కాశీరామేశ్వర మజిలీ కథలు
సదానంద యోగి
మన భారతదేశం మొదటినుండి ఉ_త్తర భారతమని దక్షిణ భారతమని చెప్పబడుతూంది. రెండు దేశాలలోనూ పుణ్య నదులు, పుణ్య త్రేత్రములు కూడ లైక్కకు మించి యున్నవి. ఉత్తర భారతదేశంలో కాశీవిశాలాక్షి సమేతవిశ్వ నాధ స్వామి వున్నాడు. దక్షిణ భారతదేశంలో (్రీరామునిచే (పతిష్ట చేయబడిన రామ లింగేళ్వరస్వామి వున్నాడు. కాశీరామేళ్వరుల "పేరులు వినని వారుండరు.
పూర్వకాలంలో మునులు మహాభక్తులు వారి వారి పరివారాలను వెంట బెట్టుకొని కాశీ నుండి రామేశ్వరాసకి - రామేశ్వరం నుండి కాశీకి ప్రయాణాలు చేసేవారు. వానిని కాశీ రామేశ్వర య్య్మాతలంటారు. ఒకదాని కొకటి యెంతో దూరం కనుక దారిలో యాత్రికులు మజిలీచేసేవారు. వానిని గురించి మనమిప్పుడు కాశీ రామేశ్వర మజిలీల కథలని చెప్పుకుంటున్నాం.
చాలాకాలం కితంగా కాశీనగరంలో సదానందయోగి యనే మునీశ్వరు డున్నాడు. ఆయన దేశమంతా తిరిగి మెక్క డెక్కడున్న దేవతల తృతార్ _ 'వారి పుట్టుపూర్వో త్రరాల నన్నింటిని ఆకళింపు జెసుకొనిన మహాదిట్ట, వానికి సంసార బంధాలు కాని, తాష్మత్రయాలకాని యేమీలేవు. ఇంకొకరాయనమీద ఉమ్మి వేసినా తుడుచుకొని తొలగిపోతాడేకాని వారివంక సరిగా చూడనైనా చూడడు. ఎపుడు చూచినా వానిలో యేదో ఆనందం నిండుతనాలే కనిపిస్తాయి. కాని చీకు చింతలుండవు. అందుకే ఆయన నందరు సదానందయోగి అని అంటూంటారు.
సదానందయోగికి శిష్యులు గూడ వున్నారు. వారందిరిలోను చిదానంద యోగి మొదటివాడు. ఆ గురుశిష్యుల న్యాయం చెప్పుకోతగ్గది. ఒకానొక సమ యంలో సదానందయోగి తన |ప్రియశిష్యుని పిలిచి “నాయనాః చిదానందా! నాకు కాశీ రామేశ్వర య్యాత చేయు తలంపు కలిగింది. నీవు _ సీ సహాధ్యాయులు నా వెంట బయలుదేరండి. మీకు నేను కాశీ నుండి రామేశ్వరం వరకు దారిలోనున్న 1పధాన నగరములు, 'క్షేత్రములు, నదులు, తీర్థములు, వనములు మొదలయిన వానిని చూపుతూ, వాని వాని పురాణ వైభవ మహాత్మ్యములను గూడ చేతనయి నంత దనుక చెప్పగల” నన్నాడు.
ఆ మాటలకు మహాభాగ్యమని నమస్కరించిన చిదానందుడు తోటి శిష్యులందరను పిలిచి కూర్చుండ బెట్టాడు. అంతట గురువులవారు “నాయనలార! మనము యాత్ర "సేయ .బయలుదేరుటకు మీరీ కాశీ సగరాన్ని గురించి ముందు కొంతయినా తెలుసుకొనడం మంచిది. ఈ వారణాసి యందలి (పతి క్షేత్రము_ ప్రతి తీర్థము... ప్రతిదై వములను గురించి పరిపూర్ణముగా చెప్పవలయునని [బహ్మ దేవునికయినా వశముకానిదై యుండగ నేనెంతవాడను? అటులని మానవుడు నిరు స్సహ పడరాదు కనుక నేను పెద్దల వలన వినిన వానిని సమ్ముళ్ళముగ చెప్పెదనని కథాగమనం పారంభించారు.
కాశీనగర విశేషణము
నాయనలార! కాశీనగరానికి మరొక'పేరు శివ రాజధాని. ఇది భగీరథీ నదికి పడమరగా నది ననుసరించి వృక్రము గలిగి యైదు కోనుల విస్తీర్ణమైన మహా పట్టణము. దక్షిణము నుండి ఉత్తరముగా (పవహించుచున్న ఈ నదీతిరముననుస రించి నగరము పొడవున అరువది నాలుగు తీర్థములున్నవి.
పూర్వం దక్ష ప్రజాపతి తన పెద్ద కుమార్తె అయిన సతీదేవిని శివుని కిచ్చి వివాహం చేశాడు. కాని ఒకానొక సమయంలో అల్లుడుమీద నగ్రహించిన దక్షుడు కుమార్తెను గూడా పిలవకుండానే మహాయజ్ఞం చేయ ప్రారంభించాడు, పిలువకపోయినా పుట్టినింటిమీద మమకారం చొప్పున పెనిమిటి నొప్పించుకొని చూడవచ్చిన సతీదేవి పరాభవం పోందినందున యోగాగ్నిలో పడి చనిపోయింది. శివుని భార్యమీద మోహం పోనందున ఆమె ప్రేతాన్ని తన భుజంమీదనే వేసి కొని దేశ దేశాలు తిరిగాడు, అది చూసిన విష్ణుమూర్తి యోగమాయచే సతీదేవి మృత దేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అప్పుడాదేవీ ముఖం ఈ కాశీ పురంలో బడినందున దీనికి “గౌరీముఖ” మనే "పేరు వచ్చింది. ఇప్పుడిది ముఖ పీఠమయింది. ఇచటి దేవత'పేరు కాశీ విశాలాక్షి, కంచి కామాక్షి! మధుర మీనాక్షీ మువ్వురు (పఖ్యాతిగల దేవతలు.
అటులనే కేశీక దేవి వెలసిన మణిపూర్ నందు వెంట్రూకలు పడుటచే నది కేశ పీఠమయింది. జ్వాలాముఖీ దేవత వెలసిన పంజాబునందు. నాలుక పడు టచే నది జిహ్వాపీఠమయింది. నయనా దేవత వెలసిన పంజాబున కన్ను పడిన చోట నయన పీఠమయింది, మీనాక్షీ 'దేవతవలె వెలసిన మధుకయందున్న "కన్ను పడినచోట నయన పీఠమయింది, విమలాదేవి వెలసినజగన్నాధముయందు కుచము పడినచోట _స్తనపీఠమయింది. హీంగుళాదేవి వెలసిన సగర నై బుతి భాగమందు పొట్ట పటిసచోట నుదరపీఠమయింది, యోగదేవి వెలసిన ద్వారకయందు యోగ పీఠమయింది. సుందరీదేవి వెలసిన కలకత్త ప్రాంతీయ సముద్రతీరమునగల అధి నాధక్షేత్రమందు భుజము పడినచోట స్కంధపీఠమయింది. తారాదేవి వెలసిన ఆసామీ ప్రాంతీయ గుహోట్ షహరు నందు బొడ్డు పడినచోట నాభి పీఠమయింది. యోగనీద్రాదేవి వెలసిన కామరూప దేశమందు ఒకచోట యోనిపీఠం మయింది. గుహ్యకాళి వెలసిన నేపాళమునందు నొకచోట గుహ్యపీఠమయింది. టేకేశ్వరీదేవి వెలసిన అసామీ ముల్కుగోలపాడునందు నొకచోట అంగుష్ట పీఠమయింది. కాళీకా 'దేవి వెలసిన కలక త్తాయందే యింకొకచోట గుల్బ పీఠమయింది. ఇంకను యిట్టి పీఠములు కొన్ని అక్కడక్కడ (ప్రఖ్యాతిగాంచి యున్నవి.
కామాచదేవి వేంచేసియున్న యోనిపీఠం నవయోనిముద్రల యోగస్థల మని చెప్పబడుచున్నది. ప్రతి సంవత్సరం నిచట ఆషాడ బహుళ త్రయోద। "మొదలుగు నాలుగు దినములు అనగా (త్రయోదశి, చతుర్ధశి, అమావాశ్య , శ్రావణ శుద్ధ పాడ్యమీలు బుతుకాలమనుచు. స్త్రీలు మాత్రమే " దేవి నారాధించుచుండుట యందు సాంప్రదాయంబుగ జరుగుచున్నది. పురుషులా సమయమున 'నచటకు పోరాదు. పోయినవారికి కీడు తప్పదు. ఈ మహాకాశీ క్షేత్రమునకు రాజు విశ్వ నాధుడు. మంత్రి బిందు మాధవస్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు, గణనాయకు 'లేబదార్గురు. ఇచట లేని దేవతలు. తీర్థములు. మహిమలు మరి యెందును లేవని పురాణములు చాటి చెప్పుచున్నవి.
యాత్రావిధానము
నాయనలారా! ఈ క్షేత్రమున యాత్రికులు నిత్యయ్మాత తిధివార యోగ్య యాత్రి కులు వార్షిక యాత్రలు పంగకోశ యాత్రలు గాక ఏకరాత్ర ప్రత దీక్ష, ద్విరాత్ర వ్రత దీక్ష త్రిరాత్ర వ్రతదీక్ష లనేకంబులుగ , చేయుచుందురు, సూర్యోదయమునకు ముందుగానే మేల్కాంచి కాలకృత్యముల దీర్చుకొనిగంగలో స్నానాదులు ముగించుకొని అన్నపూర్ణా విశ్వేశ్వరులను దర్శించుట ప్రధమ కర్తవ్యము.
అనంతరమున ఒక్కక్రోసు దూరం నందున్న బిందుమాధవస్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం దగ్గరున్న ఢుంఢిం రాజ గణపతి నారాధించి ఉత్తర ముగ ఒకటిన్నర క్రోసూ దూరం నందున్న దండపాణిస్వామిని పూజించి కాల ఖైరవుని దర్శించి పడమర క్రోసుదూరం నందున్న _ కాశీమూర్తిని సేవించి వాయువ్యముగా కొంచెందూరం నందున్న గుహనుజూచి గంగాపుష్కరిణిని కొల్చి విశ్వేశ్వర మందిరమందలి అన్నపూర్ణాదేవిని పూజించి మణికర్ణికకు పోయి మణి కర్ణిమూ ర్తి నారాధించి అచటనే స్నానముచేసి తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి తర్వాత వసతికి చేరు విధానమును నిత్యయాత్ర యందురు.
మిగిలిన యాత్ర విధులను గురించి చెప్పుటకు సమయము కాదు. మనం రేపటినుండీ యాత్రకు బయలుదేర వలయునని చెప్పిన సదానందయోగి మరు దినంబున శిష్య గణముతో గూడ బయలుచేరిపోయి గయా గదాధరలో మొదటి మజిలీ చేశారు.
గంగా గదాధర క్షేత్ర మజిలీ
“నాయనలారా! త్రేతా యుగంలో వనవాసం చేయవచ్చిన సీతారామ లక్ష్మణులు కొన్నిరోజు లిక్కడున్నారట. ఒకనాడు సీతాదేవి ఏమీతోచక ఇసుకతో ముద్దలు చేసి పెట్టింది. ఈ క్షేత్ర ప్రభావం వలన ఆ యిసుకముద్దలు వారి పితృ 'దేవతలకు సంక్రమించినై. శ్రీరాముడొకప్పుడు పితృదేవతలకు తర్పణలు విడిచి పిండ |ప్రదానములు "సేయగ ధశరథ మహారాజ్ యిసుక ముద్దలలో కనపడ్డాడు. రాముని మనసు బాలా బాధపడింది.
ఈ పని చేసిందెవరని రాముడడిగాడు. సీత భయపడి “నాకు తెలియ” దని బొంకింది. కాని ఫల్లుణితీర్థం నడుగగ నామె నిజం చెప్పింది. రాముడంతట తమ దండ్రులను - దాతలను క్షమాపణ గోరి |క్రమమయిన పిండముల నీయగ పితృ దేవతల అంగీకరించారు. తన పోరపాటు రామునికి చెప్పినందున సీత ఫల్లుణి తీర్ధంమీద కోపించి “నీవాడదానవయ్యి ఆడువారి నేరం దాచలేదు కనుక (ప్రజల కంటికి కనపడక:౦డ ప్రవహింపు”మని శపించినదట. అటులనే. వర్షములయందు తప్ప యితర దినములలో ఫల్లుణితీర్ధ మీ క్షేత్రమున యిసుకవొరల క్రీందుగా గాక నేలమీద ప్రవహించుటలేని కారణమున పెద్దలుదీనిని “అంతర్వాహిణి” అన్నారు.
ఒక 'పెద్ద మందిరంలో చదరమయిన కుండమునందు మూరనిడివి గల నున్నని పాదమొకటి యున్నది. ఇది గయుని తలయందుంచబడిన శ్రీ మహ విష్ణువు కుడిపాదమనిచెప్పబడుచున్నది. దీనిమీద పిండముపడిన దినమొక్క టియు నుండదు. అటులనే యా క్షే త్రమున ఈ శివపాదము_కుమారస్వామి పాదము. బ్రహ్మపాదము _ సూర్య పాదము _ చంద్రపాదము _ యింద్ర పాదము క్రౌంచ పాదము _ గణపతిపాదము _ మతంగపాదము _ ఆగస్త్యపాదము - కశ్య పాదము _ |త్రేతాగ్ని పాదా త్రాయమనునవి ముఖ్యములు.
విష్ణుపాదమున కీశాన్యమున గధాధరస్వామి విగ్రహమున్నది. దానికి పడమరగ రాతి గదయు కన్పట్టుచున్నది. కావున "దీనికి గయాగదాధర క్షేత్రమను "పేరు వచ్చినదని వివరించిన సదానందయోగి మరుదినంబున (ప్రయాణం సాగించి పోయి (ప్రయోగలో మజిలీ చేశాడు.
ప్రయోగ మహాక్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ ప్రయోగ అలహాబాదునకు తూర్పు ఒకటిన్నర క్రోసు దూరం నందున్నది, దీనికి పడమరగ గంగానది ప్రవహించుచున్నది. దీనినే ధారాగంజా లేక ధారానగర మనియు నందురు. భోజరాజు పాలించిన నగర మట. ఇచట గంగాప్ముతులను నొక జాతివారున్నారు. వారచటి దృశ్యములను చూపి యాత్రీకులనుండి ధనం సంపాదించుకొందురు. సమతలకూనకు క్రిందిభాగ మున పోయిచూచిన రెండు నిలువుల యెత్తున కొట్టి వేయబడిన మర్రి చెట్టు కనపడ కలదు. అది అక్షయ వటవృక్షమనియు ._ దానిచుట్టునున్న శిలలు దేవతలనియు చెప్పుదురు. అచటకు దీపపు కాంతి సాయంతో పోవలయును.
గంగ యమున సరస్వతి యను మూడునదులు కలిసిన త్రివేణి ఇచ్చట ప్రవహించుచున్నది. రాజులిచట కోట నిర్మింపని నాడీ యక్షయ వటవృక్షపు కొమ్మలీ నదిమీదకు యొంగియుండెడివట. ఏవరయినను యీ చెట్టు కొమ్మలమీద కెక్కి వారి కోరికలను చెప్పి నీటిలో దుమికి చనిపోయిన యెడల వారు. మరు జన్మలో వారి కోరికలను పొందుదురనుట కీకథ నిదర్శనము.
ఒకానొక సమయంబున మువ్వురు కన్య లాచెట్టుమీదెక్కి. అందొకరు మహా పండితకవి నాకు భర్త కొవలయునని - యింకొకరు ధైర్య సాహసములు గల ధీరుడు నాకు పతి కొవలయునని _ వేరొకరు గొప్ప కీర్తితిగల ప్రభువు నాకు "పెనిమిటి కావలయునని చెప్పి |ప్రవాహంబున దుముకుట చూసిన యొక మంగలి "చెట్టునెక్కి వీరు మువ్వురు నాకు భార్యలు కావలయునని చెప్పి నీటబడి మరణించి నందున నతండు మరుజన్మమున భోజరాజై పుట్టి వారి మువ్వురును వివాహంబు లాడెనని [గంధములు తెలుపుచున్నవి.
హిమాలయముమీద బదరీ నారాయణ్మాశ్రయమునకు వాయువ్యమున బుట్టి వసుధారయను 'పేరుతో బీనా దేశపు రాజమార్గమునకు పడమరగ పారి సర స్వతితో కలసి (బహ్మకపాలమునకు తూర్పుగా చని గంగ బద్దరీ కేదారములో నేకీభవించినంత భగీరధియను నామముధరించి హస్తినాపురము నంటుచు ముందుకు సాగి మీర్జాపూరు మీదుగా పయనించి కాశీక్షేత్రమునం దు_త్తరముగా సాగి సము ద్రములో గలియుచున్నది. అటులనే యమునానది గంగోత్రికి పడమరవాయువ్య ములుగా (ప్రవహించి, కళిందగిరి నుండి హస్తిన బృందావనం మధుర ఆగ్రా 'నగరంబుల దాగుచు వచ్చి ప్రయోగ దుర్గము మీదుగా పారి, భగీరధిలో కలియు చున్నందున త్రివేణీ సంగమ మయింది.
ఈ ప్రాంతీయులయిన గంగాపుత్రులు నీటిలో తేలుచున్న బల్లలమీద వేదికల నమర్చి యాత్రికుల చేత త్రివేణినదీ పూజయు, ముత్తయిదువుల చేత వేణి సమర్పణములు చేయించెదరు. ఇదియొక గొప్ప యాత్రస్థ్రలం. ఇక్కడకు క్రోసు దూరములో భరద్వాజశ్రమమున్నది. రావణభానంతరమునరామున కిచ్చట భరద్వాజ ముని ఆతిధ్యము నిచ్చినట్లు చెప్పబడుచున్నది. ఇంకను ఇందనేకము లయిన చూడదగిన పవిత్ర స్థలములు కలవని వివరించినసదానందయోగి మరుదినం బన ప్రయాణము సాగించిపోయి అయోధ్యలో మజిలీ చేశాడు.
అయోధ్యా పురక్షేత్ర మజిలీ
నాయనలారా! మనమిప్పుడు మజిలీ చేసిన ఈ అయోధ్య_ పూర్వం శ్రీరామచందునిచే పాలింపబడిన పుణ్యస్థలం. ఆనాటి రామ పరిపాలనలోని అయోధ్యాపుర మొకప్పుడు సరయూనదిలో కలిసిపోయినట్లు చరిత్ర చెప్పుచున్నది.. ఐనను అనాటి కొన్ని మందిరములు ఇతర కట్టడములు మాత్రము మనకీనాడు. క్రోసున్నర దూరమున కన్పట్టుచున్నవి. యాత్రికులక్కడకును పోయి దర్శించు చుందురు.
ప్రస్తుత మీ సరయూ నదీ తీరమున కన్పట్టువానిలో రామఘాట్‌భరత ఘాట్ _లక్ష్మ ణఘాట్ శతృఘ్న ఘాట్ .హనుమాన్ ఘాట్ _వశీష్ట ఘాట్ వాల్మీకి ఘాట్_ సుగ్రీవమాట్ విభీషణ ఘాట్.స్వర్గధారఘాట్ 'మొదలయిన క్షేత్రము లెన్నో యున్నవి. క్షేత్రయుగంలో దశరధ మహారాజీ యయోధ్యను పాలించాడు, ఆయనకు కౌసల్య, సుమిత్ర , కైకేయి యను భార్యలు ముప్వురున్నారు, వారికి చాలాకాలానికి శ్రీరాముడు, భరతుడు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అను నల్వురు కుమారులు కలిగారు.
అన్నదమ్ములందరూ పెరిగి పెద్దవారయ్యారు. మిధిల నగరమేలే జనక మహారాజ పుత్రికలతో వారికి వివాహాలయ్యాయి, శ్రీ రాముసకిప్పుడు ఇరువదై , 'దేండ్ల వయసు, రాముని పట్టాభిషేకం చేయించడానికన్ని ఏర్పాట్లు చేయించాడు దశరధ మహారాజు, ఆ సంగతి కైకేయికి తెలిసింది. ఆమె కంతకుముం'దే దశరథుడు రెండు వరాలిచ్చియున్నాడు. ఆ వరాలిప్పుడు కావాలంటూ కై కేయి రాముని పదునాలుగేండ్లు వనవాసం పంపించి భరతుని రాజ్యాభిషేకం చేయమని కోరింది.
ఆ కారణంగా కథ అడ్డం తిరిగింది. శ్రీరాముడుభార్య సీతను, తమ్ముడు లక్ష్మణుని వెంటబెట్టుకొని దండకారణ్యం వెళ్ళాడు. అక్కడ రామునికి రాక్షసులతో వైరం సంభవించింది. హనుమంతుడు సుగ్రీవులు నలనీలాచార్యులు మొదలయిన మిత్రుల సాయంతో లంకాధిపతి అయిన రావణునిగూడ చంపి విజయవంతంగా తిరిగి అయోధ్యకు చేరుకున్నాడు శ్రీరాముడు. , దానినే రామాయణమంటారు. ఇప్పుడిక్కడ రామాయణానికి సంబంధించిన లీలలు చాలగలవని వివరించిన సదా నందయోగి మరుదినంబున (ప్రయాణము సాగించిపోయి మధురలో మజిలీ చేశాడు.
మధురాపుర క్షేత్ర మజిలీ
నాయనలారా! యమునానది నంటుకొని యున్న మధురానగరము సక) ముగా నున్నందున వీధులు సరళముగ నుండకపోయినను రాతికట్టడములతో పుర మలంకారముగ నున్నది. విశాలమయిన ఈనగరమందే గోకులము బృందావనము 'వేణువనము కుమారవనము దాళవనము గోవర్ధనవనము మానవ సరస్సులను పుణ్యక్షేత్రము లనేకములున్నవి.
ఇచట పేరుగాంచిన ఇరవదైదు ఘట్టములలోను విశ్రమఘట్ట మొకటి. అనగా నాడు కంసుని చంపిన తరవాత శ్రీకృష్ణుడు విశ్రాంతికై శయనించిన ప్రదేశము, దీనికి చేరువయందున్న మందిరములో (శ్రీకృష్ణపాదములనబడు శిల లనేకములున్నవి. యాత్రికులు స్నానము చేసిన పిదప ఈ కృష్ణపాదము నభిషే కాదులతో సేవించు టాచారమై యున్నది.
మధుర యందలి 'దేవళంబులకు లెక్కలేదు, వానిలో ద్వారకానాధ "మందిరము గొప్పది. స్వామి సన్నిధిలో ఎడమ్మపక్కగ రుక్క్మిణిదేవి మూర్తి దర్శనమిచ్చుచున్నది. ఆలయ మండపమతి మనోహరముగనున్నది. గడిచిపోయిన యుగములలో మునులేగాక ముక్కోటి దేవతలు జపతపో నియమంబుల పాటిం చుచు నివసించిన ఆశ్రమమములు నేటికిని మనకు కనపడుచున్నవి.
మధురకు నైబుతి భాగమునందున్న తెల్లని లింగమును భూతేశ్వరు డందురు. ఆ శివలింగమునకొక పక్క ముఖము కలదు, పురాతన మైయున్న ఈ స్వామిని కృత త్రేతాయుగాలలో దేవ మునీంద్రులేగాక ద్వాపరమున కంసుడు మొదలయిన వారారాధించారు. కలియుగంబున యాదవ రాజుల సేవలందుకొనిన చరితములున్నవి. స్వామువారి దేవి'పేరు పాతాళసిద్ధేశ్వ రి. అమెయు దేవాలయ ప్రాకారమునందే వేంచేసీ యున్నారు.
అచటకు కొంతదూరంలో శ్రీ కృష్ణ జన్మస్థానమున్నది. అంతకు పూర్వం మధురను పాలించే ఉగ్ర సేన మహరాజు కుమారుని పేరు కంసుడు. ఉగ్రసేనుని తమ్ముడగు'దేవలుని కుమార్తె దేవకీదేవి ఉగ్రసేనుడు దేవకిని గూడ కన్నబిడ్డ వలెనె పెంచి పెద్దయ్యాక వసుదేవునికిచ్చి' వివాహం చేశాడు. కంసుడు తన చెల్లే లిని బావను రధంమీద గూర్చుండ బెట్టుకొని అత్తవారింట చెల్లెలిని విడిచి పెట్టు టకు వస్తున్నాడు. ఆకాశ వాణి బిగ్గరగ “ఓయీ కంసాః నిన్ను చంపే శతువు నీ చెల్లెలి ఎనిమిదవ కాన్పున బుట్టనున్నాడ”ని చెప్పింది. అపుడాలోచించిన కంస రాజు రేపు ముందెపుడో ఈమెకా కొడుకు పుట్టిందాకా యెందుకు? ,ఇపుడీమెనే చంపడం మంచిదనుకొని వెంటనే కరవాలం దూసాడు. వసుదేవుడు భార్యను చంప , వలదని బ్రతిమిలాడాడు కాని ప్రయోజనం లేక పోయింది.
చివరకు వారికొక విధంగా రాజీ కుదిరింది. దేవకికి ఎనమండుగురు కుమారులు పుట్టిందాకా తన దగ్గరనే యుండే నిర్ణయంమీద వాకిద్దరను వెనుకకు తీసికొని వచ్చి చరసాలలో బంధించాడు కంసుడు. తరవాత శ్రీ మన్నారాయాణ .మూర్తి దేవకి గర్భాన నెనిమిదవ కుమారుడుగ జన్మించిన చోటే ఇది యని వివ రించిన సదానందయోగి మరుదిననబున (ప్రయాణం సాగించి పోయి గోకులలో మజిలీ చేశాడు.
గోకుల మహాక్షేత్ర మజిలీ
నాయనలారా! మధురకు మూడుుక్రోనుల దూరంలో ఈ గోకుల మున్నది. ఇచ్చటకు లెక్కకు మించిన తీర్థములు ఘట్టములున్న వి. నాడు చెరసాల యందుంచబడిన దేవకీ వసుదేవులకు శ్రీహరి ధర్శనంబిచ్చి “పుణ్యదంపతులారా! నేను కంసాది దుష్టులను సంహరింప మీ కడుపున పుట్టబోవుచున్నాను. కాని నేనిం దుండ రాదు. వ్రేపల్లలోని నందునిభార్య మండే యశోధకు యోగమాయ శ్రీయను "పేరున స్త్రీ శిశువుగా జన్మించియున్నది. నన్ను మీరీ మద్దిమరేయియందే వ్రేపల్లెకు గొనిపోయి యశోద ప్రక్కలో పరుండబెట్టి ఆమె చెంతనున్న మాయను దెచ్చి కంసున కీయండి” అని చెప్పి మాయమయ్యాడు.
దేవదేవుని మహిమచేత చెరసాల బీగములు వానంతట నవే యూడి పోయినై. కావలివాండ్రు మాయగప్పి నిద్రలో పడిపోయారు. యమునా నది దారి యిచ్చింది. వసుదేవుడు వ్రేపల్లెలో ప్రవేశించిన చోటను “నందకవాటమని” చెప్ప బడుచున్నది. అటులనే గోవులను గాయుచున్న చిన్నికృష్ణయ్య మన్నుదిన్న చోటు గోవర్ధనగిరి నెత్తిన స్థలము యశోదానందులు బలరామకృష్ణులను వూయేలతొట్లలో నుంచి యూపిన దృశ్యములు బాలకృష్ణునిలో యశోద యోగమాయను చూచి విస్మయమొందిన విధము లోహముతో చేయబడిన ఆలమంద నడుమనున్న , మదనమోహన కృష్ణ (పతిమల నెన్నింటిలో నవమినాడ్యుకన్నుల పండుగగ చూడ గలము.
యమునానదీ తీరపుటిసుక పై నాడు బాలకృష్ణుడు పవళించిన ప్రదేశ మును కాచుకొని యున్న బారు యాత్రి కులు నచట. పొర్లిగింతలు పెట్టించిన తర వాత నచట యిల్లు మాదిరి గీతలుగీచి మంత్రము ద్వారా దేవతల నావాహనము చేసినాడు.శ్రీకృష్ణుడు తినిన మన్నును యిసుకతో కలిపి ఈయగ భక్తులు కాను కలు సమర్పించి ఆ మన్నును భక్తితో గొనిపోయి పూజింతురు. మరియు నాడు గోకులమునకు తూర్పు దిక్కున గోవింద కుండమున్నది. శ్రీకృష్ణుడు పూతనను చంపిన చోటని గోవింద కుండమున య్యాత్రికులు స్నానాదులు చేయుదురు. కాని దానికి తూర్పాగ్నేయములుగా పురాతన గోకులమున్నది. యశోద చల్లచిలికిన దచటననే చెప్పుచున్నారు. అచట చాలాకాలము నాటి రాతి కట్టడములు మనకిపుడు కనపడుచున్నవి.
గోకులమునందు నాటి శ్రీ కృష్ణలీలలు సంబంధించినదృశ్యములన్నియు కలవు. మరియు నందలి తీర్థములు _ క్షేత్రములు _ దృశ్యములన్నియు మహా పవిత్రములయినవని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణము సాగించిపోయి బృందావనంలో మజిలీ చేశాడు.
బృందావన క్షేత్ర మజిలీ
నాయనలారా! మధురా నగరమునకు గోకులము వలెనే యీ బృందా వనము కూడా మూడు క్రోసుల దూరమున యమునానదికి దక్షిణముగ నున్నది. ఇచటను తీర్ధక్షేత్రములకు లోపములేదు. శ్రీ మహావిష్ణువు చెప్పిన చందంబున వసు దేవుడు వ్రేపల్లె నుండి తిరిగి వచ్చినంతనే తలుపులు మూతబడి నై “కొక్కొరోకో” యని తొలికోడి కూసింది.
చోరాఘాటునందు కృష్ణుడు తుమ్మెదలతో ఆటలాడినచోటు భ్రమర ఘట్టం మనబడుచున్నది. హనుమంతుడు శ్రీ కృష్ణనారాధించిన చోటు హనుమ త్ ఘట్టమని గోపికలు స్నానములు చేయుచుండ బాలకృష్ణుడు చీరెలపహరించినచోటు చేలాఘట్టమని 'నందబాలుడు గోపికలతో వాగూడి ఆటలాడినచోటు రాసక్రీడా ఘట్ట మనియు చెప్పబడుచున్నవి. దానికి దక్షిణముగ రాధా మందిరమున్నది.
నాడు శ్రీకృష్ణుడు కాళింది మడుగులో కాళీయుని తలమీద చిందులు ద్రొక్కిన చోటునందే కాశీయఘట్టమున్నది. ఆ పరిసరములందు. కాళీయునిగా పోల్చుకొనదగిన నిలువెత్తు పుట్టయు, యశోదనందుల (పతిమలు, శ్రీ కృష్ణమూ ర్తి ప్రసన్న వేణుగోపాల విగ్రహాలు కలవు. బంశీఘాటన చెప్పబడుచోటున బలరామ కృష్ణుల చరణంబులు కదంబ వృక్షము క్రిందనున్న దృశ్యములు నున్నవి.
బృందావనము నుండి మధురా నగరము పోవు మార్గమున యమునకు ఉత్తరముగ అక్రూర మందిరము, దానికి సమీపమందలి వనములో భై రవాలయ ములే గాక, 'సేవాకుంజరమను పేరున నొక పవిత్ర స్థలమున్నది. అచట నివసించు వారు శ్రీ కృష్ణ పాదములను రాగితోను, వెండితోను, బంగారముతోను అమ్ముకొను చున్నారు. భక్తాదులు వారి శక్తికిం దగిన పాదములను కొని పూజించుకొను చున్నారని వివరించిన సదాసందయోగి మరుదినంబున ప్రయాణము సాగించిపోయి గోవర్ధనగిరి మజిలీ చేశాడు.
గోవర్ధనగిరి క్షేత్ర మజిలీ
నాయనలారా! మనమిపుడు మజిలీ చేసిన యీ గోవర్ధనగిరి మధురా పురికి యేడు క్రోసుల దూరమున నున్నది. శ్రీకృష్ణుడు గోవులను కాయుచుండ (బహ్మాది దేవతలకు కృష్ణుని శ_క్తి పరిశీలించాలని కోరిక కలిగిందట. దేవేంద్రు డంతట అప్పటి కప్పుడే కారు మేఘాలను రావించి కుండపోతగా వాన కురిపిం చాడు. కృష్ణుడది గమనించి వెంటనే తన యెడమచేతి చిటకెన వేలి గోటి మీద నా గోవర్ధనగిరి సమాంతంగా యెత్తి తన ఆవులమీద గోపబాలుర మీద చినుకై న పడకుండా కాపాడాడు.
ఆ కొండ తూర్పు పడమరలుగా ప్రాకి రాలవరుసతో వంతేనట్లు కన్పట్టు చున్నది. దాని వలన నొక జలాళయము రెండుగ చీలి (బహ్మతీర్థమనియు లేక మానసగంగ యనియు నామముల పోందింది. గోవర్ధనగిరి నీ పడమర భాగంబున గ్రామమున్నది. తూర్పు చివర కొన్ని మందిరములు మాత్రమున్నవి. ఆ మంది రంలో ఒకదానియందు. గుండ్రములుగా గాక, నలుచదరములుగా మలచబడిన రెండు శివలింగములున్నవి, వానిలో తూర్పున నున్న లింగము "పేరు నందుడు పడమర నున్న శ్రీకృష్ణలింగము నచటివారు పాలతో నభిషేకించి పూజించుటాచా రమై యున్నది.
సేతువుకకు పడమటి భాగమందలి గ్రామములోను కొన్ని మందిరము లున్నవి. సకలేశ్వర మహాదేవుడు; మానసదేవి ప్రతిమలు- శ్రీ కృష్ణమూర్తులున్నవి. వానిలో గోవర్ధనగిరి నెత్తిన బాలకృష్ణ విగ్రహము ప్రధాన మైనదని వివరించిన సదా నందయోగి మరుదినంబున (ప్రయాణము సాగించిపోయి పాటలీపుత్రంలో మజిలీ చేశాడు.
పాటలీపుత్ర క్షేత్ర మజిలి
నాయనలారా! పూర్వమొకప్పుడు పాటలియను యువతియు ప్యుతుడు అను యువకుడు భార్యాభర్తలై యీ నగరం నిర్మించినట్లు చరిత్ర చెబుతూంది. ఇరువది నాలుగు క్రోసుల దూరమున్న యీ పాటలీపుత్రము గంగానదికి దక్షిణముగ నున్నది. ఇచట ఏకముఖ; ద్విముఖ; త్రిముఖ; చతుర్ముఖ; పంచముఖ శివలింగముల లనేకములు ప్రతిష్టలు చేయబడినవి. ఎన్నియో 'దేవాలయములున్నవి. పురవీధు లన్నియు సమస్త వస్తువులు లభింపకల అంగడులతో సుందరములై యున్నవి.
పాటలీపుత్రము యొక్క రాజధాని మొదటి పేరు కాలీకాతా, కాలీకాతా యనగా కాళికాదేవి నివసించు చోటని యర్ధము. ఇచ్చట కాళికాదేవి పొడవైన నాలుకతో భయంకరముగ దక్షిణాభిముఖమై వున్నది. మూఢనమ్మకం గల భక్తీ నాటికిని అమ్మవారి ముందు గొరియను మేకలను చంపెడి యాచారం మిక్కు-టముగ నున్నది, కాళీ వేంచేసివున్న యీ భువనేశ్వర స్థలం ఐదు క్రోసుల విస్తీర్ణమైనది... ఈ క్షేత్రములలో కోటి లింగములున్న వని జనప్రతీతి. వానిలో ప్రముఖమైన భువ నేశ్వరస్వామి లింగము వలననే దీనినీ భువనేశ్వరస్థ్రల మనుచున్నారు. లింగరాజని ప్రసిద్ధికెక్కిన యీ స్వామి స్వయంభూయని కోందరు. బహ్మ దేవుని (పతిష్టయని మరికొందరు చెప్పుచున్నారు. ప్రస్తుత మందున్న దేవతామూర్తులు పతనావస్థ లందున్నవి.
ఈ పాటలీపుత్రము నందున్న వారందరు మహ (శ్రీమంతులు. నగర వైభవాది విశేషములో వర్ణనాతీతములు. శ్రీ భువనేశ్వరస్వాముల వారికి వార్షిక భోగములు నిరాటంకముగ జరుగుటకు గాను మహారాష్ట్ర ప్రభువులిచ్చిన గ్రామ ములు యితరాదాయములు పుష్కలముగా నున్నవి.
భువనేశ్వరాలయం మిగుల శోభాయమానము. దేవళము చుట్టునున్న చిన్న చిన్న కోవెలలో ఏకామ్రేశ్వర, విశ్వేశ్వర, ఉగ్రేశ్వర, బాలేశ్వర, లవ ణే శ్వర, చిత్ర గు ప్తేశ్వర, వై ద్యనాదేశ్వర,సోమేశ్వర,జంబుకేశ్వర,ఉత్తరేశ్వరులే గాక ఏకాదశమూర్తులు కొలవుదీరి యున్నారు. అంతేగాక గణేశుడు, కుమార స్వామి, భువనేశ్వరి, నంది, లింగరాజ్యపార్వతి, సావిత్రి ,చంద్రుడు, కల్పములు మొదలయినవి తగు స్థానములలో నెలకొల్పబడినవి. వీరందరిమధ్య సేవింపబడు చున్న భువనేశ్వరస్వామిని దర్శింపదలంచినవారు సమతలమునుండి మెట్ల మీదుగా క్రిందికి దిగిపోవలయును . ఇచట ఏ కులంవారయినను స్వాములవారిని తాకి స్వహస్తములతో పూజించుకొనవచ్చును.
బిందుసర రస్తిరంబున (బహ్మలయమున్నది. గయను శిరోగతుయనిజాజి వూరును నాభిగయమని, పీటామును పాద గయ యనియు చెప్పుచుచున్నారని వివరించిన సదానందయోగి మరుదినమున (ప్రయాణము సాగించిపోయి పురుషో త్త ములో మజిలీ చేశాడు,
పురుషోత్తమ క్షేత్ర మజిలీ
నాయనలారా ఈ పురుషోత్తమ క్షేత్రమునకే జగన్నాధక్షే త్రమనియు నామాంతరము. ఇది సముద్ర తీరమున కించుక పై భాగముననున్నది. శ్రీ జగ న్నాధాలయము నిలచలగ్రామ మధ్యభాగమున నున్నది, ఇచట స్వామి సుభద్ర బలభధ్రులతోకూడి యున్నాడు. నగరం విశాలమయిన వీధులతో " సుందరముగ నున్నది. య్యాతికులు, సాధువులు, భక్తులు మొదలయినవారు. బసచేయుట కను కూలంగనెన్నియో మఠములు సత్రములు మందిరములు నిర్మింపబడినవి.
గ్రామమునకు తూర్పుగ క్రోసు దూరమున నిం ద్ర పద్యుమ్న మహారాజు నిర్మించిన మందిరములున్నవి. జగన్నాధస్వామి రధోత్సవమునకు పోయినపుడా మందిరములో నివసించుచుందురు. స్వామివారి దేవళమును చుట్టుకొని యెన్నియో శిల్పములున్నవి, నైబుతి భాగమున అక్షయ వటవృక్షం అగ్నేయమున పెద్ద వంటశాల, పడమరగ ముక్తి మండపము, దానికి తూర్పున రోహిణి మండప పములు మొదలయినవి కలవు.
గర్భాలయ మందలి వేదికమీద యెరుపు ముఖంగల _ సుభద్ర దేవియు కుడివైపున తెల్లని ముఖంగల బలరాముడు.యెడమవేపున నీలముఖంగల జగ న్నాధస్వామియు దర్శనంబు లిచ్చుచున్నారు. వారి చుట్టును (పదక్షిణం "సేయనను వైన మార్గము నిర్మింపబడినది. |ప్రతి దినమిచట యిరువది రెండు వినియోగములు చెల్లచున్నవి, స్వామికి నైవేద్యమిచ్చిన తరవాత ఆదే మందిరములోగాని అక్షయ వటవృక్షము క్రిందగాని భక్తాదులు వరుసలుగా కూర్చుండి స్వామి (పసాదము నందు కొందురు. ఆ సమయంబున కులమత విచక్షలుండవు. ఎంగిలి పట్టింపులంత కంటేను పాటింపరాదు. అందులకే కాబోలు మనవారు సామాన్యముగ సర్వమూ జగర్నాధమనుచుందురు. జగన్నాధస్వామి ప్రసాదమనినప్పడెవిచ్చినను.యెంగిలి 'దైనను కాదనక పుచ్చుకొనుటయే యిచ్చట శిష్టాచారము. నారద సూతశౌనకాది మహామునులీ జగన్నాధక్షేత్ర మహాత్మ్యంబును మిక్కిలిగా కొనియాడి నట్లనేక పురాణములు చాటి చెప్పుచున్నవి.
రోహిణీకుండ మహాత్మ్యము
నాయనలారా! జగన్నాధ మనంబడుచున్న యీ పురుషో త్తమ క్షేత్రం సముద్రతీరాన పది యోజనముల పొడవున నున్నది. ఇందును గురంచిన యితిహస మొండు కలదు. కృతయుగంబున హిరణ్యక్షుండగు దానవుడు భూమిని చాప చుట్టి నట్లుచుట్టి గొనిపోయి సముద్రామునందడుగు భాగమున దాచియుంచాడు. ఆ సమ 'యంబున లోకము నుద్దరింప శ్రీమహావిష్ణువు వరాహరూపం ధరించి హిరణాక్ష్యుని చంపి భూదేవిని సంరక్షించాడు. అంతట ,బహ్మదేవుడీ సముద్ర తీరమందలి పురు షో_త్తమ క్షేత్రం నిర్మించిన తరువాతనే సృష్టికార్యం మొదలు పెట్టాడు.
తన సృష్టి యందవతరించిన జనులకు ము క్తిమార్గము చూపవలయునని తలంచిన బ్రహ్మ నారాయణమూర్తిని ప్రార్థించాడు. మాధవుడా సృష్టికర్తకు దర్శనంబిచ్చి “ఓయీ! చతురాసనాః ఈ'సమ్ముదతీరమున నీలాచల మొకటి యున్నది. దాని (ప్రభావ మెట్టిదియొ మునులకు... దేవతలకు నీకును తెలియదు. మహప్రళయ కెలమందైనను నేను శంఖ ,చక్ర, గదా ధారినై యందు. నిజశడ రీరము తోడ నిల్పియుందును. అందలి రోహిణి కుండమున స్నాతలై నన్నారాధించిన వారికి నేనీయని వరమొక్క టియు నుండదు. నీ వచటకుపోయి నన్ను సేవింప” మని చెప్పి అదృశ్యమయ్యాడు,
నలుమొగంబుల వేల్పు నీలచల క్షేత్రమునకుబోయి. అందు వేంచేసి యున్న జగన్నాధమూర్తిని, రోహిణీ కుండములను, అందందుగల దృశ్యములు నవలోకించి ధన్యుడై నట్లుగా తొల్లి శంకరుడు కుమారస్వామికి చెప్పగ జైమిని తక్కిన బుషులకు చెప్పినట్లు పురాణము 'తెలుపుచున్న వి.
జగన్నాధావతరణము
నాయనలారా! ఇంద్రద్యుమ్న మహరాజు గొప్పదై వభ క్తుడు. నీలచలం మీద జగన్నాధస్వామి సుభద్ర బలభద్రులతోడ 'కేళీ విలాసంబుగ విహరించుచున్నా డని (బ్రాహ్మణ పండితులవలన నాలకించి నందున నింద్రధుమ్యమ్నుడు స్వామిని కన్నులార చూచి యానందించు సంకల్పమున పరివార సమేతంబుగ బయలుదేరి పోవునంతలో స్వామి వారి భ_క్తిని పరీక్షింపనెంచి యెవరికిని కనపడక నదృశ్య మొందెనట. రాజందులకు చింతించి తనకు దర్శనభాగ్యం పసాదింపుమని ప్రార్ధించుచు కొంతకాలమందే నివసించియుండగ ఒకనాటి రేయి జగన్నాధస్వామి యింద్రద్యుమ్నుని స్వప్నమందున కనపడి “భక్తాగ్రణి! చింతింపకు కొలదిదినంబులలో నీ సమ్ముద్రపుటలలో కొయ్య మానులు కొట్టుకొని రాగలవు నీవు వానిని తీయించి నా రూపమున విగ్రహములు చేయించి ప్రతిష్టగావింపుము, నీవు చిరకాలం రాజ భోగముల ననుభవించినతరువాత నాసన్నిధికి రాగలవనిచెప్పి 'మాయమయ్యాడు.
అటులనే నీటి కెరటాలలో తేలియాడుచు వచ్చిన మానులు నారాజు వెలికి దీయించునంతలో విశ్వకర్మ భగవానుడు సామాన్య శిల్పి రూపమునుదర్శన మిచ్చి “రాజా! నేనీ కోయ్వీలో 'దేవకామూర్తులు నిర్మించేదను. కాని ఒక నియమమున్నది, మీ దూలంబులనొక మందిరంబున జేర్చి తలుపులకు తాళములు వేయింపుడు. నేనా లోపలనే యుండి శిల్పములను 'సేయుదును, నేను వెలుపలకు వచ్చి చెప్పువరకు మీరే పరిస్థియందైనను తలుపుల తేరువురా” దనగా రాజంగీక రించి చెప్పినట్లు చేశాడు.
పని | ప్రారభించి పది దినములయినది.
రాజమాత మనంబున “అయ్యో! లోపలనే యున్న శిల్పాచార్యు లిన్ని దినంబుల నుండి భోజనమయినను చేయకుండెనేనియని దలంచి మందిరం తలపులు తెరిపింప నాజ్ఞపించింది. తల్లిమాట కదనలేక ఇంద్రద్యుమ్నుడు తలుపులు తెరచి చూచునంతలో శిల్పి యదృశ్యమయ్యాడు. రాజ సేవకులెంత వెదికినను ఎక్కడ చూచినను శిల్పి కనపడలేదు. అప్పటికే దేవతామూర్తులు కరచరణంబుల చివర భాగంబులు తప్ప మిగిలిన రూపములన్నియు 'చెక్కుట పూర్తి అయినది.
ఇంద్రద్యుమ్ను డంతట జరిగినదానికై చింతించి (బహ్మ దేవునియొద్దకు బోయి కర్తవ్య మడుగగ నా చతురాసనుండు. “నరపాలా!ః నీవా విగ్రమును (పతిష్ట చేయగల తరుణము మించిపోయినది. మీ పాండ్య (బాహ్మణుల యాజ మాస్యమునకే జగన్నాధస్వామి ప్రతిష్టయు, పూజారి వైభవములు జరుగుట ద్రైవ నిర్ణయము, కావున నీవింక యింటికిపోయి వార్షికముగా స్వామి రధోత్సవం చేసి కొనుట కేర్పటులు గావింపుము, నేనప్పుడు "పది దిననులు విడిది సేయుటకు 'మందిరముల 'నిర్మింపుము మరియు నచట సీపేరు నొక జలాశయమును గూడ నిర్మిం 'పుము, ఇంద్రద్యుమ్న సరోవరంబున భక్తాదులకు స్నానము చేసినను-పానము చేసినను_దానము చేసినను కైవల్యము తప్పక సిద్దింపగల”దని చెప్పి పంపిచాడు.
ఆనాటినుండి ప్రతి సంవత్సరం ఆషాడశుద్ధ విధియల నాడు జగన్నాధ స్వామి రధోత్సవ మతివైభవముగ జరుగుచున్నది. అచటి సముద్ర తీరమున తిధి వార నిర్ణయములు లేకయే యెల్ల దినములలో స్నానములు చేసినవారు పవిత్రము లగు చున్నరారని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణం సాగించి పోయి కూర్మేశ్వరంబున మజిలీ చేశాడు.
కూర్మేశ్వరాలయ చరిత్ర
నాయనలారా! పూర్వము 'దేవదానవులు అమృతం కొరకు పాల సమ్ముదం తరచినపుడు శ్రీహరి తాబేలు రూపందాల్సి వారికి సాయం చేశాడు. తరువాత వారికి ఇమ్మత కలశం లభించింది. ఆ శుభ సమయంబున మాధవుడా కూర్మావతారము నందే శివలింగమును పతిష్టించిపూజించినందున ఇచటి స్వామికి కూర్మేశ్వరుడనే పేరు వచ్చింది.
తరువాత చాలాకాలానికి రామానుజాచార్యులవారు వైష్ణవ మతప్రచారం 'చేయు సమయమున నీ యాలయము నందొకనాడు నిశీధముగప్రవేశించి స్వాముల వారికి శంఖచక్రకాధి భూషణంబుల నలంకరించి యెవరికిని తెలియకుండ తిరిగి పోయాడు. మరుదినంబున మధ్యవర్తులతో కలిసి తలుపులు దీయించి ఈ స్వామి వై ప్టవుడేనని యొప్పించెననియు, పంచరాాత్రి విధానంబున నీ క్షే త్రమును గూడ తిరుపతిగా మార్చెననియు_నాటినుండి కూర్మేశ్వరుడు కూర్మనాయక స్వామిగా మారెననియు జనబాణి వినబడుచున్నది.
పూర్వకాలంబున శ్వేతకేతుండను రాజు దీక్షబూని కళింగపట్టణమందు నెలకొనియున్న కర్పూరేశ్వర సన్నిధిలో కొన్ని దినంబులు, శింగుపురమునందు నెలకొనియున్న సుందరేశ్వర సన్నిధిలో కొన్ని దిసములు, సమ్ముదశీరం నందు నెలకొనియున్న రామలింగేశ్వర సన్నిధిలో కొన్ని దినంబులు ఈ కూర్మక్షేత్ర మందు నెలకొనియున్న పాతాళ సిద్ధేశ్వర సన్నిధిలో కొన్ని దినంబులు "ఘోర తప మాచరించాడు.
పరమేశ్వరుడంతట వానికి సాక్షత్కరించి “శ్వేతకేత మహారాజా నీ భక్తిప్రపత్తుల కానందించాను. నీవు తపమాచరించిన ఈ ' యైదు క్షేత్రము లందును నేను స్వయముగ ప్రసన్నుడనై యుంటాను. నన్నారాధించిన వారికి సమస్త భోగముల నిచ్చెదను, ముంధీయ్యది మహ ప్రభావంగల దివ్యక్షేత్రము కానున్న ”దని చెప్పి యదృశ్యమయ్యెను, రామానుజాచార్యులవారు. నూతనముగ చేయించిన శ్రీ దేవి భూదేవి సమేత గోవిందరాజస్వా మిమూర్తులు శ్రీదేవిభూ దేవీ సమేత చ్యక్రనారాయణస్వామి మూర్తుల! లక్ష్మణ సమేత సీతా కోదండరామ స్వామిమూర్తులు నిచట ప్రశ స్తములై యున్నవి. నేటికీ ఈ మూర్తులన్నింటికి నిత్య నైవేద్యములు చెల్లుచునే యున్నవి. సముద్ర తీరమునందు. వెలసియున్న హనుమదాలయంబున నెంతమాత్రమును సమ్ముద్రఘోష వినపడక పోవుట మహా శ్చర్య మనక తప్పదు.
ఇచటి కూర్మాకు౦డిక యను జలాశయమునందు ప్రతి మాఘ శుద్ధ చవితిలు నాటికి కాశీ నుండి గంగ వచ్చుచున్నది. యాత్రికులిందు స్నాన పాన దానాదులను సేయుచుందురని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయా ణము సాగించిపోయి అరసవల్లిలో మజిలీ చేశాడు.
ఆరసవల్లిక్షత్ర మజిలీ
నాయనలారా! అరసవల్లి మొదటిపేరు హర్షవల్లి. సూర్యనారాయణ మూర్తి ఇచట ప్రముఖ దైవము. భక్తాదుల కభయ ప్రదానము నిచ్చుచున్న సూర్య మూర్తి సుందరముగా నున్నది. సూర్యాలయమందు యొక కోవిలలో శివ లింగమున్నది. ఇచట పుష్కరిణిలో శుచులయిన వారిని పూర్ణాయురారోగ్యముల.._. శేజస్సు.భాగ్య భోగములు కై వల్యమును సిద్ధింపగలవు.
సూర్యునకు ప్రియమయిన ఆదివారము లందిచట స్వామికి వేడుకలు జరుగుచున్నవి. ప్రతి మాఘశుద్ధ రధసప్తమీలలో మహోత్సవములగు చున్నవి. పుట్లకొలది పంచదార కలిపిన వేడిపాలను అమృతకుండియను పేరున స్వామి కారగింపు చేయించిన తరువాత త్రాగదలచిన వారికి తీర్ధప్రసాదములుగ నిచ్చు టయు వారు త్రాగుటయునిచటి సాంప్రదాయం.
ప్రయోగవాటి యనంబడు తాయకాడ గ్రామంబున సిద్దే శ్వరుండను లింగము, దుంప గ్రామంబున ఉత్తరముగ సోమేశ్వరుడను లింగము, సంగ మగ్రాహారమునను తూర్పుగ్న సంగమేళ్వరుడను లింగము, శ్రీకామడంబున కోటీశ్వరుండను లింగము, క ళ్ళేపల్లి యందుమనాగేశ్వరుండను లింగములైదును ప్రసిద్ధములై నని,
మహ భారతయుద్ధం సమీపించింది, బలరామకృష్ణులు వారికి బంధువులు ఐనను శ్రీ కృష్ణుడు పాండవ పక్షపాతియని తెలిసికొనిన బలరాముడు తమ్ముని కాదనలేక తీర్థయ్మాతలకు బయలుదేరాడు, ఆయన దండకారణ్యములో పయనించు చుండగా, దప్పికకొని యా కొండనేలల యందెక్కడను నీరు దోరకక బాధపడ వలసి వచ్చింది. |ప్రస్తుతంబున తనకే గాక ముందు ముందు (పజలకయినా నుప యోగపడవలయునను తలంపున చేతగల నాగలిని భూమిమీద నచ్చటచ్చట గొట్టుచు పయనించెను. వాడా బలరాముని నాగటికిందెగిన చోటు లందుదయించిన జలధారలు క్రమముగ స్వర్ణముఖి, వంశధార, ఝంబావతి, లాంగవీ నదులను నామములతో ప్రవహించుచున్నివి. నాడు లాంగవీనది యందే బలరాముడు స్నానాదులు చేసి నట్టు పురాణములు తెల:పుచున్న వి,
బలరాముడప్పడు శ్రీకాకుళంబు నందొక లింగమును ప్రతిష్టించి యజ్ఞ మొనరించారు. యజ్ఞభోక్తగా విచ్చేసిన దేవేంద్రుడు డచటివారి భక్తి ప్రవత్తుల కానందించినందున వారికి సకలై శ్యర్యములు సమకూరుట కుపాయము నాలోచించి బ్రహ్మ విష్ణు మహేశ్వరాంశలు గలట్టియు కర్మసాక్షిఅయినట్టియు తేజోముర్తియు ఐన సూర్య ప్రతిష్ట స్వయముగచేసినట్లు క్షేత్రమహోత్సవములు చెప్పుచున్నవి.
నేను చూచినంతలో (పపంచమునందుసూర్యాలయ మీ యరసవల్లిలోనే కలదు. కోణార్కయనుచోట పూర్వ మొక మహారాజా దరణమున శిల్పాచార్యులు అతి మనోహరముగ నిర్మించినట్లును వినుచున్నాము. అచట దై వాంశ సంభవుడైన యాశిల్పి బ్రహ్మ ఒక "పెద్ద శిలయందు రధము, రధచ్యక్రములు, రధాశ్వములు మొదలయిన వానినన్నింటిజీవకళలుట్టి పడేలాగున నిర్మించాడు. శిల్పికుమా రుండోకనాటిరేయి శిలాశిల్పమైయున్న రధము నెక్కి గుర్రములకు ప్రాణ పతిష్టల గావించి, కోలచే నదిలించినంత రధం కదులుచు పెళ పెళ ధ్వనులు పుట్టేను. అది చూచిన వృద్ధ శిల్పాచార్యులు వెంటనే గుర్రముల కాళ్ళు సరికివేయగా నవి యథా పూర్వకముగ శిలా ప్రతిమలై నిలిచిపోయినందున నేటికిని మనకు కన్పట్టుచున్న టులు కోణార్క సూర్యాలయ చరిత్రలు చెప్పుచున్నవని వివరించిన సదానందయోగి మరుదినంబున (పయాణం సాగించిపోయి సింహాచలంలో మజిలీ చేశాడు,
సింహాచల క్షేత్ర మజిలీ
నాయనలారా! ఇది నరసింహక్షేత్రం. విశాఖపట్టణమునకు సమీపం నం దున్నది. విశాఖ యొక సుందరమయిన గొప్ప పట్టణం, ఇచట జలయాన యంత్ర ములను నిర్మాణం "సేయు కర్మాగారం వున్నది. మరియు నెన్నియో గొప్ప సంస్థ లున్నవి, నగరం సము(ద్రం వంటి యోడరేవు (హార్చరు కలిగివున్నది) పట్టణము నందు గొప్ప వ్యాపార 'కేంద్రములు, కళామందిరముల మిక్కిలిగా నున్నవి...
పూర్వం హిరణాక్ష్య హిరణ్యకశిపులనేవారు. దానవ సోదరులు, వారి బాధలు భరింపలేకదేవమునీం ద్రులు (శ్రీహరితో మొరబెట్టుకున్నారు. అంత మాధ వుడు వరాహరూపం ధరించి తమ్ముడగు హిరణ్యాక్షుని చంపినందున అన్నఅయిన హిరణ్యకశిపుడు విష్ణుపుమీద పగదీర్చుకొన పంతం బట్టి వున్నాడు.
.రాక్షసరాజున కింతలో ప్రహ్లాదుడనే కొడుకుపుట్టాడు. ప్రహ్లదునిపుట్టుక నుండి విష్ణుభ_క్తిపట్టుబడింది కుమారుడించుక పెద్దదాడయ్యాక తండి “వైకుంఠుడు మనకు పగవాడు వాని నామస్మరణం చేయవలదని చెప్పాడు. కాని ప్రహ్లాదుడు తండ్రి మాట వినలేదు. తండ్రి కుమారుని బెదిరించాడు. చివరకు చంప ప్రయ త్నిచాండు. కాని ఫలితం లేకపోయింది. పాణం విసిగిపోయి శ్రీ హరి యెక్క డున్నాడో చూపుమని హిరణ్యకశీపుడు గద్దించాడు. ప్రహ్లాదుడందులకు “హరిలేని. చోటేలేదు. అంతటా యున్నా”డని బదులు చెప్పాడు. మరింత కోపం చెందిన హిరణ్యకశిపుడు “ఐతే ఈ _స్తంభంలో చూపు”మని గదతో కొట్టాడు. స్తంభం పెళ పెళారావం చేస్తూ పడిపోయింది. స్తంభం నుండి శ్రీహరి నరసింహరూపంలో బయటకు వచ్చి రాక్ష సేంద్రుని సంహరించాడు.
అట్లు హిరణ్యకశిపుని వధించిన సరసింహమూర్తిని ప్రధమంబుగా కీర్తించిన ప్రహ్లాదుడే ఈ సింహాచలమందలి స్వామిని ప్రతిష్ట చేసినట్లు యితి హాసము చెప్పుచున్నది. పతి వైశాఖశుద్ధ క్షయతదియలందు సింహచలనరసింహ మూర్తి నిజరూపమున ప్రకాశించు చుండుననియు జన ప్రతీతి కలదు, ఆనాడీచోట స్వామి కభిషేకములు వైభవములు జరుగుచున్నవి. యాత్రికులు నిత్యము వచ్చు చున్నారు. స్వామి పూజాదులు సేయు పరివారములో వైష్ణవులు స్మార్తులను కలసి 'పని చేయుచున్నారు.
ఇంకొక విశేష మేమనగా... ఈ విశాఖపట్నమునకు చేరువయం దున్న వయుమాక యను క్షేత్రము కూడా ప్రభావము కలది. శ్రీ నివాసావకారమున విష్ణు మూర్తి ఆకాశరాజు కుమారియగు పద్మావతిమీద వ్యామోహముతో వేటనెపంబున వచ్చినపుడొక యాదవుడా మహనీయునకు పాలు సమర్పించిన దిచటనేనని పురాణ ములు చెప్పుచున్నవి. అచటి దేవాలయము చూడ చిన్నదై నను మహిమలో తక్కువకాదు. పర్వతమునకు దిగువగ స్వామి పుష్కరిణికి సమీపము నందున్న కోవెలలో నే శ్రీ వేంకటేశ్వరస్వామికి నిత్య నై వేద్యాది భోగములు జరుగుచున్నవి. దాని కీశాన్యమున నున్న 'దేవాలయంబునను నిత్య భోగములకు లోపము లేదు. నృసింహ్మాది సాలిగ్రామము లమితముగ నున్నవి.
మరికొంత దూరమున పిఠాపురమున్నది. అచటి (పభ్యాతి దైవము కుక్కుటేశ్వరుడు. కోడియాకారముననుండుటచే ఈ స్వా మినికుక్క టేశ్వరుడను చున్నారు. పైనున్న పాత్రలోని జలమభిషేక బిందువులుగా దేవునిపై బడి 'నపుడవి కుక్కు టేశ్వరుని ముక్కునుండి కిందకు జారుచున్న దృశ్యము మనము చూడగలము, ఇందు వేంచేసియున్న రాజ రాజేశ్వరీదేవిని కూడా నిత్య వైభవ ములు యధావిధిగా జరుగుచున్నవి
ఆలయ ,పాకారము నందీశాన్యమున నున్న విష్ణుపాదముల మీద యాత్రికులు పిండములను వైచి పుష్కరిణి యందు విడిచిన ఫలితమును పొందు చున్నారు. పిఠాపురం రాజావారి కోటపురమునందున్న దని వివరించిన సదానంద యోగి మరుదినంబున ప్రయాణము సాగించిపోయి రాజమహేంద్రవరంలో మజిలీ. చేసాడు.
రాజమహేంద్రవర క్షేత్ర మజిలీ
నాయనలారా! పుణ్యగోదావరీ నది తీరమునందున్న ఈ రాజమహేంద్ర వరం పౌరాణిక స్థల మేగాక చార్మితాత్మక స్థలమునై యున్నది. ఈ యఖండగౌతమీ తీరమున మృకండమహముని కుమారుడయిన మార్కండేయునకు సంపూర్ణాయువు నిచ్చిన శివలింగము కూడ వెలసియున్నది. జనార్ధనక్షేత్రమని "పేరుగాంచిన కోటి లింగాల క్షేత్రమిందే యున్నది. గౌతమ మహామునియు నీ (పాంతమునందే తప మాచరించినందున నిదియెంతయో పుణ్యస్థలంబని చెప్పదగియున్నది.
పాండవుల సంతతి వాడయిన రాజ రాజనరేంద్రుడు కొంతకాలం క్రిందట నీ రాజమహేంద్రమును పాలించాడు. రాజాస్థాన కవి అయిన నన్నభయట్టా రకుడే వ్యాస విరచితంబైన సంస్కృత భారతము నాంధ్రీకరించిన ముగ్గురు కవు లలో మొదటివాడు, అధర్వణాచార్యుండను యొక కవి భారతమును తెలుగు సేత చేసికొనివచ్చి వినిపింపగ నన్నయభట్టు అసూయా గస్తుడ్రై కపటోపాయంబున వాని భారతమును తగలబెట్టించినట్లును.ఆ సమయమున నెవరికో చదువుకొనిన ఇచ్చిన విరాటపర్వము మాత్ర మగ్గిపాలు గాక ఈనాటి వరకు నున్నదను విషయమొక టి తెలియచున్నది.
రాజరాజు కుమారుడు సారంగధరుడు. రాజరాజుగారి చిన్న భార్య చిత్రాంగి, ఒకానొకారణమున చిత్రాంగి తన సవతికుమారుడయిన సారంగ ధరుని మీద కుత్రిమ నేరారోపణ చేయగ రాజు నిజము తెలిసికొనలేక కుమారుని కాళ్ళు చేతులు నరికించిన చరిత్ర లోకవిదితమై వున్నది. నేటికిని రాజమండ్రికి యూరి వెలుపల సారంగధర మిట్టయను నొక ప్రదేశము కలదు.
అటులనే రాజురాజుల వారి తండ్రి విమలాదిత్య విష్ణువర్ధనుడు విజయ యాత్ర గావించుకొని తిరగి వచ్చుచు పెనుగొండ పట్టణమునకు విచ్చేయగ వైశ్య కుల 'పెద్దలయిన కుసుమ గుప్తాదులు వారికి స్వాగతమిచ్చారు. ఆ సమయంబున విష్ణువర్ధనుండు కుసుమగుప్తగారి కుమార్తె వాసవిని గాంచి |పేమించి వివాహంబాడ నిశ్చయించుకున్నాడు. కాని కుసుమ గుప్తాదులు వై శు్యులు.రాజు క్షృతియుడు నైనందున నేమి.మరికొన్ని ఇతర కారణంబులచే నేమి. (పభువులతో వియ్య మొంద సమ్మతించలేదు. ఆ కార్తణమున విమ్ణువర్ధనుడు కోపోద్టీపిత మానసుడై, వారినందరను బంధింప బయలు దేరిరాజమండ్రి నుండి 'పెనుగొండకు వచ్చునంతలో వైశ్య ప్రముఖులు దంపతులును. వాసకాంబియు నగ్నికుండలములలో ప్రవేశిం చారు. ఆ వార్త విని విష్ణువర్ధనుడు తలపగిలి మరణించాడు. తరవాత వాసవి వైశ్యులకు కులదేవతఅయి "పెనుగొండయందు. ఆ వాసవీ కన్యకాపరమేశ్వరి యను పేరున వెలిసింది. ఆమెకు నిత్యదీపధూప నై వేద్యాది వైభవములు మహో న్నతముగా నూరూర జరుగుచున్నవని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణం సాగించిపోయి భద్రాచలంలో మజిలీ చేశాడు,
భద్రాచల క్షేత్ర మజిలీ
నాయనలారా! శ్రీరామ క్షేత్రములన్నిటిలో భద్రాచలం మిగుల పేరు గాంచింది. చైత్రశుద్ధ పాడ్యమీలు మొదలు నవమీలు వరకు లిచ్చటి వై భవములు.. నవమినాడు సీతారామ కళ్యాణ మహోత్సవములు వైభవముగా జరుగు చున్నవి. ఆ వేడుకలు చూడ దూర 'దేశముల నుండియు (పజలు తండోడ తండ: ములుగా వచ్చుచున్న యాత్రాస్టాలము.
కంచర్ల గోపన్నయను నియోగి బ్రాహ్మణుడు పూర్వ మీ భద్రాచలము. నందుండెడివాడు. అయన మొదటినుండి (శ్రీరామభక్తుడు. గోపన్నగారి ధర్మ వత్ని కమలాంబ, కుమారుడు రఘురాముడు దానధర్మమములుగల ఈ,బాహ్మణ కుటుంబం కొలది దినములలోనే సంపదను కోల్పోయింది. గోపన్న నిపుడందరు రామదాసని పిలుస్తున్నారు.
ఆ కాలంలో గోల్కొండ నేలుచున్న తానిషాయొద్ద మం[తులుగా నున్న ఆక్క న్న మాదన్నలు రామదాసుగారికి మేనమామలు. వారిద్దరు (పభువులకు చెప్పి మేనల్లునకు భద్రాచలం తహశీల్దార్ పని ఇప్పించారు. గోపన్న మరల, ధనవంతుడయ్యాడు, (బాహ్మణ సంతర్పణలు ముమ్మరంగా చేస్తున్నాడు. రామ. భ_క్తి నానాటికి "పెరిగిపోయింది.
అప్పటికి భద్రాచలము నందున్న పురాతన దేవాలయం పూర్తిగా శిధిల మైపోయింది. రామచంద్ర ప్రభువుల కాలయం లేకపోవడమా అన్న చింత" వానిలో బలపడినందున వెంటనే పనివారల నియమించి కొదండరామాలయమును మనోహరముగా నిర్మాణము చేయించాడు, చుట్టు పాకారం నిర్మించాడు. సీతమ్మ వారికి రాములవారికి లక్ష్మణులవారికి గూడ మణిహారములు, రత్నకిరీటములు మొదలయిన వానినెన్నింటినో యేర్చరచాడు. సీతారామ కళ్యాణాది ఉత్సవము నిది వరలో యెవరు చేసి వుండనంత వైభవముగ చేయుచున్నాడు. ధనమంతయు వ్యయమయిపోయింది. (పభుత్వం వారికి చెల్లించివలసిన రాజ పన్ను (ద్రవ్యం మూడు-లక్షల రూపాయలు చెల్లించలేక పోయాడు.
రాజద్రవ్యము నపహరించిన నేరముక్రింద రామదాసును రావించిన. తానిషా వారాయనను చెరసాల యందుంచారు. తానీషా తరవాత గోల్కొండ చక్రవర్తుల పాలన అంతరించిపోయింది. నేటికి హైదాబాదుకు సమీపమునందున్న గోల్కొండ కొండమీద ఖిల్లాయను "పేరున నాటి మొగలాయి కులీ రాజులనాటి కోట మనకు కన్పట్టుచున్నది. కొన్ని కట్టడములు శిధిలములై నను మిగిలిన యా కోట దృశ్యములను చూచిన వారానందింపక నుండజాలరు, “నాడు. గోపన్న బంధింపబడిన చెరశాల వున్నదిచటనే”నని గు_ర్తింపదగిన యవకాశము లీనాటికిన్ని కలవు.
రామదాసుగారిచే నిర్మింపబడిన రామాలయ ప్రాకారమంత రమణీయ మైనది. స్వాములవారికి చేయించిన వాహనములు ,అలంకార భూషణములు నేటికిని దేవాలయాధికారుల స్వాధీనము నందున్నవి. రాజమహేంద్రవరము వారిచటకు రా నదీ (ప్రవాహమున జలయానముల సౌకర్యమున్నదని వివరించిన సదానంద యోగి మరుదినంబున (ప్రయాణం సాగించి పోయి విజయపురియని చెప్ప బడుచున్న ఇంద్రకీలాద్రి దగ్గర మజిలీ చేశాడు.
విజయవాడ క్షేత్ర మజిలి
నాయనలారా! రాజమండ్రి నుండి బయలుదేరిన మనం కొవ్వూరు యొద్ధ గోదావరినిదాటి నిడదవోలు, ఏలూరు, కొండపల్లి, నగరముల మీదుగ యీ విజయపురిని చేరుకొంటిమి, ఈ నగరము మున్ను మాధవవర్మ యను ధర్మ ప్రభువుచే పాలింపబడినట్లు, నాడీ పట్టణమునకు కనకపురి యనుపేరు వచ్చి నట్లును శాసనముల వలన 'దెలియుచున్నది.
సహ్యాద్రి యందుదయించినదనియు, బృహస్పతి కన్యారాశి యందున్న ప్పుడు పుష్కరిణి యగుచున్నదియు జీవనదియునై న కృష్ణవేణి ఈనగరమునంటి యిచట యింద్రకీలా(దిని రెండు' భాగములుగా విడదీసికొని (ప్రవహించు చున్నది. పూర్యం దుర్గాసురుడు మొదలయిన దుష్ట దానవులను సంహరించిన ఆదిశ క్తి యీ యిం ద్రకీలా(దిమీద కనక దుర్గాదేవియై వేంచేసి వున్నది. ఆ స్థలము కనక దుర్గ మల్లే శ్యర క్షేత్ర మనుచున్నరు... మహిషాసురుని వధించినందున నీమెకు మహిషాసుర మర్థనియనియు నామాంతరము. _ కొండమీదికి చక్కని సోపానము లున్నవి. ఆలయ పాలన క_ర్తలన్నారు. నిత్యము దేవిని దర్శింప యాత్రికులు వచ్చుచున్నారు.
ఈ కొండమీదనే ప్రఖ్యాతిగాంచిన (భ్రమరాంబా సమేత విజయేశ్వర స్వామి దేవాలయము పురాతనమై వున్నది. నాడు కొన్ని మైళ్ళ వైశాల్యమున్న నున్న ఈదేవళ |పాకారమిపుడు పూరిగ హరించిపోయింది. విజయేశ్వ రస్వామి సన్నిధిలో వీరభద్ర , సుబ్రమణ్యే శ్వర, నందీశ్వర, విఘ్నేశ్వర ప్రతిష్టలునుచేయ బడి వున్నవి. అందొక వేయుస్తంభముల మండపంబున్నది. మహాశివరాత్రి ఇచట వైభవోపేతంబుగ రజతోత్సవములు జరుగుచున్న వి.
అవిగాక ద్వాపర యుగమున పాండవ మధ్యముడై న యర్జునుండు తప మాచరించి శంకరునివలన పాశుపతాస్త్రము పౌందినదియు నీ ఇంద్రాకీలా(ది మీదనే నని పురాణములు చాటి చెప్పుచున్నవి, కృష్ణానది కొక్కపక్క యీ ఇంద్రా కీలాద్రియు, రెండప్రక్క సీతానగరం కొండయు గలవు. సీతా నగరం కొండ మీద ప్రసిద్ధమైన గొప్ప సీతారామ దేవాలయమున్నది. ఇంటి స్వామికి వైభ 'వములు జరుగుచున్నవి. కొందరీ దేవాలయావరణమునందు వివాహాది శుభ కార్య ములు చేసికొనుచున్నారు. అచ్చటనొక చిన్న పల్లెనలె ఇండ్లు అంగళ్ళేగాక (పయ్యాణ సౌకర్యములు నేర్పడినై , చాక్షువ మన్యంతరమున బ్రహ్మ దేవుడు యజ్ఞము "సేయుచుండగా సరస్వతీదేవి యేదియో లోపము జరిగినదని ఆగ్రహించి క్రతువు చూడవచ్చిన దేవతలను, మునులనుగూడ “మీరందరు. నదులై పోండని శపించిందట. ఆ కారణమున మహావిష్ణువే కృష్ణానదిగాను-శివుడు వేణి నదిగాను బ్రహ్మ కుముద్వతీ నదిగను రూపములను ధరించి సహ్యాద్రి నుండి భూ పఠనమై (పవహించుచుండ మిగిలిన మునీంద్రులు నారాయణి, కాశిక, ' తులాస భీమ, ముచికుంద, మహావైష్షవి, భద్ర, విశాల్మాది నామములతో ఉపనదులుగా కృష్ణ వేణియందె కలసినట్లు నదీ పురాణములు తెలుపుచున్నవి.
దుర్గాక్షేత్రమైన కృష్ణానది తీరమున ఇంద్రతీర్థము, శివత్రిశూలతీర్థము, శ౦్తఖతీర్థము, బుషితీర్ధము, సోమేశ్వరతీర్దము, (బహ్మ తీర్ధము, నృ సింహతీర్థము, ఫల్లుణ తీర్ధము, ముక్తితీర్థము లెన్నియో వున్నవి. విజయపురి పట్టణమునందెన్నియో సత్రములు-.మఠములు. దేవదేవాలయములను (ప్రసిద్ధిచెందినవి. గొప్ప వ్యాపార 'కేంద్రము. (పయాణ సౌకర్యమున ఇది "పెద్ద కూడలిస్థానము. నగరమును చుట్టు కొని "పెక్కు. గ్రామములున్న వని వివరించిన సదానందయోగి మరుదినంబున (ప్రయాణము సాగించిపోయి కృష్ణనుదాటి మంగళగిరి నృసింహస్వా మిని దర్శించు కొని గుంటూరు, చిలకలూరిపేట, ఒంగోలుమీదుగ పయనించి శింగరాయకొండలో మజిలీ చేశాడు,
శింగరాయకొండ క్షేత్ర మజిలి
నాయనలారా! పూర్వము లంకాపతియైన రావణబహ్మ యేలుబడిలోనే ఈ దండకారణ్య ముండెడిది, రావణుండిక్కడ తన బంధువులు _ అనుచరులై న రాక్షసులను పాలకులుగా నియమించాడు. రామాయణకాలం నాటికి కరదూషణాదు లిచిట పెత్తనపుదారులై యున్నారు. కర్నాటనుండి దేశమంతయును నాడు కర దూషణులనువారే పాలించిరనియు, ఇచ్చటకు పడమరగనున్న సేనంపాలెమనబడు చోటున వారి "సేనా నాయకుండు కాపురముండెననియు చెప్పబడుచున్నది. దానికి చేరువలోనున్న ముచ్చేరుననునదికి సీతాదేవి బుకుమతియైన నాల్లవనాడు స్నాన మాడినపుడా నీటిచే నేర్పడినదనియు జనవదంతికలదు. ఆ కాలమునందిచట పర్య టించిన రామలక్ష్మణులు కరదూషణుల వధించినారనియు రామాయణము తెలపు చున్నది.
సింగరాయకొండ మీద నాడు శ్రీరామునిచే ప్రతిష్ట చేయబడిన నర సింహమూర్థి వున్నది. దాని కించుక దక్షిణిముగ ఇందిరా మందిరములున్న దేవాలయ గోపుర మేడంతస్తులతో నిర్మింపబడినది. కోవెల వెనుక భాగము నందొక భవనాశనియను పుష్కరిణి వున్నది, అదొక గుహయు గుహముందొక యమ్మ విగ్రహములు కలవు, గుహలోపల శయనించిన (శ్రీరామచంద్ర విగ్రహ మును కలదు, ఈ గుహపొడవు చెప్పవలయు ననినల యిచేటికి పశ్చిమంబుగా నున్న వేదగిరియందలి నృ సింహమూర్తి మందిరము వరకు నున్నదని పసిద్ధి వినబడు చున్నది. ఈ గుహయందే యించుక భీతిగొలుపు నరసింహాకృతి కూర్చొని వున్నది. నాటి కరాసురుడీ మూర్తి నారాధించెడి వాడట.
తూర్పునందొక క్రోసు దూరమున కరాటి సోటను కొండచోటున్నది. ఆది సమ్ముదమువంటి పై భాగమున కోసు కోసున్నర వై శాల్యమున సమతల ముగా నున్నది. వాటి కరాసుర రాజధాని యదియేనట. నరసింహస్వామి ఉగ్ర మూ రియై నందువలన వాని దృష్టివలన ప్రజల ఉపకారము కలుగరాదని తలంచి నారదముని యీ నరసింహుని శాంతమూరర్తినిచేసి పతిష్టగావించినట్లొక జన వాక్యము కలదు.
పశ్చిమో త్తరములుగ ప్రవహించు పెన్నా నదియు శింగరాయకొండనంటి పారుచున్నది. పెన్నానది యొక్క రెండవపేరు పినాకిని, జొన్నవాడ యందు కామాక్షి మల్లిఖార్జునస్వామి వేంచేసి వున్నాడు. బొగ్గేరు, చెయ్యేరులు రెండును వచ్చి 'పెన్నలో కలియు కూడలియందు. సంగమేశ్వరాలయ మున్నది. కృత యుగంబున కశ్యపబ్రహ్మ యీ ప్రాంతమునందు యజ్ఞ మొనరించి నపుడు పినాకీ నదికి దక్షిణమున వేంచేసివున్న రంగనాయకస్వా మిని.జొన్నవాడ కామాక్షి మల్లి ఖార్జున స్వామిని, వేదగిరి నరసింహస్వామిని, నెల్లూరు మూలస్థానేశ్వర స్వాము లను గూడ ప్రతిష్టలు చేసినట్లు వినుచుంటిమని వివరించిన సదానందయోగి మరు దినంబున (పయాణము సాగించిపోయి శ్రీకాళహస్తిలో మజిలీ చేశాడు.
శ్రీ కాళహస్తి క్షేత్ర మజిలీ
నాయనలారా!శ్రీ కాళహస్తిని కైలాసము _ భూతల కైలాసము _ శ్రీపురము-విష్ణుపురము...మండలేశ్వర మనియు పిలుచుచుందురు, శ్రీ కాళహస్తీ శ్వర స్వామి మహాత్మ్యము గొప్పదిగనే వర్ణింపబడినది. కొండమీద దేవాలయ ప్రాకార గోపురము ప్రఖ్యాతి గాంచినది, ఈ స్వామిని వాయులింగమందురు. ఆది సయంభవు పర్వతం నంటుకొని మహా (పభావంగల సువర్జ ముఖినది పవ హించుచున్నది.
స్వామి సన్నిధిలో (శ్రీవారి దేవేరియైన జ్ఞాన (పసూనాంబయు సుప్ర సన్న వదనయై దర్శన మిచ్చుచున్నది. ఈ క్షేతము నందెన్నియో పుణ్యతీర్థ ములు, దివ్యస్థలములు, దేవతామూర్తులు, వానికిగల ఇతిహాసములు గలవు, కాళ హ_స్టీశ్వరుని సేవించి ధన్యులై న వారెందరో వున్నారు.
పూర్వకాలమున లింగము గుడియందుగాక బహిరంగమున సున్నపు డొక సాలీడు స్వామియండు భక్తి కలిగి యెండ తగలరాదని తలంచి నీడపడునట్లు పై నున్న చెట్టుగొమ్మల నాస్కారము చేసికొని తన నూలిపోగులతో వలనల్లి నది, వరమేశ్వరుడు దాని 'సేవకానందించి మోక్షమిచ్చినాడు. అటులనే మరికొంత కాలంబున కొకపాముయు నాగలోకమునుండి మణులనుదెచ్చి సమర్పించుచుం డెడి దనియు, ఒక యేనుగు |ప్రతిదినము: తొండముతో జలము తెచ్చి లింగము నభిషే కించు చుండెడిదనియు, శంకరుడా పాము, ఏనుగులకు (పసన్నుండయ్యెననియు పురాణములు 'తెలుపుచున్నవి. ఆ మువ్వు రివలననే ఈ దేవుడు శ్రీ కాళహస్తి శ్వరుడని "పేరుగల వాడయ్యాడు. శ్రీ యనగ సాలెపురుగు_.కాళమనగా సర్పము హస్థియనగా ఏనుగు, కావున సః శ్రీ శ్రీకాలహాస్తీశ్వర క్షేత్రమయింది.
మహాభ_క్త కన్నప్ప చర్మితయు కొనియాడదగినది. కన్నడొక బోయ 'వోనీ కుమారుడు. ప్రధమంగ నీ లింగమును చూచినప్పుడే వాని మూఢభ క్తి ఏర్ప డింది. “ఏం స్వామీ! ఈ -యడవిలో నొంటిగ నుంటి వేమి? నీయం దెవరునులేరా! పోని అన్న మైనను తింటివా? అయ్యో ! మాటలాడకుంటివేమి? ఆకలివేయు చున్నదా!” అని అడవిలోనికిపోయి దుప్పిమాంసము లింగము ముందుంచి తిన, మన్నాడు. ఆయననుండి సమాధానం రానందున “నీవు తినేదాకా నేనూ ఏమీతిన” నని పట్టుబట్టి కూర్చున్నాడు, పరమేశ్వరుడంతట వాని భక్తి పరీక్షింప నెంచి లింగమునందే యొక కంటివెంట నీరు కారుచున్నట్లు కనపడేలాగా చేశాడు. అది చూచిన కన్నప్ప జాలిపడి “నీకన్ను దెబ్బతగిలినదా! నాకామాట చెప్ప వే”మంటూ తన చేతియందున్న బాణంతో తన కంటి(గుడ్డు పెకలించి యా నీరు కారుచున్న కంటిమీద నుంచుగనది శివమాయవలన నిల్‌చిపోయి రెండవకంట నీరుకార మొద లయింది. కన్నప్ప తన రెండవ గుడ్డు గూడ ఇచ్చెదనని చెప్పి మరలబాణముతో తన రెండవృగుడ్డు "పెకలింపబోవు సంతలోశ్రీ కాళహస్తీశ్వరుడు నిజరూపమున దర్శనమిచ్చి ! వత్సా ;సాహసింపకు”మని వానికనేక వరములనిచ్చి యదృశ్య మయ్యాడు.
తరువాత కన్నప్పకు కైలాసము సిద్ధించింది. జ్ఞాన ప్రసూనాంబా శ్రీకాళహస్తీశ్వరస్వామి మహిమనెన్లైన్ని చెప్పినను తరిగేవికావని వివరించిన సదానందయోగి మరుదీనంబున ప్రయాణము సాగించిబోయి తిరుపతిలో మజిలీ. చేశాడు.
తిరుపతి క్షేత్ర మజిలీ
నాయనలారా! తిరుపతి వెంకన్న "పేరు తెలియనివారుండరు. ఈ ఏడు కొండల 'వానికివచ్చే ఆదాయం ఇంకొక క్షేత్రమునందెచ్చటను లేదు. ఇచ్చట పాలనాధికారులు దేవుని సోమ్ము వెచ్చించి ధర్మసత్రములు మొదలైనవానిని నెల కొలపడమే కాకుండా మంచి కళాశాలను నడుపుచున్నారు. బీద కవుల రచనలు ముద్రణకుగాను ధనసహాయమును విరివిగ చేయుచున్నారు. యాత్రికుల కెన్నియో వివిధ సౌకర్యములను కలిగించుచున్నారు. ఉచిత భోజనములను బెట్టుచున్నారు. సర్వ విధముల క్షేత్రాభివృద్ధికి తోడ్పడుచున్నారు.
దిగువ తిరుపతి నుండి యెగువ తిరుపతికి దేవాలయమువారును (పత్యేక ముగ బస్సులను నియమించియున్నారు. కావలసిన బోజన హోటలులు, విశ్రాంతి భవనములు, [గంధాలయములు, చలనచిత్ర ప్రదర్శనశాలలు, వై ద్య నిలయములు, 'అంగడులు కూడ తిరుపతియం దెక్కువగ, నున్నవి. అన్ని వై పులనుండి రాకపోకల కనువైన బస్సులేగాక కొన్ని రైలు వసతులున్నవి.
కొండమీదాలయ గోపురంబులకు బంగారు కలవని చెప్పుదురు. స్వామి వారి యాభరణాల విలువగట్టుట సామాన్యముకాదు. ధర్మదర్శనమునకై (ప్రజలు క్యూలో బారులుతీరి గంటల తరబడి నిలుచుందురు. (మొక్కుబడులు చెల్లించుటకు వై భవములు చేయించుటకు కూడ కమిటీవారు నిర్ణయించిన రుసుములు చెల్లించ వలయును. ఆధికారులు నిర్ణయించిన రొక్కములిచ్చి స్వామి సన్నిధిలో వివాహ ములు చేసికొనువారి నందరను వరుసగ కూర్చుండబెట్టి దేవాలయమువారే వారి భజంత్రిలు..పురోహితులతో కళ్యాణములను జరిపించుచున్నారు.
ఒకానొక సమయుబున మాళవదేశ మందలి కళ్యాణపురమునకుచెందిన ధర్మపాలుండను "పేరు కలిగిన విశ్వకర్మ బ్రాహ్మణుడు కంచుపాత్రలను విక్ర యింప తన పరివారములతో కాంచీనగరమునకు బొవుచు నొకనాటి రేయి శేషా చలమునకు దగ్గరలో శయనించినట్లను, వారి స్వప్నమునందొక దివ్యపురుషుండు కనపడి “ఆచార్యా! మీకు సమీపమునంచే యున్న స్నుబమణ్యేశ్వ రాలయమందలి యంత్రములు నేడు ధనాకర్షణ జనాకర్షణమును కోల్పోయి యున్నందున నీవు వానిని సంస్కరించి పున :ప్రతిష్టలు "సేయు”మని చెప్పినట్లును, మరు దినంబున ధర్మపాల శిల్పి బ్రహ్మ స్నానసంధ్యాది [క్రియలు నెర వేర్చికొనిన తరువాత వేద మంత్రములను పఠించుచు పురాతన యంత్రములను వెలికి దీసి నూతన యంత్ర ముల ననుసరించిన నాటి నుండియే క్షేత్రమిట్ల భివృద్ధి పొందునట్లు నొక ప్రబంధ ప్రమాణమున్నది.
ఆదినుండి శేషాచలము మూడు భాగములుగా కలసియే యున్నదట. అందు దక్షిణ భాగమున బహ్మయు, మధ్యభాగమున అహోబిల నరసింహ మూర్తియు, ఉత్తర భాగమున మల్లి భార్జునులు కొలు వైయున్నారు. ఒకప్పుడు దక్షిణము నందున్న మల్లికార్డునునిచూడ నుత్తరమునకు పోయినప్పుడు కుమార స్వామి (బహ్మతో “నీవెవర”వని యడుగ చతురాసననుండు నేను“సృష్టిక ర్త”నని బదులు చెప్పినందున స్కంధు డాగ్రహించి (బ్రహ్మ దేవుని కారాగారమున బంధించి తానే స్వతం[తించి స్పష్టి చేయబూన పూర్వము బ్రహ్మయున్న స్థానము నాక్ర మించినట్లొక కథ తెలుపుచున్నది. ఆ కుమారస్వామియే యీనాటి వేంకటేశ్వర స్వామిగ పఖ్యాతి గాంచాడు.
కాని (ప్రచారము నందున్న వేంక'టేశ్వరుని చరిత్ర ఇందులకు విరుద్ధ ముగ జనవాడుక యందున్నది. ఒకానొక సమయంబున శ్రీలక్ష్మి "పెనిమిటి మీద' అలిగిపోయింది. (శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడై వేంకటాచల ప్రాంతమున దిరుగు చుండగ వరహస్వామి మిత్రుడయ్యాడు. వకుళమాత తల్లిగా నాదరించింది.శ్రీ నివాసునకు ఆకాశ రాజు కుమార్తె పద్మావతితో మహావైభవంగ వివాహం జరిగింది. పద్మావతి పినతండియైన తొండమానుడి వేంకటాచలంమీద నిర్మించిన మందిరములో శ్రీనివాసమూ_ర్తి లక్ష్మి పద్మావతితోసమేతంగ వేంచేసియున్నాడని వివరించిన సదానందయోగి మరుదినంబున (పయాణము సాగించిపోయి కాంచీ. పురములో మజిలీ చేశాడు.
కాంచీపుర క్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ కొంచీపుర మాహత్మ్యమును గురించి యెంత చెప్పి నను తరుగదు. ఐనను చేతనై నంత దనుక మీకెరిగించెదను. ఇందున్న దేవత లందరిలో యేకామ్రేశ్వరుడు ముఖ్యదై వము. కృతయుగంబున పార్వ తీపరమేశ్వ రుడు ముఖ్యదై వము, కృతాయుగంబున పార్వతీ పరమేశ్వరు లిందువిలాసముగ సంచరించిన సమయము _ ఓకానొక సమయంబున గౌరీదేవి నవ్వులాటకు శంకరుని రెండు కన్నులు చేతులతో మూసింది. శివుడంతట “పార్వతీ! నీవు నాతో పరిహాసము లాడ దగినదానివే కాని కొంచమైనను యోచింపలేక పొరపాటు చేశావుగద।
నా నేత్రములు రెండును సూర్య చంద్ర స్వరూపములని నీకును తెలి యును, నా కనుల మూసినంత కాలం ప్రపంచమున వెలగులేక గాఢాంధకార మావరించింది, ఇది దేవమానమున మనకు స్వల్పకాలమైనను మానవకాల (పమాణమున యుగములు 'గడచిపోయినవి. సూర్యచందుల వెలుగులేక ఎందరో నిత్యాహార పానాదులకు అలమటింప పాపము నీకు సంక్రమించింది. సుమా” అన్నాడు,
పార్వతి కపుడు నిజం తెలిసింది. తనకు చుట్టుకొనిన పాపమును పోగొట్టుకొనుట కీశ్వరుడు తెలిపిన చందంబున ఈ కాంచీ క్షేత్రమునకు వచ్చి యొక మామిడి చెట్టుక్రింద చాలాకాలం తపసు చేసింది. ప్రియురాలేమి చేయు చున్నదో చూడవలయునని పరమేశ్వరుడిచటకు మారు రూపమున వచ్చినందున చోరేశ్వరుడని చెప్పబడుచున్నాడు. తరువాత శంకరుడామెను లాలించి గాఢా శింగనము చేసికొని యిందే ప్రతిమగా నిలిచిపోయెనట, వారు మామిడి చెట్టుక్రింద నున్నందున నీ స్వామికి ఏకామ్రేశ్వరుడని పేరు వచ్చింది. ఆ పాంతము లీ మామిడిచెట్టు చాలా కాలము నాటిదని చెప్పుచున్నారు.
ఏక్కామేశ్వ రాలయమునకు ఆగ్నేయముగా కొలది దూరమున కామా క్షామ్మ దేవాలయమున్నది. ఆలయమునకు నాలుగు గోపురములు. దేవి ముఖము గంభీరముగా నున్నది. గర్భాలయమునకు చేరువలో (శ్రీ శంకరాచార్యులవారు నెల కొల్పిన (శ్రీ చక్రమున కనుదినము పూజలు జరుగుచున్న వి. కామాక్షి దేవాలయము నకు వెనుక నున్న తీర్థమునందు ప్రజలెక్కువగ స్నానములు 'సేయుదురు.
ఇంకొక విశేషమేమనగ_లక్ష్మి పార్వతీ దేవతలు ఒకప్పుడు లక్ష్మీ పార్వతీ దేవతలు “నా పెనిమిటి యెక్కువనగ _ నా పెనిమిటి యెక్కువ ” అని వాదులాడారు. వారిరువురకు తీర్పు చెప్ప నియమితురాలై న సరస్వతీదేవి “హరి హరులలో యెవరింతకు ముందెన్నడును విని యుండని కొత్త కధ చెప్పుదురో వారధికు”లని నియమింపగా వారు లిద్దరు సరేనని యొప్పుకున్నారు. కధ చెప్పు టకు౦ దగిన స్థలము కూడ నిర్జయింపబడింది. యెవరి యిండ్లకు వారు వెళ్ళి పోయారు.
లక్ష్మీ దేవి పట్టుదల వలన మహావిష్ణువు శంకర సన్నిధియందున్న సంగ మేయుండను పరిచారకుని రహస్యముగా పిలిచి, “నీవు పార్వతికి పర మేశ్వరుడు చెప్పెడి కథలను చాటున నుండి విని వెనువెంటనే వచ్చి ఇందిరకు చెప్పవలియు” నని మొగమాట పెట్టినందున నాతడ పని చేయబూనాడు.
[ప్రతిదినము శంకరుడు గౌరికొక కధ 'చెప్పుటయు _ దానినా పార్వతి వేదికమీద సగము కధ చెప్పునంతలో లక్ష్మందుకొని"“ఓస్1 యిదియేనా!” అని మిగిలిన కధనంతయు పూర్తిచేయుటయుగాక ముప్పదిరెండు దినములు గడచినై , ప్రార్వతి (ప్రయత్నములు ఫలించుటలేదు. శంకరుడు దివ్యదృష్టితో చూచి సంగ 'మేయుని నాడు కైలాసమున నుండనీయక దూరముగా పంపిన పిదప పార్వతి కింకొక కొత్ర కధ చెప్పాడు. ఆ దినమున సంగమేయుని సాయము పొందలేక పోయిన యిందిర పందెము నందోడిపోక తప్పలేదు.
కాత్యాయని తను నింతకాలము వంచించిన నారాయణుని సంగమేయునని గూడ “మీరు మానవులై భూలోకమున బుట్టు”డని శపించింది. అందున నారా యణుండు వ్యాస భగవానుడై యవతరించి భారత భాగవత పురాణములను రచిం చాడు. నాటి ముప్పది రెండు కధలు బృహత్క_ధామంజరి యను 'పేరును ప్రసిద్ధి కెక్కింది. కపటముగ సంచరించిన లక్ష్మి దేవియు అమె కనుకూలముగ సంచరిం చిన సరస్వతియుగూడ పార్వతి కిచ్చట వింజామరలు వీచుచున్న దృశ్యము “ఏలాంకాంబయని చెప్పబడుచున్నది.
నాయనలారా! ఈ కాంచీపురము నందలి విశ్వ(బాహ్మణ వీధిలో నొక కామాక్షి దేవాలయమున్నది. ఆ యమ్మవారి పాదముల క్రింద మూడు తలలు కనపడుచున్నవి. అవి ధర్మపాలుని కుమారులు. నిరంతరం కామాక్షి పాదపూజా దురంధరులై న రుద్రసేన, వీర సేన, భద్రసేనులవారి తలలు, వానిని గురించిన కధ కలదు.
ధర్మపాల చరిత్రము
మాళవదేశ మందలి కళ్యాణపురమున ధర్మపాలు డను పేరుగల విశ్వ వర్మ బాహ్మణుడున్నాడు. వానికి నలుగురు కుమారులు, నిత్య శివపూజా నిరతు లైన వారు పతి శుక్రవారము కామాక్షి దేవి పూజచేయు దీక్షగలవారు. వారు 'వేద వేదాంగములు చదివిన పండితులు, పంచశిల్పాచార్యులు, కంచు ఇత్తడి పాత్రలు గొప్ప పనితనముగ నిర్మించి బంగారముతో సమానముగ విక్రయించు చున్నారు. వారొక సమతలంబున వ్యాపారమునకై కాంచీపురము పోవుట తట స్థించింది.
కాంచీపురము నేలు రాజుగారి కుమారి కోరినందున మం[తిసూరన ధర్మ పాలుని యంగడిలోని కంచు దర్పణముల రెండింటిని కొని వాని మూల్యమునీయక నిరాకరించాడు, రాజాయు మంత్రి చేసిన దుర్బోధలాలకించి శిల్పకుమారులను పరాభవించినందున యుభయులకు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ పోరా టంలో కామాక్షిదేవి యనుగ్ర హం కలిగిన శిల్పి (బ్రాహ్మణులే రాజు సై న్యములను చంపగలిగారు. చోళాంగునికి చిన్నతనమయింది...చిన్నతనంతోబాటు చింత కూడా పట్టుకుంది.
మంతి కపటం పన్ని అతి వినయం చూపి క్షమాపణలుగోరి“రాజుగారు మిమ్ము సత్కరింప పిలుచుచున్నా”రని నమ్మించి శిల్పి కుమారులను మువ్వురను రాజభవనంబునకు గొనిపోయిన తరువాత వారిని కుత్తుకులలోతు దీసిన గోతులలో పూడ్చి పెట్టి తలలు సరికించారు, ఆ శిరములు నేలమీద పడక ఎగిరిపోయి గగన మార్గమున దిరుగాడుచు తండ్రిగారిని పిలిచినై. ఆ భయంకర దృశ్యము చూచిన ధర్మపాలుడు కామాక్షి దేవాలయమునకు బోయి“యిదియేమి యన్యాయముతల్లి!” అని వాపోయాడు, కామాక్షిదేవి కోపంతో చూచినంతనే మంటలుపుట్టి నగరమంతా గాల్చివేయు పరిస్థితి సంభవించింది. చోళాంగ మహారాజు తన పరివారంతో గూడ వచ్చి -ధర్మపాలుని పాదాలమీద బడ్డాడు
ధర్మపాలుని ప్రార్ధన మన్నించిన కామాక్షిదేవి మంటల చల్లార చేసింది, ఆమె తెప్పించిన పళ్ళేములోనికి రుద్రసేనాదుల తలలు వచ్చి నిలచినై, రాజ కోటలో నరికి వేయబడిన శిల్పకుమారులకు దేవి సంకల్పమున తలలువచ్చి వారు లేచి వచ్చారు. పళ్ళేరమందున్న తలలు దేవి పాదములక్రింద వెలసినై . నేటికిని యీయమ్మ వారి పాదముల్మక్రింద మనకామూడుతలలు దృష్టాంతరముగా కనపడు చున్నది.
ఈ మూడు తలలు పాదముల క్రింద నున్న కామాక్షిదేవి చాలచోట్ల మహామాయాదేవిగా వేంచేసి యున్నది. మహామహిమగల మహామ్మాయి దేవా లయము లెక్కువగా తెలంగాణాకు చెందిన పోచంపాడు, మంగళంపల్లి, పెద్దకశ్ళే పల్లి, సిద్ధిపేట మొదలై న గ్రామాలలో వెలసియున్నవి, నెల్లూరు మండలానికి చెందిన కందుకూరు నందును యీతలమ్మ విగ్రహమునకు పాదముల క్రింద నీ మూడు తలలు కనపడుచున్నవని యెరింగించాడు.
నాయనలారా! పూర్వ మొకప్పుడు లక్ష్మిదేవి యీ [పపంచమునకంతకు నేనే ముఖ్యమైనదాననగ సరస్వతియు నేనే ముఖ్యమైనదానినని వాదమాడింది. ఆ విషయ తెలిగిన బ్రహ్మ దేవుడు సరస్వతిని మందలించి నీ వెంతచదవరివైనను లక్ష్మి ధనవంతురాలుగద. కవులు పండితులు శ్రీమంతులను యాచింపవలచినవారే” నని పలికినందున సరస్వతి భర్త మీద అలిగి నదియందు కలిసిపోయింది. భార్య తనచెంత లేనందున బ్రహ్మ మనసు వికలమై యుండగ ఆకాశవాణి “విధాతా నీవు సత్యవ్రత క్షేత్రంబుగు కాంచీపురంయందు వేయి అశ్వ మేధయాగములు చేసి నచో నీకి చిత్తచాంచల్యము తీరగలదని హితబోధ చేసింది.”
చతురి్మఖము సంతసించి కాంచీపురం నందు యజ్ఞం చేయ ప్రారంభిం చాడు. ఆ యజ్ఞానికి సర్వలోకములందలి మునులు దేవతలంతా వచ్చారు.. వశిస్ట , మహాముని స్వయాముగపోయి సరస్వతిని భ_ర్తదగ్గరకు రమ్మని పిలిచాడు. కాని ఆమె నిరాకరించింది. అంత పరమేష్టి సూర్యదేవుని పుత్రికయైన సావిత్రిని ధర్మ పత్నిగ స్వీకరించి-ఆమెను తన వెంటనుండగ యజ్ఞం'జేయ మొదలు పెట్టాడు,
ఆ యజ్ఞ సమయంలో దేవతలకు జరుగుచుస్న మర్యాదలు తమకు జరు గుట లేదని గొడవలు "పెంచుకొన్న రాక్షసులు వెడలిపోయిన తరువాత సరస్వతిని (పసన్నురాలిని చేసికొని “అమ్మా! నీ పెనిమిటి నీవుగాక యింకొక స్త్రీని నీ స్థానము నందుంచుకొని సవనము సేయుట మీకంగీకారములే”దని మాటాడినందున వారు మమ్ము సభనుండి లేచిపొండని పరాభవించారు. “ఇంత యన్యాయమెందైన నున్నదా, ఐన యీ సమయంబున, చేతగాని వానినట్లు దూరముగా పడియుండక నీ గౌరవము నిల్చుకొను”మని చెప్పుట కే మేము వచ్చినారమని చాడీలు చెప్పారు.
చెప్పుడు మాటలా లకించిన సరస్వతిని సహ్యాద్రి మీదికెక్కి అక్కడ నుండి నదీరూపమున భయంకర "ఘోష చేయుచు యజ్ఞశాల చెంతకు పరుగిడి వచ్చుచున్నందున్న వారందరెటు వారటు పారిపోయారు. నారాయణమూర్తి మాత్రము దై ర్యంతో నదికడ్డముగ శయనించాడు, మహావిష్ణువునుచూచి సరస్వతి బిడియపడి వెగవతియను చోటున రెండు పాయలుగ చీలింది, తరువాత వానినుండి కలిగిన యుపచీలికలె |స్రంప కంప శు క్హిక కనక అసమంజస చండవేగయను నామముల ధరించింది. అటుపిమ్మట సరస్వతినే కళత్ర స్థానమునందుంచుకొని మిగిలిన యజ్ఞములు బ్రహ్మ పూర్తిచేశాడు. (శ్రిమన్నా రాయణుండు సరస్వతి బ్రహ్మలకు పత్యక్షమై “మీరు యజ్ఞమొనరించిన యీ పుణ్యస్థలము నందే నేను వరదుడనై యుండు”నని వరమిచ్చాడు.
అటులనే రమా రమణుండు కాంచీ క్షేత్రమున వరదరాజ స్వామి. నామముధరించి దేవేరిమైన 'పేరించేవి తాయారుతో గూడ వెంచేసియున్నాడు. ఆ దేవున కానాటినుండి యీనాటి వరకును దినపూజ, పక్షపూజ, మాసపూజలే కొక సాంవత్సరీకోత్సవము లతివై భవముగ జరుగుచున్నవి. వివిధ వాహనాలంకార ములతోను, సూర్య చంద్ర ప్రభలతోను, జరుగుచున్న వై భవములు వర్ణ నాతీత ములు, ముక్తి, పదములై న అయోధ్య మధుర మాయా కాశీ కంచి అవంతిద్వారం యను క్షేత్రము లేడింటిలోను యీ కాంచి కగ్రస్థానము లభించింది.
ఇందు పదునెనిమిని విష్ణు ఆలయములునూట నాలుగు శివాలయములు. యిరువనొక్క తీర్ధములు-పరాశ బిలము, మామిడిచెట్టు "పెద్ద పుట్ట మున్నగున. "వెన్నియో ప్రఖ్యాతిగాంచినవని వివరించిన సదానంద యోగి మరుదినమున ప్రయాణం సాగించిపోయి పక్షితీర్థంలో మజిలీ చేశాడు.
పక్షితీర్ధం క్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ పక్షితీర్థమను స్థలము చెంగల్పట్టునందున్నది. కృత యుగము నందొకప్పుడు సర్వసంగ పరిత్యాగులు.జితేం ద్రి యములునై స యెనిమిది మంది మహామునులకు (ప్రపంచ భోగముల ననుభవింపకోర్కె కలిగి ఈకొండమీద తపమాచరింపగ పరమశివుడు ,పత్యక్షమై “మీకేమి కావలయు”నని యడిగారు. 'మునులంతట నిజమును చెప్పలేక తటపటాయించుచు. “మాకు మీ సేవయే కావ లయు”నన్నారు. కాని సాంబశివమూ_ర్షి వారి మనసులోని మమకారము |గహించి నందున “యోగేం[దులారా! నేను మీ నిజసంకల్పము తెలిసికొంటిని, మీ మెనమండుగురును యెనిమిది పక్షులై జన్మింపుడు, ఒక్కొక్కంయుగమునందిద్దరు రెండుపక్షుల చొప్పున (పతిదినము గంగాస్నానము చేసివచ్చి నా (పసాదమును తినిపోవుచుండుము. ఆ తరువాత జన్మమున మీరు మోక్షం నొందగలరని తెలిపి యదృశ్యుడయ్యాడు.
శంకరునిచే నాజ్జాపింపబడిన యామునులే కృతయుగంబున పూషవిధాత లను పేరుగల పక్షులయ్యారు. త్రేతాయుగమున సాంపది జటాయువులను "పేరుగల పక్షులయ్యారు. ద్వాపర యుగమున శంభుగుప్త మహాగు ప్తులను పేరుగల పక్షు లయ్యారు. ఈ కలియుగమున శంబర శంబరాదులను "పేరుగల పక్షులై ప్రతి దిన మును గంగాస్నానముచేసి ఇచ్చటకు వచ్చిపోవుచున్నారు. యాత్రికులు ఉదయం కాలకృత్యముల దీర్చుకొనిన తరువాత పక్షి తీర్ధంలో సుస్నాతలై కొండ నెక్కిపోయి స్వాములవారికి పండ్లు, పూలు కర్పూర ములు సమర్పించిన కొంత సేపటికి దేవాలయమునకు సంబంధించిన పక్షి పండారం వారు వచ్చి భక్తాదులిచ్చిన విరాళములను సేకరించి చక్కెర పొంగలి కలశమును ఘృత పాత్రలను 'వెంటగొనివచ్చి స్వామివారికి కైంకర్యముచేసి పూజావిధానము ముగించెదరు . తరువాత పూజారు లొక వేదికమీదను _ యాత్రికులు వేరుగ కుర్చొని యుండ రెండు రెండు యామములగునప్పటికి గగన మార్గమునుండి రెండు పక్షులువచ్చి; వాని కీయబడిన పొంగలిని తీని.నేతిని తాగి; తిరిగిపోవును అనంతరము నా (ప్రసాదము నందరకు పంచి పెట్టుదురు,
[పతి పన్నేం డేండ్ల కొక పర్యాయము ఈ వేదగిరియం మన్న ఇంకొక దివ్యస్థలం. రుద్ర కోటీశ్వర క్షేత్రము. అచట వింతలు జరుగుచుండుటయు సంప్ర దాయము. దేవాలయ పెత్తనపుదారికి మొదట స్వప్నమగును. మరు దినంబు నందొక మంచి ధ్వని వినపడును. అంతట నా యధికారి శంఖ తీర్థములో స్నాన మొనరించివచ్చి పరిసరంబులందు వెదుకుచుండగ వారికొక మహశంఖంకనబడును, వారా శంఖమును భక్తి శ్రద్ధలతో నెత్తి బంగారుతొట్టి యందుంచి కొండమీద' వేద గిరీశ్వరస్వా మి సన్నిధికీ మహోత్సవంలో తీసికొనిపోయి స్వా మి ముందుంచి' పూజించెదరు. ఇంతకు పూర్వమున్న శంఖముతోనిక పనియుండదు. కనుక వెనుకటి శంఖములన్నియు దేవాలయమునందు గుట్టబడియున్న వి.
పూర్వము చొక్కమ్మ యను కన్య నిచట తపసుచేసి, (ప్రసన్నుడైన యీ రుద్రకోటీశ్వరునే వివాహమాడి ఈ వేదగిరిమీద కాపురమున్న దని, అందు లకు కోపించి |తిపుర సుందరీదేవి ఈ ' కొండదిగి వచ్చినదనియు, స్వాములవా రంతట నొకభక్తుని దేవిచెంత తోడుండమని నియమించి వారు మాత్రము (ప్రతి దినము (త్రిపురసుందరి దగ్గరకువచ్చి పోవుచుందురను నొక కథ వినబడుచున్నది, అట్లు అమ్మవారి దగ్గరకు వచ్చిన స్వామియే దిగువ తిరుపతియందలి 'పెద్దగుడిలో నున్న భ_క్తవత్స లేశ్వరుండని ప్రసిద్ధి కెక్కినట్లును, చొక్క మ్మ చొక్కా.నాయకి 'యైనదనియు తెలియుచున్నది.
(పతి చైత్రమాసమున స్వామికి బ్రహ్మోత్సవములు జరుగుచున్న వి. ఆ సందర్భమున దేవతామూర్తులన్నింటిని వేదగిరిచుట్టు నూరేగింపు చేయించు దురు, వేదగిరిమీద సంజీవి మొదలైన దివ్యయోషదులున్నవని నమ్మి వర్షా కాలమునందా చెట్ల పైబడిన నీటిచే నేలయు పవిత్ర మైనదని చాలామంది నమ్ము చున్నట్లు వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణము సాగించిపోయి చిదంబరలో మజిలీ చేశాడు.
చిదంబర క్షేత్ర మజిలి
నాయనలారా! చిదంబర మొక గొప్ప శివక్షేత్రము. ఇచ్చట సటరాజ స్వామి ముఖ్యదై వము, చిదంబరమునకు సమీపము నందున్న పల్లె గ్రామంబున నందుడను పంచమ బాలుడున్నాడు. . వానికి సటరాజమీద మొదటినుండి భక్తి శ్రద్ధలెక్కువ. అది తెలిసికొనలేనివారు నందునికి పిచ్చి పట్టినదన్నారు. నందు 'డెంత స్వామిని చూడాలని తహతహలాడినా యజమాని వానిని చిదంబరం పంప డానికి ఇష్టపడలేదు.
చివరికెట్లో కాపు యనుమతి తీసికొని నందుడు చిదంబరం చేరుకున్నాడు. కాని కడజాతి వాడై నందున వానిని దేవాలయంలోనికి రాకుండా పూజారు లటకా యించారు. ఐనా దూరాన నిలువంబడిన నందుడు జనంలోనుండి తొంగి చూచు చున్నాడు. వాని భక్తి కానందించిన నటరాజు తన కెమరుగనున్న నందీశ్వరుని కొంచెం (పక్కకొదుగుమన్నాడట, నేటికి (పక్కకొదిగిన నంది మనకక్కడ కనబడుతూంది. ఆ రాత్రి నటరాజస్వామి పూజారుల కలలో కనబడి “నా భక్తుని తీసుకురండి” అని చెప్పాడు. మరునాటి యుదయ మా (బ్రాహ్మణులు నందుని చేరి *అబ్బాయీ! నిన్ను స్వామి దర్శనానికి తీసుకుపోవచ్చాం. కానీ ఇలా కాకుండ పవిత్రమైన అగ్నిలో ప్రవేశించిరావడం మంచి” దన్నారు. నందు డందులకైనా సరేనని నిప్పుల కుండంలో దూకి కొంత సేపటికి విభూతి రేఖలు పట్టుబట్టలతో శివమూర్తిలా వెలుపలకువచ్చి నిలబడ్డడు. దేవాలయాధికారు లంతట నందుని క్షమాపణలు వేడుకొని నటరాజ సన్నిధికి తీసుకొనిపోయారు. ఇది మహాభక్త నందుని కధ.
ఆలయమున నటరాజస్వామి దర్శనమిచ్చుచున్నాడు, వారి దేవేరిమైన శివకామ సుందరీదేవి బంగారు ప్రతిమయై భర్త వంక క్రీగంట చూచుచున్నది. దంపతులిద్దరూ దక్షిణాభిముఖులై యున్నారు అమ్మవారికి తూర్పున స్వర్ణ బైరవస్వామి వేంచేసి యున్నాడు. దేవాలయంబున కైదు (పాకారములు. వెలు పలి (ప్రాకారంబునకు నాలుగు వైపుల నాలుగు గోపురములున్నవి.
ఐదు ప్రాకారములలోను వరుస క్రమముగ చిత్సభ-కనకసభ రాజ సభ-నర్తకసభ-దేవసభ లున్నవి. మొదటిదైన చిత్సభయందు కామసుందరీ సమేతంబుగ చిదంబర తాండవమూర్తి నెలకొనియున్నాడు. రెండవదై న కనక సభయందు నిత్యారాధనలు జరుగుచున్నవి. మూడవదైన రాజసభయందు. వేయి నాళ్ళ మంటపమున్నది. నాల్లవదైన నర్తక సభయందు ఊర్ధ్వతాండవేశ్వరులై యున్నారు. ఐదవదై న దేవసభయందు వినాయకుడు స్ముబ్రహ్మణ్యేశ్వరుడు శివా నంద నాయకుడు కుమారస్వామి భిక్షెటన శివమూర్తి మున్నుగాగల 'దేవశిల్పము లున్నవి.
మూల విగ్రహములకు పడమరో త్తరములందు పరదాలు కట్టబడి యున్న వి. ఆ తెరవెనుక నేమున్నది? ఏమి జరుగుచున్న దెవరికిని తెలియవు. కనుకనే మనలో చిదంబరహస్యములను వాక్యము పరిపాటియైనది. ఈ క్షేత్రమున శివగంగా తీర్థము, గుహ్యతీర్థము, పరమానందతీర్థము, వ్యాఘ్రా తీర్థము, నాగ తీర్థము, యావన తీర్థము,క్షీరాబ్ధి తీర్థము, (బహ్మ తీర్థము, శివతీర్థము లనునవి నది తీర్థములు ప్రశస్తములు.
కాంచి యందున్న యేకమ్రేశ్వ ర ఫృథ్వీలింగము. జంబుకేశ్వర మందున్న జంబుకేశ్వర అగ్నిలింగము తిరుణామల యందున్న అరుణాచలేశ్వర 'తేజోలింగము కాళహస్తి యందున్న (శ్రీ కాళహస్తీశ్వర వాయులింగములవలెనే ఈ చిదంబరమందున్న చిదంబరేశ్వరకాశ లింగము పసిద్ధి గాంచినందున_ ఈ 'క్షే త్రమును పుండరీక పురమనియు'వ్యాఘ్రపురమనియు బిల్వవనమనియు చెప్పు చున్నారని వివరించిన సదానందయోగి మరుదినంబున (ప్రయాణము సాగించిపోయి చియ్యాళిలో మజిలీ చేశాడు.
చియ్యాలి క్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ చియ్యాళియందు వేంచేసియున్న దైవము బ్రహ్మ పురిశ్వరము. వీరి సతీమణియైన త్రిపుర సుందరీదేవి మరియొక కోవెలయందు వేంచేసి యున్నారు. దేవాలయమునకు చేరువలో (బహ్మతీర్థ కుండమున్నది. 'దేవళమును చుట్టూ లింగములు మందిరములుభ క్తుల ప్రతిమము లనేకముగా నున్నవి. య్యాతికులకు కావలసిన పూజా ద్రవ్యములుగాని _ యితర వస్తువులు గాని 'దేవాలయములోనే విక్రయించుచున్నారు.
(పధానాలయమునకు దగ్గరలో నొక 'పెద్దగుడి యున్నది. _అచటినుండి సోపానముల మీదుగనెక్కి. దక్షీణముగా పోయినచో యెత్తయిన పార్వతీ 'పర మేశ్వర విగ్రహములు తూర్పుముఖముగ వెలసియున్నవి. ఆ పురాణదంపతులను చుట్టుకొని పరివారమున్నారు. అందుండి మరికొన్ని మెట్ల నెక్కి, పడమరగపోయి నచో శరనాధస్యా మి కన్పించును. పూర్వమీ శరనాధుని గాంభీర్యమును చూడ లేక (బ్రహ్మాది దేవతలుప్రార్ధిం చినందున నా దేవుడు దిగంబరియై ప్రశాంత వదనుండయ్యెనని చెప్పుదురు. ఈ మూర్తికి శుక్రవారములందు. పునుగు జవ్వాజి మొదలగు సుగంధ దవ్యములతో అభిషేకములు, అలంకారములు, భోగములు చేయబడుచున్నవి.
మరియు నిచటకు సమీపము సందే వై ద్యనాధమున్నది. ఆలయము నందీ వై ద్యనాధులు పడమర ముఖంబునకు, బాలాంబికా అమ్మవారు. దక్షిణ ముఖంబునను నిలిచియున్నారు. చేరువలోనే రామలక్ష్మణులు జటాయువునకు దహన సంస్కారములు గావించిన త్రేతాయుగము నాటికుండమున్నది. ప్రధ నాలయంబునకు మూడు ప్రాకారములున్నవి. రెండు ప్రాకార మందంతటను మందిరము లున్నవీ,. వెలుపలి ప్రాకరమున నాలుగు గోపురములన్నవి. అచటనే సిద్దామృత కుండమున్నది. అందలి జలము సేవించినవారికి దీర్గాయురారోగ్యాలు కలుగు చున్నందునచే ఇచ్చటి కుండమునకు సిద్ధామృత కుండమనియు ప్రముఖ దైవమునకు వైద్యనాధస్వామియనియు. సార్ధకనామము లేర్చడినై.. ఇచటి కుమారస్వామికి కార్తికమాసములో కృత్తిాక నక్షత్ర పుణ్యకాలమున (ప్రత్యేక ముగ గొప్ప వైభవములు జరుగుచున్నవవి,
అచటకు మరికొంత దూరముగ మయూర క్షేత్రమున్నది. ఈ శివ క్షేత్రము కూడ కావేరినది శాఖకు దక్షిణమునందు యున్నది. అందున్న మయూ రేశ్వరుండును స్వయంభూ లింగమనియే చెప్పబడుచున్నది. స్వామి ననుసరించి దేవేరీ యైన అభయాంబికాదేవి గణపతి. కుమారస్వామి, సభాపతి మొదలయిన వారలకు గూడ కోవెల లమరియున్నవి. వారికి పూజాది వేడుకలు జరుగు చున్నవి.
అటులనే కావేరి శాఖకు నుత్తరముగనున్న తిరువందళ్ళూరునందు శ్రీ పరిమళరంగనాయక స్వామి ' వేంచేసియున్నాడు, నాలుగు భుజములు, తలయందు సూర్యబింబము, నాభికమలమున చతురాసనుడు, చరణములందే చంద్రులున్న యీ మూర్తి సుందరముగ నున్నది. అందెయున్న భూదేవి కావేరి గంగా ప్రతి మలు శోభగలవి. అచటను వేడుకలు విధివిధానంబుగ జరుగుచున్న వని వివరించిన సదాన్గందయోగి మరు దినంబున (ప్రయాణము సాగించిపోయి. రాజమన్నారులో' మజిలీ జేశాడు.
రాజమన్నారు క్షే త్ర మజిలీ
నాయనలారా! పూర్వ మీ క్షేత్రమున గోఖిల మహముని చాలాకాలం తపసు "సేయగ శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిచ్చి “మహామునీ! నీకేమి వరము కావలయు”నని యిడిగాడు, గోఖిలుడంతట దేవదేవుని యభినందించి తరువాత “మహాత్మా! నేను తపమాచరించినదియు, మీరు నాకు దర్శనంబిచ్చినదియునై న ఈ ప్రదేశము దివ్యస్థలమై భక్తజన పాలనార్ధము మీరిందే స్థిరనివాసంబుగనుండు టయే నాకు కావలయుననగ వాసుదేవుడు సంతసించి “వక్సా! నీవు కోరినటులనే నేనీచోట సంతాన గోపాలస్వామి నను పేరున నిలిచియుందును. . ఈ క్షేత్రము ముందిక మీదట చంపక వనమనియు దక్షణద్వారకాపురమనియు ప్రశస్తినొంద గలదని చెప్పి యదృ శ్యమయ్యాడు.
'నేడా స్థలము మంగళపు స్టేషనుకు నుత్తరమున నాలుగు క్రోసుల దూరములో 'వెలుగొందుచున్నది. దానినిపుడు రాజమన్నారగుడి క్షేత్రమనియు చెప్పుచున్నారు. ఇచట పంచభై రవులు ఆళ్వారులను వేంచేసియున్నారు. ఈ స్థానమునకు దక్షిణముగ శేషవటపత్రసాయి కిరువై పులందు భూదేవి, శ్రీ దేవియు నున్నారు. మూర్తులకు విలువైన యలంకారము లున్నవి.
ఇందలి హరిద్రా తీర్థము, శంఖుతీర్థము, చక్రతీర్థము, క్షీరబ్దతీర్థము, గోపీనాథ తీర్థము, అగ్నితీర్థము, లక్ష్మితీర్ధము, కృష్ణతీర్ధము,గజేంద్రమోక్షతీర్థము లన్నింటిలో మొదలైన హరిద్రాతీర్ణము ముఖ్యమైనది. ఇచ్చట ఎత్తయిన గోపు రములు మనోహరముగ రూపొందినవి. మందిరంలో రాజమన్నారుస్వామి చంపక లక్ష్మి మున్నగు దేవతలున్నారు. సంతాన గోపాలదేపునకు వెండి రధమున్నది. ఆ స్వామి విగ్రహము నెత్తుకొని పార్థించి ఆరాధించిన వారికి సంతానము కలుగుచున్నదని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణము సాగించి: పోయి కమలాలయంలో మజిలీ చేశాడు.
కమలొలయ క్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ కమలాలమైన శ్రీ వాల్మీకస్వామి ప్రధాన దైవము, పూర్వము దేవ దానవులకు జరిగిన యుద్ధంలో ముచికుండ మహారాజు దేవేంద్రు నకు సాయంచేశాడు. దేవతలకు విజయం లభించింది. దేవేం ద్రుడంతట ముచి కుందుని గౌరవముగ స్వర్గమునకు తీసికొనిపోయి “రాజా! నీ యుపకారమువలన మేము మేలు పోందితిమి, 'నా వలన నీకేమి ప్రత్యుపకారము కావలయునో కోరు కొను” మనగ ముచికుందుడు “శచీపతి నాకితఠ సంపద లక్కరలేదు, నీ పూజ యందుంచబడిన త్యాగరాయస్వా మి విగ్రహము నిచ్చిన” చాలన్నాడు.
ముచికుందు డడిగిన దానిని కాదనలేక, పూజయందున్న దాని నీయలే కను సంకటంబుపడిన ఇంద్రుడు మరికొన్ని విగ్రహములట్టివే చేయించి యిందు నీకు కావలసిన దానిని తీసుకొను మనవి రాజేంద్రుడొకదానిని తీసుకొనిపోయాడు. ముచికుందుని స్వప్నమున నారేయి త్యాగరాజస్వామి కనబడి “నరపాలా! నీవు తెచ్చినది నిజమైన పూజలోని ప్రతిమ కా”దని చెప్పినందున నాతండు మరునాడు దేవేం[దుని యొద్దకుపోయి “యిదికాదు. నాకు నీ పూజియందున్న బొమ్మయే కావలనన్నాడు. పురందరు డేమియు ననలేక విగ్రహంబుల నన్నింటిని రాజుకే యిచ్చి పంపించాడు.
ముచికుందుడంతట వానిని భూలోకమునకు గొనివచ్చి దేవేంద్రుని పూజ యందుంచబడిన ప్రధమ లింగమునీ తిరువాలూరునందుప్రతిష్ట గావించిన పిదప వానిని తిరువాంబూరు తిరుక్కోవిల తిరువల్లూరు తిరుక్కాయరు తిరుమల క్కాడు వేదారణ్యము లనుచోట్ల స్థాపనచేశాడు. ఈ క్షేత్రములన్నియు మొదట తిరువాలూరునకు చుట్టుపక్కలనున్నది. తిరువట్టూరనం బడుచున్న తిరుమల క్కాడు చెన్నపురికి యుత్తరమున నై దుమైళ్ళ దూరమున నున్నది. తిరువా వూరులో 'దేవార్చితమైన త్యాగరాజమూర్తినే వల్మీకేశ్వరుం డనుచున్నారు.
పూర్వ మొకానొక సమయంబున దుర్వాస మహాముని చేసిన ఘోర తపసున కానందించి త్యాగరాజస్వామి వల్మీకము నుండి సాక్షాత్కరించినందున నాదేవునకు వల్మీ కేశ్వరుండును "పేరువచ్చింది, దానికి చేరువయందే దుర్వాసముని సమాధియు కలదు. ఈ క్షేత్రమందలి స్వాములవారి తీర్థ ప్రసాదంబుల కెట్టి కట్టు బాటులు లేవు, స్వామికి వార్షి కాదాయములు రాగల సదుపాయంబులున్నవి. ఇచటి కీశాన్యము నందొక క్రోసు దూరములోని హాటక క్షేత్రమందు.. శ్రీరామునిచే పూజించబడిన అన్నపూర్ణా విశ్వనాధమూర్తులు గణపతి, కుమారస్వామ్మి చండి 'కేశ్వర మూర్తులున్నవి. దేవాలయ మండపములో శ్రీ రుద్ర పాదములు శ్రీరామ పాదములు కన్పట్టుచున్నవి. యాత్రీకు లిచట పిండములు వేయుదురు. పుర బాహ్య ప్రదేశమున హనుమత్స మేత సీతా రామ లక్మణాలయ మున్నది.
హాటక క్షేత్రమండలి అన్నపూర్ణా విశ్వనాధ విగ్రహము లొక చోళ రాజ ప్రతిష్టలట, రాజుగారి అలమందలోని యొక ఆవు పోదుగున పాలెన్నడును కనరాక నుండుటచే, రాజా కారణ మేమియో తెలిసికొన నొక దినంబున గనపు వేయ వచ్చిన గోవును వెంబడించెనట. ఆవు దూరముగా బోయి పుట్టమీద నిల్చి పొదుగులోని పాల నందు విడచుట గాంచుటం జూసి రేడా పుట్టను త్రవ్వించి చూచుటయు, భూమియందె అన్నపూర్ణా, విశ్వనాధ విగ్రహంబులు కన్పించుటయు జరిగినందున చోళరాజా మూర్తుల కాలయము నిర్మించి పోషణ సౌకర్యముల కల్పించెననియు 'దెలియుచున్నది. ఆపు పాలు పిండబడిన పుట్టగల చోటునందే క్షిర పుష్కరిణి యేర్పడినదనియు క్షేత్ర పురాణములు చెప్పబడుచున్నవి. క్షీర పుష్కరిణీ యందు గంగ యమున సరస్వతి గోదావరి కృష్ణ తుంగభద్ర కావేరి తామ్రపల్లి సరయూ నదుల మహాత్మ్యము కలదని ప్రతీతి.
కమలాలయ తీర్థము నందనేక మండపములు ఘట్టములు గలిగి మిగుల విశాలముగనున్నది. ఆదియంచచోట స_ప్తబుషులు తపసు చేసినట్లును చెప్పు చున్నారు, దేవాలయ ప్రాకారమున నూటేనిమిది. చిన్న చిన్న గుడులున్నవి 'దేవళంచునకు మూడు ప్రాకారములు , నాలుగు గోపురములున్నవి. మొదట | పాకార ములో వేయిగాళ్ళ మండపమున్న దని వివరించిన సదానందయోగి మరుదినంబున ప్రయాణము సాగించిపోయి కుంభకోణంలో మజిలీ చేశారు.
కుంభకోణం క్షేత్ర మజిలీ
నాయనలారా! ఈ కుంభకోణమున కుంభేశ్వర, నాగేశ్వర, సో మేశ్వర కాళహస్తీశ్వర, విశ్వేశ్వర, గౌరిశ్వర, అభిముక్తేశ్వర, బాణపురిశ్వరులను శివాలయంబు లెనిమిదియు, చక్రపాణి, వరాహస్వామి, శరనారాయణాది విష్ణ్యా లయములారు [పధమ శ్రేణికిచెందినవి. మంగళాంబకా సమేత కుంభకోణేశ్వరా లయము. సీతా సమేత రామాలయం-కోమలవల్లీ సమేత శార్జపాణి దేవాలయం విజయవల్లీ సమేత చక్రపాణి దేవాలయం జ్ఞాన (ప్రసూనాంబా సమేత నాగేశ్వరా లయం- సోమసుందరి సమేత సోమేశ్వరాలయం - బాలాంబా సమేత, బాణా పురీశ్వరాలయం _ అద్భుతవల్లీ సమేత అవిముక్తేశ్వరాలయం _ అన్నపూర్ణా సమేత కాశీవిశ్వేశ్వరాలయం అభయాంజా సమేత ఐరావతేశ్వరాలయం త్రిపురసుందరీ సమేత గౌతమేశ్వరాలయములేగాక భూతవరాహస్వామి దేవా లయములు మొదలై న వెన్నియో కలవు,
పూర్వము చంద్రుడు తపసుచేసి (శ్రీమన్నారాయణుని మెప్పించి సకలై శ్వర్యములను ప్రసాదింపూమని కోరగ రమారమణుండు శశితో “ఓయీ! సంపదల నీయదగిన లక్ష్మీ యిపుడు నా చెంతలేదు. లోక కళ్యాణమునకై నేను దశావతారములు దార్చుచున్న సమయంబున నామె వైకుంఠము నందొంటరిగ నుండలేక భూలోకమందలి కుంభకోణ క్షేత్రమునందు స్వర్ణ పంకజారణ్యమున మంగళాంబికా నామంబున నవతరిం యున్నది. ఇకమీద నేనును కుంభకోజే శ్వరుండనై మంగళదేవత చెంతనే యుండబోవు చున్నాను.
లక్ష్మిదేవి యచట పరిశుద్ధాత్మతో తపసుచేసి నిర్మించిన లక్ష్మి సరో వరంబున మరణించినవారికి వైకుంఠము సిద్ధించుట యందనుమానములేదు. బ్రహ్మది దేవతలు ప్రతి సంవత్సరమును వచ్చి లక్ష్మీ సరోవరంబున పవిత్ర స్నానములుచేసి పోవుచున్నారు. క్షేత్రమున మూడు రాత్రములు నిద్రించినవారికి బ్రహ్మలోక ప్రా ప్తియగును. నీ వచ్చటకుపోయి అందు వెలసియున్న నా కుంభ కోణీశ్వరమూర్తి నారాధించితివేని నీ సంకల్పము తప్పక నెర వేరగలదని చెప్పి యదృశ్యమయ్యాడు.
చంద్రుడు కుంభకోణమునకు పోయి లక్ష్మిసరోవరంబున స్నానమాచ రించి మంగళాంబిక కుంభకోణేశ్వరు నారాధించిన తరువాత వానికి సర్వసంపదలు లోక పూజితము, నవగ్రహ మండలమున స్థానములు ప్రాప్తించినవని వివరించిన సదానందయోగి మరుదినంబున (పయాణం సాగించిపోయి. శ్రీరంగంలో మజిలీ చేశాడు.
శ్రీరంగ క్షేత్ర మజిలీ
నాయనలారా! శ్రీరంగనాయకస్వామి నిలయమైన శ్రీరంగం మహా మహిమంబు గలది. ఆదియందు. శ్రీరంగనాయకస్వామి (వతమును పూజించు కొనుటకు గాను నారాయణమూ రి (బ్రహ్మదేవుని కీయగా _బ్రహ్మ మనుచక్ర వర్తికీయగా _ మనులుక్ష్వారాని కీయగా సూర్యవంశీయులనుండి (శ్రీరామునకు సంక్రమించి-రామునినుండి విభీషణునకు లభించింది, విభీషణుడు దానిని లంకకు గొనిపోవుచుండగ దేవత లందు కంతరాయం కలిగించాలనుకు న్నారు.
అయోధ్య నుండి లంకకు పయనించుచున్న విభీషణుడు ఉభయ కావేరీ నదుల మధ్యభాగమునకు చేరునంతలో సంధ్యాసమయమయింది. రంగనాయక విగ్రహమును నేలమీద పెట్టరాదనియు, అటుల పెట్టినను తిరిగి పెకలించుట సాధ్యం కాదనియు వానకి తెలియును. అందు వలన ఆటు యిటు చూచి సమీపం నందున్న యొక బ్రాహ్మణుని పిలిచి “అయ్యా! నేను సంధ్య ముగించుకొని వచ్చువరకు నీ వీ బొమ్మను పట్టుకొనుము, నీకు మంచి బహుమతి స్తానన్నాడు. ఆ మాయా బ్రాహ్మణుడు విభీషణుని మోసగించుటకే మారు రూపమున వచ్చిన వినాయకుడు కావున సమయం దొరికినదని లోలోన సంతసించుచు పై కి“అటులనే పట్టుకొందును. కాని నేను నిన్ను మూడు పర్యాయములు పిలచునంతలో నీవు రావలయు” నన్నాడు. విభీషణు డందులకు సమ్మతించాడు.
ఆయన స్నానం చేయుచుండగనే మాయా బాహ్మణుడు ముమ్మారు పిలిచి, రంగనాయకస్వామి ప్రతిమను భూమిమీద దించి వెళ్ళిపోయాడు. విభీ షణుం డంత తొందర తొందరగ సంధ్యావందన క్రమం నెర వేర్చుకొని వచ్చి _ యెంత బలముపయోగించి 'పెకలింప చూచినను విగ్రహ మందుండి కదలనై నా కదలలేదు. అంతట స్వామి పత్యక్షమై “రావణానుజా!' పూర్వ మొకప్పుడు కావేరీనది నన్ను తపస్సుచే మెప్పించి “నన్ను గంగానది కన్నను మించి పవిత్రు రాలినిగా జేయు” మని యడుగగా. నేనామోదించి “కొలది దినములలో నేనునీ తీరమునందే వెలియుదును. అప్పుడది మహాక్షే త్రముకాగలదు, నీయందు స్నాన పానదానములు "సేయువారి జన్మజన్మాంతర పాపములు హరించు నట్లును, వారికి సకల సంపదలు కల్పగునట్లును, ఆంత్యమునందు వారికి కైవల్యము సిద్ధించునట్లు కరుణించెదనుగాన నీ యభిమతం ఈ డేరగల”దని వరమిచ్చి యుంటిని.” ఇపుడా కార్యము నీ వలన నెరవేరినది. నీవిచటనే నన్ను సేవింపు”మని చెప్పి యదృశ్య మయ్యాడు.
తరువాత రంగనాయక భగవానుని కిచట నాలయ ప్రాకారములు రూపొందినవి. (పధానాలయమునకు నాలుగు శిఖరములమధ్య విమానము కలదు. స్వామి వేదికలాంటి యున్నత స్థానమున పడమరగ తలనుండి లంకవై పు చూచుచు శయనించి యున్నారు. ఆలయమునకు పాకారములున్నవి. పతి దిన మిచట స్వాములవారు మేల్కొ.ను వరకు వీణావాద్యము జరుగుచున్నది. సూర్యో దయ ప్రాంతమున పూజారులు కావేరీ తీర్థము తెచ్చెదరు. గుడి తలపులు కొంచెంగానే తెరచి లోపలకు పోయినవారు స్వామికి అద్దముచూపి,దంతధావనము "సేయించి, దీపారాధన చేసి, నవనీత నైవేద్యము చెల్లించి అలంకారము గావిం చిన పిదప తలుపులు పూ_ర్తిగా తెరిపించి భక్తులకు రంగనాయకస్వామి వారి విశ్వ రూప ప్రదర్శనము జేయింతురు.
మరికొంచెము సేపటికి పాలు , రొట్టే , వెన్న నివేదనల నిచ్చి _ కొంత "సేపటికి పొంగలి దోసెల విందు చేయించి ఆ తరువాతి రాజభోగం మనంబడు నూటేబది శేర్ల బియ్యముతో వండిన అన్నము శాకములు పప్పు క్షీరాన్నము పిండి వంటలు కైంకర్యం మొనరించిపత్యేకంగా క్షీరాన్న మహా నైవేద్యమును చేల్లించుచు దపాలవారీగా యాత్రికులకు (పసాద వినియోగమును గావించెదరు. స్వామివారు నిత్యము కస్తూరీ తిలకంబునే ధరించుచున్నారు.
ఆలయ మొదటి ప్రాకారమునండు ఉత్సవులు గరుత్మంతుడు విభీష నుడు మొదలగు వారున్నారు. రెండప్రాకారము నందు విష్వక్సెనులు వెలసి యున్నారు. తూర్పు భాగమునందితడి పద్మమున్నది అటులనే యుత్తరము నందొక బావి కలదు. అందలి నీటిని స్వాములవారి సేవలందుపయోగించెదరు. నుయ్యి ప్రక్కగా యిత్తడి చక్రమున్నది, మూడవ ప్రాకారమునందు విజయ గంగాచొక్కానాదులు నెలకొనియున్నారు, వారికి ప్రదక్షిణములు జరుగుచున్న వి. నాల్లవ |పాకారమునందు స్వామి కభిముఖముగా హనుమంతుడు నిలిచి నమస్కం రించుచున్నాడు. మరియు పొన్నమామయు చంద్ర పుష్కరిణియందు నున్నవి. అందెందరో హిరణ్య శ్రార్ధము చేయుచుందురు, ఐదవ ప్రాకారము నందు 'వెయీ గాళ్ళ మండపము, రంగనాయకీదేవీ మందిరము, ఆళ్వారుల సన్నిధి మహ బలిపీఠము లున్నవి, బిల్వవృక్షమునకు దక్షిణంబున ముక్కోటి యేకాదశీ పర్వ దినము నుండి పదిరోజులు తెరచి యుంచెదరు. మిగిలిన ఆరవ, యేడవ, యెనిమి దవ ప్రాకారములలో వరుసగ ద్రావిడులు, పూజారి వైష్ణవులు,శూద్రులు నివ సించి యున్నారని వివరించిన సదానందయోగి మరుదినంబున (పయాణం సాగించి పోయి సీతా రామేశ్వరంలో మజిలీ చేశాడు.
రామేశ్వర క్షేత్ర మజిలీ
నాయనలారా! మనమిప్పటికి కాశీనుండి బయలుదేరి క్షేత్రములలో మజిలీలు సేయుచు చేరదలంచుకొనిన రామేశ్వరమునకు వచ్చితిమి, ఇక మీకు నేనీ రామేశ్వర చరిత్రను యిందున్న పుష్కరెణిలు వానినిగురించియు విపులముగ చెప్పెదను. దీనిని సీతారామేశ్వర మనియు చెప్పుదురు. సేతునిర్మాణ మెటు లైనదో 'తెలిసికొనండి.
త్రేతాయుగమున దశరథడను మహారాజు అయోధ్య రాజధానిగ కోసల రాజ్యమును పాలించాడు, దశరధునికి (శ్రీరాముడు పెద్ద కుమారుడు, శ్రీ రాముల భార్య సీత. ఒకనొక కారణంబున శ్రీరామచంద్రుడు తండ్రిమాట కాపాడుటకు గాను దండకారణ్యములో నివసింపవలసి వచ్చింది. అప్పుడాయన భార్యయైన సీతయు, తమ్ముడయిన లక్ష్మణుడును రాముననుసరించియే వున్నారు. _ వారు మువ్వురు పంచవటి (పాంతము నందొక వర్ణ శాల నిర్మించుకొని అందులో కాపుర మున్నారు.
దండకారణ్యం రాక్షసులది. దాని కధికారి లంకాధిపతియైన రావణే శ్వరుడు. రాముడు దండకారణ్యము నందున రాక్షసులను చంపాడు. రావణా సురుడు వచ్చి రామలక్ష్మణులు యింటలేని సమయాన మాయోపాయంచేసి సీత నెత్తుకొనిపోయి తనలంకలోని యశోకవన మందుంచాడు. ఇక్కడ రామలక్ష్మణు లకు సీత జాడతెలియక అడవినంతా గాలించారు. చివరకు జటాయువను పక్షి ద్వారా వారికి కొంత విషయం తెలిసింది. రామలక్ష్మణులింకా ముందుకు పోయి బుష్యమూక పర్వతం మీదనున్న సుగ్రివుడనే వానరరాజుతో స్నేహంచేశాడు. సుగ్రీవునికంటే కూడ సుగ్రీవుని మేనల్లుడు _ మంత్రియునై న హనుమంతుడు రామునికి నమ్మిన బంటయ్యాడు.
వాలి, సుగ్రీవులు కిష్కింధనేలు వానరరాజులు, వారిలో వాలి చాలాబల వంతుడు. ఒకప్పుడు దుందుభియనే దానవునితో పోరాడుతూ _ బుష్యమూకా(ది గుహలోనికి పోయి కొన్ని నెలలదాకా బయటకురాలేదు. స్కుగీవుడప్పుడు అన్న గుహలోనే చనిపోయాడని చెప్పి కిష్కింధకురాజై వాలిభార్య తారను తన వశం చేసుకొని సుఖంగా వున్నాడు. కాని వాలి నిజంగా చనిపోలేదు. గుహలోనే దుందు భిని చంపి వాని కళేబరాన్ని కాలితో తన్నాడు, అది పోయి ఒక మునీందుని ముందు పడినందున నా ముని యీ శవము నిటు పడవేసినవాడెవడై నను కాని ఇంకొకమారీ కొండమీదకువస్తే తలపగిలి మరణిస్తా”డని శపించాడు. ఆంతట వాలి తిరిగి యింటికిపోయి చూడగ తమ్ముడు సింహాసన మెక్కిన సంగతి తెలి సింది. వాలి కడుపు మండిపోయింది. వెంటనే స్కుగీవుని. జుట్టుబట్టి లాగి నాలుగు తన్ని మెడబెట్టి గెంటిచేయడమే గాక తమ్ముని భార్య రుమ నపహరించాడు. సు(గ్రీవుడెమీ చేయలేక యీ బుష్యమూక ద్రి మీది కెక్కి కాలం గడుపుతున్నాడు. ఇంతలో వారికి రాములక్ష్మణులు తోడయ్యారు.
ఇపుడు రాముడు వాలిని చంపి సుగ్రీవుని భార్య రుమను తిరిగి సుగ్రీ వున కిచ్చేలాగునను సుగ్రీవుడు తనబలగంతో రావణాదులను చంపి రామునిభార్య సీతను తిరిగి రామున కిచ్చేలాగున యొడంబడికలు జరిగినై. ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు వాలిని చంపడమేగాక సుగ్రీవుని కిష్కింధ రాజ్యానికి యెదురులేని రాజును చేశాడు. సుగ్రీవున కిప్పడు తన భార్యయేకాకుండ అన్నగారి భార్య తార కూడ ప్రియురాలయింది. వాలి కొడుకు అంగదుడు అనుచరు డయ్యాడు.
మొదటి నిర్ణయం ప్రకారం సుగ్రీవుడింక తన వానర సైన్యంతోగూడ రామునికి తోడు చేయవలసిన వంతు మిగిలిపోయింది. దానికై సీతయున్న జాడ తేలిసికొని రావలసినదిగా నియమించి వానరులను నలుదిక్కులకు పంపించాడు. నూరు యోజనముల సముద్రమును గగన మార్గమునుదాటి లంకకు చేరుకున్న హనుమంతుడు సీతనుచూచి మాటాడి తిరిగివచ్చి రామునకా చల్లని వార్త విని పించాడు. ఇపుడు రాముడు లక్ష్మణుడు సు(గీవుడు సు(గ్రివుని బలమంతా కలసి లంకకు పోవలయునని సమ్ముద్రందాకా వచ్చారు. సముద్రం చాల లొతు పొడవు. లున్నందున దిగిపోవడంగాని.యీది పోవడంగాని సాధ్యమయ్యేపని కాదు.
(శ్రీరాముడు సముద్రుని దారి యీయమని యడిగాడు. సముద్రుడు పలుకలేదన్న మహోగ్రహంతో ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి నీరింకిపోయేలా చేస్తానని గర్జించాడు. ఆ సమయంలో ప్రసన్నుడై న సముద్రుడు “రామచంద్రాః తొందరపడకుము. నీకార్యము నెర వేరుటకొక యుపాయంబు తేలిపెద. విశ్వకర్మ కుమారులై న నలనీలాచార్యులను సోదరులిడ్దరున్నారు. వారు శిల్పి శాస్త్రమునందే గాక యుద్ధరంగమునందును ఆసాధారణ ప్రజ్ఞకలవారు. వారిసాయము కోరుము, సముద్రము మీదుగ వారధి నిర్మింతురు. మీరందరు క్షేమముగా లంకకు చేర వచ్చును. అంతేకాదు. నలాచార్యుని నీ సేనకు నాయకత్వము వహింప జేయుము. నీకు జయంబగు”నని చెప్పాడు.
రాముని కోరిక నిరాకరింపని నలనీలులు వారధి నిర్మించారు. రాముడు లంకకుపోయి యుద్ధంలో రావణాదులను సంహరించి విజయవంతంగా తిరిగి యిక్కడకు వచ్చేటప్పటికి రామునకు రాక్షసులను చంపిన బహ్మత్యా పాతకం బున కంటిచూపు హరించిపోయింది. అందున రాముడిక్కడ లింగ పతిష్ట చేసి శివునారాధించి మరల చూపును పొందగలిగాడు. ఆనాడు రామునిచే ప్రతిష్టచేయ బడిన లింగమే రామలింగేశ్వరుడని |ప్రసిద్ధికెక్కి యున్నాడు. ఆ సమయంబున సీత, లక్ష్మణుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మొదలై న వారమంతా వారి వారి పేరులు మీదుగ లింగముల నిందు ప్రతిష్టలు చేశారు. అప్పుడనేక తీర్థములు రూపాందినవి. ఆ తీర్ధము లన్నింటిలోను ధర్మ పుష్కరిణి తీర్ధములు (ప్రధాన మైనది.
ధర్మపుష్కరిణి ప్రభావము
నాయనలారా! పూర్వము గాలవ మహముని దక్షిణసముద్ర తీరమందలి క్షీరసరోవరంబునకు దగ్గరలో ధర్మపుష్కరిణితీర్థము చెంత చిరకాలము తపమాచ రింపగ (శ్రీహరి పత్యక్షమై “నీకేవరము కావలయు” నన్నాడు. గాలవుడంతట నాగశాయనునకు నమస్కరించి “ఇందిరా రమణా। నేను సర్వదా మిమ్మెడబాయక నుండి మీ సేవ చేయుచుండునట్టి వరమి”మ్మని యర్థించాడు.
పద్మనాభుండంత “గాలవాః చాలాకాలము నాడిక్కడ ధర్ముండను యోగి యొక తీర్థమును నిర్మించుకొని అందు స్నానాదులు సేయుచు తపో నియ మంబు పాటించుచుండగ శంభుడు దర్శనం బొసగి భక్తుని యభిమతంబేమని యడిగాడు, ధర్ముడంతట “దేవా! నేను సదా మీ పరిచారకుండనై యుండు లాగు నని; నా పేరీ ప్రపంచమున చిరస్థాయిగా నిలిచియుండు లాగునను నన్ననుగ్ర హింపు”మని పార్థింపగ పరమేశ్వరుండు ముదమొంది “భక్త్యాగణి। అటులై న నీవు నంది రూపం ధరించి నాకు వాహనమై యుండు” మని చెప్పి వృషభ వాహనుండై కైలాసంబునకు బోయినాడు. ఆ ధర్ముని 'పేర నీ తీర్థము ధర్మ పుష్కరియై ప్రకాశించుచున్నది. కావున నీవీ పుణ్యతీర్థము చెంతనే మరికొంత కాలముండుము. తరువాత నాయందై క్యమొందెద” వని చెప్పిన యనంతరమున నదృశ్య మొందాడు.
ఈ ధర్మ పుష్కరిణికే చక్రతీర్ధంబని యెక పేరుగలదు, పూర్వము విశ్వానను గంధర్వుని కుమారుడు దుర్దయ డనువాడు కొందరి. స్త్రీలతో గూడి యొక జలాశయంబున వస్త్రములు లేకుండానే జలక్రీడలాడుచున్న సమయంబున వశిష్ట మహోమునియు నచటకు పోవుటయు సంభవించింది. మహామునిని చూచిన స్త్రీలు వెంటనే లేచిపోయి బట్టలు ధరించి దూరమున నిలువంబడియుండ దుర్ధముడు మాత్రము 'చలింపక నందే దిగంబరుడయి వికారచేష్టలు గావించుటం చూసి వశిష్టు డాాగ్రహించి “ఓయీ! దుర్మదాంధుండ వగు నీవు భూలోకమున రాక్షసుడవై పుట్ట”మని శపించాడు.
దూరమునుండి చూచుచున్న స్త్రీలందరునువచ్చి యతీంద్రుని పాదము లంటి ”మహామునీః మా నాధుండు శాపగ్రస్తుండయిన నింక మా గతేమి! ఆడు వారము వేడుకొనుచుంటిమి, మా మొరాలాలకించి గంధర్వునకు శాపవిమోచన మార్గం లెరిగింపు”డని ప్రార్టింప నాజటియు దయ దలంచి “పడుచులారా? మా శాపంబు తిరుగు లేనిది కావున నీతండు దానవుండవయి జన్మంపక తప్పదు. కాని కొన్ని సంవత్సరముల కా రాక్షస రూపంబు శ్రీ మన్నారాయణమూర్తి చేతి సుదర్శనంబుచే తెగిపోయిన పిమ్మట తిరిగి నిజాకారము నొందగల”డని చెప్పి వారినోదార్చాడు. దుర్దముడును గర్వ మణిగి మునీం[దునకు నమస్కరించి ప్రియురాం[డ్రతో తన నివాసమునకు తిరిగిపోయాడు.
కొంతకాలమున కతండు భూలోకంబున భయంకరరాక్షసుడయి యవత రించి లోక కంఠకుడయ్యాడు. మాధవుండిచ్చిన యానతి ప్రకారము గాలవ మహాముని యీ ధర్మ పుష్కరిణి ప్రాంతమునందే జప తపంబుల చేసికొనుచు సంచరించుచుండగ దానవాకారము దాల్చిన దుర్దముండరు'దెంచి గాలవుని చంప బోయాడు. అ సమయంబున గాలవుండు ప్రాణభయమునొంది “హ! శ్రీహరీ!” ఒక్కమారు బిగ్గరగా పిలిచినంతనే విష్ణుచ్చక్రము పరుగు పరుగునవచ్చి రాక్షసుని తల దుంచివేసింది. అంతటితో శాపవిముక్తి పొంది నిజయూపము ధరించిన చక్ర పాణి సుదర్శనముతో “నీవీ దినమునుంచి యీ ఖర్మపుష్కరిణి యందే నిలిచి యుండుము. ఇందు స్నానమొనరించి నా భక్తులచే దుష్టు లేనియు బాధించు నెడల నా యానతి లేకయే నీవు వారిని వధింపుము, ఇకనుండి యీ తీర్థము చక్రతీర్థ మనియు చెప్పబడుగాక యని పలికి యంతర్జానమయాడు.
గంధమాధవ పర్వతము
నాయనలారా! గంధమాదవ పర్వతము సేతువు ననుసరించి సముద్రము లోనికి చొచ్చుకొనిపోయి యున్నది. ఆ కొండ నెక్కగలిగినవారికి బ్రహ్మహత్యా దోషములు సైతము హరించుటయేగాక బహ్మలోకమునకు మార్గము దొరుకుట యందు సందేహము లేదని పౌరాణికులు చెప్పుచున్నారు. అందు వేంచేసియున్న గౌరిసమేత మహాదేవుని లక్మీనారాయణులు, సరస్వతీ బహ్మ, శచీ దేవేరదులు! సమస్త మునిబ్బందారకులు సేవించి ధన్యులై నారు. ఆ పర్వతము మీదనున్న తీర్ధము "పేరు దలంచినంతనే జన్మ జన్మలలోని పాపములు హరించి పునర్జన్మ లేని శాశ్వత కై వల్యము లభించునని మహనీయులు తెలుపుచుండ నింక నాసరో 'వరంబున స్నానపాన దానములు చేసిన వారెంత పుణ్యవంతులో చెప్పగలవిగాదు.
ఒకప్పుడు దృఢమతి యను శూద్రుఁడు హిమవత్పర్వత ప్రాంతానికి బోయి మున్యాశ్రమం నందున్న యోగిం[ద్రులను దర్శించి నమస్కృతులాచరించి యనంతరమున “తపోధనులారా! జన్మచే నేను శ్యూద్రుండనై నను నాకు వేదా ధ్యయనం సేయ భ్రాంతి కలదు . నాకు వేదమంత్రముల నుపదేశించి నానేత యజ్ఞ యాగాది క్రతువుల చేయింపు”డని ప్రా ర్ధించాడు. మునులందుల కంగీకరింపక “ఓయీ?! నీవిది యడుగరాని కోరిక. వేదం చదువుటకును, వేదవిధుల నాచరించు టను గూడ నీకధికారం లేదు. కాక నీ యందభిమానం జూపి యీ నిబంధన నతిక్రమించి యే బాహ్మణుండేని నీకధికార మిచ్చెనేని యాతండు నరక మనుభ వింపక తప్పదు. కావున నీవు విప్రాదుల కుపచర్యలు చేయుచు జీవింపు” మని హితబోధ చేశారు.
దృడమతి కామాటలు నచ్చలేదు. దూరంగపోయి పర్ణశాల గట్టు నానుకొని జలాశయం నిర్మించుకొని పూలవనం "పెంచుకొని దేవకార్చనలుసలుపుచు కందమూలాలు దినుచు తపమాచరించు చుండ కొంతకాలం గడిచింది. ఒకనాడ గర్గముని వంశానికి చెందిన సుమతి యను తపస్వి నిజాశ్రమంబునకు రాగ దృఢమతి వాని కతిధి మర్యాద లొనరింప నాతండు సంతసించి దృఢమతికి 'వేదాధికారం నిచ్చి యజ్ఞముల చేయించు. చుండ కొలది దినంబుల కాతడు మర ణించాడు.
చనిపోయిన సుమతి నరకములో కొన్ని కల్పంబుల కాలము కష్టముల ననుభవించిన తరువాత భూమిమీద చెట్టుగను _ జంతువులుగను జన్మ నెత్తి అటు పిమ్మట చండాల శూద్ర వై శ్యులందుదయించిన యనంతరమున బ్రాహ్మణుల యింట బుట్టగలిగాడు. అట్లుజన్మించిన విప్రకుమారుండు చదువరియయ్యు (బహ్మ రాక్షసిచే పట్టి పీడింపబడుచుండ నాతని తండ్రి కుమారునికై దిగులొందిపోయి అగస్త్యముని కీయుదంత మంతయు చెప్పుకున్నాడు. అగస్త్యుండును కర్తవ్య మాలోచించి “భూసురో_త్తమా। భయపడనవసరములేదు. గంధమాదవ పర్వతం మీదనున్న తీర్థంబున నీ కుమారుని మూడు దినములు స్నానములుజేయింపుము. ఆ తీర్ధమందలి మహోత్మకంబున నెట్టి భూత ప్రేత పిశాచముల బాధలైనను తీరి పోవుట యందను మానము లేదు. అతండు సుమతియైన నాడు చేసిన పాపంబు లును నశింపగలవనియు నుపదేశింప నా (బాహ్మణుండవ్విధంబున తనకుమారున గంధమాధవ పర్వతమందలి కుండమున స్నానము చేయించి నంతనే విప్ర కుమారున కావేశించియున్న గ్రహపీడ తొలగిపోయింది. పాపములు హరించి నాయి. పూర్వ జన్మ జ్ఞాన ముదయించినదని సదానందయోగి శిష్యులకు వివరిం చాడు.
సీతాసరోవర తీర్థము
నాయనలారా! సీతా రామేశ్వరమునందలి పాపనాశనీ తీర్థమున గ్రుంకు విడినవారు సమస్త తీర్థములందలి (పభావముతో కూడియున్న సీతా సరోవరము నందు తప్పక పునీతులు కావలయును. రావణుని వధించిన రాముడు సీతను పిలి పించి “జానకీ; నీవింతకాలము పగవాని యింట నుంటివి. నీ శీలమునకంతరాయం కలుగలేదని నీవు రుజువు చేసుకొనవలసి యున్నది, కావున , నీవగ్ని ప్రవేశమై రావలయు”నని శాసించాడు. సీత దానికంగీకరించి యగ్నియందు దుమికి తిరిగి క్షేమముగా వెలుపలకువచ్చి తన పాతివ్రత్య (పభావంబు నందరకు తెలియచేసింది. 'ఆ సమయంబునం సీతాదేవి రూప మీ కుండమున కనబడినందున నీ తీర్థమునకు సీతా సరోవరమను పేరు వచ్చింది.
వింధ్యాతి [ప్రాంతమున త్రిశరుడనే రాక్షసుడున్నాడు. వాని భార్య మిగుల సౌందర్యవతి. ఆ దంపతులకు సంతానము కలుగని కారణమున భర్తయే భార్యతో “మనకు వంశము నిలుపు ప్ముత్రుడు కావలయును కనుక నీవు శుచి యను మునిని నియోగము చేసికొని సంతాన వంతురాలవు కమ్మని చెప్పాడు. శుచియు నా యువతి సౌందర్యమునకు ముగ్ధుడయి యామెతో కామభోగములనుభవించాడు. మున్యాశ్రమమునుండి యింటికేతెంచిన యువతికి పురుష సంతానం కలిగింది. శ్రిశరుడు సంతోషించి తన కుమారునకు కపాలాభరనుండని నామకరణము చేశాడు.
కపాలాభరనుండు "పెరిగి "పెద్దవాడయ్యాక వైజయంతీ పట్టణమునకు పాలకుడయి రాజ్య సింహాసనమెక్కాడు. వానికి శేషభక్రముడను వాడు మంత్రి కపాలాభరనుండు మం(తితోడను చతురంగ బలంబుల సేకరించుకొని యమరావతి మీదకి దండె త్తిపోయాడు. దేవదానవులకు' భయంకరమైన యుద్ధం జరిగింది. యుద్ధంలో దేవేంద్రుడు పడరానిపాట్లు బడిన తరువాత నెటులనో దానవ రాజేం ద్రుని సంహరించాడు. కపాలాభరనుని చంపిన కారణంబున దేవేంద్రునకు (బహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అతడనుభవించుచున్న బాధలు భాధలు కావు, భర్త దుస్థితి చూడలేక శచీదేవి దేవగురువులై న బృహస్పతి భగవానుల వారిని తక్కువగల మునీంద్రులను రావించి వారి కుచిత మర్యాదలు గావించిన పిదప “మహానుభావులారా!. రాక్షసుని చంపిన నా పెనిమిటికి (బ్రహ్మహత్య కల్గుటకేమి కారణము! కలిగిన యీ దోషము పోవుట కేది మార్గమని అడిగింది.
అందులకా మునులు “అమ్మా శచీదేవి! నీ పతిచే చంపబడిన కపాలా భరనుండు రాక్షస వంశమువాడే కాని శుచియను (బాహ్మణుని యంశచే జన్మిం చిన కారణమున దానవునకు బ్రహ్మత్వము సిద్ధించినది. అతనిని వధించిన దేవేంద్రునకు (బ్రహ్మహత్యా పాతకము సంభవించినది. ఐనదేదో అయినది, సీతా రామేశ్వరము నందునున్న సీతా సరోవర కుండమున మునిగెనేని యింద్రుని పాపంబులు నిశ్చయంబుగా హరింపగలవు, ఆ తీర్థము నందట్టి ప్రభావమున్నదని చెప్పారు.
బృహస్సతి సందేశము ననుసరించి శచీదేవియు, జయంతుడు మున్నగు వారు దేవేంద్రుని గొనిపోయి సీతా సరోవరంబున ముమ్మారు తలమునుగ స్నానము చేయించినంతనే వానినిచుట్టుకొనియున్న బ్రహ్మహత్యా దోషమంతయు సూర్యరశ్మి తగిలి మంచుచందంబున మాయమైపోయింది. 'దేవ మునీంద్రులందరు నా తీర్థ (పభావంబునకు మహశ్చర్య చకితులయ్యారు.
రామకుండ ప్రభావము
నాయనలారా! అగస్త్యముని శిష్యులలోని వాడై న సుతీక్షనుండు రామ కుండమున (పతిదినము స్నానమాచరించి ఐదువేల రామనామ స్మరణము "సేయు చుండ కొంత కాలంబునకు శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి భక్తుడడిగిన చందం బున వానికి అద్వైత జ్ఞానము, పరకాయ (పవేశ విద్య, గాలిలోను గగనమందున పయనించు శ_క్తి అరువది నాలుగు కళలందు పాండిత్యము జంతువులు పక్తులు క్రిమికీటకంబులు భాషించునట్టి భాషాజ్ఞానము మొదలగున వన్నియు ప్రా ప్తించు నటుల వర మొసంగెను. కావున రామకుండముతో సమానమైన తీర్థమెందునలేదని చెప్పబడుచున్నది. ఒక గడ్డిపోచ విలువగల వస్తువు దాన మొనరించినను గొప్ప 'ఫలితము నొందెదరు.
ద్వాపర యుగంబున మహాభారత యుద్ధం జరిగింది, కౌరవ పక్షమున “నున్న భీష్ముడు పడిపోయిన తరువాత దుర్యోధనుడు (దోణాచార్యుల వారిని సర్వ సై న్యాధిపతిని చేశాడు. కురు సేనల కగ్రనాయకత్వం వహించిన ద్రోణుడు సంతోషించి సమరంతో పాండవులమీద విజృంభించాడు. ఆయనధాటి కెవరూ నిలువ లేకపోయారు. అపుడు శ్రీకృష్ణుడు మొదలై నవారు గుమిగూడి ద్రోణాచార్యుల వారిని చంపే యుపాయ మాలోచించారు. ఆచార్యులు తన కుమారుడైన అశ్వ ద్ధామ మరణవార్త నింటే తానింక జీవించి యుండనని యొకప్పుడు శపధం చేసినమాట వారికిపుడు జ్ఞప్తికి వచ్చింది. దానికి తగినట్లే అశ్వద్ధామ యిపుడు తండ్రి కంటెదుట లేకుండ దూరప్రదేశంలో యుద్ధం చేయుచున్నందున నీ కుమా రుడు చనిపోయాడని చేప్పి (దోణాచార్యులవారిని మోసగింపవచ్చును. ఐతే తన కుమారుడు మరణించాడని యెవరు చెప్పితే గురువుగారు నమ్మగలరనే దొక గడ్డు సమస్య యేర్చడింది.
ధర్మరాజు అబద్ధ మాడడనే ప్రతీతి యొకటుంది కనుక ఆయన నోట వింటే గురుండు తప్పక నమ్మడమే కాకుండ యుద్ధం విరమించి ప్రాయోప వేశమున చనిపోవడం సిద్ధం. అందువలన అశ్వద్దామ చనిపోయాడని అని రామకుండమున స్నానము ”వేయింపుమని 'తెలుపగ శ్రీ కృష్ణుడాది బంధు సమే తంబుగ పాండవులు 'సేతు రామేశ్వరమునకు పోయి రామకుండమునందు శుచియై వెలుపలకు వచ్చినంతనే మరల గగనవాణి “పాండవాగ్రజా । మహా పవిత్రమైన రామకుండమున మునిగితివి కావున నీ పాపములు హరించినవి. నీవింక పట్టము గట్టుకొను” మనియు పల్కింది. అంత ధర్మరాజు సంతోషముగ హస్థినాపురము సకు తిరిగివచ్చి స్మామాజ్య పట్టాభిషేకంబు చేసికొనినపుడు దేవతలాకాళమున నుండి పూలవానలు గురిపించారు.
రామకుండము చెంతనున్న రామునిచే పతిష్ట చేయబడిన శివలింగము. నారాధించిన వారికి తొలగని పాపములు గాని_కలుగని సంపదలుగాని యుండునని వాల్మీకి మొదలై న బుషులు వంచించియున్నారు. : నారదాది మునులు రామకుండ. ప్రభావమును గాన మొనరించారు.
లక్ష్మణకుండ ప్రవేశము
నాయనలారా! లక్ష్మణ కుండము మహప్రభావముక్తలది. దీనిగురించిన యితిహాసమొండు నేనెరుంగుదును. భారత యుద్దంలో శ్రీకృష్ణుడు పాండవపక్ష పాతియని (పజలు చెప్పుకొనుచున్నారు.శ్రీ కృష్ణునియన్న బలరాముడు, ' బల రామునకట్టి పక్షపాతము లేదు. కాని తమ్ముని మందలించుటకు ధర్మరాజుకు వచ్చింది. కాని ఆయన నేనబద్ధమాడనని పట్టుపట్టి కూర్చున్నాడు. , అప్పుడు ఆ కృష్ణుడు మళ్ళీ యుక్తి పన్ని.ఇప్పు డశ్వద్ధామ ' అనే ఏనుగు. చనిపోయింది కనుక.
నీవు “అశ్వద్ధామ హతః కుంజరః” అంటే చాలన్నాడు. ధర్మరాజందులకు సరే నని ద్రోణాచార్యులవారు వినబడేలాగా “అశ్వద్ధామ హతః” అనినాక మెల్లగా “కుంజరః” అని “నా సత్య వ్రతం నేను నిలుపుకున్నానుగదా” అని తృప్తిబడ్డాడు. అదిగాక “కుంజరంః” అన్నప్పుడు తక్కినవారు వాద్యాలు గూడ మోగించారు. ఎలాగైతేనేం (దోణుడు తన కొడుకు నిజంగానే చనిపోయాడనుకుని తాను మర ణించాడు. తరువాత పాండవులకే విజయం లభించింది.
తరువాత ధర్మరాజు పట్టాభిషేకం 'చేసికొనడానికి అన్ని ప్రయత్నాలు పూ_ర్హయ్యాయి. ఆయన సింహాసనం మీద యెక్కబోవుసమయంలో ఆకాశవాణి. యుధిష్టిరా! నీవు అశ్వద్ధామ బ్రతికియుండగ చనిపోయాడని అబద్ధమాడావు, ఆ మాట విన్నందున పుత్రశోకంతో దోణాచార్యులు చనిపోయాడు. కుట్రపన్ని తివి. కావున నీ వసత్యవాది వేగాక గురుద్రోహివి. విప్రద్రోహివి గూడనై తివి. నీయట్టి పాపాత్ముడీ పవిత్రమయిన హస్తీనాపుర సింహాసన మెక్కరా” దని అందరూ వినేలాగ పలికింది. ఆ మాటలు విని ధర్మనందనుండు సిగ్గుపడి తలవంచు కున్నాడు. దౌమ్యాదీ మునులుగూడ గగనవాణి మాటలు కాదనలేక పోయారు.
నారదాది మునులంతా యోచించి శ్రీకృష్ణునితో “వాసుదేవా! సేతు రామేశ్వరము నందు రామకుండ మున్నది కద అందు మునిగిన వారికి (బ్రహ్మ హత్యాది దోషములు హరించును కావున ముందీ యుధిష్టిరునిచే చేయించుట వాని మతము కానందున యుద్ధసమయంలో తాను తీర్ధయ్మాతలకు పోవుట మంచిదను కొన్నాడు.
ద్వారకా నగరమునుండి బయలుదేరిన బలరామ ప్రభువు ముందుగ ప్రభాస తీర్థమున పితృ దేవతలకు తర్పణలువొదలిన తరువాత మరికొన్ని క్షేత్రా లను దర్శించుచు కొలదిదినములో నై మిశారణ్యంబునే. మునులందరు సేయుచున్న యజ్ఞ శాలకు బోయాడు, బలరాముని చూచినంతనే మునులందరును లేచి నమస్క.. రించుచు ప్రతి నమస్కారముల నందుకొనుచు. కుశల ప్రశ్నల జేయుచున్నను సూతమహర్షి నిర్ణక్ష్యమున కూర్చొని యున్నందున బలరాముడాగ్రహించి, దర్భతో వానితలపై కొట్టాడు. వెంటనే సూతముని తలపగిలి చనిపోయాడు,
మునులంతట “యాదవరాజా। నీవాదిశేషావతార మూర్తివని జగంబున కొనియాడుచున్న వి. ఐనను నిరంతరము పరమేశ్వరుని లీలలనే (పవచించుచు మహాపుణ్యశాలియైయున్న సూతుని చంపుట మంచిదికాదు. నీకు ముని హత్యా పాతకంబు ప్రాప్రించుటకు సందియంబులేదు. కావున నీవు నీ సంఘర్షణ మాయా: ప్రభావంబున వీనిని బతికించి మునిహత్యాపాతకంగాని-దుష్కీ ర్తిగాని పొందక నుండు”మని పలుక నా ద్వారకానాధుండు సంతసించి సూతుని తిరిగి బతికిం. చాడు. పునర్జీవితుండయిన సూతుండును...మిగిలిన మునులు బలరాముని గౌర" వించారు.
అదియునుగాక వల్కలుండను రాక్షసుడు బలవంతుడై యీ మునులు లాచరించుచున్న యజ్ఞముల నన్నింటిని భంగ మొసరించుచుండెననియు, మును లను హింసించుచుండెననియు, ముని పత్నులను చెరబట్టుచుండె ననియు వారల వలన నాలకించిన బలరాముడ(గహించి యీ దానవువి సంహరించాడు. అటు మీదట మునుల నుండి వీడ్కోలు పొందిన రోహిణి కుమారుడు తీర్ధయాత్రలు గావించుకొని తిరిగి నిజపురంబున కేగుచుండ గగనవాణి బిగ్గరగా “వాసుదేవా సూతుని బతికించినంత మాత్రమున నీ దోషం సంపూర్ణముగ హరింపలేదు పాపంబుల గొన్నింటిని మిగిలించుకొని యింటికిపొవుట మంచిదిగా”దని పలికింది
బ లరాము డంతట తిరిగి నై మిశారణ్యమునకుంబోయి తానాలకించిన పల్కుల నా మునులకు వినిపించి “నేను పరిపూర్ణ ముగ 'పాతకంబుల బాయుటకేమి 'చేయవలయు” ననగ సూతమునీంద్రాదులు “బలరామా! నీవు గంధమాధవ పర్వ తము నందున్న లక్ష్మణ కుండమున స్నాన మొనరించినచో నీ సంకల్పము నెర వేరగలదని చెప్పారు. వారి మాటల ప్రకారంబున కృష్ణ్యాగ్రజుండు సేతు రామే శ్వరమునకు బోయి గంధమాధవ పర్వతము నెక్కి. లక్ష్మణ కుండమున స్నానం బొనరించి సంపూర్ణముగ పాపరహితుడై ద్వారకకు పోయి సుఖసౌఖ్యము లనుభ వించాడు.
హనుమత్కుండ ప్రభావము
నాయనలారా! (శ్రీరాముడు లంకనుండి తిరిగి యయోధ్యకు బోవ సేతువు దాటినంతనే కంటిచూపు కనపడకపోయింది. కారణము లేని కారణంగా దృష్టి హరించిపోవుట కేమి కారణంబన యడుగగ నలనీలాచార్యాదులు “రాఘవాః బ్రాహ్మణుండై న రావణుని వారి వంశము నంత మొందించితివి. (బ్రహ్మహత్యా పాతకంబున నీ చూపు స్పష్టమైనది. ఐనను చింతింప బనిలేదు. ఇచట గంధ మాధవ పర్వతం మీద శివపతిష్ట చేయుము. కోల్పోయిన నేత్ర దృష్టిని మరల యధావిధిగ పొందగల”వని కర్తవ్యము నుపదేశించారు.
నవనీలాదులు మాటలందు రామునకు నమ్మకమున్నది. కావున యోచిం పక వెంటనే శివ ప్రతిష్ట జేయ నిశ్చయించుకొని జ్యేష్ట శుద్ద దశమీ బుధవారం హస్తా నక్షత్రంబున ప్రతిష్ట చేయుటకు శుభలగ్నము నిశ్చయించిన తరువాత హనుమంతుని పిలిచి “వత్సా! మనకిపుడు శివలింగము కావలయునుగదా! నీవిదే కైలాసంబునకు బోయి పార్వతీ పరమేశ్వరుల నడిగి శ్రేష్టమైన లింగమును గొని తెమ్మ”ని నియోగించినందున అంజనీ తనయుండు వాయువేగంబున కైలా సంబునకుపోయి గౌరీశంకరుల కీయుదంతమంతయు నెరింగించి వారి వలన లింగమును గై కొని తిరిగి రా పయనంబగునప్పటికి కొంతకాల మైనది.
గంధమాధవ పర్వతంమీద రాముడు మొదలయిన వారాంజనేయుని రాక' 'కెదురు చూచుచున్నారు. కాని హనుమంతుని జాడలేదు. నిర్ణయించిన లగ్నం మించిపోవుచున్నది. ఏమిచేయుటకు తోచక రాముడు మదనపడుచుండగ సీత యిసుకతో నొక లింగమును చేసియిచ్చింది. గత్యంతరములేక దాశరధి సీత చేసి యిచ్చిన సై కతలింగమునే నిర్ణీత స్థానమునందు శుభముహూ_ర్తము మించ కుండగ వేదమంత్రములతో పతిష్ట చేశాడు. ప్రతిష్టానంతరం జరుపవలసిన క్రియలు పూజలు క్రమము ననుసరించి జరుపబడుచున్నవి .
అంతలో శై లాసంసుండి శివుడిచ్చిన లింగముతోడ హనుమంతుడు
తిరిగి వచ్చాడు. 'అప్పటికే (పతిష్ట జరిగినందున హనుమంతుడు చాలబాధపడ్డాడు. పొంగి పొంగి వచ్చే దుఃఖాన్ని నిలుపుకో లేకపోయాడు. నేనింత కష్టపడినందుకు ప్రయోజన మేమిటి! ఇట్టి లింగమును తెచ్చి యేమిచేయవలయునని వాపో యాడు. కొంతవరకు రాముని నిష్టూరం లాడారుకూడ. నిజానికి రాముడు గాని,” లక్ష్మణుడుగాని, సీతగాని , విభీషణుడుగాని, నలనీలులుగాని, స్ముగ్రీంవాంగద జాంబ వంత సుషేణాదులుగాని మాటాడ లేకపోయారు.
శ్రీరాముడే ఆంజనేయుని కౌగలించుకుని “వత్సా హనుమా! నీవు నాకాత్మీయుండపు, నా తమ్ములలో నొక్కండవని నేనింతకు ముందే చెప్పియుం టీని, నాయీ నేటి విజయానికి నీవు కారకుండ వనుటయు సత్యము, నీ యందు నాకేనాడును 'భేదాభిప్రాయముండదు, కాని నీవు కై లాసమునుండి లగ్నకాలము నకు 'రాలేకపోతివి. 'ముహూ_ర్హము మించరాని దయినది. కావున నీ విపు డింకొక పనిచేయుము,. నేను పతిష్టించిన ఈ రామలింగేశ్వర లింగమునకు సమీపమం దే నీవీ లింగమును ప్రతిష్టచేయుము. నీచే ప్రతిష్ట చేయబడీన ఈ లింగము హనుమ లింగమని (పఖ్యాతి నొందగలదు. అదియునుగాక నేను స్థాపించినది యిసుక లింగమేకాని నీవు స్థాపించినది సాక్షత్పరమేశ్వరు డిచ్చిన లింగముగదా! ఇంక నీకీ విచారమెందుల” కని సమాధానం చెప్పాడు ,
రామ సందేశము కాదనక ఆంజనేయుండు రామలింగేశ్వర లింగము
నకు ఉత్తర భాగంబున తాను తీసుకొని వచ్చిన శివలింగమును ప్రతిష్టించి పూజిం చాడు. మనమీనాటికిని గంధమాధవ పర్వతంబుమీద నాయా లింగములను గాంచి సేవించి కృతార్థులము కానవకాశములున్నవి. (పతిష్టకు ముందాంజనేయుడు శోకించుచు భూమిమీదపడి దొరలినచోటనొక గుంట పడింది. అంతట గంగాజల మాగర్త మునందు నిండినవి. దానికి హనుమత్కుండమని "పేరు కలిగింది. _ ఆ కుండమున స్నానము చేసినవారికి పంచ' మహాపాపములు దొలంగుట యందెటు వంటి సందేహంలేదు. మరియు వారికి భూత'ప్రేత పిశాచ భయములుండపు. దారి ద్రము సంభవింపదు.
యాత్రా పరిసమాప్తము
నాయనలారా! ఇట్లే కాశీరామేశ్వర య్యాత్రకు సంబంధించిన సకల తీర్ధములు, సకల క్షేత్రములు, సకల దేవతామూర్తుల దర్శింపవలయునన్ను ను అయా యితిహోసంబుల వివరింపవలసియున్నను బహ్మాదులకై నను సాధ్యంగాని పనియని నేనింతకు ముందే చెప్పియుంటిని. ఇంతకు మనం చూడదగినవనియు విడువదగినవియు _ సేవింపదగినవియు ననేకంబులు మిగిలియున్న వి,
ఈ 'సేతురామేశ్వరమందును భేతాళ వరదతీర్థం, మంగళతీర్ధం,అమృత వాసి తీర్థం, (బహ్మకుండము, అగస్త్య తీర్ధం, జటాతీర్ధం, లక్ష్మణతీర్ధం, శివ తీర్థం, శంఖతీర్ధం, కోటతీర్ధం, ధనుష్కోటి తీర్ధంలు మొదలయిన వెన్నియోకలవు, ఆవీగాక రామసైన్యముననున్న వారందరి పేరుల ననుసరించిన నలతీర్థం, నీల తీర్థం, సుగ్రీవతీర్ధం, గవక్షయ తీర్ధం, గజతీర్థం, శరభతీర్థములు మొదలయినవి గూడ పెక్కులున్నవి.
మనిమిప్పటికి చూచిన ఈ క్షేత్రములు చాలును, ఈ సేతురా మేశ్వరం బున ముఖ్యముగ 'జేయదగిన పనులను మాత్రం పూర్తిచేసుకొని తిరిగి కాశీకి పోవుదము లెండని శిష్యజన సమేతంముగ తిరిగి ప్రయాణమై పుణ్యతీర్థములలో స్నానములు చేసి మోములందు బొట్లుధరించి గంధవమాధవ పర్వతమునందలి రామేశ్వర లింగము హనుమల్లింగము మొదలైన దివ్యలింగమూర్తుల నారాధించి యధా శ_క్తినందున్న (బ్రాహ్మణులకు యాచకులకు దానంబు లొనరించిన యనంత రమున నాటికి వారందరును విశ్రాంతి తీసుకున్నారు.
ఇవ్వి ధంబున కాశీరామేశ్వర యాత్ర ముగించుకొనిన సదానంద యోగి మరుదినంబున శిష్యజనంబుల వెంటనుంచుకొని వెనుకకు మరలి ప్రయాణము "సేయుచు మునుపు నివసించిన చోటులలో గాక క్రొత్త దృశ్యంబుల చూచుచూ అందందుగల మహమునుల సందర్శించుచు కాశీపురంబునకు చేరి అన్నపూర్ణి విశ్వనాధ స్వాములకు నమస్కరించి తరువాత నిజాశ్రమంబు చేరుకున్నారు.
_ కథ కంచికి...మన మింటికి_