ఎంచక్కా గాల్లో ఎగురుతానోచ్!
హాయ్ నేస్తాలూ.. బాగున్నారా! నేనో విచిత్ర జీవిని. నాకు తెలిసి నన్ను మీరు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. అందుకే నా వివరాలు మీకు చెప్పిపోదామని, ఇదిగో ఇలా వచ్చాను. మరి నా విశేషాలు తెలుసుకుంటారా!
నా పేరు కొలుగో. ఆగ్నేయాసియా దేశాల్లో నేను జీవిస్తుంటాను. నేనో క్లీరదాన్ని. అయినా ఎగరగలను. అలా అని పక్షిలా కాదు. నిజానికి నాకు రెక్కలు ఉండవు. నా కాళ్ల మధ్య ఉండే చర్మం సాయంతో నేను గ్రైడ్ చేస్తాను. అంటే అచ్చం ఎగిరే ఉడతల్లా అన్నమాట. నాలో సుండా ప్రయింగ్ లెమర్, ఫిలిప్పైన్ ఫ్లయింగ్ లెమర్ అనే రెండు జాతులున్నాయి. నేను పగటి పూట చెట్టు తొర్రల్లో, కొమ్మలపై నిద్రపోతాను. చీకటి పడ్డాక యాక్టివ్‌గా ఉంటాను.
ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు...
నేను ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు దూకుతుంటాను. ఇలా దాదాపు 280 అడుగుల దూరం వరకు గ్రైడ్ చేయగలను. నేను 85 నుంచి 40 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతాను. బరువేమో 1 నుంచి ? కిలోల వరకు తూగుతాను. నాకు పొడవైన తోక కూడా ఉంటుంది.
ఏం తింటానంటే...
నేను శాకాహారిని. ఆకులు, రెమ్మలు, పువ్వులు, కాయలు, పండ్లను ఆహారంగా తీసుకుంటాను. నా జీవితకాలం దాదాపు 15 సంవత్సరాలు. అప్పుడే పుట్టిన కొలుగోలు కేవలం 5 గ్రాములు మాత్రమే బరువుంటాయి. డేగలు, గద్దలు మాకు ప్రధాన శత్రువులు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత కూడా మా సంఖ్య తగ్గిపోయేలా చేస్తోంది. నేస్తాలూ.. మొత్తానికి ఇవీ నా విశేషాలు. ఇక ఉంటా మరి.. బై.. బై...!