నేనో బంగారు పక్షిని…
హాయ్ నేస్తాలూ..! మీకు నెమలి తెలుసు కదా! ఇప్పటి వరకు చాలాసార్లు చూసే.. ఉంటారు! కానీ మీకు నెమలి కాని నెమలిని పరిచయం చేయబోతున్నాం. దాని వివరాలు ఆ పక్షి మాటల్లో తెలుసుకోవాలని ఉంది కదా! అయితే అలస్యం చేయకుండా... వెంటనే ఈ కథనం చదివేయండి. పిల్లలూ ఎలా ఉన్నారు.. నేనైతే చాలా బాగున్నా. నా పేరు గోల్డెన్ ఫెజెంట్. నేను నెమలి జాతికి చెందిన పక్షిని. నా స్వస్థలం చైనా, ఇంకా వేరే ఏ దేశాల్లోనూ నేను కనిపించను. చూడటానికి రంగురంగులుగా భలే అందంగా ఉంటాను. నా శరీర రంగు, ఆకారాన్ని బట్టే. నాకు ఆ పేరు పెట్టారు. నా శరీరమంతా ముదుర ఎరుపు, నారింజ, నలుపు రంగు అక్కడక్కడా ఆకుపచ్చ రంగు గీతలతో ఉంటుంది. మాలో ఆడ పక్షులకు రంగు కాస్త పేలవంగా ఉంటుంది. నా తల మీద ఉండే... బంగారు రంగు జుట్టు నన్ను అందంగా కనిపించేలా చేస్తుంది.
తోకే ప్రత్యేకం...
నేను ఎక్కువగా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతాను. ఆకారం కాస్త పెద్దగా ఉంది కదా అని, ఏవైనా జీవులను చంపి తింటాననుకోకండి నేస్తాలూ.. నేను పండ్లు, పువ్వులు, ఆకులు, విత్తనాలు తిని నా బొజ్జ నింపుకొంటాను. నా తోక చాలా పెద్దగా ఉంటుంది. అందుకే... నేను ఎగరడం కంటే. నేల మీద తిరగడానికే ఎక్కువ ఆసక్తి చూపుతాను. మీకో విషయం తెలుసా... ప్రమాదంలో ఉన్నప్పుడు ఒకలా, ఆనందంగా ఉన్నప్పుడు ఇంకోలా శబ్దాలు చేసుకుంటూ మేము మాట్లాడుకుంటాం.
అదృష్ట పక్షిగా...
నన్ను మా దేశంలో... అదృష్టానికి గుర్తుగా చెప్పుకుంటారు. నేను గంటకు "12 కిలో మీటర్ల వేగంతో ఎగరగలను. నా పొడవు 61 నుంచి 115 సెంటీ మీటర్లు. అందులో తోక పొడవే దాదాపు 68 నుంచి 19 సెంటీ మీటర్ల వరకు ఉంటుంది. బరువు 550 నుంచి 100 గ్రాములు. సాధారణంగా అయితే అయిదు సంవత్సరాలు, రక్షణ కల్పిస్తే ?0 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవీ నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి కదూ!