మొదటికే పూసం



నలుగురు వర్తకులు కలసి సమిష్టిగా దూది వ్యాపారాన్ని ప్రారంభించేరు. దూది బేళ్చను ఒక గదిలోవేసి తాళం వేసేవారు వాళ్ళు, కాని, ఆ గదిలోని ఎలుకలు వాటిని పాడుచేస్తూండేవి, అందుచేత వాటిని అంతం చెయ్యాలని ఒక పిల్లిని పెంచడం మొదలు పెట్టేరు వాళ్ళు

ఆ పిల్లి ధర్మమా అంటూ ఎలుకల బాధ తగ్గిపోయింది. దానితో ఆ వర్తకులకు లాభం రావడం మొదలు పెట్టింది. ఆ లాభానికి కారణం పిల్లేనని గ్రహించుకుని ఆ పిల్లి నాదంటే నాదని తగవులాడటం మొదలు పెట్టేరు ఆ నలుగురు వ్యక్తులు.

అలాగ కొంతకాలం తగవులాడిన పిమ్మట వారు ఒక నిర్ణయానికి వచ్చేరు. ఆ పిల్లికి నాలుగు కాళ్ళూ తమ విభేదాన్ని తొలగించడానికే ఇచ్చేడు భగవంతుడనుకొని, ఒక్కొక్క కాలిని ఎంచుకొని పంచుకున్వాగు. ఎవరీ కాలికి వారు. పంచుకున్నారు. ఎవరి కాలికి వారు వారికి తోచిన అలంకరణ సంరక్షణా
చెయ్యడం మొదలు పెట్టారు. కాళ్ళ అలంకారంతో పిల్లి దిట్టంగా పెరగటం మొదలు పెట్టింది.

ఒక వర్తకుడు తన వంతుకు వచ్చిన పిల్లి కాలికి బంగారవు మువ్వలను కట్టాడు. కొత్త బరువువల్ల పిల్లికాలు బలిసి పుండయింది. అందుచేత అతడు ఆ మువ్వలను తీసివేసి ఆ కాలికి నూనె గుడ్డతో కట్టుకట్టాడు.

వూర్వంలాగే దాన్ని గదిలో వదిలిపెట్టి, చీకటి పడగానే ఆ గదిలో ధీపం పెట్టి తాళం వేనుకుని వెళ్ళిపోయేరు వర్తకులు.

ఆ రాత్రి ఒక ఎలుక ఆ గదిలోకి వచ్చింది. వెంటనే దాన్ని పట్టుకోవడా నికి ఆ పిల్లి పరుగెత్తబోయింది. కాని కాలు కుంటి అవడంచేత లక్ష్యం తప్పి, దీపం మీద అది పడింది. దాంతో ఆ కాలికున్న నూనె గుడ్డకు దీపం అంటు కుంది. పిల్లికి గాభరా ఎత్తింది: దాంతో అది గది యంతట చిందులు త్రోకటం మొదలు పెట్టింది. ఆ చింధులతో కాలికున్న నిప్ప దూదిబే ళ్ళకు అంటుకొని అవన్నీ తగులబడి పోయాయి.

రెండవనాడు ఆ వర్తకులంతా ఆ ఘోరాన్ని చూసేరు. దానికి కారణం వారిలో ఒకరు పిల్లికాలికి నూనెగుడ్ల కట్టి కుంటించడమేనని నిర్ధారణ చేసుకుని, మిగ్జిలిన ముగ్గురూ ఆ నాల్లవవాడిని తమకు వచ్చిన నష్టానికి పరిహారం యివ్వమని కోరెరు. ఇది వాడికి చాలా కష్టమనిపించింది. తన బాపతు సరుకుపోయినందుకే ఏడవాలో, ' లేక మిగిలిన ముగ్గురకూ వచ్చిన నష్టాన్ని ఇచ్చుకోవడానికి ఏడవాలో తెలిసిందికాదు. వారికి ఏమైనా గాని వాడు అంత మొత్తాన్ని ఇచ్చుకోలేక కొంత యిస్తానని ' బ్రతిమాలేడు. కాని వాళ్ళు తమ మొత్తాన్ని అణాపైనలతో ఇచ్చుకోవలసిందేనని ఒత్తిడి పెట్టారు. వాడు ఇవ్వలేడనడంతో వాళ్ళు పంచాయితీ పెద్దలకు ఫిర్యాదు చేసేరు. పెద్దలు రెండు పక్షాలవారి వాదనలూ శ్రద్ధగా విని అనలు విషయం జాగ్రత్తగా గ్రహించేరు. తరువాత వారీ క్రింది విధంగా తీర్చునిచ్చేరు.

నాలుగవ వర్తకుడికి చెందిన పిల్లి కాలికి దెబ్బ తగలడం చేత అది కుంటిది అయిపోయింది. అందువల్ల మిగిలిన మూడుకాళ్ళే పరుగుత్తే స్థితిలో వున్నవి. ఆ కాళ్ళ పరుగువల్లనే నాల్గవ కాలికి కట్టివున్న నూనె గుడ్డకు నిప్ప అంటుకుంది. తరువాత ఆ కాళ్ళే నాల్లవకాలికి అంటుకొన్న నిప్పును దూది బేళ్ళకు అంటించేయి. అదే దూది గిడ్డంగి తగలబడడానికి కారణం. మిగిలిన ముగ్గురు వర్తకులూ నాలుగవ వర్తకునికి చెందిన వాటాకు పిల్లి వలన నంభవించిన నష్టానికి నరిపోరం ఇచ్చుకోవలసిందే అని తీర్చునిచ్చారు.

అది విని ముగ్గురూ "అయ్యో! వాడిస్తానన్న కొద్ది మొత్తానికే అంగీకరిస్తే ఈ చిక్కే వుండేది కాదు గదా! ఇంతకు తగవులాడి తీర్పుకు వెళితే మొదటికే మోసం వచ్చింది” అని మధనపడి, నాల్లవవాడికి నష్ట పరిహారం ఇచ్చుకున్నారు.

Responsive Footer with Logo and Social Media