మంత్రపుష్పం
దుర్వాస మహాముని ఆశ్రమంలో నాగవర్ధనుడు అనే శివ్యుడుండేవాడు. నాగవర్ధనుడు కపటి. తన గురువు వద్ద ఎలాగైనా విద్యలన్నీ తక్కువ కాలంలో నేర్చుకుని, వాటి ఫలితాలను అనుభవించాలని యోచించేవాడు.
ఒకసారి దుర్వాస మహాముని ఏకాంతంలో ఉండగా నాగవర్థనుడు ముని కాళ్ళు వత్తుతూ “స్వామో...మీకు చాలాకాలంనుంచి భక్తి శ్రద్ధలతో సేవలు చేస్తున్నాను" అన్నాడు.
దుర్వాసుడు అతడి మాటలు విని నవ్వి ఊరుకున్నాడు.
“స్వామీ ...మా దయవల్ల అన్ని విద్యలు నేర్చుకున్నాను. కాని ఒక్క మంత్రపుష్పం విద్యనే నేర్వకోలేకపోయాను. కనుక దానిని నేర్చించి పుణ్యం కట్టుకోండి" అంటూ ప్రాధేయపడ్డాడు. నాగవర్ధనుడి కపట స్వభావం తెలియని దుర్వాసుడు మంత్ర వుష్తంతో శిల అయిపోయే మంత్రాన్ని చెప్పడమే తరువాయి దానిని వెంటనే 'నాగవర్ధనుడు, మంత్రాన్ని దుర్వాస మహాముని మీదే ప్రయోగించాడు. అయితే ఈ సంఘటనకు విస్తుపోయిన దుర్వాసుడు, నాగవర్థనుడి ప్రవర్తనకు అగ్రహిస్తూ.."మూర్చుడా... జ్ఞానాన్నిచ్చే గురువునే మోసం చేయాలని చూస్తావా? నీకు మంత్రాన్ని చెప్పాను గాని, ఆ మంత్రం ఫలించడానికి పఠించాల్సిన
మూలమంత్రాన్ని చెప్పలేదు. నీ కుటిల బుద్ధి ఇప్పడర్థమైంది. నీ పాపానికి పరిహారంగా శిలవై పో ! అంటూ శపించి, అక్కడినుంచి వెళ్ళిపోయాడు దుర్వాసుడు.