Subscribe

నా మాతృభాష ఏమిటి?

ఒకానొకప్పుడు, ఒక గొప్ప తెలివిగల వ్యక్తి విజయనగరం రాజాస్థానాన్ని సందర్శించాడు. రాజు కృష్ణదేవరాయలను ఆ తెలివైన వ్యక్తి మాటలు చాలా ఆకట్టుకున్నాయి. కొంతకాలం తర్వాత, కృష్ణదేవరాయలు అతని స్వస్థలం గురించి ఆ తెలివిగల వ్యక్తిని అడిగారు.

ఆ వ్యక్తి కొంచెం కొంటెగా ఆలోచించాడు. రాజు అడిగిన ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా, ఆ తెలివిగలవాడు ఒక సవాలు విసిరాడు. తన స్వస్థలాన్ని కనుగొనమని సవాలు చేశాడు. సభికులందరూ ఆ తెలివిగల వ్యక్తి స్వస్థలం తెలుసుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నించారు. అందరూ విఫలమైనప్పుడు, కృష్ణదేవరాయలు ఈ బాధ్యతను తెనాలి రామకృష్ణుడికి అప్పగించారు. తెనాలి రామకృష్ణు అతని స్వస్థలం గురించి మరుసటి ఉదయం వెల్లడిస్తానని చెప్పాడు . అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు .

రాత్రి సమయంలో,ఆ తెలివిగల వ్యక్తి భోజనం చేసే సమయంలో అతనికి చాలా మసాలా భోజనం అందించారు . ఆ వ్యక్తి నీటి కోసం అరవడం ప్రారంభించాడు. రాయల వారి వంటమనిషి క్షమించ౦డి మీ కోసం కొత్త భోజనాన్ని సిద్ధం చేసి, తీసుకువస్తానని చెప్పింది .

మరుసటి రోజు ఉదయం తెనాలి ఆ తెలివిగల వ్యక్తి స్వస్థలం తమిళనాడు అని వెల్లడించాడు.నన్ను మీరు క్షమించండి అని ఆ వ్యక్తిని వేడుకుంటున్నాను, నేను మాత్రము ఉద్దేశపూర్వకంగా రాజ వంటమనిషిని మీకు ఘాటైన మసాలా భోజనం వడ్డించమని అడిగాను. నువ్వు నీళ్ల కోసం

అరుస్తున్నప్పుడు అమ్మా(తమిళ౦ లో ) అని కూడా అరిచావు అంటే అమ్మ అనేది తమిళ పదం. మరియు నొప్పి ఉన్నప్పుడు, ఏ వ్యక్తి అయినా ఎల్లప్పుడూ తన తల్లిని పిలుస్తాడు మరియు అది కూడా తన మాతృభాషలో. అందుకే మీ ఊరు తమిళనాడు అని నమ్మకంగా చెప్పగలిగాను . మరోసారి తెనాలి చమత్కారంతో అందరూ ఆశ్చర్యపోయారు.

Responsive Footer with Logo and Social Media