కలసి వుంటె కలదు సుఖం



రామయ్యకు నలుగురు కొడుకులు. ఆస్తిపాస్తులున్న రామయ్య కొడుకులు ఒకరినొకరు అస్తమానూ వాదులాడుకుంటుండేవారు. తను మరణిస్తే తన ఆస్తిపాస్తులను కాపాడే వారుండరని, రామయ్య విపరీతంగా బాధపడేవాడు.

ఒకసారి రామయ్య మిత్రుడు వీరయ్య అతని వద్దకు రాగా, తన కొడుకుల గురించి వివరంగా చెప్పాడు. దానికి వీరయ్య, రామయ్య చెవిలో ఓ ఉపాయాన్ని చెప్పి వెళ్ళి పోయాడు.

ఆ మర్హాడే రామయ్య తీవ్రంగా జబ్బపడ్డాడు. తండ్రి అవసాన దశకు చేరుకున్నాడని ' అతని కొడుకులంతా రామయ్య వద్దకు వచ్చారు. అప్పడు రామయ్య “అబ్బాయిలూ...నేను ' జీవితంలో ఎంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాను. రేపో మాపో 'హరీ' మనే నాకు మీరో పనిచేయాలి” అంటూ నలుగురికీ నాలుగు పుల్లలు ఇచ్చి విరవమని చెప్పాడు.

నలుగురు కొడుకులూ పుల్లలు తీసుకుని అతి నునాయానంగా విరిచేశారు. ఈసారి 'రామయ్య ఒక్కొక్క కొడుకుకి రెండేసి పుల్లలు చొప్పన ఇచ్చి విరవమన్నాడు. ఈసారి పుల్లలు విరవడానికి కాస్త కష్టపడ్డారు కొడుకులు.

ఈసారి తలో కొడుక్కి మూడుపుల్లలు చొప్పన ఇచ్చి విరవమన్నాడు. మూడు పుల్లలు విరవడానికి విపరీతంగా కష్టపడాల్సి వచ్చింది. ఈసారి ఒక్కొక్క కొడుక్కి నాలుగు పుల్లలు ఇచ్చి విరవమన్నాడు. పుల్లలు తీసుకుని విరిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారు కొడుకులు. అవ్వడు రామయ్య చిరుమందపాసం చేస్తూ, "చూశారా...అబ్బాయిలూ...మీరు ఒక పుల్లను అతి సునాయాసంగా విరిచేశారు. నాలుగు పుల్లలను అస్సలు విరవలేకపోయారు. అంటే మిరు ఒకరిమాద ఒకరు వాదులాడుకుంటూ ఎవరిమట్టుకు వారు బతికితే మిమ్మల్ని మన శత్రువులు అతి సునాయాసంగా మట్టుపెట్టగలరు. అందరూ కలసి కట్టుగా వుంటే మిమ్మల్ని ఎవరూ ఏమి చేయలేరన్న విషయాన్ని మీరు గమనించారా...కనుక ఇప్పటికైనా మీరు ఒకరిమాద ఒకరు వాదులాడుకోవడం మానేసి కలిసికట్టుగా వుండి మన ఆస్తిపాస్తుల్ని కాపాడండి' అంటూ వివరించాడు. అంతే ఆనాటినుంచి రామయ్య కొడుకులు కలసిమెలసి జీవించడం మొదలుపెట్టారు.

తన కొడుకుల్ని ఎలా కలపాలనే సమయంలో తన మిత్రుడు వీరయ్య ఇచ్చిన సలహాకు మనస్సులోనే కృతజ్ఞతలు చెప్వకున్నాడు రామయ్య.

Responsive Footer with Logo and Social Media