జరిగిన పౌరపాటు



హేలపురిలో కన్నయ్య, చిన్నయ్య పరమ బద్ధకస్తులు. కష్టపడి పనిచేయడమంటే ఇద్దరికీ ఇష్టముండదు. వున్న ఊళ్ళో వీళ్ళసంగతి తెలుసు గనుక పారుగూళ్ళకు పోయి అక్కడ ఎవరింట్లోనైనా శుభకార్యానికి విందు భోజనాలు జరుగుతుంటే వెళ్ళి సుఫ్టిగా భోజనం చేసేవాళ్ళు.

వాళ్ళిద్దరూ ఒకసారి మిట్టమధ్యాహ్నంవేళ ఒక ఊరు చేరారు. అక్కడో ఇంటి ఎదురు గోడ మిదుగా ఎవరో విస్తరాకులు వీథిలోకి వేస్తున్నారు. “ఆహా..పెళ్ళి భోజనం!" అంటూ కన్నయ్య, "చిన్నయ్య ఆ ఇంటి ఆవరణలోకి వెళ్ళారు. ఆ సమయంలో వడ్డన చేసేటందుకు విస్తరాకులు వేస్తున్నారు. ఇద్దరూ వాటి ముందు కూర్చున్నారు.

అక్కడ వడ్డన ఏర్పాట్లు అజమాయిషీ చేస్తున్నవాడు వీరివైపు అనుమానంగా చూసి “అయ్యా! తమరెవరో కాస్త చెబుతారా?” అనడిగాడు.

వెంటనే కన్నయ్య “నేను పెళ్ళి కూతురి మేనమామ బావమరిదిని!” అన్నాడు. చిన్నయ్య "నేను పెళ్ళి కూతురి పెదతండ్రిగారి చిన్నల్లుడిని!” అన్నాడు.

మరుక్షణం వాళ్ళను ప్రశ్నించినవాడు పెద్దగా “ఈ దొంగవెధవలను వెంటనే వీధిలోకి నెట్టండి.!” అన్నాడు. వెంటనే నలుగురు పనివాళ్ళు వచ్చి ఆ ఇద్దర్లీ ఎదురు గోడమిదుగా పులివిస్తరాకుల్లోకి విసిరి వేశారు.

“ఎక్కడ జరిగిందిరా చిన్నా. పొరపాటు?” అన్నాడు కన్నయ్య ఒళ్ళు దులుపుకుంటూ. "మనల్ని ఇక్కడ విసిరేసిన దుర్మార్గులు తిట్టిన తిట్లు నువ్వు వినలేదా? ఇప్పుడు జరుగుతుంది పెళ్లి కాదురా. ఇల్లుగలాయన తండ్రి పెద్దదినం భోజనాలు” అన్నాడు చిన్నయ్య మూలుగుతూ.

Responsive Footer with Logo and Social Media