మనోయజ్ఞం
త్రేతాయుగంలో శ్రీరామ, రావణ 'యుద్ధంనకు ముందు నముద్రానికి వంతెన నిర్మించుటకు శ్రీరాముని అనుచరులైన వానరులు ప్రతీరాతి మాద రామ అన్న పదాన్ని త్రాసి, దానిని తీసుకెళ్ళి సముద్రంలో వేయగానే అది తేలి వంతెనకు అవసరమైన విధంగా సమకూరుతుండేది.
అక్కడే నిల్చుని ఇదంతా గమనిస్తున్న శ్రీరామునికో వింతకోరిక జనించింది. "ఆహా! నా పేరు మహిమవల్లే కదా. ఈ రాళ్ళు సముద్రంలో మునిగిపోకుండా నీటిలో తేలుతున్నాయి. అలాంటప్పుడు నేను విసిరే రాతి మోద నా పేరెందుకు రాసుకోవాలి? ఎటూ తేలుతుంది. కదా”ని తలచి, ఓ రాయి తీసుకుని చుట్టుప్రక్కలంతా కలియజూశాడు. దగ్గర్లో ఎవరైనా తనపనిని గమనిస్తున్నారేమోనని!
ఎవరూ తనవైపు చూడటం లేదని గుర్తించిన శ్రీరాముడు చేతిలో వున్న రాతిని తత్వారంగా నీటిలోకి విసిరాడు ఢభేల్‌మని శబ్దం రావడంతో దూరం నుండి వస్తున్న హనుమంతుడు కపీమని అక్కడవాలి. శ్రీరాముని చర్మను చూసి “ప్రభూ! తమరి అనుచరుల మైన మేము ఇందరముండగా తమరు జిలగర్భంలోకి రాళ్ళు వేయటమా!” అని దీనంగా పలికాడు. శీరాముడు అందుకు జవాబివ్వక తాను విసిరిన రాయివైవు తదేకంగా చూస్తున్నాడు. హత్షంతుడు కూడా తన ప్రభువు విసిరిన రాయివైపు చూడడం మొదలపెట్టాడు. కొన్ని గంటలు గడిచిపోయాయి కానీ రాముడు విసిరిన రాయి తేలలేదు. అంటే అది నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఈ వింత సంఘటనకు ఆశ్చర్యచకితుడైన హత్మంతుడు "ప్రభూ! " ఇదేంటి...అవతారపురుషులైన తమరు వేసిన రాయి నీటిలో మునిగిపోవడమా?” అని ప్రశ్నించాడు.
ఆ చర్యకు సిగ్గు పడిన శ్రీరాముడు భక్తునివైపు చూసి ఆంజనేయా! ఇందులో ఆశ్చర్య వడాల్సిందేమా లేదు. నేను నా పేరు, మహిమను చూసి గర్వపడి వింత సంకల్పం చేకను మోరంతా భక్తి అనే మనోయజ్ఞంతో చేసే కార్యాలు సార్థకమైనవి. ఈ యుగధర్మం కూడా ఇదే. నేను చేసిన పని వికర్షతో కూడుకున్నది. సుకర్మతో భక్తితో చేసే పనులు నీటిలో తేలిన రాక్టలాగ పలువురికి కన్సిస్తాయి. అంతేకాక అవి ఒక ప్రయోజనాన్ని సాధిస్తాయి. కానీ అహం అనే వింత కోరికతో చేసే పనులు నీటిలో మునిగిపోయే రాజ్టలాగ పదిమంది దృష్టిలో పడకపోవడమేకాక వాటివల్ల కలిగే ప్రయోజనం కూడా ఏమి వుండదు” అని జవాబిచ్చాడు.
"మహాప్రభూ! ఎట్టివారికైనా వింతకోరికలు వుండకూడదు. యుగధర్మం పాటించాలనే ఈ దివ్యమైన తమ సందేశం చిరస్మరజీయమైనది. లోకానికి ఆదర్శవంతమైనది” అని భక్తి పూర్వకంగా ప్రణమిల్లుతూ స్వామి పాదాల మాద వాలిపోయాడు హన్మంతుడు.