గ్రద్ద, పావురము
అనేక పర్యాయములు గ్రద్ద, యొకటి పావురములను బట్టు కొనుటకయి ప్రయత్నము చేసి, అవి దొరకక పొరిపోయి గూటిలో దూరుచు వచ్చినందున చేసిన ప్రయత్నము విఫలము కాగా దరువాత మాయోపాయ మొకటి యాలోచించి వానిని చేరవచ్చి "ఓ పావురము లారా! మీరు నామనోభావమును కనిపెట్టలేక నే నేమో మీకు శత్రు పక్షమువాడ నవి భ్రమ పడి నేను దగ్గఱ రాగావే వృథా భయపడి దూరముగా తొలగుచున్నారు. సాధుపక్షులయిన మీకు నిత్యమును సంభవించుచున్న యాపదలకు దుఃఖపడి మీ హితముగోరి నే ఏప్పుడు మీదాపునకు వచ్చినాను, డేగలు మొదలయిన వాని వలన మీకు సదా కలుగుచుండెడి యసాయమునుండి మిమ్ము రక్షింపవలెనన్న సదుద్దేశముతప్ప నామస్సులో వేఱు చింతలేదు. పనికిమాలిన యవిశ్వాసమును విడిచి మీరందఱు నన్ను, రాజునుగా స్వీకరించెడు-పక్షమున మీకు శత్రు భయము కలుగకుండ గాపాడి మిమ్మందఱ నాకడుపులో, బెట్టుకొని యాదరించెదనను' అవి హితోపదేశము చేసెను. ఆ పావురము లామాటలకు సంతోషించి యాగ్రద్దను తమ రాజునుగా జేకొనుట కంగీకరించి, సర్వ స్వాతంత్ర్యముల విచ్చి గృధ్రమునకు రాజ్యాభిషేకముచేసి తా మాతనిని ప్రభుభక్తి గలిగి సేవించునట్టు ప్రమాణములు చేసేను. అంతట నా గృధ్రరాజు పావురములవద్ద బ్రవేశించి ప్రజలయొక్క దేహప్రాణములు రాజుయొక్క సాత్తగుటచేత వాని విచ్చవచ్చి నట్టనుభవించుట తనకుగల స్వాతం త్య్రములలో నొక్కటియని చెప్పి యొక్కొక్క పావురమునే చంపి భక్షింపసాగెను అందుచేత దినదినక్రమమున బలుచబడి హతశేషులయిన పావురములన్నియు నొకచోట జేరి, స్వభావ మెఱుగక పరువికి దమపై నధికారవిచ్చి తమలో దెచ్చి పెట్టుకొన్న పాపఫల మనుభవింపక తీఱదవి విలపింప జొచ్చెను.