నాకు చేపలంటే ఇష్టం…



'హాయ్‌ నేస్తాలూ..! ఎలా ఉన్నారు.. వేసవి నెలవులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారా? మీరు ఎప్పుడూ చూసే పక్షుల్లానే ఉన్నా... కాస్త వింతగా కనిపిస్తున్నాను కదా! అందుకే మిమ్మల్ని కలిసి... ఓసారి పరిచయం చేసుకుందామని ఇలా వచ్చాను. మరి ఆలస్యం చేయకుండా ఈ కథనం చదివేయండి. ఆ వివరాలేంటో మీకే తెలుస్తాయి...

'నన్ను బెల్టెడ్‌ కింగ్‌ఫిషర్‌ అని పిలుస్తారు. నేను అమెరికా, వెస్ట్‌ఇండీస్‌లో ఎక్కువగా కనిపిస్తాను. నా ఆకారం చిన్నగా ఉన్నా. కాస్త వింతగా ఉంటుంది. నా శరీరం తెలుపు, బూడిద రంగులో ఉంటుంది. తల మీద కిరీటం లాంటి ఆకారం ఉంటుంది. ముక్కు కూడా చాలా పొడవుగా ఉంటుంది. నాకు చేపలంటే చాలా ఇష్టం.. దాదాపు 1 సెంటీ మీటర్లు ఉన్న వాటిని కూడా ఒక్కసారిగా తినేయగలను. ఒకవేళ చేపలు దొరక్కపోతే... చిన్నచిన్న బల్లులు, కీటకాలను తిని ఆకలి తీర్చుకుంటాను.

కొమ్మల అంచునే...!

తెల్లవారుజామున, సాయంకాలం సమయంలో వేటాడటానికి ఇష్టపడతాను. నేను ఎక్కువగా కొమ్మల అంచునే వేలాడుతూ ఉంటాను. ఎందుకంటే. అలా ఉంటేనే నాకు కావాల్సిన ఆహారాన్ని తొందరగా పసిగట్టగలను. మరో విషయం ఏంటంటే... నా ముక్కు చాలా పదునుగా ఉంటుంది. ఒకసారి చేపను పట్టుకున్నానంటే. అది వెంటనే చనిపోతుంది. వేరే పక్షులు, మనుషులు, ఇతర ఏ కారణాల వల్ల అయినా నేను ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాను అనిపించినప్పుడు... దాని నుంచి తప్పించుకునేంత వరకు అరుస్తూనే ఉంటాను. మధ్యలో అస్సలు ఆపను. కొన్నిసార్లు గద్దల నుంచి తప్పించుకోవడానికి.. నీళ్లలో కూడా దాక్కుంటాను.

చాలా దూరం వెళ్తా..!

నేను చూడటానికి చిన్నగానే ఉన్నా... గంటకు 11 కిలో మీటర్ల దూరం వెళ్లగలను. నా బరువు 118 నుంచి 118 గ్రాములు ఉంటుంది. పొడవు £8 నుంచి 95 సెంటీ మీటర్లు. సాధారణంగా అయితే 8 ఏళ్లు, రక్షణ కల్పిస్తే 14 సంవత్సరాల వరకు జీవిస్తాను. ఇవి నా విశేషాలు. మీకు నచ్చే ఉంటాయి. కదూ...

Responsive Footer with Logo and Social Media