గర్వం



కాకులు దూరని ఒకానొక కీకారణ్యంలొ ఒక చెవులపిల్లి, తాబేలు ఉంటుండేవి అడవిలో గల జంతువులన్నింటిలో తానే గొప్పదాన్నని కుందేలుకు ఎంతో గర్వం. సాటి జంతువులకు దాని ప్రవర్తన మాటలు అంతగా నచ్చేవికావు. తన అంతటి చురుకైన జంతువుగాని, వేగంగల జంతువుగాని, తెలివితేటలుగల జంతువుగాని మరొకటి లేదని తనను తాను తెగ పోగడు కుంటుండేది అతి మెల్లగా నడిచే తాటేలును చూస్తే ఆ కుంధేలు కెంతో లోకువ “ఏంటో తాబేలు బావా! నాతో వరుగు వందెం వేస్తావేమిటి?” అంటూ వెటకారం చేసెది. పాపం ఆ తాబేలు యేమీ అనేదికాదు. ఇలా అంటుండడం అలవాటయిపోయి పదిమంది ముందు గర్వంగా మాట్లాడుతుండేది.

ఒకనాడు జంతువులన్నీ గుమిగూడి ముచ్చటగా మాట్లాడుకుంటున్న సమయంలో కుందేలుకు తన దర్పం ప్రదర్శించుకోవాలన్నా అహంబావం కలిగింది. దానితో ఒళ్ళు తెలియకుండా నోటికి వచ్చిన ప్రగల్బ్ లన్నీ చెప్పడం ప్రారంభించింది. చుట్టూ చేరిన జంతువులా మాటలకు అసహ్యించుకుంటూ దానినోట్లో నోరుపెడితే మర్యాద దక్కదని మాట్లాడకుండా ఊరుకున్నాయి. అలా వుండడంతో కుందేలు ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ "ఈ తాబేలు బావ నాతో పరుగుందెం వెయ్యాలని కలలు కంటున్నాడు. అడుగు తీస్తే అడుగు వెయ్యలేడు. ఎందుకొచ్చిన జన్మది” అంటూ పాగరుబోతుతనంగా మాట్లాడింది.

“పరుగులో గొప్పదాన్ననుకునే ఓ పొగరుబోతు! ఎవరి జన్మ ఎంతటిదో ఎవరికి తెలుసు? నాతో పాటుకూడా నడవలేనిరోజు నీకు రాకపోదు మిడిసి పడకు” అన్నది తాటేలు.

“అబ్బో బావకు పౌరుషం వచ్చిందే నీతోపాటు నడకకే నేను తగని రోజులుదాకా ఎందుకు? ఏం అదేదో ఇప్పడే చూద్దాం/వస్తావా యేం? తారతమ్యం తెలియకుండా మిడిసివడకు!” అన్నది కుందేలు.

“పొగరుబోతు కుందేలా! అంతటి గర్వం తగదు” అని మందలించింది తాబేలు.

“అదేమిటో తేల్చుకుందాం రా. నాతో పరుగుపందానికి” అని అంది కుందేలు.

సై అంటే సై అనుకున్నాయి తాబేలు, కుందేలు. అడవికి ఆవలవున్న నగరం పాలిమేర వరకూ వెళ్ళి రావాలి. ఎవరు ముందొస్తే వారు గెలిచినట్టు అని జంతువులన్నీ నిర్ణయించాయి.

రెండూ కలసి.బయలుదేరాయి. చిటికెలో కుందేలు కనుచూపుదూరం పోయింది. తాబేలు నెమ్మదిగా కదులుతూ వుంది, జంతువులన్నీ హుషారిస్తున్నాయి. కనుచూపు దూరం పోయి కుందేలు ఇదంతా గమనించి నేనెందుకింత ఆదుర్దాగా పరుగెట్టాలి? హాయిగా కాసెపిక్కడ ఆగి తాబేలు దగ్గరపడ్డాక మెల్లగా బయలుదేరుతాను అనుకొని ఆగిపోయింది. అంతలో దానికి ఆకలి జ్ఞాపకమొచ్చి అక్కడి ఆకులు, దుంపలు తింటూ వుండిపోయింది.

తాబేలు ఆ చోటు దాటి ముందుకు సాగిపోయింది. దుంపలవీ తిని తేస్చుకుంటూ త్రోవలో కొచ్చిన కుందేలు తనకన్నా ముందుగా 'తాబేలు వెళ్ళిపోవడం చూచింది. ఒక్క ఉదుటున పరుగు ప్రారంభించింది. పరుగెత్తి పరుగెత్తి అలసటొచ్చేనరకు పరుగెత్తి వెనక్కు చూసింది. తనకు వెనకబడిన తాబేలు కనుచూపుమేరలో ఎక్కడా దానికి కనబడలేదు. బ్రతుకుజీవుడా అని మెల్లగా నడవసాగింది.

కుందేలు తిని పరుగుపెట్టి బాగా అలసిపోయిందేమో నిద్ర ముంచుకురావడంతో ఒక పొదరింటి నీడలో హాయిగా పడుకుంది. అలా పడుకున్న కుందేలుకు తెలిపొచ్చేసరికి చీకటి పడిపోయి చాలాసేపు పడుకుండి పోయానే అని కంగారు పడి ముందుకు బయలుదేరింది.

అలా బయలుదేరిన కుందేలుకు ఎదురొస్తున్న తాబేలు దాని వెనక జంతువులు కనబడ్డాయి. అవన్నీ దగ్గరకంటూ వచ్చి “పద కుందేలా ఇంకా ఎక్కడికి వెడతావు? తాబేలు నీకన్నా ముందే వెళ్ళివఛ్చేసింది. నేను చాలా వేగమయిన దానినని డబాయించే దానివి. తాబేలుతోనే గెలవలేకపోయావు ఎందుకొచ్చిన ప్రగల్భాలు ఎవరు యేనాడు ఎలా భంగపడతారో ఎవరికి తెలసు? నేను గొప్ప అని విర్రవీగే వాళ్ళేపూడూ అర్బకులవల్లనే భంగపాటు పొందుతారు! అని మందలించాయి. ఆనాటినుండి కుందేలు డాబులు మాని అన్నింటితో కలసి మెలసి తిరుగుతుండేది.

Responsive Footer with Logo and Social Media