మంగళం కృష్ణా ! చాకలి కృష్ణా !



ఒక బ్రాహ్మణుడికి ఒక మంగలి, చాకలి పనులు చేసి పెట్టేవారు. మంగలి వారానికొకసారి బ్రాహ్మణునికి క్షౌరపూజ చేసేవాడు. చాకలి బ్రాహ్మణుని బట్టలు ఉతికేవాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు బ్రాహ్మణునికి సేవలు చేశారు. సమాజంలో బ్రాహ్మణునికి మంచి గౌరవం లభించడం, కానీ వారికి అంతగా గౌరవం లభించకపోవడం గమనించారు.

ఒకరోజు ఇద్దరూ కలుసుకున్నారు. “మనమిలా ఎంతకాలం పని చేసినా మనకు మంచి గుర్తింపు రాదు. అందుకని మనం కూడా బ్రాహ్మణులుగా మారిపోదాం” అనుకున్నారు. అనుకున్నదే తడవుగా నున్నగా గుండు గీయించుకున్నారు. విబూదితో బొట్లు పెట్టుకున్నారు. మంచి బట్టలు ధరించారు. మరో ఊరికి పయనమయ్యారు.

వాళ్ళు వెళ్తుంటే దారిలో కొందరు ఎదురయ్యారు. "అయ్యా! ఈరోజు మా ఇంట్లో శ్రీకృష్ణుని పూజా కార్యక్రమం ఉంది. మీరు బ్రాహ్మణోత్తములు కదా! మా ఇంటికి దయచేసి మమ్మల్ని ధన్యుల్ని చేయండి" అని వేడుకున్నారు. చాకలి, మంగలి లోలోపల సంతోషపడ్డారు, మంచి అవకాశం దొరికిందని సంబరపడ్డారు.

ఇద్దరూ పిలిచిన వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. పూజ గదిలో ఇద్దర్నీ పీటల మీద కూర్చోబెట్టారు. ఆ ఇంటివారు పూజ మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ మౌనంగా చూస్తుండిపోయారు. చివరికి పూజ ముగిసింది. ఆడవాళ్ళు దేవునికి హారతి పడుతూ “మంగళం కృష్ణా.. మంగళం కృష్ణా” అని చెప్పసాగారు. చాలాసేపటి నుంచి ఇదిచూసిన మంగలి చటుక్కున లేచి “ఏమిటండీ ఇది. అప్పట్నుంచి మంగళం కృష్ణా, మంగళం కృష్ణా అంటున్నారేగాని, చాకలి కృష్ణా అనరేం?” అన్నాడు కోపంగా. దానికి ఆ ఇంటివాళ్ళు “అలా అనడం మేమెప్పుడూ వినలేదండీ, అదేమిటి?” అన్నారు ఆశ్చర్యపోతూ.

మంగలి “నేను మంగలి కృష్ణయ్యను, వీడు చాకలి కృష్ణయ్య. మీరేమో నన్నొక్కడినే గుర్తుపట్టినట్లున్నారు” అన్నాడు.

ఇంటివాళ్ళకు వాళ్ళు బ్రాహ్మణులు కావడం అర్థమైపోవడంతో, ఇద్దరికీ బాగా దేహశుద్ది చేసి పంపించారు.

Responsive Footer with Logo and Social Media