లఖచ్చి+లర్రి
రాజమండ్రిలోని ఉమెన్స్ కాలేజీ క్లాసురూంలోకి మొదటిసారి క్లాసు తీసుకోవటానికి అడుగుపెట్టింది లెక్టరర్ సీతాలక్ష్మి రాగానే క్లాసులోని విద్యార్థినులతో “నాకు విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.విఆర్. కాలేజి నుండి ఇక్కడకు బదిలీ అయ్యింది. విజయవాడలోనూ ఇల్లునుండి బస్టాండుకు నాలుగు కిలోమీటర్లు. నేను ఆటోలో మా ఇంటినుండి విజయవాడ బస్టాప్‌కు వచ్చాను. విజయవాడనుండి రాజమండ్రికి రెండువందల కిలోమీటర్లు రాజమండ్రిలో బస్స్టాప్ నుండి మా కాలేజికి ఆటోలో వచ్చాను. గేటు వద్దనుండి నలభై గజాలు నడిచి, రెండు మెట్లు ఎక్కి క్లాసురూమ్‌లోకి వచ్చాను. ఇప్పడు నా వయస్సెంతో మీలో ఎవరైనా చెప్పగలరా?” అన్నది సీతాలక్ష్మి వింతగా.
క్లాసులో చాలాసేపు నిశ్శబ్దం అలుముకుంది. చివరికి విజయ అనే ఒక స్టూడెంట్ లేచి 'మీ వయస్సు ముప్పైసంవత్సరాలు అన్నది.
“శభాష్! ఇంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావ్?ా ఆశ్చర్యంగా అడిగింది సీతాలక్ష్మి
“ఏమి లేదండి! మా తమ్ముడాకడున్నాడు. వాడి వయసు 17 సంవత్సరాలు. వాడికి పావువెర్రి..సగం పిచ్చి అందువల్ల దానికి సగం కలిపి మీ వయసు ౩4 అని అంచనా వేసి చెప్పాను” అంది విజయ నవమ్రతగా. ఆ మాటకు సీతాలక్ష్మి నివ్వెరపోయింది.