Subscribe

లండన్ దా , అమెరికాదా?



శీను ఒక ధనవంతుడి ఇంట్లో పనివాడిగా జేరాడు. ఆ ధనవంతుడికి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటు. అందరికి అతను యెంతో ధనవంతుడిని,

ప్రపంచమంతా చూసాడని తెలియాలని బాగా తపన పడేవాడు.

ఒక రోజు అతని ఇంట్లో ఒక విందు జరిగింది. వచ్చిన అతిథులకు గొప్పలు చెప్పుకుంటూ శీను ని పిలిచి, “శీను, వెళ్లి దుర్భిణి పట్టుకురా!” అన్నాడు. దుర్భిణి అంటే బైనాక్యులర్స్. శీను లోపలి వెళ్లి అడిగినట్లే దుర్భిణి తెచ్చి ఇచ్చాడు.

వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక, ఆ ధనవంతుడు శీనూను పిలిచి తిట్టాడు. “దుర్భిణి తెమ్మంటే తెచ్చేయడం కాదు! యే దుర్భిణి, లండన్ దా అమెరికా దా అని అడగాలి. అప్పుడే కదా నేనెంత ధనవంతుడివో అందరికి తెలిసేది?” అన్నాడు.

శీను తలవంచుకుని, “ఇకపైన అలాగే చేస్తాను సారూ” అన్నాడు.

కొన్ని రోజుల తరవాత ధనవంతుడి స్నేహితుడు ఒకడు ఇంటికి వచ్చాడు. కూర్చుని మాట్లాడుతుంటే హాల్ లో వున్న పులిచర్మం చూసి అది ఎక్కడిదో అడిగాడు.

ధనవంతుడికి అలవాటే కదా, బడాయిలు చెప్పుకుంటూ, “ఇది మా నాన్న గారు వేట కి వెళ్లి చంపిన పులి!” అంటూ, శీనుని పిలిచి, “మా నాన్నగారి ఫోటో వుండాలి తీసుకుని రా!” అన్నాడు.

వెంటనే అమాయకపు శీను, “యే నాన్నగారు సారూ, లండన్ నాన్నగారా, అమెరికా నాన్నగారా?” అని అడిగాడు!

Responsive Footer with Logo and Social Media