నేను తేనెటీగలను తింటా…



హాయ్‌ నేస్తాలూ..! అలా చూస్తున్నారేంటి? మీరు అలా చూడటం ఆపేస్తే నేను మాట్లాడతాను... ఇంతకీ ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా. చూడటానికి ఇంతే ఉంది కానీ.. బాగా మాట్లాడుతుందే అనుకుంటున్నారా? నేను మీకు పెద్దగా తెలిసి ఉండను... అందుకే సరదాగా ఎగురుంటూ వచ్చా... మీకు ఒకసారి పరిచయం చేసుకొని వెళ్దామని. మరి ఇంకా ఆలస్యమెందుకు వెంటనే ఈ కథనం చదివేయండి..!

నన్ను 'ఏషియన్‌ గ్రీన్‌ బీ- ఈటర్‌' అని పిలుస్తారు. ఇది చూస్తే... పక్షిలా ఉంది పేరులో మాత్రం "బీ అని ఉంది అనుకుంటున్నారా.. దానికి ఒక కారణం ఉంది. నేను ఆహారంగా తేనెటీగలను తీసుకుంటాను. అందుకే... నా పేరులో ఆ పదం చేరింది. నేను ఎక్కువగా మీ దేశంతో పాటుగా ఇరాన్‌, చైనా, నేపాల్‌ వంటి దేశాల్లో కూడా కనిపిస్తాను.

మాలో చాలా రకాల పక్షులు ఉంటాయి. కానీ అన్నింటిలోకెల్లా... నా రంగు చాలా ప్రత్యేకం. చూసిన వెంటనే నచ్చేస్తాను తెలుసా..! నా శరీరం లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. కళ్ల దగ్గర నలుపు, గొంతు దగ్గర నీలం రంగుతో చాలా అందంగా కనిపిస్తాను. నా కళ్లు ఎరుపు, కాళ్లు, ముక్కు ముదురు బూడిద రంగులో ఉంటాయి. తోక కూడా కాస్త పొడవుగానే ఉంటుంది. మేము ఎక్కువగా గుంపులుగా ఉండటానికే ఇష్టపడతాం. చాలా తక్కువ సమయాల్లో మాత్రమే ఒంటరిగా బయటికి వెళ్తాం. ఒక్కో గుంపులో దాదాపు 30 నుంచి 300 పక్షుల వరకు ఉంటాయి.

అవే ఎక్కువ...

నేను చిన్నచిన్న కీటకాలను కూడా ఆహారంగా తీసుకుంటాను. కానీ తేనెటీగలనే ఎక్కువగా తింటాను. అవి అంటే నాకు చాలా ఇష్టమన్నమాట. వాటిని తినేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే... ఒక్కసారిగా అన్నీ కలిసి నన్ను చుట్టుముట్టి చంపేస్తాయి. నేను పుట్టిన తర్వాత కనీసం ఒక నెల రోజుల వరకు అసలు బయటికే రాను. మా అమ్మే అన్నీ చూసుకుంటుంది. నాకు ఎక్కువసేపు ఎగరడం అంటే చాలా ఇష్టం. అందుకే అసలు గూటిలో ఉండకుండా తిరుగుతూనే ఉంటాను. నేను గంటకు 42 కిలో మీటర్ల వేగంతో ఎగరగలను. 15 నుంచి 20 గ్రాముల బరువు తూగుతాను. దాదాపు 18 సెంటీ మీటర్ల పొడవుంటాను. సాధారణంగా అయితే 12 సంవత్సరాలు, రక్షణ కల్పిస్తే... 18 ఏళ్ల వరకు జీవిస్తాను. మొత్తానికి ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదా నేస్తాలూ...!

చూస్తాం. సెలవు రోజుల్లో అయితే... పార్కులకు, ఎగ్జిబిషన్లకు తీసుకెళ్లమని ఇంట్లో మారాం చేస్తుంటాం. అంతే కదా! అక్కడికి వెళ్లక మనకు నచ్చిన ఆటలు ఆడుకుంటాం. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటారా..? ఈ కథనం చదివేయండి ఎందుకో మీకే తెలిసిపోతుంది..! పార్కులకు, ఎగ్జిబిషన్లకు వెళ్లినప్పుడు రకరకాల ఆట వస్తువులు చూస్తుంటాం. అందులో జంబో జంప్‌ కూడా ఒకటి. అది ఎక్కి ఆడుకోవడానికి పిల్లలు చాలా ఆసక్తి చూపిస్తారు. కానీ అన్నిచోట్లా పెద్దవి ఉండవు కాబట్టి, ఎక్కువ సార్లు ఆడుకునే అవకాశం రాదు... అంతే కదా! కానీ పక్క దేశమైన పాకిస్థాన్‌లోని కరాచీలో మాత్రం... ప్రపంచంలోనే అతిపెద్ద జంబో జంప్‌ని ఏర్పాటు చేశారు నేస్తాలూ...!

ప్రత్యేకమైన ధీమ్‌...

ఒకే విధంగా కాకుండా ఇల్లు, ఫొటో బూత్‌... పిల్లలకు నచ్చేలా ఐస్‌క్రీం, డోనట్స్‌ ఆకారాలు ఇలా రకరకాల థీమ్‌లతో దాన్ని ఏర్పాటు చేశారట. దీని నిర్మాణం పూర్తవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టిందట. 15,205.51 చదరపు అడుగుల పరిమాణంలో ఈ జంబో జంప్‌ని ఏర్పాటు చేశారు. ఇంకో విషయం ఏంటంటే. ఒకేసారి దీంట్లో దాదాపు 200 మంది ఆడుకోవచ్చట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా. ఇది నిజమే నేస్తాలూ...!

రద్దీ ఎక్కువే...

ఆ చుట్టు పక్కల వాళ్లే కాకుండా చాలా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్తుంటారట. సాధారణ రోజుల కంటే వారాంతాల్లో, సెలవు రోజుల్లో అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుందట. మీకో విషయం తెలుసా... ఇక్కడ పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా ఎంచక్కా ఆడుకోవచ్చట. మరి ఇంత మంచి ఆట స్థలానికి గుర్తింపు లేకుండా ఎలా ఉంటుంది. ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌' వారు. గుర్తించి... అవార్డు కూడా అందించారు. ఇవీ ఫ్రెండ్స్‌... ప్రపంచంలోనే అతిపెద్ద జంబో జంప్‌ విశేషాలు. వెంటనే... మీకు అక్కడికి వెళ్లాలని ఉంది కదూ!

Responsive Footer with Logo and Social Media