పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలు



పార్వతీశం పుస్తకం చదివినవాళ్ళు చాలామంది, "ఈ ఆసామి ఎవ రండీ" అనో, "ఎవరిమీద రాశారండీ" అనో, "అసలిలా రాయాలని మీకు ఎలా తోచిందండీ" అనో, నన్ను తరచు అడుగుతూండడం కద్దు. అలాగే ఆ మధ్య రేడియోవారు కూడా “వాడి, అనగా పార్వతీశం పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, నాలుగు ముక్కలు చెప్పండి" అన్నారు. వారికి చెప్పిన సమాధానాలూ, దరిమిలా నన్ను ప్రశ్నించే వారికందరికీ నేను తరచు చెప్పిన సమాధానాల సారాంశం, ఈ క్రింది సమాచారం.

దేనికైనా పెట్టి పుట్టాలంటారు మనవాళ్లు; లేదా ముఖాన్ని రాసి ఉండాలంటారు. ఒక్కొక్క ముఖం చూస్తే ముద్దు పెట్టుకో బుద్ధి పుడు తుంది. అన్నపుడూ అందరికీ అది సాధ్యం కాకపోయినా మరోమాట ఆ ముఖం చూడాలసీ, ఆ ముఖం గలవారిని పరిచయం చేసుకోవాలనీ అనిపిస్తుంది. కొన్ని ముఖాలు చూస్తే మొత్తబుద్ధి పుడుతుంది, జన్మలో ఆ ముఖం కనపడకుండా ఉంటే బాగుండుననిపిస్తుంది. అలాగే కొందరి పేరు వినగానే ఆయన పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకోవలెననే కుతూ హలం కలుగుతుంది.

అలాంటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అతని ముఖారవిందం, అందలి వికాసం అతని జన్మ నక్షత్రఫలం, అదంతాను. లేకపోతే ఎందరికో అతని పేరు తెలియడమేమి? నా పేరు తెలియక పోవడమేమి? అతని పరిచయం కోసం, అతని సంగతి తెలుసుకోడం కోసం, అందరూ కుతూహలపడడం; కుతూహలమే కాదు తహతహడడం, ఎందుకు? మా వాడి పేరు తెలిసిన వాళ్ళలో శతాంశానికేనా నా పేరు తెలియక పోవడమేమి? ఒక్కరూ నన్ను తెలిసిన వాళ్ళలో నీ సంగతి సందర్భాలూ, పుట్టుపూర్వోత్తరాలూ ఏమిటి బాబూ అని ఏ ఒక్కరూ అడగరేమి? ఇది నాకు కొంచెం బాధగానే వుంటుంది. అప్పుడప్పుడు, ముఖ్యంగా నా స్నేహితులెవరేనా వారి స్నేహితులకో, లేదా ఏదేనా సభ లోనో నన్ను పరిచయం చేసేటపప్పుడు వీరు ఫలానా నరసింహశాస్త్రిగారు అంటే, అయితే ఏమంటావు అనే ప్రశ్నార్ధక ముఖాలు చూడడం. వెంటనే "వారు పార్వతీశం సృష్టికర్త" అనగానే, ఓహో అలా చెప్పండి అయితే కొంతవరకూ ఈయన్ను సహించవచ్చుననే తృప్తి వారిలో కనపడడం చూచినప్పుడు కొంచెం కష్టంగా ఉండే మాట వాస్తవమే! పుత్రాదిచ్ఛేత్ పరాజయం అంటారు కాని, ఏమో చెప్పలేను.

ఆ పరజయాన్ని ఎంత పుత్రునివల్లనైనా అంగీకరించడం కూడా గొప్పేనంటాను. నా మట్టుకు నేను గొప్పవాడినని కాదు కాని పేరు ఎవ్వరూ ఎరక్కపోయినా ఇదే బాగుందని నా మనస్సుకు సమాధానం చాలాకాలం క్రితమే చెప కున్నాను. నా అహమికకు స్వస్తి చెప్పాను. మైనారిటీ వెళ్లని వాడికింద లెక్క వేసుకున్నాను నా మట్టుకు నేను. ఏమంటే పెద్దవాళ్ళంతా నన్ను సుబ్బారాయుడిగారి తమ్ముడు అంటారు. మరోచోట శివశంకరశాస్త్రిగారి వియ్యంకులనీ, తీర్ధులుగారి మామగారనీ, అనిపించుకోడం బాగా అలవాట యింది. అందుచేతను ఎవరైనా ఈయన పాగ్వతీశం రచయిత అనగానే అవతలవాడు ఓ పెద్ద నవ్వు నవ్వి, "అలాగటండీ! అలా చెప్పండి?" అని పైకి, అందుకనే ఆయన మొహం అలా వుందని లోపల, అనుకుం టున్నాడని తెలిసినా నాకేమీ ఇబ్బంది కలగడం లేదు. అంతే కాదు ; సంతోషంగా ఉంటోంది.

ఈ మధ్యను. ఎందుచేతనంటే యేనకేనాప్యుపా యేనా, నలుగురి నోళ్ళాపడడం, నలుగురిచేతా నాలుగూ అనిపించుకోడం, మంచిదే అనుకోండి. సంతోషించతగ్గ విషయం. గర్వించతగ్గ విషయం అని చాలామంది అభిప్రాయం. సరే నా మాటెవరికి కావాలి! పార్వతీశం సంగతి కదా మీకు కావలసింది. అతని పుట్టుపూర్వోత్తరాలు నేను చట్టుకు ఏం చెప్పను. అతను చెప్పుకున్న దానికంటే, అతను అయోనిజుడు, స్వయంభువు బ్రహ్మ మానసపుత్రుల జాతిలోని వాడు. పార్వతీశం తన నివాసం మొగలితుర్రు అని అని వాసు వాసుకున్నా యదార్థం చేతను అతని పుట్టుక మాత్రం నర్సాపురం తాలూకా గుమ్మలూరు అనే గ్రామంలో మనలో మనమాట ఆ వూరులో పార్వతీశం ఎందుకు పుట్టవలసి వచ్చింది అంటే, అది మా అత్తవారి వూరు. అందు చేతను నాకు ఆ వూరు మీద అభిమానం యెక్కువ. రోజులలో అక్కడకు ప్రయాణం యెంతో కష్టంగా వుండేది. ఆ వూరికి ఎటువైపునా రోడ్డులేదు. మట్టిరోడ్డు కూడా సరిగా వుండేది కాదు. వర్షం కురిస్తే బాటసారుల పాట్లు పరమేశ్వరుని కెరుక, అయినా నాకక్కడకు వెళ్ళడం సరదాగా వుండేది. ఒకసారి దీపావళికి మంచి వర్షాలు పడుతున్న రోజులలో, పడుతూ లేస్తూ ఒక్కడుగు ముందుకి వేయబోతే రెండడుగులు ముందుకి జారుతూ నానాయాతనా పడి, గుమ్మలూరు చేరుకున్నాను.

అప్పుడు మామూలుగా మా బావమరుదులూ, మరదళ్ళూ పక్కింటి వారబ్బాయీ మొదలైన వాళ్ళంతా నా చుట్టూ చేరారు. వీళ్ళంతా నన్నొక నాయకుణ్ణి చూసినట్లు భక్తి భావంతో చూస్తూండేవారు. ఉబుసుపోకకు, వాళ్ళకు ఆ కబురూ, ఈ కబురూ చెప్పడంలో ఆనాటి పడవ ప్రయాణంలో వుండే కష్టాలూ, తమా షాలూ, అనుభవాలు కొన్ని చెప్పుకొచ్చాను. వాళ్లు చాలా సంతోషించారు. వాళ్ళంతా నన్ను ఏకగ్రీవంగా అదో కధలా వ్రాయమన్నారు. నాకప్పటికీ పుస్తకం రాద్దామని సంకల్పం ఎంతమాత్రమూలేదు. సరికదా వ్రాయగలననే ధైర్యం కూడా సుతరామూ లేదు. నేనప్పటికి వ్రాసినదల్లా మూడుకథలు మాత్రమే. "పిలక”, “నేను మా ఆవిడ", అనేవి సాహితిలోనూ.. లక్ష్మి, భారత పత్రికలోనూ తరువాత అచ్చుపడ్డాయి. సాహిత్యరంగంలో అతిచౌకగా ఖ్యాతి సంపాదించిన వాళ్ళలో అగ్రగణ్యుడను నేను. పిలక, లక్ష్మి అనేవి రెండూ చాలామంది. దృష్టిని ఆకర్షించాయి, చాలామంది అభిమానాన్ని పాందినాయి.

కాని నాకు తెలుసు కనుకను ఇకముందు మనమేమీ వ్రాం వ్రాయకుండా వుంటే మర్యాదగా వుంటుంది అనుకుంటూండగా ఈ సమావేశం తటసమయింది. "బాలవాక్యం బ్రహ్మవాక్యం" అన్నారు పెద్దలు. మా కుర్రాళ్లు అడగగానే యెందుకో నాకూ వ్రాయవలెనని ఉత్సాహం కలిగింది. కాగితం మీద శ్రీ రామ చుట్టి ప్రారంభించి, ఒక కుర్రవానిని నర్సాపురం నుంచి నిడదవోలుదాకా తీసుకువెళ్ళాను అక్కడ వానిని ఏమి చెయ్యాలో తోచక మద్రాసు తీసుకువెళ్ళాను. అప్పటికి కుర్రవానికి నామకరణం చెయ్యలేదు. ఇంగ్లండు పంపిద్దామని అనుకోనూ లేద:. ఆ వ్రాసినంతవరకూ మా కుర్రవాళ్ళుకు చదివి వినిపించాను. వాళ్లు చాలా బాగుందని ఏకగ్రీవంగా నాకు సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ కుర్రవాళ్ళసంతోషం నాకెంతో ఉత్సాహం కలిగించింది. ఈ కుర్రవాడు మద్రాసులో వుండిపోయాడే, వాడిని మళ్ళీ యిల్లు చేర్చవద్దా అనుకున్నాను. కధకు. ఆది మధ్యాంతాలు సరిగా వుంటేనేకాని నాకు తృప్తిగా వుండదు. అందు చేతను ఆ కుర్రవాని సంగతి తేల్చక తప్పింది కాదు. అప్పుడు హటాత్తుగా తోచింది.

ఇలాంటివాడిని దేశాంతరాలకు తీసుకువెడితే యెలా వుంటుందా అని, చాలా తమాషాగా వుంటుందనిపించింది, సరే ఎంత ఖర్చయినా, యెంత శ్రమయినా వీడిని ఇంగ్లండు పంపించవలసినదే ననుకున్నాను. ఆ రోజులలో ఇంగ్లండు వెళ్ళడమన్నా బారిష్టరు చదవడమన్నా చాలా గొప్ప. ఈ కుర్రవాడి భవిష్యత్తు ఎప్పుడైతే నిశ్చయయిందో, ఆ తక్షణం అతని జన్మస్థానం పేరూ, ఇంటి పేరూ, చదువూ వగైరా అవసరమైన పూర్వరంగం వ్రాశాను. అంతవరకే. నా బాధ్యత తరు వాత కధంతా పార్వతీశ మే చెప్పుకుపోయాడు. మన పురా ణకర్తలు సూతుడు, శౌనకాది మహామునుల కిట్లనియె; అనో, దేవా! వైశంపాయనుండు జన మేజయున కిట్లనియె. అనో కథ అందుకునేవారు. అప్పుడు దానం తటది కొంతదూరము సాగిపో యేది.

డబ్ల్యు.డబ్ల్యు జేకబ్స్ అనే సుప్రసిద్ధ ఆంగ్ల హాస్య రచ యిత వుండేవాడు. అతను నౌకా జీవితం యెన్ని రకాలుగానో, యెంతో హాస్య జనకంగానో, వర్ణిస్తూ అనేక కధలు వ్రాశాడు. అతని కథలన్నీ, దినైట్ వాచ్ మన్ డెక్ మీద కూర్చుని ఇలా అన్నాడు, అని ప్రారంభిస్తేగాని అతనికి కథ నడి చేదికాదట.అలాగే మాది మొగలితుర్రు మా ఇంటి పేరు వేమూరువారు. అని స్వీయచరిత్ర మాదిరిగా ప్రారంభించే సరికి తరువాయి చరిత్ర ప్రయోజకత్వం లేకుండానే నడిచిపోయింది. మొదటి నుంచీ నా బుద్ధికి మల్లేనే నా కాళ్ళకు కూడా స్థిరత్వం తక్కువ తరుడు ఎక్క as ఒక చోటికి తిరుగు తూంటేనే గాని తోచేది కాదు.

ఈ కుర్రవాడిని మద్రాసులోనే ఉంచి, నేను గుమ్మలూరు నుంచి గుంటూరుకు ప్రయాణం కట్టాను. అక్కడ మా మిత్రు లను కొందరిని తల్లావఝుల శివ శంకరశాస్త్రి, నోరి నరసింహ శాస్త్రి, వర్డు బాబూరావు, శ్రీ నివాస శిరోమణి ప్రభృతులను కూర్చోబెట్టి, బాలకవులు తరుము కూతపట్టి, తమ పద్యాలు విని పెంచినట్లు, నా కథ వినిపిం చాను. వారి ఆనందానికి మేర లేదు. ఇది చాలా పాప్యులర్ అవుతుందని వారు ఆశీర్వాదిం చారు. ఇది యసర్ వర్క్ అవు తుందనీ బ్రహ్మాండ మైన జనాద తణ పొందుతుందని నౌు నరసిం హశాస్త్రి గారు అన్నారు. తక్కిన మిత్రులంతా అనేక రకాలుగా నన్ను స్తోత్రం చేశారు. నేను ఊకే సమయస్ఫూర్తిగా మాటడేవాడినా, హ్యూమరిస్టునా, అని సందేహి స్తున్న మిత్రులు ఒకరిద్దరు నేను హ్యూమరిస్టునే అని నిర్ధారణ చేశారు.నీ కర్మమింతే, నువ్విలా హ్యూమరిస్ట్ స్టోరీస్ వ్రాసుకుని కాల క్షేపం చేసుకోవలసిం దేనని నాలుగు అక్షిం తలు నామీద చల్లారు. ఏది ఎలా వున్నా ఈ కద, ఇక్కడ కూర్చుని పూర్తి చేయవలసిందే నన్నారు సభాపతిగారు. ఎలాగూ? నేను తొంద రగా వ్రాయలేనన్నాను.

'అందుకని కథ అడ్డు తుందా స్వామీ! తమకు తోచినప్పుడల్లా డిక్టేట్ చెయ్యండి, ఈ లేఖకా ధముడు వ్రాస్తాడు.....' అని శ్రీనివాస శిరో మణి అభయమిచ్చాడు. ఆయన ధర్మమా అని 2 కధంతా వారం రోజులలో పూర్తి చేయ కలిగాను మిత్రులకు విని పించాను. వారందరూ చాలా బావుందన్నారు. బారిష్టరు పార్వతీశం అంటే బాగుంటుందని మా సభాపతి శివశం కరశాస్త్రిగారు అప్పుడే నామకరణం చేశారు. ఇది 1924 డిశంబరు వారాంతానికి పుస్తకం వెంటనే శారదా ప్రెస్ లో అచ్చుకిచ్చాను మొదటివారంలో జరిగిన విషయం. రెండవ పూర్తి అయింది. పుస్తకం బెజవాడలో వారు పాపం నెల రోజుల లోపుననేమొక్కపాటి నరసింహశాస్త్రిగారి బారిష్టరు పార్వతీశం. ఈ పాత్రను ఎరు గనివారు తెలుగునాట లేరు. ఇటీవల వెండి తెరకెక్కిన కథ.

లండను వెళ్ళి బారిష్టరు ప్యాసవుదామని ఉబలాటం, ఉత్సాహంకల ఆంధ్ర సనా తన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడే పార్వతీశం. ఆంగ్లేయ విద్యతో పాటు అబ్బవలసిన అనేక రకాలయిన సుగుణాలు ఆనాటికి ఇతనిలో కొరత పడినాయి. నేటి నాగ రికత అంతా అతనికి కొత్త. యెన్నడూ రైలెక్కి కూడా ఎరు గని ఈ వ్యక్తికి, యిల్లు బయ లుదేరినది మొదలు అడుగడునా విపరీత పరిస్థితులే తారసిల్లి ఎక్క డికక్కడే అతనిని మూర్ఖుడుగా చేసి ప్రపంచమే తలక్రిందులైనట్లు అతనిచేత భావింపచేస్తాయి. రైలులో అతడు నడిచిన నడత, మద్రా సులో అతను పడిన యిబ్బందులు స్టీమరులో అతను పడిన అవ స్రలు, క్రొత్త ప్రదేశాలలో అతడు పడిన చిక్కులు.

అన్నీ చదివి తీరవలసినవే కాని వ్రాయడానికి అలవికావు. కడుపు చెక్కలయ్యే టంతగా నవ్వించి ఒక ఘట్టాన్ని మించి మరో ఘట్టాన్ని హాస్య ప్రదంగా చిత్రించి ఈ రచయిత తెలుగులో అనుపమానమైన హాస్య০ ఈ కథ మనకందిం చాడు. మన మెరుగని వస్తు వలేవైనా మనచేత పడినప్పుడు. దాన్నెలా పట్టుకోవాలో, దానికి తల ఏదో తోక ఏదో తెలియుక మనమొకహడు కాకపోతే ఇంకొక ప్పుడు అయినా నవ్వుల పాలయి విచారిస్తాం. ఇదే సూత్రం పార్వతీశం కథలో ఆద్యంతమూ యిమడ్చబడి హాస్యాన్ని పోషించింది. అంతా అసహజంగానే కన్పించి అత్యంత సహజమని ఆఖరికి తెలుస్తూ ఉంటుంది. పొరపాటు మరో పొరపాటుకి మూలమై వికృతులు ఒకదానికొకటి గుదిగ్రుచ్చినట్లు పెనవేసుకొన్నట్లు చూపించి, ఊహకందని వంపులోకి కథను ఈడుస్తాయి. పాత్ర స్వభావతః మూర్ఖుడు కాదు. పరిస్థితులతనిని మూర్ఖునిగా చేసి, వెక్కిరిస్తూ వుంటాయి. ఈ పార్వతీశాన్ని మించి నవ్వుల పాలైన అవస్థలు మనం కూడా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అనుభవించి ఎరిగినవే. అందుకే ఈ పాత్ర అంటే మనకి మమత్వం.

అభిమానం సానుభూతి అన్నీ కలిగాయి. ఇది మన జాతీయమైన సొత్తుగా తయారయిన పాత్ర, గిరీశాన్ని మనం సహించలేము. కానీ పార్వతీశాన్నివిడిచి ఉండలేము. పార్వతీశము ఈ క్షేత్రంలో ఏకైక హాస్యపాత్రగా నిల్వ గెలగేడంటే తప్పులేదు. ఈ రచయిత అనేక హాస్య వ్యాసాలూ, కథలూ కూడా వ్రాశారు. అంతటా సరసమైన హాస్యాన్నే అందించాడు. హాస్యపు పాత్రను సృష్టించడంలో ఇతనిలో గల విశిష్టత. ఈ పాత్రలు కూడా మన ప్రేమకు పాత్రమై వుంటాయి.' ఈ రీతిగా ఆధునిక సాహిత్య సమీక్ష చేసిన వారందరూ తమతమ వ్యాసములలోనూ, ఉపన్యాసములలోనూ, రేడియో ప్రసంగములలోనూ, పార్వతీశాన్ని ప్రశంసిస్తూనే వచ్చారు. వారి నెవ్వరినీ నేను వెళ్ళి ఈ ప్రశంసలు చేయమని కోరలేదనీ, అవి వారి వారి అభిప్రాయములనీ, నేను వేరే చెప్పనక్కర లేదనుకుంటాను. ఇంతకూ, ఇంతవరకూ ఎందుకు చెప్పవలసిన వచ్చినదంటే “లోకోభిన్నరుచి” అని అన్నారు కదా? ఎవరి సంస్కారమునుబట్టి వారికి సాహిత్యము రకరకాలుగా అర్ధమవుతూంటుంది.

అని చెప్పడానికి మాత్రమే! ఇది మూడో రకం విమర్శ. ఒక వ్యక్తి కాని, సంఘంకాని, ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ, ఒక పరిణతి పొంది ఉంటే తప్ప, సరియైన హాస్యాన్ని సరిగా అర్ధం చేసు కోవడం కష్టం. అందుకనే హస్య ప్రశంసా, ప్రసంగమూ, సజాతీయుల మధ్యనూ, సమాన సంస్కారము కలవారి నడుమునూ రాణించినట్లు, సర్వత్రా రాణించలేకపోవచ్చు. ఇక నాలుగో రకం వారు, మొదట ఈ కథ విని తమరు చదివీ, చాలా బాగుందన్న పెద్ద మనుష్యులు కొందరు. నాలుగురోజులు పోయిన తరువాత, తమ చుట్టూ తరుచు పార్వతీశాన్ని గురించిన ప్రశంసలు తమ చెవిన పడుతూంటే, అది భరించలేక ఆయన బొంద ఇదో పెద్ద ఇదే మిటి, ఏ డాన్క్విక్సోటో చదివి కాపీ కొట్టాడు. ఈయన తెలివితేటలేమి ఏడిసినాయి అన్నారు. ఇది సామాన్యంగా ప్రతి ఆంధ్రుడూ చేసే విమర్శ.

ఒక చక్కని పుస్తకం వ్రాయడం కాని, ఒక చక్కని చిత్తరువును చిత్రించడం కాని,. ఎవడేనా మనవాడు చేశాడంటే, మనవాళ్ళు చచ్చినా ఒప్పుకోరు. ఏమంటే బుద్ధికుశలత గల ఏపని గాని, ఏ ఆంధ్రూడూ చేయలేడని, ప్రతి ఆంధ్రు డికి ఒక గట్టి నమ్మకం. అందుకని అటువంటి అపురూపమైన రచన ఏదైనా కనపడితే ఇది ఎక్కడో చేతి దెబ్బ కొట్టాడని అనుకుని మనవాళ్ళు తృప్తి పడతారు. అలా అనుకోకపోతే ఆ పూట వాళ్లకు భోజనం చేసినట్లుండదు పాపం. పోనీలెండి ఏం చేస్తాం, టాగూరంతటి విశ్వకవికే తప్ప లేదు ఈ అపవాదు. ఇంక అస్మదాదుల మెంత. సరే, ఎవరు ఏమన్నా, అనాలోచిత సంకల్పంలో ప్రభవించిన పార్వతీశం అందరి అభిమానాల చేతా, విశాల విఖ్యాతయశుడు అయ్యాడు. అది నాకానంద హేతువు.

ఎందుచేతనంటే అతని యశోదీధితులు కొన్ని ప్రత్యక్షంగానూ కొన్ని పరోక్షంగానూ, నామీద కూడా పడి నన్ను గిలిగింతలు పెడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఇప్పటికి కూడాను. కాని ఈ ఆనందంతోపాటు నాకు కొన్ని సందేహాలు బాధించగా, కొంత ఆత్మ పరీక్ష చేసుకోవలసి వచ్చింది. నేను గొప్ప పుస్తకం వ్రాసి అందరనూ గొప్పగా ఆనందపరవశులను చెయ్యవలెనని కాని అందుకు నేను తగినవాడనని కాని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, కొందరు కాదన్నా నేను వద్దన్నా, ఇది గొప్ప పుస్తకమే అయింది. అఖండ ఖ్యాతి నార్జించింది.

'పేరు మీదనే నేను నేటికీ చెలామణి అవుతున్నాను. అందుచేతను నాలో లేని శక్తి యేదో ఉన్నట్లు ప్రజలను భ్రమ పెట్టి ఆ రీతిగా వారిని మోసగించటం లేదు కదా అనే సందేహం ఎప్పుడూ నన్ను బాధిస్తూ ఉంటుంది ; అది అలా ఉండగా పార్వతీశం విశిష్టత యేమిటో, ఎందుకింతమం దికి ప్రేమ పాత్రుడయ్యాడో, ఇతన్ని చూచి ఎందుకు జనం విరగబడి నవ్వుతున్నారో, అనే ప్రశ్న వరంపర నాలో బయలుదేరుతూ ఉంటుంది. మనం ఏదో వ్రాశాం.

వాళ్లు నవ్వుతున్నారు. సంతోషిస్తున్నారు. ఇంకను ఈ వెర్రి సందేహాలు నాకెందుకు అని ఒక ప్రక్క సమాధానం వచ్చినా, దానితో తృప్తిపడే స్వభావం కాదు. కనుక మరికొంచెం తరచి చూచాను. దాన పైన అసలు ఎదుటి వాళ్లను చూచి మనం ఎందుకు నవ్వుతాం. వాళ్లలో యే లక్షణాలు మనల్ని నవ్విస్తాయి అనే ఆలోచన కలిగింది. ఇది చాలా పెద్ద ప్రశ్న సమాధానం సరిగా చెప్పతలుస్తే, సవాలక్ష గ్రంధం అవుతుంది.

అందుకని సూక్ష్మంగా మనవి చేస్తాను. మనుష్యుల రూపురేఖా విలాసాదులలోనూ, వేష భాషలలోనూ, మనకంటికి చెవికి అల వాటైన వాటికంటే హెచ్చు తగ్గులేమాత్రం ఉన్నా మనకు నవ్వు వస్తుంది. ఎదటివాడు యెక్కువ యెత్తరి అయినా, కురచ అయినా, లావైనా, సన్న మైనా, పెద్దముక్కున్నా, అసలు లేకపోయినా కండ్లు ఎగుడు దిగుడుగా ఉన్నా, మెల్ల ఉన్నా, ఇటువంటి తేడాలు యేమి కనుపించినా, నవ్వుతాం అంటే మామూలు ప్రమాణాలకంటే హెచ్చు తగ్గులేమున్నా మనకు వికా రంగా తోచి నవ్వుతాం.

యిదిగాక ప్రతి మనిషిలోనూ కొంత కదలికా,చురుకూ, వివేకం వగైరా లక్షణాలు విడిగా ఉంటాయనుకుంటాను. అవి ఏ మనిషిలోనైనా లోపిస్తే ఆ మనిషి అనాగరికుడుగా మనకు కనపడి, మనం నవ్వుతాం.. అందుచేత, కథా రచనలో నాయకుడి మాటల్లోనూ, చేష్టల్లోనూ, వేషంలోనూ ఇటువంటి వ్యత్యాసాలు చూపించగలిగితే పార కులు నవ్వుకుంటారని తేలింది. మనకంటే ఆంగ్లేయులు చాలా విషయాల్లో చాలా నాగరికులనీ, వారి వేషభాషలు చాలా అందంగానూ, నాజూకుగానూ వుంటాయని అందరూ అనుకుంటారు కదా! ఆ పద్ధతులూ, ఆ.

వేషమూ మనం సాధ్యమైనంతవరకూ అనుకరిస్తాం కదా. అటువంటప్పుడు ఈ పార్వతీశం కచికా తాటాకులూ, బొంత యెర్ర శాలువా, గులాబిరంగు సెల్కు కండువా, బంతిపువ్వు రంగు పెట్టె వగయిరా సామగ్రితో బయలుదేరుతున్నాడంటే ఇంత వెర్రి ముండాకొడుకేమిటా అని అందరూ నవ్వుకుంటారనుకుంటాను.అలాగే ఆడవాళ్ళ టోపి కొన్నప్పుడు భోజనశాల దగ్గర కత్తి కటారులుపయోగించడం చేత కానప్పుడు ఫ్రాన్సులో షాపులో తివాసి మీద నడవకూడదే మోననుకొని మైనం నునుపు పెట్టిన చక్కలమీద నవడబోయి పడినప్పుడూ ఇంత చేతకాని తనం వుంటుందా అని నవ్వు కున్నారు. యదార్థం చేత నవ్వవలసిన పనిలేదు.

యేమం టారా, ఈ నవ్వేవారందరూ ఆ పరిస్థితుల్లో, ఆ సన్నివే శాల్లో, ఆ సందర్భాల్లో సరిగా పార్వతీశం లాగానో, అంత కంటే కొంచెం తెలివితక్కు వగానో ప్రవర్తించేవారని ధైర్య ముగా చెప్పగలను ఒక పెద్ద మనిషి బి.యల్. చదవడా నికి మద్రాసు వచ్చినప్పుడు, క్షరశాలలో పార్వతీశానికి కలిగిన సందేహమే తనకూ కలిగిందని రహస్యంగా నాతో చెప్పాడు. ఇంగ్లండు వెళ్ళి డాక్టరు పరీక్షలో ఉత్తీర్ణుడయి వచ్చిన పెద్దమనిషి, తనూ ఒక షాపులో తివాసీ మీద నడవకూడదను కుని, తలక్రిందుగా బోల్తాపడ్డ సంగతి చెప్పి నా సంగతి నీకెలా తెలిసిందని అడిగాడు. మానవుడు చాలా విషయాల్లో అజ్ఞానుడు, అందుచేత అజ్ఞానజనిత మైన అపచారాలు చాలా వుంటాయి.

ఇటువంటివి కొన్ని చేర్చి ఒక వ్యక్తిలో చూపించడం కొంతవరకు అతిశయోక్తిలా కనిపించినా, తప్పక హాస్యజనకంగా వుంటుందని తేలింది.ఈ అజ్ఞాన కృతాపరాధములకు తోడు, తన తప్పు ఒప్పుకోకుండా అదేదో తను తెలిసే చేసినట్లు నటించడం మనలో చాలామందికి అలవాటు. పార్వతీశం ఆడటోపీ తెలియక కొని వాళ్లు నవ్వగానే తన స్నేహితురాలి కోసం కొన్నానని డబాయించినట్లు మనలో చాలామందికి జబ్బు వున్నది. ఇది కూడా అజ్ఞానలక్షణమే, పర్యవసానమేమిటంటే మనలో అజ్ఞాతంగా ఉన్న అజ్ఞానమూ, అవకతవకలూ, అస్తవ్యస్తాలూ, డాబూలూ, దర్బాలూ, ఎదుటివాడిలో ప్రదర్శితమయితే మనకు నవ్వెనా వస్తుంది.

లేక కోపమైనా వస్తుంది. ఎందుకు నవ్వు అనే దానికి ఒక్క సమాధానం చెప్పవచ్చుననుకుం టాను. ఏ మనిషి తన తప్పుతా నెరుగడు సరికదా! ఎదుటివారికా తప్పు ఆరోపిస్తాడు కూడాను. "మనం చెయ్యని తప్పు ఎదుటి వాడు చేశాడు. వాడొట్టి మూర్ఖుడు. నేనే అయితేనా” అని తన వీపు తను తట్టుకొని సంతోషిస్తాడు. మా పార్వతీశం విషయంలో అంతే జరిగింది మనలో ఉండే తెలివిత క్కువలన్నీ పార్వతీశంలో చూచి ఆ వెర్రికుంక గనక అలా చేశాడు. కాని నేనైతేనా అని ఎవరిమట్టుకు వారు ఆత్మ సంతృప్తితో పార్వతీ శాన్ని చూచి నవ్వుతున్నారు. దీనినే ఇంగ్లీషులో ఒక తత్వవేత్త “సుపీరియర్ ఎడాప్టేషన్” అన్నాడు. అనగా అది ఒకరకమైన అహంకార వికారమన్న మాట. కారణం ఏమైనా పార్వతీశం ఆంధ్ర హృదయంలో స్థిరనివాసము ఏర్పరచుకున్నాడు.

అతనిలో ఆలంకారికులు చెప్పిన ధీరోదాత్తాది లక్షణాలు లేకపోవచ్చు. అందుచేత మహానాయకుడు కాదు. పోనీ నాటకాల్లో ప్రసిద్ధు డైన ప్రతి నాయకుడూ కాడు. ఏది కాకపోయినా అతను మనలాంటి మానవుడు. మనలో అతనే మనం. అందుకనే మన ప్రతి ఒక్కరిలోనూ ఒకడు కాగలిగాడు ఈ పార్వతీశం. ఎవడు ఎంతనవ్వినా, పార్వతీశం ఏమీ అనుకోడు, వాళ్ళకు సామాన్య ధర్మాలైన సాహసం, వుద్రేకం, దురాలోచన, అజ్ఞానం, అహంకారం, కార్యావ సరమైన సాధన సంపత్తి చేకూర్చుకునే ఓపిక లేకపోవడం ఇలాటివన్నీ మూర్తి భవించిన మూర్తి మా పార్వతీశం అని నా అభిప్రాయం. మీరేమంటారు! ఇలా నిర్మొగమాటంగా మాట్లాడానని ఏమీ అనుకోరనుకుంటాను. ఏమంటే సత్యవ్రతం హాస్య రచయితలకు ప్రధానలక్ష్యమూ, ధర్మమూను. ఇప్పటివలెనే ఎప్పటికినీ ఆంధ్రుల అల్లారుముద్దు బిడ్డగా, పార్వతీశం చిరంజీవిగా, వర్దిల్లాలని మీరు ఆశీర్వదించండి.

Responsive Footer with Logo and Social Media