పేదవాడు-దేవత



ఒక ఊళ్లో ఒక పేదవాడు ఉండేవాడు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి అమ్మి బ్రతికేవాడు. ఎప్పటిలాగానే ఒకరోజు అడవికి వెళ్ళాడు. ఒక పెద్ద చెట్టు ఎక్కి కట్టెలు కొట్టసాగాడు. అనుకోకుండా అతని చేతుల్లోంచి గొడ్డలి జారి క్రింద ఉన్న చెరువులో పడిపోయింది. దాంతో “రేపటినుండి ఎలా?" అని ఏడుస్తూ కూర్చున్నాడు.

అతని ఏడుపు విని దేవత ప్రత్యక్షమైంది. “ఎందుకు ఏడుస్తున్నావు?” అని అడిగింది. పేదవాడు విషయం చెప్పాడు. అప్పుడు దేవత ఒక బంగారు గొడ్డలి చూపించి “ఇది నీదేనా?” అని అడిగింది. “కాదు” అన్నాడు. ఈసారి ఒక వెండి గొడ్డలిని చూపించి “పోనీ ఇదైనా నీదేనా?” అని అడిగింది. కాదన్నాడు. మూడవసారి అతని ఇనుప గొడ్డలినే చూపించి “ఇది నీదేనా?” అని ప్రశ్నించింది. “అవును నాదే” అన్నాడు పేదవాడు సంతోషంగా. అతని నిజాయితీకి దేవత చాలా ఆనందపడింది. అతని గొడ్డలితోపాటు మిగతా రెండు గొడ్డళ్ళను ఇచ్చి హాయిగా బ్రతకమంది. దేవత ఇచ్చిన గొడ్డళ్ళతో పేదవాడు ధనవంతుడయ్యాడు. భార్యతో సుఖంగా జీవించసాగాడు. ఒకసారి భార్యతో కలిసి వేరే ఊరికి ప్రయాణమయ్యాడు. వారు ప్రయాణిస్తున్న ఎద్దులబండి ఒకచోట బోల్తాపడి అతని భార్య చెరువులో పడిపోయింది. “అయ్యో నా భార్య చెరువులో మునిగిపోయింది. రక్షించండి.” అని ఏడుస్తూ అరవసాగాడు అతడు.

ఏడుపు విని దేవత మళ్ళీ ప్రత్యక్షమైంది. “ఏమైంది” అనడిగింది. “నా భార్య చెరువులో మునిగిపోయింది” అని చెప్పాడు. అప్పుడు దేవత రంభను చూపించి "ఈమేనా నీ భార్య?" అని అడిగింది. దానికతడు “అవును ఈమే” అన్నాడు. దేవతకు కోపం వచ్చింది. “నువ్వెంతో నిజాయితీపరుడివి అనుకున్నాను. రంభను నీ భార్య అంటావా! నిన్ను ఇప్పుడే శపిస్తాను” అంది. దానికతడు “శాంతించు తల్లీ! రంభను నా భార్య కాదంటే మరొకావిడను చూపిస్తావు

Responsive Footer with Logo and Social Media