పనిలేని రాజు



మాలతి ఆరేళ్ళ పిల్ల. కథలంటే చాలా ఇష్టం. వాళ్ళ అన్నయ్య మధు ఆమెకు కథలు చెప్పేవాడు. ఒకనాటి రాత్రి మాలతి అడిగిన వెంటనే ఒక కథ చెప్పాడు.

అనగా అనగా ఒకరాజు. ఆయనకు పిల్లా జెల్లా లేరు. పెళ్లీ గిళ్లీ కూడా కాలేదు. పనీ గినీ కూడా లేదు. ఆయనకు బొమ్మలు వేయడం మహా ఇష్టం పొద్దున మొదలు సాయంత్రం దాకా ఏవో బొమ్మలు వేస్తూ ఉండేవాడు. వాటికి మంచి మంచి రంగులు కూడా వేసేవాడు. రంగులు వేసి, 'అబ్బా, ఈ బొమ్మలకు ప్రాణం వస్తే ఎంత బాగుండును” అని అనుకుంటూ ఉండేవాడు. కాని ప్రాణం పోయడం రాజుగారికి చేతకాని పని.

పెళ్లి గిళ్ల, పనీ పాటా లేని ఆ రాజుగారు తన ముఖ్యమంత్రిని పిలిచి తను గీచిన బొమ్మలన్నింటికీ ప్రాణం పోసే విధానమేమైనా ఉన్నదా అని అడిగి చూశాడు.

మంత్రిగారు చిరునవ్వు నవ్వి ప్రాణం పోసే శక్తి ఒక్క భగవంతునికే కదా ఉన్నది అన్నాడు. రాజుగారికి కోపం వచ్చింది. కాని ఏమి చెయ్యడానికీ తోచలేదు. చాలాసేపు ఆలోచించాడు. ఆలోచించగా ఆలోచించగా ఒక మార్గం కనిపించింది. అది ఏమంటే తపస్సు చేసి భగవంతుడి పరిచయం సంపాదించి ఈ ప్రాణం పోసే శక్తిని పొండాలని. కొన్నాళ్ళకు రాజుగారు తపస్సు చేయడం మొదలు పెట్టారు. రాజ్య వ్యవహారాలన్నీ మంత్రులకు వదిలేశారు. కాబట్టి వారే చూసుకుంటున్నారు. రాజుగారి తపస్సును ఎవ్వరూ ఆటంకపరచలేదు.

ఒకనాటి రాత్రి రాజుగారు తవస్సు విరమించి మంత్రులందర్నీ విలిచి సమావేశపరచారు. తను వస్తువులకు ప్రాణం పోసే శక్తిని సంపాదించానని వారికి తెలిపారు. మంత్రులంతా ఆశ్చర్యపోయారు. ఇంతలో రాజుగారు అక్కడ ఉన్న ఒక పెద్ద బల్లమీద చెయ్యివేశారు. వెంటనే ఆ బల్ల జర్‌, జర్ర్‌ర్‌ మంటూ ఒయ్యారంగా గది అంతటా తిరగటం మొదలెట్టింది. మంత్రులందరూ ఈ వింతను చూసి ఒకరి ముఖాలు ఒకళ్లు చూచుకున్నారు. ఆ బల్ల తమ వైపు వచ్చినప్పుడల్లా పరుగెత్తి పక్కకు తప్పుకుంటున్నారు. రాజుగారు గర్వంగా వారి వంక చూసి తన శక్తిని ఇంకా ప్రదర్శించాలని అక్కడ ఉన్న వస్తువులన్నింటి పైనా చెయ్యి వేశారు. తను గీచిన బొమ్మల మీద కూడా చెయి వేశారు. ఇంకేముంది అంతా గందరగోళంగా తయారయింది. గదిలో సామానంతా రణగొణ ధ్వని చేసుకుంటూ గదిలో తిరుగుతూ ఉంటే గీసిన బొమ్మల్లోని మనుష్యులు మాట్లాడటం (ప్రారంభించారు. అక్కడ సమావేశమైన వారికి ఆశ్చర్యమూ వింత పోయి భయం పట్టుకుంది. వారికి ఆ తిరిగే బరువైన సామాన్లవల్ల గాయాలు తగిలినై. ఇటుపోతే కుర్చీలతో ఢీకొంటున్నారు. అటుపోలే బల్లలతో ఢీ కొంటున్నారు. పోనీకదా అని ఏమూలకో ఒదిగి నిలుచుంటే రాజుగారు గీసిన బొమ్మలు గట్టిగా గోలగా మాట్లాడుకుంటున్నై, ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంటున్నారు.

కొంతసేపటికి మంత్రులందరూ పరుగు లెడుతూనే మొరపెట్టుకున్నారు. వస్తువులకు ప్రాణం వస్తే భరించడం కష్టమని. కాని పరిస్థితి విషమించింది. రాజుగారి మాటలైనా మంత్రులు వినగలిగే అవకాశం లేదు. వారందరికీ నడిచే సామానువల్ల విపరీతంగా గాయాలు తగిలి శోకాలు మొదలెట్టారు. దీనికి తోడు రాజుగారి భవనంలో ఏదో గందరగోళం అవుతోందని తెలుసుకుని ప్రజలంతా పరుగు పరుగున బయల్దేరి అక్కడికి చేరారు. ఆ విధంగా వెళ్ళిన వాళ్ళకు కూడా దెబ్బలూ గాయాలు తగిలి, ఆ రభసకు కారణం తెలియక విచిత్రంగా వాళ్ళతో వీళ్ళు కూడా కలిసిపోయారు.

_ రాజుగారికి కాస్త జ్ఞానోదయం కలిగింది. ఆ గోల కంతకూ తనే కారణమని తెలుసుకున్నారు. అంతేకాదు, భగవంతుణ్ణి శాయశక్తులా ప్రార్ధించి, ఆ వస్తువుల ప్రాణాలను తీసివేయమని దీనంగా కోరాడు.

ఒక బొంగురు గొంతుకతో భగవంతుడు రాజుగారికి జవాబిచ్చాడు. ఇచ్చిన ప్రాణం తిరిగి పుచ్చుకోవడం తనకు చేతకాదని భగవంతుడు మాటలాడినప్పుడు మాత్రం ప్రాణంతో ఉన్న వస్తువులు మనుష్యులూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. మంత్రులూ (ప్రజలూ కూడా భగవంతుడిని ప్రార్థించి తమను ఆ కష్టం నుండి తొలగించమని కోరారు. భగవంతుడి ఎదుట రాజుగారు తను చేసింది పొరపాటనీ, అటువంటి పొరపాటును ఇక మీదట ఎన్నడూ చేయననీ, అతి దీనంగా వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడు దయదలచి రాజుగారిని క్షమించి ఆ వస్తువుల ప్రాణాలను తిరిగి తీసుకున్నాడు. అందరూ భగవంతునికి మొక్కారు.

మంత్రులూ (ప్రజలూ సంతోషంతో రాజుగారికి కూడా మొక్కారు. వినయంగా రాజుగారితో భగవంతుడి కొక్కడికే ఉండేశక్తి మనకుగావాలని కోరుకొనడం పొరపాటని విన్నవించుకున్నారు. రాజుగార అది నిజమేనని ఒప్పుకుని, అటువంటి కోరికలను ఇక మీదట కోరనని మాట ఇచ్చి, ప్రజలను (ప్రేమతో పరిపాలించడం మొదలెట్టారు.

కథ కంచికీ, మనం నిద్రకూ, ఏం చెల్లాయ్‌, అన్నాడు మధు.

మాలతికి కథ బాగుంది కాబోలు “మళ్ళీ చెప్పవా అన్నాయ్‌?” అన్నది.

“నేను రాసి, అచ్చువేయిస్తాను. అప్పుడు నీ కిష్టమొచ్చినన్నిసార్లు చదువుకో దానిని” అన్నాడు మధు. ఇంతలోకే నిద్రపోయింది మాలతి.

Responsive Footer with Logo and Social Media