నేను నేలను తాకను…



హాయ్‌ నేస్తాలూ..! చూడగానే నచ్చేశాను కదా మీకు! మరి, నా రంగు, రూపమే అంత. ఎవరికైనా వెంటనే నచ్చేస్తాను. అన్నట్టు నేనెవరో మీకు తెలియదు కదూ! ఆ విశేషాలన్నీ సరదాగా మీకు చెప్పి వెళ్దమనే ఇలా వచ్చాను. మరి వెంటనే ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి..!

నన్ను 'గ్రేటర్‌ బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ అని పిలుస్తారు. నేను ఇండోనేషియా, గునియా వంటి దేశాల్లో కనిపిస్తాను. మాలో మొత్తం 89 రకాలు ఉన్నాయి. వాటిలో నేనే అతిపెద్ద జీవిని. అలాగే అందమైన పక్షిని కూడా...! నా శరీరం బ్రౌన్‌ రంగులో ఉంటుంది. తల పైభాగం గోధుమ, నలుపు.. కింది భాగం ఆకుపచ్చ రంగు కొలతలతో మేసినట్లుగా ఉంటాయి. ముక్కేమో.. పర్పుల్‌ రంగులో చాలా బాగుంటుంది.

గుబురులాంటి తోక...!

నన్ను చూస్తే... మీకు బొమ్మను చూసిన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే నా ఆకారం అలా ఉంటుంది. నా తోక గుబురుగా... మొదట్లో పసుపు, తర్వాత తెలుపు... ఆ తర్వాత బూడిద రంగులో కనువిందు చేస్తుంది. నేను చిన్నచిన్న గుంపులతో ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాను. పండ్లు, విత్తనాలను.. అప్పుడప్పుడు చిన్న చిన్న కీటకాలను తిని.. నా బొజ్జ నింపుకొంటాను. ఇంకో విషయం.. నన్ను 'లెగ్‌లెస్‌ బర్డ్‌ ఆఫ్‌ ప్యారడైజ్‌ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే. నాకు వేళ్లు ఉంటాయి.. కానీ పాదాలు ఉండవు.

అదే ప్రత్యేకం...!

నేను చాలా సుకుమారంగా ఉంటాను. చిన్న దెబ్బలను కూడా తట్టుకోలేను. మీకో విషయం తెలుసా...! నేను పుట్టిన తర్వాత ఒక్కసారి కూడా నా ఈకలు నేలను తాకవు. చనిపోయిన తర్వాత మాత్రమే... నేను నేలను తాకుతాను. ఎప్పుడూ చెట్ల మీదే ఉంటాను. లేకపోతే ఎంచక్కా గాల్లో ఎగురుతాను. నా పొడవు 85 నుంచి 489 సెంటీ మీటర్లు ఉంటుంది. సాధారణంగా అయితే అయిదేళ్లు... కాస్త రక్షణ కల్పించి జాగ్రత్తగా చూసుకుంటే. 80 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవి నా విశేషాలు. మీకు నచ్చాయి కదూ!

Responsive Footer with Logo and Social Media