కీరికల చిట్టా



ధనవంతుడు, పిసినారి అయిన శీనయ్య రోజూలాగే దేవుడికి పూజ చేస్తూ, తన కోర్కెల చిట్టా దేవుడికి విన్నవించుకున్నాడు. ఈలోగా బయటనుండి రోజూ కాలువ కడిగే వెంకయ్య కేక వినబడింది. ఎప్పటినుండో ఓ పాత చొక్కావుంటే ఇమ్మని శీనయ్యను అడుగుతున్నాడు వాడు. ప్రతిసారీ ఇస్తాలే అంటూ వాయిదా వేస్తున్నాడు శీనయ్య ఇంక వాడి పోరు పడలేక

ఏదో ఒక పాతచొక్కా ఇచ్చి వదిలించుకోవాలనుకున్నాడు. తను ఇంట్లో లేని సమయంలోనైతే భార్య మంచి చొక్కాని ఇచ్చేస్తుందన్న భయంతో పూజి మధ్యలో లేచి పాత బట్టలున్న ట్రంక్‌ పెట్టి తీశాడు. వాటిల్లో ఏది ఇవ్వాలో అన్నీ తిరగామరగా వేసి చూస్తూన్నాడు. వున్నవాటిలో బాగా చిరిగిపోయిన చాక్కా తీసి కాలువ కడిగే వాడికి ఇది చాల్లే అనుకుని ఆ చొక్కా తీసి వెంకయ్యకి ఇచ్చాడు. దానికి వెంకయ్య నంతృప్తి పడి వెళ్ళిపోయాడు. లోపలికొచ్చిన శీనయ్య తిరిగి దేవుని ముందు కూర్చుని కోర్కెల చిట్టా విప్పాడు. |

“స్వామి! ఇన్ని రోజులుగా నిన్ను పూజిస్తున్నాను. కానీ నా కోర్కెలు తీరటానికి ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి స్వామి! నీ భక్తుడినైన నన్ను కరుణించటానికి ఇంకా ఆలోచిస్తున్నావా తండ్రీ!” అని వేడుకున్నాడు. వెంటనే శీనయ్యముందు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.

దేవుడ్ని చూసిన శీనయ్య ముఖంలో ఎంతో సంతోషం. “నన్ను కరుణించావా తండ్రీ! నా కోర్కెలు తీర్చటానికి వచ్చావా?” అని ఉద్వేగంతో దేవుని ముందు మోకరిల్లాడు. దేవుడు చిన్నగా నవ్వాడు శీనయ్యకు ఏమి అర్థం కాలేదు.

"శీనయ్యా! నువ్వు రోజు నన్ను భక్తిగా సేవిస్తున్నావు. కాదనటంలేదు. అలాగే రోజూ నీ కోర్కెలు అన్నీ విశ్వవించుకుంటున్నావు. నీ కోర్మెలన్నీ తీర్చటం లేదని నన్ను ఆడిపోసుకుంటున్నావు. ఆ వెంకయ్యకి నీ పాతచొక్కా ఇవ్వటానికి అన్ని రోజులు ఆలోచించి, రేపుమాపు అని వాయిదా వేసి, చివరికి జీర్ణావస్థలో వున్న చింకిచొక్కా ఇచ్చావే నీ కోర్కెలన్నీ తీర్చటానికి నేను ఇంకెంత ఆలోచించాలో చెప్పూ అన్నాడు. కనువిప్ప కలిగిన శీనయ్య ఇంకెవ్వడూ దేవుని ముందు కోర్కెలచిట్టా విష్ణకుండా వున్నంతలో దానధర్మాలు చేయడం మొదలు పెట్టాడు.

Responsive Footer with Logo and Social Media