నేనో పెద్ద అడవిపిల్లిని!
'హాయ్ ప్రెండ్స్ బాగున్నారా! చూడ్డానికి కాస్త మౌంటెన్ లయన్‌లా కనిపిస్తున్న నేను నిజానికి ఓ అడవిపిల్లిని. నా గురించి తెలుసుకోవాలని మీకు తెగ ఆసక్తిగా ఉంది కదూ! ఆ వివరాలు చెప్పి 'వెళ్ళామనే ఇదిగో ఇలా వచ్చాను. తెలుసుకుంటారా మరి!
'నా పేరు కారకల్. నా స్వస్థలం ఆఫ్రికా. నేను ఆసియా ఖండంలోనూ కొన్ని చోట్ల కనిపిస్తుంటాను. నా కాళ్లు పొడవుగా ఉంటాయి. ముఖం మాత్రం చిన్నగా ఉంటుంది. చెవులు కూడా పెద్దగా ఉంటాయి. దంతాలు పొడవుగా ఉంటాయి. నేను ఇసుక రంగులో ఉంటాను. మాలో మగవి 18 'నుంచి 108 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. 8 నుంచి 19 కేజీల వరకు బరువు తూగుతాయి. ఆడవేమో "1 నుంచి 108 సెంటీమీటర్ల వరకు పొడవుంటాయి. 7 నుంచి 15.9 కేజీల వరకు బరువు తూగుతాయి. తోకలు కూడా ఆడవాటికన్నా. మగవాటికే కాస్త పొడవుగా ఉంటాయి.
వేటలో మేటి...
'నేను పక్షులు, ఎలుకలు, ఇతర చిన్న చిన్న జంతువులను వేటాడతాను. దాదాపు 10 అడుగుల ఎత్తు 'వరకు గెంతి మరీ గాల్లోని పక్షులను అమాంతం పట్టుకుంటాను. కొన్ని సార్లు జింక పిల్లల్నీ 'వేటాడతాను. నేను ఎడారి వాతావరణాన్ని కూడా తట్టుకోగలను. ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా 'ఎడారిలోనూ నా ఉనికి ఉంది. చెట్లను కూడా చక్కగా ఎక్కగలను.
'అస్స లు మాట వినం...!
నా జీవితకాలం 10 నుంచి 12 సంవత్సరాలు. అన్నీ అనుకూలిస్తే 15 సంవత్సరాల వరకు కూడా జీవించగలను. సింహాలు, చిరుతలు, హైనాలు నాకు ప్రధాన శత్రువులు. మేం అడవి జంతువులం కాబట్టి... మమ్మల్ని పెంచుకోవడం చాలా కష్టం. అస్సలు మాట వినం. ఎప్పుడూ చాలా కోపంగా 'ఉంటాం. మరో విషయం ఏంటంటే... మీ భారతదేశంలోనూ మా ఉనికి ఉంది. రణతంబోర్‌లోని టైగర్ రిజర్వ్‌లో, గుజరాత్‌లోని కచ్‌లోనూ చాలా తక్కువ సంఖ్యలో మమ్మల్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. భలే ఉన్నాయి కదూ!