కిలకిల... నా పేరు అకికికి!



హాయ్‌ ఫ్రెండ్స్‌... బాగున్నారా! నేనో అరుదైన బుజ్జి పక్షిని. నా వివరాలు మీకు చెప్పిపోదామని ఇదిగో ఇలా వచ్చాను. మరి నా విశేషాలు తెలుసుకుంటారా? అయితే ఇంకెందుకాలస్యం.. ఈ కథనం చదివేయండి.

నాపేరు అకికికి. నేను హవాయి ద్వీపానికి చెందిన జీవిని. ప్రస్తుతం నేను అంతరించిపోతున్న పక్షుల జాబితాలో ఉన్నాను. 2018 నాటికి మా సంఖ్య 454 మాత్రమే. 201 నాటికి అది 45కు పడిపోయింది. £0£8లో మాలో 5 పక్షులు మిగిలాయి.

బుడ్జ పక్షిని...

నేను అతి చిన్న పక్షిని. కేవలం 18 సెంటీమీటర్ల పొడవు ఉంటాను. నా బరువేమో 12 నుంచి 17 గ్రాముల వరకు ఉంటుంది. నా తోకేమో పొట్టిగా, బలంగా కనిపిస్తుంది. మేం ఏటా మార్చి నుంచి జూన్‌ వరకు గూళ్లు కట్టుకుంటాం. మాలో ఆడ, మగ రెండూ ఈ పనిలో పాలు పంచుకుంటాయి. పిల్లల పోషణలో కూడా రెండూ భాగమవుతాయి. మేం చిన్న చిన్న కీటకాలు, పండ్లు, గింజలను ఆహారంగా తీసుకుంటాం.

ముప్పు ఎందుకంటే...

మేం అంతరించి పోయే స్థితిలో ఉండటానికి ప్రధాన కారణం... అటవీ నిర్మూలన, వాతావరణ 'మార్పులు. మరో విషయం ఏంటంటే. మాకు వ్యాధినిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. మేం తేలిగ్గా మలేరియా బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాం. ఎలుకల్లాంటి ఆక్రమణ జాతి జీవుల వల్ల కూడా ముప్పును ఎదుర్కొంటున్నాం. అలాగే ఆహారం, గూళ్ల కోసం ఇతర పక్షుల నుంచి ఎదురయ్యే గట్టి పోటీ కూడా మా ఉనికిని ప్రశ్నార్ధకంగా మారుస్తోంది.

Responsive Footer with Logo and Social Media