కోటలో మొదటి ఛాలెంజ్



రాయల సభ కొలువుదీరి ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన కాళీచరణ్ అనే ఇంద్రజాలికుడు తన విద్యలన్నీ ప్రదర్శిస్తుంటాడు. అందరూ అతన్ని కీర్తిస్తారు. 'నాతో పోటీ పడేవారు మీ రాజ్యం లో ఉన్నారా?' అని సవాల్ విసురుతాడు. ఎవరూ ముందుకు రాకపోవడంతో రామకృష్ణుడు 'మహారాజా అనుమతి ఇస్తే, నేను ఈ సవాల్ను ఎదుర్కొంటాను' అని ముందుకు వస్తాడు.

రాజు అనుమతితో కారం తెప్పించి, 'ఈ కారం కళ్ల మీదుగా వేసుకొని భరించగలవా?' అంటాడు. తన వల్ల కాదంటాడు. ఇంద్రజాలికుడు. రామకృష్ణుడు రెండు గుప్పిళ్ల నిండుగా కారం తీసుకొని, కళ్లు మూసుకొని ఆ కళ్ల మీదుగా పోసుకుంటాడు. ఇంద్రజాలికుడు తన ఓటమిని ఒప్పుకొని వెనుదిరిగిపోతాడు.

రాజు రామకృష్ణుడి తెలివికి మెచ్చుకొని బహుమానం కోరుకోమంటే 'వంద కొరడా దెబ్బలను ఇప్పించండి ప్రభూ' అని వేడుకుంటాడు. ఇంత విచిత్రమైన కోరిక ఎవరూ కోరరు. అయినా సరే కానీ, అంటూ కొరడా దెబ్బలను అమలు చేయమంటాడు. అప్పుడు రామకృష్ణుడు 'ప్రభూ తమకో విజ్ఞప్తి. ముగ్గురు ద్వారపాలకులకు మీరు ఇచ్చే బహుమానం ఇస్తాను అనే మాట మీద లోపలికి వచ్చాను. వాళ్లకు కూడా ఈ ఇనామ్లో భాగం ఉంది మహారాజా' అని కోరుతాడు.

ఆ ద్వారపాలకులను పిలిపించమంటాడు రాజు. లంచగొండులుగా మారిన ఆ ద్వారపాలకులకు అలా శిక్షపడేలా చేస్తాడు రామకృష్ణుడు. అంతేకాదు మహారాజు తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునేలా ఆలోచన చేస్తాడు.

రామకృష్ణుడి చాతుర్యాన్ని మెచ్చుకున్న శ్రీకృష్ణదేవరాయలు తన సాహిత్యసభలో కవిగా కొనసాగమని చేతి ఉంగరాన్ని బహుకరిస్తాడు. అలా రామకృష్ణుడు భువన విజయంలో అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చేరిపోయాడు.

వికటకవిగా పేరొందిన రామకృష్ణుడు 16వ శతాబ్దికి చెందినవాడు. ఇతని జీవిత సంఘటనలన్నీ చమత్కారపు కథనాలుగానే ఆకట్టుకుంటాయి.

అక్బర్-బీర్బల్ కథల మాదిరిగానే రాయలు-రామకృష్ణుడు కథలుగా, తెనాలిరామలింగడి కథలుగా చిన్నా పెద్దను ఆకట్టుకున్నాయి.

ఈ కథలను దర్శించిన చిన్నా పెద్ద పెదవులపై నవ్వులను పూశాయి. 'శభాష్ తెనాలి రామ' అని రామకృష్ణ తెలివికి జనం చేతులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశాయి.

Responsive Footer with Logo and Social Media