పుండరీకుని కథ



"విక్రమార్కభూపాలా ! పూర్వము కాశీనగరమున వేదవర్మ అను మహారాజు పాలించెడివాడు. అతని ఏకైకపుత్రిక- తిలోత్తమ. ఆమె అందాల రాశియై విజ్ఞానవతియై, వినయవతియై ప్రకాశించినది.

ఆ రాజపుత్రికను పెండ్లాడుటకు మంత్రికుమారుడగు పుండరీకుడు; సేనాధిపతి కుమారుడు-అగు వీరవర్మ; కోశాధికారి కుమారుడగు ధనపాలుడు - ఈ ముగ్గురును ప్రయత్నించసాగిరి. వారు ముగ్గురుకూడ విజ్ఞానంతులే; పరాక్రమము గల వారలే; సుందరాకారులే.

అందువలన మహారాజగు వేదవర్మ బాగా ఆలోచించాడు. ఆ ముగ్గురను సభలోనికి పిలిపించి యిట్లు తెలియజేశాడు. "మీలో ఎవ్వరు మంచి మహత్తు : గల వస్తువులను సంపాదించుకొని వస్తారో, అట్టివారికి నా పుత్రిక తిలోత్తమను యిచ్చి వివాహము చేయుదును" అని సభాపతుల యెదుట తెలియజేసెను. పుండరీకుడు, వీరవర్మ, ధనపాలుడు... ఈ మువ్వురూ మహారాజు మాటలకు సమ్మతించిరి; వెంటనే వారు మువ్వురూ మూడుమార్గములు బట్టి ఇట్లు బయలు దేరిన ఆ వీరులు ముగ్గురూ ఆరు మాసముల నాటికి మగధ దేశములో కలిసికొన్నారు. ఆనందంతో ఆరోజు గడిపినారు. ఆ సమయంలో పుండరీకుడు "రాజపుత్రిక యిప్పుడు ఏమిచేయుచుండెనో: చూడాలని ఉంది" అని తన కోరిక చెప్పినాడు.

అంతట ధనపాలుడు “రాజపుత్రికను చూడవలయునన్న నేను చూపించగలను. అట్టి అద్భుతమైన వస్తువు నావద్ద నున్నది" అనేను. మిత్రులిద్దరూ చూచుటకు ఉత్సాహం చూపించారు.

"ధనపాలుడు వెంటనే తాను భద్రముగా గొనివచ్చిన ఒక అద్దమును పైకి తీసెను. లోలోపల ఒక మంత్రమును పఠించి కాశీనగరం-అంతఃపురంయందలి తిలోత్తమ గది" అన్నారు. ఆశ్చర్యం: నిజంగా ఆ అద్దములో కాశీనగరమంతా కనిపించసాగింది. క్రమంగా అంతఃపురమందలి తిలోత్తమగది కనిపించింది. అందులో అందరూ ఏడ్చుచున్న దృశ్యమూ, కొంచెం దూరంలో తిలోత్తమ శవమూ కనిపించింది. పుండరీకుడు ఆ దృశ్యాన్ని చూచి "అయా: తిలోత్తమ మరణించింది. త్వరగా అక్కడకు వెడితే బాగుండును. నేనామెను బ్రతికించగలను? నేనట్టి మంత్రమును సంపాదించాను. అని కంగారు పడసాగెను.

అప్పుడు వీరవర్మ లేచి-"నేను తీసికొనిపోగలను అట్టి మహిమ గల వస్తువు నావద్ద నున్నది" అని పలుకుచు ఒక కంబళి (తివాచీ) తీసి పరిచినాడు. మువ్వురూ దానిపై కూర్చుండి, వాయువేగంతో వచ్చి తిలోత్తమ గదిముందు దిగినారు.

పుండరీకుడు వెంటనే తిలోత్తమ శవము వద్దకు వెళ్లి, తాను. సంపాదిం చిన మహత్తరమైన దివ్యమంత్రముతో తిలోత్తమను బ్రతికించినాడు అందరును చాల సంతోషించినారు."

విక్రమార్కభూపాలా: వింటివి కదా కథః మువ్వురూ వీరులు గొప్ప మహిమగల వస్తువులు సంపాదించినవారే। మహారాజగు వేదవర్మ యిప్పుడు తన పుత్రిక తిలోత్తమను ఎవరికిచ్చి వివాహం చేయాలి:" అని భేతాళుడు ప్రశ్నించెను.

విక్రమార్కుడు క్షణం యోచించి "భేతాళా: నీవు చెప్పినట్లు మువ్వురు గొప్ప మహత్తుగలవి సంపాదించినవారే. అయినను ప్రాణ మొసగినవాడు పుండరీ కుడు. మిగిలినవారు యిర్వురూ అతనికి సహాయపడినారు. అంతియేగాక, మగధ రాజ్యంలో వారు కలిసికొన్నప్పుడు తిలోత్తమను చూడ అభిలషించినవాడును పుండరీకుడే. కావున తిలోత్తమ పుండరీకునకే భార్యయగుట ధర్మము" అని జవాబు నిచ్చెను.

"అవును, మహారాజు తిలోత్తమా - పుండరీకులకే వివాహము చేయించినాడు"." అని పలుకుచూ, నియమభంగ మైనందున ఎగిరి చెట్టునకు వ్రేలాడినాడు. విక్రమార్కుడు మరల ఆ చెట్టువైపు బయలు దేరినాడు, విక్రమార్కుడు మరల చెట్టువద్దకు వెళ్ళి, భేతాళుని బంధించి భుజంపై నేసికొని బయలుదేరాడు. భేతాళుడు ఇంకొక కథ ప్రారంభించాడు.

Responsive Footer with Logo and Social Media