాఢమైన స్నేహం ఏర్పడింది.

ఈ రోజు నా సోదరి మారియన్‌ వాళ్ళ గ్రామం నుండి వస్తున్నది. ఆమె నాకూ దూరపు బంధువు. మంచి చలాకిగా ఉంటుంది, మనకంకె ఒకటి రెండు సంవత్స రాలు చిన్నది.” అని రాబిన్‌తో చెప్పాడు విల్‌ గామ్‌ వెల్‌.

ఆ రోజు మారియన్‌ వచ్చింది. రాబిన్‌కు ఆమె బాగా నచ్చింది.

రాబిన్‌ తల్లి కొడుకును అన్న వద్ద విడిచిపెట్టి తిరిగి తన (గ్రామం వేళ్ళి పోయింది.

సంవత్సరాలు గడుస్తున్నాయి. రాబిన్‌ మంచి దృఢకాయునిగా తయారయ్యాడు నాటింగ్‌ హామ్‌లో జరుగుతున్న ఉత్సవాలకు "స్నేహితులతో కలిసి వచ్చిన రాబిన్‌ పట్టణవాసులతో ముష్టి యుద్దానికి దిగుట!. గామ్‌వెల్‌ పర్యవేక్షణలో మేటి విలుకాడుగా తయారయ్యాడు. కత్తి యుద్ధంలోనూ, కర్రసాములోనూ నిష్ణాతుడయ్యాడు.

, [ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా నే, ఆ సంవత్సరంకూడా నాటింగ్‌ హామ్‌లో పండుగ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

“ఈ సంవత్సరం మనం ఉత్సవాలు చూడటానికి వెళ్దాం”. అన్నాడు రాబిన్‌ విల్‌గామ్‌ వెల్‌తో.

“వద్దు! అక్కడ మన పళ్ళేటూరు వాళ్ళంటే. పట్నం వాళ్ళు చాలా చుల కనగా చూస్తారు. _ ఆట పట్టిస్తారు. మనం అటువంటి, చోటికి వెళ్ళకపోవడమే మంచిది!” అన్నాడు విల్‌ గామ్‌వెల్‌.,

రాబిన్‌ కి పట్టుదల పెరిగింది!

“మనం ఈసారి పట్నం కుర్రవాళ్ళను ఆట పట్టిద్దాం! మన శక్తి సామర్ద్యలు ఏపాటివో వాళ్ళకు రుచి చూపిద్దాం! మసం తప్పకుండా నాటింగ్‌ హోమ్‌ సగ రానికి వెళ్ళవలసిందె !” అన్నాడు రావిన్‌.

“నువ్వు మా నాయకుడిగా ఉండి, పట్నం క్యురవాళ్ళ తిక్క కుదురుస్తా నంటే , మా కుర్రవాళ్ళమంతా నీ వెనుక ఉంటాం! నువ్వు చెప్పినట్టు సడుచు కొంటాం!” అన్నారు విల్‌ గామ్‌ వేల్‌ "స్నేహితులు.

అందుకు రాబిన్‌ అంగికరించాడు!.... కుర్రవాళ్ళంతా కత్తులు ధరించారు. చక్కగా ముస్తాబై ఉత్సవాలకు బయలుచేరి వెళ్ళారు.

ఉత్సవం జరిగే [ప్రాంతంలో వేడుకలు, వినోదాలు ఘహా సందడిగా జరుగు తున్నాయి.

రావిన్‌నూ, అతడి వెనుకగా ఉన్న పళ్ళేటూరి కూర్రవాళ్ళనూ చూసిన పట్నం కుర్రవాళ్ళు, ఆట పట్టించాలని నిశ్చయించుకున్నారు.

పట్నం కుర్రవాళ్ళు వీళ్ళవేనుక పడి, ఈలలూ, కోతిగెంతులూ వేసి వేళా కోళంగా సంభాషించడం (ప్రారంభించారు. వాళ్ళకు వత్తాసుగా కొంతమంది దుకాణ దారులు, కూడా చేరారు.

కొద్ది క్షణాలు గడిచిన తర్వాత రాబిన్‌ _ తన స్నేహితులకు కనుసైగ చేసాడు. అంతే!...విల్‌ గామ్‌'వెల్ల్‌ తన: స్నేహితునితో సహా పట్నం కుర్ర వాళ్ళమీద విరుచుకు పడ్డాడు. అంతా కలిసి పట్నం కుర్రవాళ్ళను చితకబాదడం (ప్రారం భించారు.

అక్కడున్న దుకాణాలను రావిన్‌ తల్మక్రిందులుగా పడగొట్టసాగేడు, అడ్డు వచ్చిన వాళ్ళను ఎత్తి అవతలకు గిరవాటు వేయసాగేడు.

అక్కడ ఒక విధమైన ముష్టియుద్ధం ప్రారంభ మైంది. రావిన్‌, కుర్రవాళ్ళు అన్ని విద్యల్లోనూ బాగా ఆరితేరినవారు. ” విలాసాలలో మునిగితేలే పట్నం కుర వాళ్ళు వాళ్ళముందు ఆగగలరా?-- బాగా దేబ్బలుతిన్న, పట్నం కురవాళ్ళు నేల మీద పడిపోయారు.

అదే సమయంలో రక్షకభటాధికారి గుర్రం మీద అటుగా వచ్చాడు. అతడి వెనుక బోలెతంతమంది రక్షకభటులు ఉన్నారు.

మార్కెట్‌ వద్దకు అప్పుడే వచ్చిన రక్షకభటులు షరీఫ్‌ ఆజ్ఞ మేరకు రాబిన్‌ను బంధించుట.

వాళ్ళను చూసిన పట్నం కుర్రవాళ్ళు, భయంతో తలకొక దిక్కూ పారి పోయారు.

పట్నం కుర్రవాళ్ళు దేనికి పారిపోతున్నారో తెలుసుకున్న విల్‌గామ్‌ వేల్‌, తన స్నేహితులను హెచ్చరించాడు. వాళ్ళుకూడా పిక్కబలంకొద్దీ పరుగు లంఘించు కున్నారు.

“రావిన్‌! ఓ రావిన్‌! పారిపో!... రక్షకభటులు వచ్చేస్తున్నారు” అంటూ విల్‌ గామ్‌వెల్‌, జనంలో కలిసిపోయాడు.

అయితే రాబిన్‌, ఎవరి మాటా వినిపించుకోలేదు. చేతికి అందిన వాడినల్లా చితకబాదుతూనే ఉన్నాడు.

రక్షకభటులకు నాయకుడై న “షరీఫ్‌” గుర్రం మీద రావిన్‌ ముష్టియుద్ధం చేస్తున్న చోటికి వచ్చాడు. అచే సమయంలో రాబిన్‌ కొట్టిన దెబ్బలకు, "నేలమీద విరుచుకు పడిపోయాడు.

“చట్ట వ్యతిరేకంగా ఒక వ్యక్తిని కొట్టి చంపిన నేరానికి ఆ క్యురవాడిని బంధించండి. ఈడ్చుకుంటూ తీసుకుపోయి ఖై దులో పడేయండి!” అని తన భటులకు ఆజ్ఞాపించాడు షరిఫ్‌.

రక్షకభటులు రావిన్‌ "పెడరెక్కలు విరిచి కట్టి తీసుకువెళ్ళి ఖైదులో పడే సారు. రావిన్‌ను ఉంచిన జైలు గోడలు రాతితోనే కట్టబడ్డాయి. అయితే జైలు గది పైభాగం మాత్రం చెక్కలతో తయారుచేయబడింది. ఆ చెక్కలు పురాతన కాలం నాటివి కావడంవల్ల చాలాచోట్ల విరిగిపోయి ఉన్నాయి.

రావిన్‌ తలెత్తి పైకి చూసాడు! తనలో నవ్వుకుని “గోడ పై భాగం వరకూ వెళ్ళగలిగితే తప్పించుకోవడం ఏమంత కష్టంకాదు” అనుకున్నాడు.

చీకటి పడింది!.... రావిన్‌కి భోజనం పెట్టిన భటులు వెళ్ళిపోయారు. అంతటా నిశ్శబ్దం!... అర్థరాత్రి దాటింది. తెల్లవారంది!.... నిద్రా లేచిన భటులు రావిన్‌ను చూసేందుకు గది దగ్గరకు వచ్చారు. గదిలో రావిన్‌ లేకపోవడం వారు గమనించారు. గది గోడల పైభాగాన ఉన్న చెక్కలు తొలగింపబడి వున్నాయి.

రావిన్‌ తప్పించుకు పోయాడన్న వార్త షరీఫ్‌కు అందజేయబడింది. అతడు ఉగ్రరూపం ధరీంచాడు.

"రావిన్‌ శవాన్ని గానీ, బతికివుండగా గానీ తెచ్చి అప్పగించిన వారికి తగిన బహుమానం యివ్వా బడుతుంది!” అని (ప్రకటించాడు షరీఫ్‌. అంతేకాదు. భటులను గామ్‌చెల్‌ భవనానికి, రావిన్‌ తల్లిదండులు ఉండే గ్రామానికే పంపించాడు.

రాత్రి అతి కష్టంమీద జైలు గోడను అధిరోహించిన రావిన్‌కు పైన వున్న చెక్కలను పగులగొట్టి క్రిందికి దూకడం ఏమంత కష్టమనిపించలేదు. ఎవరి కంటా పడకుండా అతడు మేనమామగారి ఇంటికి వచ్చాడు. రావిన్‌' తప్పించుకు వచ్చి నందుకు అందరూ సంతోషించారు,

“నేను యిక్కడ వుండటం క్షేమకరం కాదు. తక్షణం వెళ్ళిపోతాను” అని చెప్పి అందరి వద్ద సెలపు తీసుకుని, రావిన్‌ తన గుర్రాన్ని అధిరోహించాడు.

జైలు నుండి తప్పించుకున్న రావిన్‌ అశ్వారూఢుడై షేర్‌వుడ్‌ ఫారెస్ట్‌ దిక్కుగా పారిపోవుట!

రాత్రంతా అతివేగంగా (ప్రయాణం చేసి, షేర్‌వుడ్‌ అడవి సమీపానికి చేరు కున్నాడు. అడవి అవతల భాగంలో రాబిన్‌ తల్లిదండ్రులు వుంటున్నారు.

“నాటింగ్‌ హామ్‌లోని షరీఫ్‌ చాలా క్రూరుడనీ, నేర విచారణ చేయకుండానే, కఠిన శిక్షలు విధిస్తాడనీ విన్నాను. నేను ఇంటికి వెళ్ళడం, నా తల్లిదండ్రులకు క్షేమం కాదు ఈ క్షణం నుండి నా నివాస స్టానం షేర్‌పుడ్‌ ఫారెస్ట్‌! క్రూరమైన చట్టాలకు వ్యతికేకంగా పోరాడుతాను. అడవిలో తలదాచుకుంటున్న 'నేరస్తూలందర్ని ఒకచోట చేరుస్తాను. పేదలకు, అసహాయులకు సహాయ, సహకారాలు అందిస్తాను. ధనవంతు లను దోచుకుంటాను. మంచివారిని మోసం చేసే దుర్మార్గులను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నిళ్లు తాగిస్తాను. దొంగతనం నా వృత్తి కాదు . హత్యలు జేయడం నా ప్రవృత్తి కాదు .”

అని నిశ్చయించుకున్న రాబిన్‌, తన గుర్రాన్ని షేర్‌పుడ్‌ ఫారెస్ట్‌ లోపలి భాగానికి పోనిచ్చాడు.

" రాత్రంతా ప్రయాణం చేయడంవల్ల రావిన్‌ బాగా అలసిపోయాడు.గుర్రన్ని ఓ చెట్టుకు కట్టి, చెట్టు నిడలో పడుకుని, హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు.

Responsive Footer with Logo and Social Media