పందెం తెచ్చిన మార్పు



అయినదానికీ, కానిదానికీ పంధాలు కాసే రవికి ఆ వూర్లో పందాల రవిగాడుగా పేరు పండిపోయింది. ఏ పందెం అయినా రవియే గెలవడంతో ఓ విధంగా గర్వం కూడా కల్గింది అతడికి

గ్రామంలో పెద్ద తోట యజమాని నురేంద్ర పట్ట్నంలో చదువుతూ, శెలవలకు ఆ వూరు వచ్చాడు. రవి కథ విని...మా తోటలోని ఓ చెట్టు చూపిస్తా, దాని పళ్ళు పది నువ్వు తింటే పదివేల రూపాయలిస్తాను అన్నాడు. పదివేల రూపాయల పందెం రవి ఎప్పడూ కాయలేదు.

రవి తోటంతా కలియతిరిగాడు. బత్తాయి, కమలా, జామ, సపోటా, మామిడీ. “ఓహ్‌... తినేస్తాను. ఏదీ చూపించు!” అన్నాడు.

పందెం కోసం ఊర్లో పెద్దలందర్ని పిలిచాడు. రవి ఓడిపోతే ఐదువేలు ఇచ్చి, ఇకముందు ఎవ్వరితోనూ పందెం వేయకూడదని ఖరారునామా.

సురేంద్ర రవిని, పెద్దల్ని తోటలో ఓ మూలనున్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. కమలాల్లా ఎర్రగా, ఏవుగా వున్నాయి ఆ పళ్ళు ఐతే అవి విష ముఫ్టి పళ్ళు, ఆ పళ్ళు పది తింటే తనపని ఆఖరే అనుకున్నాడు రవి. బ్రతికుంటే బలుసాకు తినొచ్చు.

పెద్దల సమక్షంలో తను ఓడిపోయినట్లేనని అంగీకరించి, ఐదువేలు సమర్పించుకున్నాడు రవి. ఆ తర్వాత అతడు మరెవరితోనూ పందేలు కాయలేదు.

Responsive Footer with Logo and Social Media