నేను పందిని కానోచ్!
హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా! నేనో అరుదైన జీవిని. నన్ను చూసి చాలామంది నేనో షే.ద్ద పందిని అనుకుంటారు. కానీ కాదు. అన్నట్లు మరో విషయం నాకు చిన్న తొండం కూడా ఉంటుంది. అందుకే కాస్త ఏనుగులా కనిపిస్తాను. కానీ గజాన్ని కూడా కాదు. నేను ఎవర్నో నా పేరు ఏంటో... మీకు తెలిసి ఉండకపోవచ్చు! అందుకే నా విశేషాలు చెప్పిపోదామని ఇదిగో... నేనే ఇలా మీ ముందుకు వచ్చాను. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుంటారా!
నా పేరు టాపిర్. నేను శాకాహార జీవిని. దక్షిణ, మధ్య అమెరికా, ఆగ్నేయ ఆసియాలో జీవిస్తుంటాను. నాలో మళ్లీ నాలుగు రకాలున్నాయి. ఇవన్నీ కూడా అంతరించిపోయే ప్రమాదమున్న జీవుల జాబితాలోనే ఉన్నాయి. 150 నుంచి 800 కేజీల వరకు బరువు తూగుతాను. ? మీటర్ల పొడవు, 1 మీటరు ఎత్తు ఉంటాను. మాలో మలయన్ టాపిర్ తెలుపు, నలుపు రంగులతో భలే అందంగా ఉంటుంది. మిగతావన్నీ, నలుపు, బూడిద రంగుల్లో ఉంటాయి. పిల్లలు మాత్రం నలుపు తెలుపు చారలతో భలేగా కనువిందు చేస్తాయి.
నీళ్లంటే భలే ఇష్టం!
నా కళ్లు బ్రౌన్ రంగులో ఉంటాయి. £5 నుంచి 80 సంవత్సరాల వరకు జీవించగలను. మాలో ఆడవి ప్రతి రెండు సంవత్సరాలకో పిల్లకు జన్మనిస్తాయి. నాకు నీళ్లంటే భలే ఇష్టం. నీటి ఏనుగుల్లా మేం ఎక్కువ సమయం నీళ్లలోనే గడిపేస్తూ ఉంటాం. మాకు చక్కగా ఈత కూడా వచ్చు. ఎండాకాలాల్లో అయితే మేం ఇంకా ఎక్కువసేపు నదుల్లో, మడుగుల్లో కాలక్షేపం చేస్తుంటాం. ఆ సమయంలో నీటిలో దొరికే మొక్కలనే ఆహారంగా తీసుకుంటాం.
ఏం తింటామంటే...
మేం ఎక్కువగా పండ్లు, బెర్రీలు, ఆకులు, లేత కొమ్మలను ఆహారంగా తీసుకుంటాం. ఒక్క రోజులోనే దాదాపు 40 కేజీల ఆహారాన్ని హాం6 ఫట్ చేసేస్తుంటాం. జాగ్వార్లు, పులులు, అనకొండలు, మొసళ్లు మాకు ప్రధాన శత్రువులు. మా చర్మం చాలా మందంగా ఉంటుంది. శత్రువుల దాడుల నుంచి మమ్మల్ని మేం రక్షించుకోవడానికే ఈ ఏర్పాటు అన్నమాట. ఇది మాకు ప్రకృతి ఇచ్చిన వరం. మాలో మౌంటెన్ టాఫిర్‌కు కాస్త ఉన్ని కూడా ఉంటుంది తెలుసా!
మాకు సిగ్గెక్కువ... కానీ!
నిజానికి మాకు సిగ్గెక్కువ. మీ మనుషులు కనిపిస్తే చాలు, చాలా దూరంగా వెళ్లిపోతాం. కానీ భయం వేసినప్పుడు, మేం ప్రమాదంలో ఉన్నాం అని భావించినప్పుడు మీ మనుషుల మీద కూడా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తాం. మాకున్న బలమైన దవడలతో మిమ్మల్ని గాయపరుస్తాం. మేం కాస్త లావుగా ఉన్నా కూడా, వేగంగానే పరిగెడతాం. సాధ్యమైనంత వరకు శత్రువుల నుంచి తప్పించుకునేందుకే ప్రయత్నిస్తాం. కుదరనప్పుడే ఎదురుదాడికి దిగుతాం. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!