మూర్ఖులు



రామాపురంలో నలుడు, బలుడనే ఇద్దరు స్నేహితులుండేవారు. వారిద్దరూ పారుగింటి వాళ్ళే అయినా ఒకరిని చూసి ఒకరు వివరీతంగా ఈర్ష్య పడుతుండేవారు, ఎప్పుడు ఒకరికి తెలియకుండా మరొకరికీ తెలియకుండా ఎత్తులు వేసుకుని ఒకరినొకరు ఆనందించేవారు.

ఇలా వుండగా ఆగ్రామానికి ఓ ముని వచ్చాడు. నలుడు ఆ ముని వద్దకు వెళ్ళి డబ్బు సంపాదించే మార్గాన్ని ఉపదేశించమని అడిగాడు. దానికా ముని, అరణ్యాని కెళ్ళి బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే కోరిక నెరవేరుతుందని చెప్తాడు.

విషయం విన్న నలుడు ఆనాడే అరణ్యానికి వెళ్ళిపోయాడు. నలుడ్ని గమనిస్తున్న బలుడు యోగి చెప్పిన విషయాన్ని తెలుసుకుని నలుడికంటే రెండింతల ఫలితాన్ని పొందాలన్న ఉద్దేశంతో అరణ్యానికి వెళ్ళాడు.

అయితే బలుడి విషయం అర్థమైన నలుడు, బలుడ్ని ఎలాగైనా నష్టపరచాలన్న ఉద్దేశ్యంతో ఓ ఉపాయం ఆలోచించి బ్రహ్మదేవుడికి తపన్సు చేశాడు.

తవస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు సంతోషించి నలుడితో “భక్తా... ఏం వరం కావాలనడిగాడు”.

దానికి నలుడు “స్వామి...నా కన్నులో ఒక కన్ను పోయేట్లు అనుగ్రహించండి' అన్హాడు.

నలుడి ఈ కోరికకు బ్రహ్మదేవుడు విన్తుపోతూ 'తథాస్తూ ... అంటూ అదృశ్చమయ్యడు .

కొన్హాళ్లకు బలుడికి కూడా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై "ఏం వరం కావాలో కోరుకో మన్నాడు"

"నలుడికి ఏమిచ్చారో... దానికి రెండింతలు వరం ప్రసాదించండి ప్రభూ” అంటూ ప్రాధేయపడ్డాడు బలుడు. బలుడి మాటలకు బ్రహ్మదేవుడు చిరుమందహసం చేస్తూ తథాస్తూ..." ఇంటూ అదృశ్యమయ్యాడు .

Responsive Footer with Logo and Social Media